residential school
-
కస్తూర్బా పాఠశాలలో అగ్నిప్రమాదం.. ఆ ముగ్గురూ ఏమైనట్టు?
వెంకటాపురం(ఎం): కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యార్థుల దుస్తులు, పెట్టెలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలో విద్యార్థులు నిద్రించకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్ కేజీబీవీలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు చోటుచేసుకుంది. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 280 మంది విద్యారి్థనులు చదువుతున్నారు. వారం రోజుల క్రితం కళ్ల కలక వచ్చి సుమారు 230 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లారు. మిగతా వారు పాఠశాలలోనే ఉన్నారు. వారు పడుకున్న పక్క గదిలో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. టోల్గేట్ వద్ద విధులు నిర్వహించుకుని ఇంటికి వెళుతున్న యువకులకు ఆ మంటలు కనిపించాయి. వెంటనే స్థానిక సర్పంచ్ శనిగరపు రమ భర్త రమేశ్‌కు ఫోన్లో సమాచారం ఇచి్చన యువకులు అక్కడికి చేరుకున్నారు. రమేశ్ పాఠశాలకు చేరుకుని గదిలో నిద్రిస్తున్న 44 మంది విద్యారి్థనులను కిందికి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను అదుపుచేయడంతో విద్యార్థులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కళ్లకలక వ్యాధి వచ్చి విద్యార్థులు ఇళ్లకు వెళ్లకపోతే ప్రమాదం జరిగిన గదిలో కూడా చాలామంది నిద్రించేవారని సహచార విద్యార్థులు పేర్కొన్నారు. కాగా, రాత్రి సమయంలో పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయురాలితోపాటు వాచ్‌మన్, ఏఎన్ఎం ఎవరూ విధుల్లో లేకపోవడం గమనార్హం. -
Vikarabad: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం చిలాపూర్‌లో ఓ చిన్నారి మృతి కేసు వివాదాస్పదంగా మారింది. స్థానికంగా ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని టీచర్ కొట్టడంతోనే మృతిచెందాడని తల్లిదండ్రులు, అటువంటిదేం లేదని స్కూల్ యాజమాన్యం పరస్పరం ఆరోపణలకు దిగారు. చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే పిలగాడు మూడో తరగతి చదువుతున్నాడు. హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడతను. సమాచారం అందుకుని చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాత్విక్ కన్నుమూశాడు. అయితే ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కొడుకు మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సాత్విక్ తండ్రి. అయితే.. అటువంటిదేం లేదని, బెడ్ పైనుంచి పడడంతో అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని, ఆ తర్వాతే చనిపోయాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. చిన్నారి సాత్విక్ స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం. -
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ క్రీడా పోటీలకు వేదికలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడాపోటీలకు వేదికలు ఖరారయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఐదు చోట్ల పోటీలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు 15 వ్యక్తిగత విభాగాల్లో 2,763 మంది, ఏడు టీమ్ విభాగాల్లో 2,207 మంది దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన పాఠశాలల క్రీడా పోటీల్లో 20 రాష్ట్రాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అత్యధికంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 480 చొప్పున, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ 61, సిక్కిం 83, ఉత్తర ప్రదేశ్ 96 మంది క్రీడాకారులతో బరిలోకి దిగనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ఏకలవ్య జాతీయ పోటీలను సమర్థవంతంగా చేపడతామన్నారు. పోటీలు ప్రారంభానికి ముందే ఏపీ క్రీడాకారులకు నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇవ్వనున్నట్టు వివరించారు. కచ్చితంగా పతకాలు వచ్చే విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
Photo Feature: అక్కడే తరగతి.. వసతి
ఆదిలాబాద్ జిల్లా బేలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులకు 12 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఆరు గదులను తరగతి గదులకు, రెండు గదులను విద్యార్థుల వసతికి కేటాయించారు. మిగతా నాలుగు గదులను ఆఫీస్, స్టోర్, ల్యాబ్, వంటకు ఉపయోగిస్తున్నారు. అయితే 267 మంది విద్యార్థులు పడుకునేందుకు రెండు గదులు సరిపోకపోవడంతో, తరగతి గదులనే వసతికీ వాడుతున్నారు. వాటిలోనే విద్యార్థులు రాత్రిపూట పడుకుంటున్నారు. ఉదయం ఆ గదుల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ఇదిగో ఇలా పాఠాలు బోధిస్తున్న గదిలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, అదనపు తరగతి గదులను నిర్మించి, తమ అవస్థలు తొలగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. (క్లిక్: ఓయూలో ఐడియాలకు ఆహ్వానం) – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
Covid: ఒకే స్కూల్లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
బెంగళూరు: దేశం వ్యాప్తంగా కరోనా రోజువారీ కొత్త కేసుల నమోదు తగ్గుతోంది. వరసుగా రెండో రోజు దేశంలో రోజువారీ కేసులు 20 వేల కంటే దిగవకు నమోదు కావటం గమనార్హం. అయితే మరోవైపు కర్ణాటకలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. 60 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అందులో ఇద్దరికి మాత్రమే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజు రాష్ట్రంలో ప్రాథమిక పాఠళాలలు ప్రారంభించాలనుకున్న ప్రభుత్వాని ఈ కేసులు ఆందోళనకరంగా మారాయి. బెంగుళూరు అర్బన్ జిల్లా కమిషనర్ జే. మంజునాథ్ దీనిపై స్పందిస్తూ.. 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 60 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వారంతా 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులని పేర్కొన్నారు. -
ఒకే హాస్టల్లో 229 మందికి కరోనా
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 229 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ శణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను సీల్ చేసి, కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులంతా పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నారు. మహారాష్ట్రలో బుధవారం 8,807 మందికి కరోనా సోకగా, 80 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో మంగళవారం కరోనా రోగుల సంఖ్య 6,218 నమోదు కాగా బుధవారం ఏకంగా 8,807 నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,95,578 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. అలసత్వం వద్దు.. సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది. కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ముగ్గురు చొప్పున సభ్యులుండే బృందాలను రంగంలోకి దించింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నేతృత్వం వహిస్తున్నారు. వివరణ ఇవ్వండి.. రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండడం, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గడంపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను ఆదేశిస్తూ కేంద్రం లేఖలు రాసింది. నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేవారు ఇకపై కరోనా నెగటివ్ ధ్రువపత్రం చూపించాల్సిందే. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వచ్చేవారు కరోనా నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15 మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని సమాచారం. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్టీ–పీసీఆర్ టెస్టు చేయించుకున్నట్లు, కరోనా నెగెటివ్‌గా తేలినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. -
గురుకుల పాఠశాలలో దీపావలి జరుపుకున్న పుష్పశ్రీవాణి
-
‘సీఎం కేసీఆర్ చొరవతో సన్నబియ్యం’
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్‌లో సన్నబియ్యంతో విద్యార్థులకు మూడు పూటలా భోజనాలు పెడుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హరీశ్ ఆదివారం మిట్టపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆరో జోనల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిట్టపల్లిలో జోనల్ స్థాయి క్రీడలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 269 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రవీణ్ లాంటి అధికారి ఉండటం చాలా అదృష్టమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి రాష్ట్రానికి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన వెయ్యి మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని హరీశ్ వెల్లడించారు. -
గూడులేని గురుకులం
విజయవాడలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు కష్టమొచ్చింది. గూడు కరువయ్యే పరిస్థితి నెలకొంది. 150 మంది మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఆర్టీసీకి చెందిన భవనంలో కొనసాగుతుండగా ఖాళీ చేయాలని ఆ సంస్థ యాజమాన్యం హుకుం జారీ చేసింది. సాక్షి, భవానీపురం: మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు గూడు కల్పించి విద్యా బోధన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు ఇప్పుడు గూడు కరువైంది. 14 ఏళ్ల నుంచి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న ఈ పాఠశాలను ఖాళీ చేయాలంటూ ఏడాది నుంచి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ హుకుం జారీచేస్తున్నారు. ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంకాగా నెల రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ ఎండీ మరోసారి హెచ్చరికలు జారీచేశారు. దీంతో విద్యార్థినుల భవితవ్యం అయోమయంలో పడింది. అద్దె భవనం కోసం వెతుకులాడుతూనే ఉన్నామని, సుమారు 150 మంది విద్యార్థినులకు సరిపోయే వసతిగృహం దొరకడం కష్టసాధ్యంగా ఉందని స్కూల్ ప్రిన్సిపాల్ ఆంధ్రవాణి చెబుతున్నారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల గూడు గోడు ఇలా ఉంది.. రూ.70 వేలు అద్దె చెల్లిస్తున్నా వేధింపులే శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు గల 9 జిల్లాల్లోని 5 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించే ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థినుల కోసం ప్రభుత్వం 2003లో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను గుణదలలోని ఒక అద్దె భవనంలో ప్రారంభించింది. అయితే అక్కడ స్థలం సరిపోకపోవడంతో గతంలో విద్యాధరపురం ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ ఉండే భవనంలోని మొదటి అంతస్తులోకి 2005లో మార్చారు. అప్పుడు రూ.26,250 చెల్లించిన అద్దె కాలక్రమంలో ఇప్పుడు రూ.70 వేలకు చేరింది. అయినా ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ యాజమాన్యం నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ భవనంలోని 20 గదులలో విద్యార్థినులకు వసతి కల్పించి విద్యా బోధన చేస్తున్నారు. వాస్తవానికి 480 మంది విద్యార్థినులు ఉండాల్సిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 150 మంది మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అందులో మైనార్టీ విద్యార్థినులు తక్కువకాగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థినులు ఎక్కువగా ఉన్నారు. విజయవాడ ఏం పాపం చేసుకుంది? కృష్ణాజిల్లాలో 5 ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో నిమ్మకూరు, ముసునూరు, పులిగడ్డ పాఠశాలలకు కొన్ని ఎకరాల స్థలంలో సొంత భవనాలు ఉన్నాయి. మచిలీపట్నం పాఠశాల కోసం సుమారు 12 ఎకరాల స్థలం కేటాయించగా భవన నిర్మాణం జరగాల్సి ఉంది. అలాగే నిమ్మకూరులోని గురుకుల కళాశాలకు కూడా సొంత భవనం ఉంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సొంత భవనాలు ఉండగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ ఏం పాపం చేసుకుందో అర్ధం కావడం లేదని ప్రిన్సిపాల్ ఆంధ్రవాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల ఉన్న 25 ఎకరాల (వక్ఫ్) భూమిలో కొంత ఈ పాఠశాలకు కేటాయించవచ్చు. లేదంటే భవానీపురం దర్గా వద్ద కార్పొరేషన్ స్వాధీనంలో ఉన్న 2.9 ఎకరాల స్థలాన్నైనా ఈ గురుకుల పాఠశాలకు కేటాయించవచ్చు. భవనం దొరికే వరకు ఇబ్బంది పెట్టవద్దు తమ భవనాన్ని ఖాళీ చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించిన నేపథ్యంలో ఏడాది నుంచి భవనం కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇటీవల స్కూల్ పునఃప్రారంభంకాగా మళ్లీ వచ్చి నెల రోజుల్లో ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీ నాగభూషణ శర్మ పర్యవేక్షణలో భవనం కోసం అన్వేషిస్తున్నాం. దయచేసి భవనం దొరికే వరకు ఇబ్బంది పెట్టవద్దని, పిల్లలు ఇబ్బంది పడతారని అర్టీసీ ఎండీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో నూతనంగా ఏర్పాటైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమైనా గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించాలని కోరుతున్నాం. – వి. ఆంధ్రవాణి, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. -
బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే లక్ష, రూ.2 లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని, దీనికి వంద శాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీలు, ఎంబీసీలకు సంబంధించి పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయడానికి శనివారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు ప్రగతిభవన్‌లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతాకుమారి, బుర్రా వెంకటేశం, కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెంచుతామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ఏటా వంద కోట్ల మొక్కలు ప్రతి గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఆ మేరకు నర్సరీల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నిర్వహించే హరితహారంతోపాటు వచ్చే ఏడాది నుంచి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు. 19.83 శాతం ఆదాయాభివృద్ధి 2018–19 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయాభివద్ధి రేటు 19.83 శాతం నమోదు కావడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2018–19 తొలి 3 నెలల్లో తెలంగాణలో స్వీయ ఆదాయం 19.83 శాతం వృద్ధి రేటు సాధించినట్లు అధికారులు కేసీఆర్‌కు వివరించారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ దేశంలోనే అత్యధిక ఆదాయ వృద్ధిరేటు నమోదు చేసిందని, 2018–19లోనూ అదే దిశగా పయనించడం శుభసూచకమని సీఎం అన్నారు. 2017–18 మొదటి త్రైమాసికంలో తెలంగాణలో రూ.13,374.25 కోట్ల ఆదాయం వచ్చిందని, 2018–19 మొదటి త్రైమాసికంలో రూ.16,026.63 కోట్లకు పెరిగిందని తెలిపారు. 9న కేబినెట్ భేటీ జూలై 9న సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. -
పద్యం అప్పజెప్పలేదని చెప్పుతో కొట్టిన టీచర్
అడ్డతీగల (రంపచోడవరం): తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం డి.భీమవరం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పద్యం అప్పజెప్పలేదని తెలుగు ఉపాధ్యాయుడు 24 మంది విద్యార్థులను చెప్పుతో కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థుల కథనం మేరకు.. గత మంగళవారం తెలుగు ఉపాధ్యాయుడు గాంధీ 10వ తరగతి విద్యార్థులను ఓ పద్యం చదివి గురువారం నాటికి అప్పజెప్పాలని ఆదేశించారు. గురువారం ఉపాధ్యాయుడు తరగతికిరాగా, ఫార్మేటివ్ పరీక్షలు జరుగుతున్నందున పద్యం చదవలేదని విద్యార్థులు జవాబిచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు కాలి చెప్పు తీసి తమను చితకబాదారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బయటకు చెబితే పాఠశాల పరువు పోతుందని కొందరు ఉపాధ్యా యులు విద్యార్థులను సముదాయించారు. చివరకు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటనపై సహాయ గిరిజన సంక్షేమ అధికారి శంభుడు శనివారం పాఠశాలలో విచారణ నిర్వహించారు. -
మత్స్యకార విద్యార్థులకు వరం..!
- జిల్లాకు కొత్త రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు విజయనగరం : జిల్లాకు కొత్త రెసిడెన్షియల్ స్కూల్ (ఆరో తరగతి నుంచి పది వరకు) మంజూరైనట్లు సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ద్వారా పాఠశాలకు సంబంధించిన నివేదికలు, వివరాలను తెలియజేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఇక్కడి అధికారులను కోరారు. మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. పూసపాటిరేగ మండలం కుమిలిలోని బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో తాత్కాలికంగా తరగతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది. కుమిలిలోని ఈ రెండు వసతిగృహాలూ ఇటీవలే ఇతర వసతిగృహాల్లో విలీనమయ్యాయి. ఇందులోని విద్యార్థులు సమీపంలోని వసతిగృహాలకు వెళ్లడంతో ఈ వసతిగృహాలకు చెందిన భవనాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ భవనాలను కొత్తగా మంజూరైన రెసిడెన్షియల్ పాఠశాలకు తాత్కాలికంగా వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పాఠశాలకు రూ.15 కోట్లు కేటాయించే అవకాశముంది. రాష్ట్రంలోని అన్ని తీరప్రాంతాలున్న జిల్లాల్లో కూడా ఇటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి ఈ నిధులతో చింతపల్లిలో కొత్త భవనం నిర్మించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ భవన నిర్మాణం కోసం చింతపల్లిలో 7.08 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. స్థలం వివరాలను స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు అంగీకరిస్తే కొత్త భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇంటిగ్రేటెడ్ వసతిగృహ స్థాయి పెంపునకు స్థలం కరువు రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచి డార్మెటరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన స్థలం ఆ పరిసరాల్లో ఉందో, లేదో చెప్పాలని ఉన్నతాధికారులు బీసీ సంక్షేమ శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చీపరుపల్లిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వసతిగృహాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు అదనపు తరగతి గదులు నిర్మాణానికి సరిపడా స్థలం లేదని ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రస్తుతం నూట పది మంది విద్యార్థులున్న ఈ సమీకృత వసతిగృహం స్థాయి పెంచితే 960 మంది విద్యార్థులు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితరులు) చదువుకోవడానికి వీలుపడుతుంది. -
వార్డెన్ భర్తా.. మజాకా?!
⇒ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన ⇒ భరించలేక హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ⇒ అధికారుల విచారణలో వెలుగుచూసిన అరాచకం చందంపేట (దేవరకొండ): తండ్రి స్థానంలో ఉండాల్సిన ఆ వ్యక్తే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు.. అతను తమ వార్డెన్ భర్త కావడంతో చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని భావించిన విద్యార్థినులు ఆలోచించి నేరుగా ఛైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.. నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయరాణి వార్డెన్‌గా ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న ఆమె భర్త రాజు కూడా హాస్టల్లోనే నివాసం ఉంటున్నాడు. అయితే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి వేళలో వారిని నిద్రలేప డం, వివిధ రకాలుగా మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అయితే దీనికి విసిగిపోయిన విద్యార్థినులు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమ బాధను వివరించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును దేవరకొండ పట్టణంలో ఉన్న గ్రామ్య స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు. ఈ విషయమై గ్రామ్య నిర్వాహకులు ట్రైబల్ వెల్ఫేర్ పీడీకి విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు యంత్రాంగం కదలడంతో గ్రామ్య కోఆర్డినేటర్ రవి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.వెంకటేశ్వర్‌నాయక్ పాఠశాలకు వెళ్లి అసలు విషయాన్ని ఆరా తీశారు. విడివిడిగా రాజు ప్రవర్తనపై విద్యార్థినులను అడగడంతో ఫిర్యాదులో వాస్తవం ఉందని గ్రహించారు. ఈ విషయమై పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా కొందరు అతని ప్రవర్తన పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారు నేరెడుగొమ్ము పోలీసులకు కేసు వివరాలను తెలియజేసి అతడిపై ఫిర్యాదు చేశారు. -
గురుకుల విద్యార్థి అదృశ్యంపై ఆందోళన
► ఏన్కూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో ► పోలీసుల హామీతో విరమణ ఏన్కూర్: కనిపించకుండా పోయిన స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థి అచూకీ తెలపాలంటూ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఏన్కూర్ ప్రధాన సెంటర్లో ఆందోళన చేశారు. గత నెల 27న 8 వతరగతి చదువుతున్న గార్లపాటి ఉదయ్‌కిరణ్ అనుమతి లేకుండా గురకులం నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఈ క్రమంలో బాలుడి సమాచారం లేదని తండ్రి రామకృష్ణ, పాఠశాల యాజమాన్యం ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అప్పటి నుంచి పోలీసులు, విద్యార్థి బంధువులు విద్యార్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. దాదాపు 20 రోజులు కావస్తున్నా తమ పిల్లాడి ఆచూకీ తెలియలేదని, గురుకులంలో అడిగితే ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆగ్రహించిన విద్యార్ధి బంధువులు ఏన్కూర్ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో ఏన్కూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు గంటన్నర సేపు రోడ్డు పై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులతో మాట్లాడారు. విద్యార్థి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
ఫిట్స్‌తో గురుకుల పాఠశాల విద్యార్థి మృతి
నరసాపురం : మండలంలోని ఎల్బీచర్ల గురుకుల పాఠశాల విద్యార్థి కాటూరి ఆనంద్(17) ఫిట్స్ వల్ల శుక్రవారం ఉదయం మరణించాడు. అతనికి సకాలంలో వైద్యం అందకే మరణించాడని ఆరోపిస్తూ.. నరసాపురం ప్రభుత్వాసుపత్రి వద్ద దళితసంఘాల నేతలు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.హెచ్ఆర్.కె.మూర్తి కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన ఆనంద్ రెండేళ్లుగా గురుకుల పాఠశాలలో ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు లైట్లు వేయగానే, ఆనంద్ లైట్లు ఆర్పాలని పెద్దగా కేకలు వేశాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లి చూసేసరికే ఫిట్స్‌తో కొట్టుకుంటూ కోమాలోకి వెళ్లాడు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే సరికి అతను మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆనంద్‌కు సకాలంలో వైద్యం అందలేదని, అందుకే మృతి చెందాడని ఆరోపిస్తూ దళిత సంఘాల నేతలు దొండపాటి స్వాములు, ఇంజేటి జాన్‌కెనడీ, అడిదల శరత్, నక్కా ఆనంద్, ముస్కూడి రవి, బత్తుల దుర్గారావు తదితరులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీనికి స్పందించిన ప్రిన్సిపాల్ ఆనంద్‌కు ఫిట్స్ వస్తుంటాయని, పాఠశాలలో చేర్చుకున్నప్పుడే అతని తల్లిదండ్రులు తమకు అఫిడవిట్, లేఖ ఇచ్చారని చెప్పారు. మొత్తానికి ఆందోళనకారులకు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్‌కు మధ్య చర్చలు జరగడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆనంద్ తండ్రి తిరుపతిరావు కూలిపనులు చేస్తుంటారు. తల్లి మరియమ్మ గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మృతితో వారిద్దరూ బోరున విలపిస్తున్నారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
10 వేల కోట్లతో గురుకులాల అభివృద్ధి
-
10 వేల కోట్లతో గురుకులాల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మూడేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ నిధులతో అన్ని సొసైటీల పరిధిలోని గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు, పూర్తిస్థాయి వసతులు కల్పిస్తాం. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేలా ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతాం’’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ‘స్కూల్ లీడర్స్ కన్వెన్షన్-2016’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే 240 ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో 210 పాఠశాలలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం అన్ని సొసైటీ పాఠశాలల్లో 4.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఒక్కో పాఠశాలను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేందుకు రూ.20 కోట్లు ఖర్చవుతుందని, ఏడాదిపాటు నిర్వహణకు రూ.3 కోట్లు వెచ్చించాలన్నారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో 700 గురుకుల పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు అవసరమన్నారు. వీటిల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను భర్తీ చేస్తామని, ఈ మేరకు 14 వేల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కడియం ప్రకటించారు. డిజిటల్ బోధనకు సిద్ధం: గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన చేపట్టనున్నట్లు కడియం వివరించారు. ఈ మేరకు డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సొసైటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సొసైటీ లీగ్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. చాలా గురుకులాల్లో ప్రిన్స్‌పాల్స్ స్థానికంగా ఉండడం లేదని కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లోని పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలని.. పనిచేసే గురుకులంలో ప్రిన్స్‌పల్ కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్లో నివాసం ఉండాలని స్పష్టం చేశారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే అందుకు సదరు ప్రిన్స్‌పాల్ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, లక్ష్మణ్, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వాయి మండ ల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్న త పాఠశాల విద్యార్థిని తాటి అఖిల (12) జ్వరంతో మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందింది. తాడ్వాయి మండ లం భూపతిపూర్‌కు చెందిన తాటి మల్లయ్య, సావిత్ర దంపతుల ఏకైక కుమార్తె అఖిల తాడ్వాయిలోని గిరి జన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా తండ్రి మల్లయ్య కుమార్తెను పాఠశాల నుంచి 16న ఇంటికి తీసుకెళ్లాడు. అఖిలకు జ్వరం రావడంతో తండ్రి మరుసటి రోజు వైద్య పరీక్షల కోసం ఏటూరునాగారంలోని ప్రైవేటు ఆస్రతికి తీసు కెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీ ఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల మంగళవారం రాత్రి మృతి చెందింది. మలేరియాతో మృతి చెందిందని వైద్యులు చెప్పారని అఖిల తండ్రి తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక తమ కూరుతు మృతి చెందిందని మల్లయ్య ఆరోపించాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమార్తెకు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించ లేదన్నారు. -
నీట్ శిక్షణ దరఖాస్తుకు 30 ఆఖరు తేదీ
ఎస్సీ విద్యార్థులకు దీర్ఘకాలిక ఉచిత ఎంబీబీఎస్ ప్రవేశపరీక్షకు(నీట్) శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ శిక్షణ పొందేందుకు విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మంగళవారం (26వ తేదీ)తో ముగిసిన తుది గడువును 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశం కోసం విద్యార్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో గౌలిదొడ్డిలోని రెసిడెన్షియల్ స్కూలులో ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్నివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
27న తెలంగాణ గురుకులాల ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని 47 ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి బి.శేషుకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 27న ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్షలను అన్ని రెవెన్యూ డివిజన్లలోని 131 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు 28,476 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ వెబ్సైట్ నుంచి (http://tsrjdc.cgg.gov.in) డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. అభ్యర్థులు హాల్‌టికెట్, బాల్ పాయింట్ పెన్నుతో ఉదయం 10.15 గంటలలోపు పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్లాలని సూచించారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
-
పాముకాటుతో విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా భద్రా చలం నియోజక వర్గం ఆశ్వాపురం మండం బొండుగూడెం ఐటీడీసీ ఆశ్రమ పాఠశాలలో పాము కాటుకుగురై ఓ విద్యార్ధి మృతి చెందాడు. పాఠశాల బయట అపస్మారక స్థితిలో పడిఉన్న ముగ్గురు విద్యార్థులను గుర్తించి.. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే... 5తరగతి చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజారాం అనే విద్యార్ధిని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మరో విద్యార్థి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆడుకుంటూ ఉండగా.. విద్యార్థులకు పాము కాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా.. భద్రాచలం ఆస్పత్రిలో ఉన్న విద్యార్థిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. -
ఆహారం వికటించి 25 మందికి అస్వస్థత
ఉదయం అల్పాహారం తిని 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో 150 మంది బాలికలున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో అల్పాహారంగా ఇచ్చిన ఉప్మా తిన్న విద్యార్థులు 25 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. అధికారులు వారందరినీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని, బాలికలకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. -
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
-
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మంగళవారం రాత్రి ఉరివేసుకుని మృతిచెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పునూరు వియ్‌కుమార్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తరగతి గదిలో పుస్తకాలు ఉంచేసి ఎటో వెళ్లిపోయాడు. రాత్రి కూడా హాస్టల్ కు రాలేదు. బుధవారం ఉదయం పాఠశాల పక్కనున్న షెడ్డులో ఉరివేసుకుని విగతజీవుడై కనిపించాడు. ఉరికి వేలాడుతున్న వినయ్‌కుమార్‌ను చూసి తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
'గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలి'
వరంగల్: జిల్లాలోని రాయపర్తిలోగల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండటం, అడ్మిషన్ కోరే విద్యార్థుల విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉన్న కారణంగా సీట్ల సంఖ్య పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పెంపుపై నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
బాలికపై తహసీల్దార్ అత్యాచారయత్నం
గుండాల: ఖమ్మం జిల్లా గుండాల ఇన్చార్జి తహసీల్దార్ సురేష్(40) సోమవారం ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి బంధువులు అతనిపై దాడి చేసి ఖమ్మం టూటౌన్లో అప్పగించారు. కొత్తగూడెంకు చెందిన సురేష్ (40) గుండాల ఇన్చార్జి తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఉంటున్నాడు. బూర్గంపాడు మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఖమ్మంలోని బంధువుల ఇంటికి వచ్చింది. సురేష్ ఇంటి పక్కనే వారి ఇల్లు ఉంది. ఈ క్రమంలో సురేష్ ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. 454 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
30 మంది బాలికలు ఆస్పత్రిపాలు
జైపూర్: కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. నాగౌర్ జిల్లాలోని లాంగోర్ అనే గ్రామంలో ఓ ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. గత రాత్రి భోజనం చేసిన ఆ బాలికలు.. అనంతరం తమకు వికారంగా ఉందని, వాంతులవుతున్నాయని, కడుపులో నొప్పిగా ఉందని వసతి గృహం అధికారులకు చెప్పారు. దీంతో వారిని అందుబాటులో ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి పాలైన బాలికలంతా కూడా 11 నుంచి 13 సంవత్సరాల లోపువారే. వీరంతా ఈ పాఠశాల సమీపంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆహార పదార్థాల తనిఖీల అధికారులు స్టాక్‌ను పరీక్షించారు. కలుషితమైన ఆహారం కారణంగానే బాలికలకు సమస్య ఎదురైందని స్పష్టం చేశారు. -
అందరూ చదువుకోవాలి
చౌటుప్పల్, న్యూస్‌లైన్ : అందరూ చదువుకోవాలని.. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో మండలానికో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావిలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ తరహాలో అన్ని రకాల హంగులతో మండలానికో పాఠశాలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తామన్నారు. ఈ విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. అందరూ చదువుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నందగిరి మహేశ్వరి, పోసాని నాగేశ్వర్రావు, పోసాని రాణి, ఎంఈఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏకే రెడ్డి, డీజీ రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పెద్దిటి బుచ్చిరెడ్డి, శ్యామ్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మరో 15 గురుకుల పాఠశాలలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కొత్తగా 15 గురుకుల పాఠశాలలను రూ.195 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో శనివారం గుంటూరులో నిర్వహించిన పేరెంట్స్ ఫెస్ట్ -2014 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక్కో గురుకుల పాఠశాలను రూ.13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రూ.150 కోట్ల వ్యయంతో అత్యున్నత సదుపాయాలతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో ఏటా 500 మందిని ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. -
పెద్ద సాహసం ఈ ‘పేద..’ ఆశయం
అలంపూర్, న్యూస్‌లైన్ : ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలోకి రావాలని ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించడం సహజం. కానీ ఆ శిఖరాన్ని అధిరోహించడానికే ఎంపికయ్యాడు అలంపూర్ మండలంలోని ప్రాగటూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి నాగరాజు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి సాహసమైనా చేసి ఉన్నత స్థానాన్ని దక్కించుకోవచ్చనే రుజువు చేశాడు . పర్వతారోహణలో మెళకువలు ఔపోసన పట్టి ఏకంగా ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి స్థానం సంపాందించాడు. నాన్న లేకున్నా...అమ్మే ఆసరాగా.. రామదాసు, దేవమ్మలకు నేతాజి, పుష్పావతి, నాగరాజు, జ్యోతి నలుగురు సంతానం. వీరిలో నాగరాజు మూడో కుమారుడు. రామదాసు 13 ఏళ్ల క్రితం వలస కూలీగా పని చేస్తూ మృత్యువాతపడ్డాడు. దీంతో కుటుంబాన్ని దేవమ్మ తన కష్టార్జితంతో పోషిస్తోంది. వీరిలో ఇద్దరు కుమారులు చదవులతోపాటుగా వివిధ రంగాల్లో రాణించి తల్లిదండ్రులతోపాటు గ్రామానికి వన్నె తెచ్చారు. నాగరాజు ఎవరెస్టు అధిరోహణకు ఎంపిక కాగా... పెద్ద కుమారుడు నేతాజీ రాష్ట్రం తరపున హ్యాండ్ బాల్ క్రీడాల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాడు. మట్టిలో మాణిక్యం ... ఆర్థిక స్తోమత లేని నాగరాజు విద్యాభాస్యం ఇతర ప్రాంతాల్లోనే కొనసాగింది. ప్రాథమిక విద్య వనపర్తిలోని కేడీసీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగింది. 6 నుంచి 10వ తరగతి రంగారెడ్డి జిల్లాలోని చిలుగూరి రెసిడెన్షియల్ స్కూలులో సాగించాడు. ప్రస్తుతం పరిగిలోని ఏపీఎస్‌డబ్ల్యూ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ఏడాది చదువుతున్నాడు. భువనగిరలో జరిగిన పర్వతారోహణ శిక్షణ ఎంపికకు 299 పాఠశాలల నుంచి విద్యార్థులు రాగా ఇందులో 20 మంది ఎంపీకకాగా నాగరాజుకూ అవకాశం దక్కింది. 2013 సెప్టంబర్లో డార్జిలింగ్ వెళ్లాడు. అక్కడ 20 రోజులపాటు హిమాలయ మౌంటనీరింగ్ ఇన్స్ట్యూట్లో శిక్షణ పొందాడు. శిక్షణలో భాగంగా ఫస్ట్ క్యాంపులో 3500 అడుగుల ఎత్తును 20 కిలోల బరువుతో ఎక్కాడు. రెండవ, మూడవ క్యాంపుల్లోను ఇదే తరహా శిక్షణ పొందాడు. అనంతరం బేస్ క్యాపులో రినాక్లో 14500 అడుగుల గమ్యంలో 1700 అడుగుల గమ్యాన్ని సాధించింది నాగరాజు బృందం. అనంతరం స్నోక్ రాక్, ఐస్ రాక్, రాక్లను అవరోహించడం జరిగింది. 2013 డిసెంబరులో ఢిల్లీలో నాగరాజు, ఆనంద్(ఖమ్మం), గంగాధర్, మధుకర్(కరీంనగర్), భారతి(కడప), పూర్ణ, సరిత(నిజామాబాద్), సత్యనారయణ, మోహన్‌ప్రసాద్(వైజాగ్) ప్రత్యేక శిక్షణకు వెళ్లారు. వీరిలో నాగరాజు ఏప్లస్ గ్రేడ్ సాధించి గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఎవరెస్టు శిఖరారోహణకు ఎంపికయ్యాడు. ఆత్మసైర్యంతో ముందుకు వెళ్లాం.... భువనగిరిలో శిక్షణ తర్వాత మా బృందంతో కలిసి డార్జిలింగ్ వెళ్లాం. అక్కడి గుట్టలను చూసి భయపడ్డాం. అక్కడ చలి మైనస్ 20 డిగ్రీలు ఉంది. ఆ చలిని తట్టుకోలేపోయాం. ఎముకులను కొరికే చలిలో కనీసం అన్నం తినే పరిస్థితి లేదు. ఎందుకు వచ్చామా దేవుడా అనిపించింది. మా ప్రవీణ్‌కుమార్ సార్ ఆశయాన్ని నేరవేర్చాలనే పట్టుదలతో అత్మసైర్త్యంతో ముందుకు వెళ్లాం. శిక్షణలో స్నోక్ రాక్..ఐస్ రాక్..రాక్లను దాటి ముందుకు వెళ్లాం. 10వ రోజు రినాక్పీక్ ఎక్కేందుకు వెళ్లాం. దాన్ని అధిరోహించి జెండాను పాతి వచ్చాం. గౌల్దొడ్డిలో 20 రోజుల పాటు శిక్షణ పొందాం. అక్కడ 11 మంది బృందంలో ఇద్దరు ఆనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. తర్వాత శిక్షణ నిమిత్తం కాచిగుడా నుంచి ఢిల్లీ వెళ్లాం. అక్కడి నుంచి లాద్దాక్ వెళ్లాం. ఇంతటి అవకాశం కల్పించిన కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ, పీడీ ఉదయ్ భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ రఫీయుద్దీన్, క్లాస్ టీచర్, ఉపాధ్యాయ బృందానికి రుణపడి ఉంటాను. లాద్దాక్లో 20 రోజుల శిక్షణ పొందాం. అక్కడ ముందుగా చైనాసరిహద్దుకు చేరుకొని అక్కడ స్వచ్ఛమైన నీటి సరస్సును చూశాం. అక్కడ పని చేస్తున్న మన సైనికులతో అరగంటపాటు మాట్లాడి ఇక్కడి వాతవరణ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని ముందుకు వెళ్లాం. ఇలా అనేక అంశాలు నేర్చుకున్న తర్వాత ఈ అపూర్వ అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. - నాగరాజు విజయం సాధించాలి : ఎవరెస్టు అంటే నాకు తెలియదు. కానీ అందరు నా కొడుకు గురించి గొప్పగా చెబుతుంటే మాత్రం అనందంగా ఉంది. అందులో విజయం సాధించాలని కోరుకుంటున్నా. 13 ఏళ్ల క్రితం భర్త చనిపోతే కష్టమైన ఆ పని ఈ పని చేసుకుంటు పిల్లలను చదివించాను. వాళ్లు సైతం నా కష్టాన్ని చూసి బాగా చదువుతున్నారు. చదువుతోపాటు ఇలాంటి గొప్ప అవకాశాన్ని దక్కించుకోవడంతో నా కష్టానికి ఫలితం దక్కిందనిపిస్తుంది. ఎవరెస్టు ఎక్కి విజయం సాధించిన నా బిడ్డను గొప్పగా చూడాలని ఉంది. - దేవమ్మ, నాగరాజు తల్లి అలంపూర్, న్యూస్‌లైన్ : ప్రపంచంలోనే అతి ఎత్తై శిఖ రాన్ని అధిరోహించడానికి ఎంపికైన ఇంటర్ విద్యార్థి నా గరాజు శిఖరమంత ఎత్తుకు ఎదగాలని గ్రామస్తులు అకాంక్షించారు.తమ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన అతన్ని అభినందిస్తూ గ్రామస్తులు ఘనంగా స న్మానించారు. పర్వతారోహణలో శిక్షణ పొందుతున్న అతను సోమవారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. గ్రా మ రెవెన్యూ కార్యదర్శి భవన ఆవరణలో మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధమ్మ, ఉస సర్పంచ్, రైతు సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, దండోర సంఘం నాయకులు రాజు, రాముడు, మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తు లు తదితరులు నాగరాజును శాలువ, పూల మాలతో ఘ నంగా సత్కరించారు. గ్రామస్తులు సైతం అతన్ని అభినందించి పుష్పగుచ్చం అందజేశారు. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న వ్యక్తులకు గ్రామం తరుపున అన్నీ విధాల అదుకోవడానికి సిద్దంగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజు తల్లి దేవమ్మను కూడా ఘనం గా సన్మానించారు. -
టెండర్ రీకాల్..!
సాక్షి ప్రతినిధి, కడప: అడ్డుగోలు పనులు అప్పగించేందుకు సిద్ధమైన అధికారులకు చెంపపెట్టు తగిలింది. కాంగ్రెస్ నేతల మెప్పుకోసం నిబంధనలు తుంగలో తొక్కిన అధికారిపై విచారణకు ఆదేశించారు. రూ.5.76 కోట్లతో నిర్వహించిన టెండర్లును రద్దు చేస్తూ ఎండీ రవిచందర్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలల్లోకి వెళితే...జిల్లాలోని సగిలేరు, మడకలవారిపల్లె రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.5.76కోట్లతో పనులు నిర్వహించేందుకు టెండర్లను ఆహ్వానించారు. 1350 క్యూబిక్ మీటర్ల నిర్మాణం అనుభవం ఉన్న వారికి మాత్రమే అర్హతగా రూపోందించారు. అనంతరం 450 క్యూబిక్ మీటర్లు నిర్మాణం అర్హత ఉన్న వారందరూ పాల్గొనవచ్చని సవరించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టరుకు ఎస్ఈ స్థాయి అధికారి అప్పగించేందుకు చేశారని పలువురు కాంట్రాక్టర్లు ఎండీకి ఫిర్యాదు చేశారు. ఈవైనంపై బుధవారం సాక్షి పత్రిక ‘స్వామిభక్తి’ అంటూ ప్రధాన శీర్షిక ప్రచురించింది. ఈకథనాన్ని కొందరు కాంట్రాక్టర్లు ఎండీ రవిచందర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు చేశారు. ఆమేరకు ఆయన టెండర్ రీకాల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈ ప్రతాప్‌రెడ్డి నిబందనలు తారుమారు చేయడంపై వివరణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టెండర్ నిబందనలు మార్చకా తగిన గడువు ఎందుకు ఇవ్వలేదని కోరినట్లు సమాచారం. ఉన్నతాధికారి అండతో అప్పనంగా రూ.5.76కోటు కాంట్రాక్టును దక్కించుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీ నేతకు ఈ పరిణామం మింగుడు పడని వ్యవహారంగా మారింది. మాజీ మంత్రి ద్వారా పనులు దక్కపోతే పర్వాలేదు కనీసం సహకరించిన అధికారినైనా కాపాడండి అంటూ ప్రాధేయపతున్నట్లు సమాచారం. కాగా సగిలేరు, మడకలవారిపల్లె రెసిడెన్షియల్ పాఠశాల టెండర్లు రద్దు అయిన మాట వాస్తవమేనని జిల్లాకు చెందిన సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సాక్షి ప్రతినిధికి ధ్రువీకరించారు.