ఖమ్మం జిల్లా గుండాల ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్(40) సోమవారం ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి
గుండాల: ఖమ్మం జిల్లా గుండాల ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్(40) సోమవారం ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి బంధువులు అతనిపై దాడి చేసి ఖమ్మం టూటౌన్‌లో అప్పగించారు. కొత్తగూడెంకు చెందిన సురేష్ (40) గుండాల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఉంటున్నాడు. బూర్గంపాడు మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఖమ్మంలోని బంధువుల ఇంటికి వచ్చింది.
సురేష్ ఇంటి పక్కనే వారి ఇల్లు ఉంది. ఈ క్రమంలో సురేష్ ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. 454 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.