ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కురిచేడు(దర్శి టౌన్): ఓ మహిళా వీఆర్‌ఏపై మండల మేజిస్ట్రేట్ అసభ్యంగా ప్రవర్తించడానే ఆరోపణలు కురిచేడులో సోమవారం చర్చనీయాంశమైంది. మండలంలోని పడమర వీరాయపాలేనికి చెందిన వీఆర్‌ఏపై స్థానిక తహసీల్ధార్ డీవీబి వరకుమార్ లైగింక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వీఆర్‌ఏ ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా కురిచేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించింది.
సిబ్బంది అంతా హాజరు కాగా తహసీల్దార్ వరకుమార్ హాజరు కాలేదు. ఈ క్రమంలో గత శనివారం తహసీల్దార్ తన కార్యాలయంలో క్రిస్మస్ విందుకు తాను హాజరు కాలేదని, నాకు కోడి కూరతో పాటు నీవు కావాలంటూ తనతో అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలు ఆరోపిస్తోంది. తండ్రి లాంటి వారు ఇలా మాట్లాడటం సరికాదని వారించినా.. తనను వెనక నుంచి వచ్చి కౌగలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
చదవండి: ఛీఛీ.. బాలికపై పోలీస్ బాస్ లైంగిక దాడి
ఈ సంఘటనపై సోమవారం బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు. తహసీల్దార్‌ను దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై తహసీల్దార్ వరకుమార్ మాట్లాడుతూ తనపై బాధితురాలు నిరాధార ఆరోపణలు చేస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment