సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం చిలాపూర్‌లో ఓ చిన్నారి మృతి కేసు వివాదాస్పదంగా మారింది. స్థానికంగా ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని టీచర్ కొట్టడంతోనే మృతిచెందాడని తల్లిదండ్రులు, అటువంటిదేం లేదని స్కూల్ యాజమాన్యం పరస్పరం ఆరోపణలకు దిగారు.
చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే పిలగాడు మూడో తరగతి చదువుతున్నాడు. హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడతను. సమాచారం అందుకుని చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాత్విక్ కన్నుమూశాడు.
అయితే ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కొడుకు మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు సాత్విక్ తండ్రి. అయితే.. అటువంటిదేం లేదని, బెడ్ పైనుంచి పడడంతో అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని, ఆ తర్వాతే చనిపోయాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది.
దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. చిన్నారి సాత్విక్ స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం.
Comments
Please login to add a commentAdd a comment