children death
-
Vikarabad: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం చిలాపూర్‌లో ఓ చిన్నారి మృతి కేసు వివాదాస్పదంగా మారింది. స్థానికంగా ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని టీచర్ కొట్టడంతోనే మృతిచెందాడని తల్లిదండ్రులు, అటువంటిదేం లేదని స్కూల్ యాజమాన్యం పరస్పరం ఆరోపణలకు దిగారు. చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే పిలగాడు మూడో తరగతి చదువుతున్నాడు. హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడతను. సమాచారం అందుకుని చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాత్విక్ కన్నుమూశాడు. అయితే ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కొడుకు మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సాత్విక్ తండ్రి. అయితే.. అటువంటిదేం లేదని, బెడ్ పైనుంచి పడడంతో అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని, ఆ తర్వాతే చనిపోయాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. చిన్నారి సాత్విక్ స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం. -
ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్ సిరప్‌లే కారణం’
ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మాక్స్ దగ్గు మందు తాగి పిల్లలు మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సిరప్‌లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు తెలిపింది. సిరప్‌లపై నిషేధం ‘పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు అందించారు. 2.5- 5 ఎంఎల్ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2-7 రోజుల పాటు ఈ సిరప్‌ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్‌లపై నిషేధం విధించారు. కాగా 2012లో మారియన్ బయోటెక్ ఉజ్బెకిస్తాన్‌లో రిజిస్టర్ చేసుకుంది. స్పందించిన భారత్ భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఉజ్బెకిస్తాన్ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. దీనికి సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపింది. అయితే ఈ సిరప్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఈ ఘటనపై సీడీఎస్ఓ-నార్త్ జోన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయని తెలిసింది. మారియన్ బయోటెక్ కంపెనీ ఏమన్నదంటే ఉజ్బెకిస్తాన్‌లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ పేర్కొంది. తయారీ యూనిట్ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా అన్నారు. రెండోసారి భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 70 మందికిపైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారైన దగ్గు మందు సిరప్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పిల్లల మృతిపై కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉబ్జెకిస్తాన్, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్‌లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్ ఉండటమే కారణమని తేలింది. -
ఖమ్మంలో విషాదం.. చిన్నారులను చిదిమేసిన రావి చెట్టు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజారులో ప్రమాదవశాత్తు ఓ భారీ రావి వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. సరదాగా ఆడుకుంటున్న చిన్న పిల్లలపై చెట్టు పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన పిల్లల్ని ఆయుష్ (12), దిగంత్(8)గా గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ వాల్‌పై అకస్మాత్తుగా రావి చెట్టు పడిపోయింది. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా -
కారు డోర్‌లాక్ పడి.. ఊపిరాడక
నిజామాబాద్ అర్బన్: కారులో కూర్చుని సరదాగా ఆడుకుందామని అనుకున్నారు ఆ చిన్నారులు., కానీ ఆ కారే తమ పాలిట మృత్యుపాశం అవుతుందని గ్రహించుకోలేకపోయారు. ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులో ఎక్కిన ఇద్దరు చిన్నారులు కార్ డోర్ లాక్ అయి.. ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ముజాహిద్నగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సయ్యద్ రియాజ్ (10) మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇతనికి మహమ్మద్ బద్రుద్దీన్ (5) జత కలిశాడు. ఇద్దరు సమీపంలో ఉన్న పార్కులో కలసి కాసేపు ఆడుకున్నారు. ఈ క్రమంలో అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ కారులోకి సరదా కోసం ఎక్కారు. అయితే వెంటనే కారు డోర్‌లాక్ కావడంతో ఇద్దరు అందులోనే ఉండిపోయారు. కాసేపటికి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు కారులోనే మృత్యువాత పడ్డారు. సాయంత్రం 6 గంటలు అవుతున్నా చిన్నారులు ఇద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలోని అన్ని చోట్లా వారికోసం వెతికారు. అయినా వారి జాడ దొరకలేదు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కారు యజమాని అబ్దుల్ రహమాన్, తన కారును తెరిచి చూడగా వెనుక సీట్లో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి. వెంటనే రియాజ్ తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆడుకునేందుకు వెళ్లిన తమ పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఘటనాస్థలానికి చేరుకున్న ఒకటో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించగా బాలురు ఆడుకుంటూ కారులోకి వెళ్లినట్లు తేలింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన ఇద్దరు పిల్లలు అక్కా చెల్లెళ్ల కొడుకులు. తన కలల రూపం కళ్ల ముందే మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. -
సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మాతా శిశు మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ప్రస్తుతం ప్రతి లక్ష ప్రసవాల్లో 81 మంది తల్లులు, ప్రతి వెయ్యి జననాల్లో 28 మంది శిశువులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రసవాల సందర్భంగా లేబర్ రూం (ప్రసవ గది)లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్ కేసులను ఎలా డీల్ చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను, ఏకరూప కార్యక్రమాన్ని తయారు చేసింది. దానికి అనుగుణంగా లేబర్ రూంలలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించేలా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు లేబర్ రూంలలో ప్రసవాలు చేయకుండా అత్యంత సురక్షిత పద్ధతిలో కీలకాంశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే సిజేరియన్లు కాకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పది జిల్లాల్లో ‘దక్షత’ను వైద్య ఆరోగ్యశాఖ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు పది జిల్లాల్లో 2 వేల మంది డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారు కిందిస్థాయిలో మరికొందరికి ఇచ్చేలా కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మిగిలిన జిల్లాల్లోనూ ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహించి శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వరప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుకు పూనుకోవడం విశేషం. ఆ 72 గంటలే కీలకం... మాతాశిశు మరణాలు ప్రసవ సమయం నుంచి 72 గంటల మధ్య ఎక్కువగా సంభవిస్తుంటాయి. రక్తస్రావం జరగడం, బీపీలో హెచ్చుతగ్గులు, ఇన్ఫెక్షన్ సోకడం, శిశువు బయటకు రాకపోవడం తదితర కారణాల వల్ల గర్భిణులు చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే శిశువులైతే ఉమ్మనీరు మింగేయడంతో ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో చనిపోతుంటారు. గర్భిణులు ప్రసవం కోసం వచ్చిన దగ్గరి నుంచి ప్రసవం జరిగే వరకు మధ్యగల 72 గంటలే అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది తీసుకునే ప్రత్యేక జాగ్రత్తల మీదే మాతా శిశువుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో లేబర్‌రూంలు ఎంత గొప్పగా ఉన్నా హైరిస్క్ కేసుల్లో చేపట్టాల్సిన ప్రొటోకాల్ చికిత్సను పాటించకపోవడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన చికిత్సా పద్ధతులు పాటించడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయని, అలాంటి వాటికి చెక్ పెట్టడమే దక్షత కార్యక్రమం ఉద్దేశమని డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. చాలావరకు సంభవించే మరణాలన్నీ కూడా లేబర్ రూంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనని ఆయన విశ్లేషించారు. దక్షత ద్వారా శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రసవాల సందర్భంగా పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని పెంచుతారు. ప్రసవాల సందర్భంగా పాటించాల్సిన పద్ధతులను చెబుతారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను శిక్షణలో భాగంగా నేర్పిస్తారు. సిజేరియన్ల తగ్గింపూ లక్ష్యమే... హైరిస్క్ సందర్భాల్లో అనేక మంది వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ల వైపు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా అందులో 62,591 మంది అంటే 60 శాతం సిజేరియన్ ద్వారానే జరిగినట్లు సర్కారు నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు నిర్ధారించారు. దేశంలోకెల్లా తెలంగాణలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా మాతాశిశు మరణాలను తగ్గించడం, సిజేరియన్లను వీలైనంత వరకు నివారించడమే లక్ష్యంగా దక్షత కార్యక్రమం ద్వారా ముందుకు సాగాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రసవాలను సురక్షితంగా ఎలా చేయాలి? హైరిస్క్ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశాల గురించి వైద్యులు, సిబ్బందికి ప్రయోగాత్మకంగా చూపేందుకు ఉన్నతాధికారులు ఒక పరికరాన్ని కొనుగోలు చేశారు. ఇదొకరకంగా మాక్ డ్రిల్ లాంటిది. ఆ పరికరం ధర లక్ష రూపాయలు ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
విషాదం నింపిన వేసవి
మంత్రాలయం/మంత్రాలయం రూరల్: బుడిబుడి నడకల సవ్వడి ఆ ఇళ్లలో మూగబోయింది. ముసిముసి నవ్వులు బోసిపోయాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్న పసి మొగ్గలు నేలరాలాయి. సరదగా సాగాల్సిన వేసవి సెలవులు పెను విషాదం నింపాయి. ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన మంత్రాలయం మండలం చెట్నేహళ్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. చెట్నేహళ్లి గ్రామానికి చెందిన చిన్న రాఘవేంద్రగౌడ్, ఉమాదేవి దంపతుల కుమారుడు కార్తీక్‌గౌడ్(9) మూడో తరగతి పూర్తి చేశాడు. అదే ఇంటి ఆడపడచు రాఘమ్మను ఆదోనికి చెందిన గురుపాదప్పకు ఇచ్చి వివాహం చేశారు. వీరి కుమారుడు పెద్ద బసవ (11) 5వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల నిమిత్తం పెద్ద బసవ అమ్మమ్మ ఇల్లు చెట్నేహళ్లికి వచ్చాడు. సోమవారం బసవ, కార్తీక్ గ్రామ సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొందరు క్రికెట్ ఆడుతుండగా కాసేపు చూస్తూ ఉండిపోయారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో పక్కనే ఉన్న బావి వైపు చిన్నారులు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకపోవడంతో క్రికెట్ ఆడుతున్న కొందరు అనుమానం వచ్చి బావి వైపు పరుగులు తీశారు. అప్పటికే చిన్నారులిద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో బావిలోకి దూకి బయటకు తీసి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని ప్రైవేటు వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పెద్ద బసవ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆదోనికి తీసుకెళ్లగా, కార్తీక్ మృతదేహాన్ని చెట్నేహళ్లికి తరలించారు. -
సిరియాలో ప్రభుత్వ బలగాల అమానుష దాడులు
-
వారి ధనదాహం.. వీరికి శాపం
* తెలుగు తమ్ముళ్ల అత్యాశే చిన్నారుల మృతికి కారణం చిలకలూరిపేట టౌన్: తెలుగు తమ్ముళ్ల మితిమీరిన ధనదాహం ఇద్దరు చిన్నారుల మృతికి కారణ మైంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందే తడవుగా చెరువుల అభివృద్ధి పేరు మాటున అధికార పార్టీ నాయకులు జేబులు నింపే నీరు–చెట్టు పథకానికి తెరతీశారు. నిబంధనలకు నీళ్లు వదులుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఈ వ్యవహారం చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ యథేచ్ఛగా కొనసాగింది. ఏ చెరువును ఎంతమేరకు తవ్వాలనే నియమాలేవీ పాటించకుండా ఎంత మట్టి తవ్వాం, జేబులు ఎంత నిండాయనే రీతిగా ఈ తతంగం కొనసాగింది. ఒకసారి తవ్విన చెరువునే రెండోసారి తవ్వడం, మట్టివిక్రయాలు చేయడం మండలంలోని మైదవోలు గ్రామ సమీపంలో 56 ఎకరాలలో విస్తరించి ఉన్న సీతమ్మ చెరువులో జరిగింది. ఈ అడ్డగోలు తతంగం చివరకు ఇద్దరు చిన్నారుల మృతికి కారణమై రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం బడినుంచి వచ్చిన చిన్నారులు ధర్నాసి ప్రహర్షిత (6), జొన్నలగడ్డ సరస్వతి (7) చెరువు కట్టపై ఆడుకుంటూ జారిపడి నీటిలో మునిగి మృతి చెందారు. కలకలం రేపిన విషాదం.. సీతమ్మ చెరువును గత ఏడాది వేసవిలో నీరు–చెట్టు పథకం ద్వారా తవ్వకాలు జరిపారు. వర్షాలు లేకపోవడం, చెరువులో నీరు చేరక పోవడంతో తిరిగి ఈ ఏడాది వేసవిలో చెరువులో మరోమారు తవ్వకాలు నిర్వహించారు. ఒకసారి తవ్విన చెరువును రెండోసారి తవ్వకాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేది జగమెరిగిన సత్యం. కేవలం ధనదాహంతో మట్టివిక్రయాలు చే సేందుకే తవ్వకాలు జరిగాయనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడం ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేరకు మాత్రమే చెరువులో నీళ్లు చేరాయి. స్వయానా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 50 చెరువులలో మట్టితవ్వకాలు జరిగాయి. వీటిలో చాలా చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతు తవ్వకాలు జరిగినట్టు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టినపుడు ముందు చెరువుగట్ల అభివృద్ధికి, గ్రామంలోని రైతుల పంటపొలాల మెరకకు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వంటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి మట్టివిక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. యడ్లపాడు మండలంతో పాటు నియోజకవర్గంలోని నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లోని పలు చెరువులను ప్రమాదకర స్థాయిలో లోతుగా తవ్వకాలు చేశారు. భారీ వర్షాలు కురిసి పూర్తిస్థాయిలో నీరుచేరితే ఈసారి ఇంకెన్ని కుటుంబాలకు ఇలా శాపంగా మారుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై యడ్లపాడు ఎంపీడీవో సీహెచ్ సువార్తను వివరణ కోరగా సీతమ్మ చెరువులో గత రెండేళ్లుగా నీరు–చెట్టు పథకం ద్వారా రెండుసార్లు తవ్వకాలు చే సినట్లు తెలిపారు. -
అత్యాచారాన్ని ప్రతిఘటించిందని...
రాయపూర్: ఛత్తీస్గడ్ దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యాచారాన్ని ప్రతిఘటించిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదంగా ప్రవర్తించాడు. ఆమె బంధువుల పిల్లల్ని కిరోసిన పోసి నిప్పు అంటించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గుసిద్ధి గ్రామంలో మహావీర్ అనే దుండుగుడు 22సంత్సరాల వివాహిత మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. అయితే తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె అతడి నుంచి తప్పించుకుంది. దీంతో రెచ్చిపోయిన ఆ దుండగుడు ఆ మహిళ మేనకోడలు భువనేశ్వరి (6) మేనల్లుడు మోహన్ (3) ను కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆ పసివాళ్లు మంటల్లో కాలి బూడిదైపోయారు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. గత నెలలోనే బాధితురాలు అత్తవారింటికి వచ్చిందని, మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన మహావీర్.. అత్యాచారానికి యత్నించి విఫలం కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.