రాయపూర్: ఛత్తీస్గడ్ దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యాచారాన్ని ప్రతిఘటించిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదంగా ప్రవర్తించాడు. ఆమె బంధువుల పిల్లల్ని కిరోసిన పోసి నిప్పు అంటించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం గుసిద్ధి గ్రామంలో మహావీర్ అనే దుండుగుడు 22సంత్సరాల వివాహిత మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. అయితే తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె అతడి నుంచి తప్పించుకుంది. దీంతో రెచ్చిపోయిన ఆ దుండగుడు ఆ మహిళ మేనకోడలు భువనేశ్వరి (6) మేనల్లుడు మోహన్ (3) ను కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆ పసివాళ్లు మంటల్లో కాలి బూడిదైపోయారు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.
గత నెలలోనే బాధితురాలు అత్తవారింటికి వచ్చిందని, మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన మహావీర్.. అత్యాచారానికి యత్నించి విఫలం కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అత్యాచారాన్ని ప్రతిఘటించిందని...
Published Tue, May 12 2015 10:33 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement