700 శవపరీక్షలు చేసిన మహిళకు శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం | Chhattisgarh Woman Who Conducted Over 700 Autopsies Gets Ram Mandir Invite - Sakshi
Sakshi News home page

700 శవపరీక్షలు చేసిన మహిళకు శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం

Published Sun, Jan 14 2024 3:51 PM | Last Updated on Sun, Jan 14 2024 4:25 PM

hhattisgarhWoman Who Conducted Over 700 Autopsies Gets Ram Mandir Invite - Sakshi

అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాల రామ  విగ్రయ ప్రాణ ప్రతిష్టకు  మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆహ్వానితులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నారు. పౌర పురస్కార గ్రహీతలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు,  రామ మందిర ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఆహ్వానితుల్లో ఉన్నారు.

తాజాగా  700 శవపరీక్షలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ మహిళ సంతోషి దుర్గకు  రామమందిరానికి ఆహ్వానం రావడం విశేషంగా నిలిచింది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామమందిర్ ట్రస్ట్ నుండి ఆహ్వానం అందుకున్నారు. దీంతో  సంతోషి దుర్గ  సంతోషంగా  ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన జీవితంలో ఇలాంటి అదృష్టం దక్కుతుందని  ఊహించలేదు. సాక్షాత్తూ  ఆ రాముడే తన ఆహ్వానం పంపాడంటూ పరవశంలో  మునిగి  తేలుతూ భావోద్వేగానికి లోనైంది.  ఆహ్వానం అందినందుకు గాను ప్రధాని మోదీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.నర్హర్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు చెందిన సంతోషి దుర్గ(35) ప్రత్యేకత ఏంటంటే 700 శవపరీక్షలు నిర్వహించారు. నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్యంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపు 18 సంవత్సరాలు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు.. ఈ సమయంలో, ఆమె 700 పోస్ట్‌మార్టమ్‌లను నిర్వహించడం విశేషం ఆమె చేసిన కృషికి వివిధ సంఘాల నుండి గుర్తింపు పొందారు.

ఆహ్వాన లేఖ అందగానే ఆశ్చర్యపోయానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని ఆమె వెల్లడించారు.మార్చురీలో చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పనికి ఇంత పెద్ద గౌరవం లభించడంపై ఎంతగానో పొంగిపోయింది. జనవరి 18న నర్హర్‌పూర్ నుండి బయలుదేరి, అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై, నర్హర్‌పూర్ ప్రజల సంతోషం, శాంతి , పురోగతి కోసం ప్రార్థించాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు నర్హర్‌పూర్ BMO ప్రశాంత్ కుమార్ సింగ్ కూడా  సంతోషిని అభినందించారు.ఇ ది తమకు కూడా గర్వకారణమన్నారు.

కాగా అయోధ్యలోశ్రీ రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు శుభ ముహూర్తంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి  రామాలయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల బంధువులు, న్యాయవాదుల బృందం, హిందూ సాధువులు, నేపాల్‌లోని సెయింట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, జైన, బౌద్ధులకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఇంకా  సిక్కు కమ్యూనిటీలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, వార్తాపత్రికలు ,టెలివిజన్ ఛానెల్‌ల రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, నోబెల్ బహుమతి, భారతరత్న, పరమవీర చక్ర , పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరకు , త్రివిధ దళాల విశ్రాంత అధిపతులు, మాజీ రాయబారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులుతోపాటు,  మేధావులు, క్రీడాకారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు , పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement