
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది.
‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్‌లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment