
ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు దిగడం అనేది సాధారణమైపోయింది. ఆ జ్ఙాపకం గుర్తుండిపోవడం కోసం ఇలా సెల్ఫీ తీసుకుంటాం. చాలా సందర్భాల్లో సెల్ఫీలు గుర్తులా మిగిలిపోతే.. కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎత్తైన కొండలు, సముద్రాలు, జలపాతాలు. పాములు.. ఇలా ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ఇబ్బందులు పడ్డ వారున్నారు. సెల్ఫీ కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు, ప్రాణాలు కోల్పోయిన వారిని చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ మేకతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన యువతికి ఊహించిన షాక్ తగిలింది.
చదవండి: Viral: కుక్కపిల్లతో సీతాకోకచిలుకల చిలిపి ఆట!
అయితే ఈ వీడియో ఇప్పడిది కాదు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనకు చెందిన పాత వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్‌లో షేర్ చేయడంతో మళ్లీ ట్రెండవుతోంది. ఈ వీడియోలో తాడుతో కట్టేసి ఉన్న ఓ మేక ముందు యువతి సెల్ఫీకి ట్రై చేస్తోంది. ఇంతలో మేక తాడు విదిలించుకోని రావడానికి ప్రయత్నించింది. మేక దగ్గరకు వస్తున్నా.. ఆ యువతి మాత్రం వీడియోలు, సెల్ఫీలు దిగుతూనే ఉంది. ఇంతలో మేకకు ఏమనిపించిందో ఏమో ఒక్కసారిగా వెనక్కి వెళ్లి ముందుకొచ్చి గట్టిగా ఆ యువతి తలను బలంగా కుమ్ముకుమ్మింది. లక్కీగా మేకకు కొమ్ములు లేవు. ఉంటే.. తీవ్రమైన గాయలు అయ్యేవే.
చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ
మేక గుద్దిన గుద్దుకు ఆమె చేతిలో సెల్‌ఫోన్ ఎగిరి కింద పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ అమ్మాయి మేకను గమనించాల్సిందని, మేక బలంగా పొడిచింది పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఇంకొందరు ఈ సెల్ఫీ పిచ్చి ఏంటి, మేకతో సెల్ఫీ అంటే అంత ఈజీ కాదు. ఏది ఏమైనప్పటికీ యువతి ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే బాగుండేది. ఇకనైనా సెల్ఫీలు తీసుకునేటప్పుడు ముందు, వెనక చూసుకొని తీసుకోవాలని కోరుతున్నారు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.
— The Darwin Awards (@AwardsDarwin_) September 1, 2021
Comments
Please login to add a commentAdd a comment