పక్షి జాతుల్లో డేగలది ప్రత్యేక స్థానం. పక్షులన్నీ క్రిమి, కీటకాలను భోంచేస్తే.. అవి మాత్రం ఏకంగా జంతువులపై వేట సాగిస్తాయి. ఒక్కసారి వాటి బలమైన కాళ్లకు దొరికాయా ఇక అంతే! అంతెత్తున గాల్లో తిరుగుతూ నేలపై ఉన్నవాటిని గురిచూసికొట్టే వాటి వేగానికి వేట ఖాయమవాల్సిందే.
తాజాగా ఓ డేగ వేటకు సంబంధించిన 57 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈసారి డేగ ఆటలు సాగలేదు. దాని బలమైన పంజా నుంచి కొండ మేక తప్పించుకున్న తీరు భలేగా ఉంది. వీడియో ప్రకారం.. మాంచి ఆకలిమీదున్న ఓ భారీ డేగ కొండ మేకపై కన్నేసింది. అంతెత్తు నుంచి అమాంతం దానిపైబడి తన పదునైన కాళ్లతో ఒడిసి పట్టింది. ఇంకొంచెమైతే అది మేకను నోట కరిచి ఉడాయించేదే!
అయితే, అక్కడే మేకకు ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. ప్రాణాలు దక్కిచుకునేందుకు శక్తినంతా కూడదీసుకుని పరుగు లంకించుకుంది. అయినప్పటికీ డేగ తన పట్టు విడువలేదు. మేక మరింత తెలివిగా దారిలో దొర్లుకుంటూ పోయింది. రెండు జీవాలు అలా బండరాళ్లపై రాసుకుంటూ కొంత దూరం వెళ్లాయి. అయినా లాభం లేకపోవడంతో ఈసారి మేక బండరాళ్లకు బలంగా రాసుకుంటూ పోయింది.
అలా కొద్దిదూరం వెళ్లగానే రాళ్ల దెబ్బలకు డేగ వెనక్కి తగ్గకతప్పలేదు. తిండి మాట దేవుడెరుగు ఒళ్లు హూనమైందిరో బాబోయ్ అంటూ అది తన ఉడుం పట్టు విడిచింది. ఇక ఈ భీకర పోరు జరుగుతున్న సమయంలో ఆ కొండ మేక తోడుగా మరో మేక కూడా ఉండటం విశేషం. తన మిత్రుడికి ఎప్పుడేం సాయం అవసరమవుతుందో అని అది వాటి చుట్టే పరుగులు పెట్టింది.
(చదవండి: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం)
సింహం కన్నా బలమైన పట్టు
ఎంతో బరువైన జంతువులపై దాడిచేసి అలవోకగా లేవదీసుకుపోయే డేగ పట్టు సింహం కన్నా బలమైనదట. ఒక చదరపు అంగుళానికి సుమారు 340 కిలోల పట్టు బలం దీని సొంతం. సాధారణంగా ఇవి మూడున్నర ఫీట్ల వెడల్పుంటాయి. వీటి రెక్కలు 9 ఫీట్ల పొడవు ఉంటాయి. అంతటి బలమైన పక్షిబారి నుంచి తప్పిచుకోవడంమంటే మామూలు విషయం కాదు.
(చదవండి: ముంబో జంబో.. అంటే అర్థం తెలుసా? ఈ ఆర్ట్‌ను చూస్తే..)
Comments
Please login to add a commentAdd a comment