బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
బాధిత యువతి ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది.
కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.
Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7
— Niti (@nihihiti) September 4, 2024
కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
ఓలా స్పందన
ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండిస్తోంది. నిందితుడైన డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణీకుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment