కొంతమంది వాహనదారులకు తెలియకుండా వెనక నుంచి వాహనంలోకి ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా గూడ్స్ డెలివరీ చేసే వాహనాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఆధికంగా జరగుతుంటాయి. తాజాగా అటువంటి ఓ ఘటన అమెజాన్ డెలివరీ వాహన డ్రైవర్‌కు ఎదురైంది. ఓ అమ్మాయి అమెజాన్ డెలివరీ వాహనం డ్రైవర్‌కు తెలియకుండా ఆ వాహనంలోకి ఓ మహిళ ఎక్కి కూర్చుకుంది.
ఈ ఘటన అమెజాన్ డెలివరీ ఫ్లొరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఫ్లొరిడాలోని ఓ రోడ్డుపై ఉన్న అమెజాన్ డెలివరీ వాహనం నుంచి ఓ మహిళ కిందకు దిగి నడుచుకుంటూ వెళ్లుతుంది. అయితే వాహనదారుడికి తెలియకుండా అందులోకి ఎక్కడంతో విషయం తెలుసుకున్న వాహనదారుడు ఆమెను కిందకు దించివేశాడు. అయితే ఈ వీడియోను ట్విటర్‌లో ఓ నెటిజన్ షేర్ చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీగా జోకులు పేల్చుతున్నారు.
‘అందుకే నా డెలివరీ ప్యాకేజీలు అలస్యం అవుతన్నాయా?’.. ‘ఆమె ప్రైమ్ ప్లస్ మెంబర్‌షిప్ తీసుకున్నట్లు ఉంది’.. ‘అసలు ఆ అమ్మాయి వ్యాన్‌లోకి ఎలా వెళ్లింది?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. తాము ఉత్పత్తులను డెలివరీ చేసే సయమంలో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేవలం కంపెనీ గుర్తింపు ఉన్నవాళ్లు డ్రైవర్లు మాత్రమే.. డెలివరీ వాహనాలను నడుపుతారని అన్నారు.
Amazon delivery drivers are different! 😅😂 (via @patrickhook01/TT) pic.twitter.com/sS0kzEw0Ij
— i SEENT it (@iseentit_online) October 25, 2021
Comments
Please login to add a commentAdd a comment