rural areas
-
పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్‌ఈఆర్‌లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్ ఫోన్లు, సొంతంగా స్మార్ట్ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. ఏఎస్ఈఆర్ సర్వేలోని ప్రధాన అంశాలు» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు. » ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. » అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. » సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. » విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్ మీడియా ఖాతాల కోసం స్మార్ట్ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. » డిజిటల్ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్ చేయడం, ఫేక్ ప్రొఫైల్‌లను రిపోర్ట్ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్‌ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్‌వర్డ్‌లను మార్చడం తెలుసు. » పూర్తి డిజిటల్ టాస్్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్ సెట్ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్ చానళ్లను లొకేట్ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. » స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు» ఏఎస్‌ఈఆర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు. » చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది. » కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. » గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది. » ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది. చదవండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు74% సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు75% చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన పిల్లలు -
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ స్టోర్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు 33 శాతం పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు దూసుకెళ్తున్నాయనడానికి ఇది నిదర్శనమని డిజిటల్ బ్యాంకింగ్, నెట్వర్క్ సేవల్లో ఉన్న పేనియర్‌బై నివేదిక తెలిపింది. గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక, డిజిటల్ సేవలను అందిస్తున్న 10,00,000 కిరాణా, మొబైల్ రీఛార్జ్ వంటి చిన్న రిటైలర్ల నుండి సేకరించిన వాస్తవ లావాదేవీల సమాచారాన్ని విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు.2024 జనవరి నుండి నవంబర్ వరకు జరిగిన వ్యాపార లావాదేవీల సమాచారాన్ని 2023తో పోల్చారు. ‘ఈ ఏడాది బీమా పాలసీ కొనుగోళ్లు, ప్రీమియం వసూళ్లు లావాదేవీల పరిమాణంలో 127 శాతం పెరిగాయి. కొత్త కస్టమర్లు 96 శాతం అధికం అయ్యారు. భారత్ అంతటా బీమా చొచ్చుకుపోయే సవాళ్లను అధిగమించడంలో డిజిటల్ రిటైల్ దుకాణాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. నగదు ఉపసంహరణలు.. ‘గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో వ్యాపారం, బంగారం, వ్యక్తిగత రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్ సహా రుణ ఉత్పత్తులలో పరిమాణం 297 శాతం దూసుకెళ్లింది. ఈ గణనీయమైన పెరుగుదల అట్టడుగు స్థాయిలో రుణ పరిష్కారాల పట్ల పెరుగుతున్న అవగాహన, డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. మైక్రో ఏటీఎం, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్స్ వద్ద నగదు ఉపసంహరణలు 2024లో తగ్గాయి. లావాదేవీల పరిమాణం, ఒక్కో లావాదేవీకి సగటు నగదు ఉపసంహరణ రెండూ స్వల్ప క్షీణతను చవిచూశాయి.సగటు నగదు ఉపసంహరణ 2023లో రూ.2,624 నమోదైతే, ఈ ఏడాది ఇది రూ.2,482కి పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో నగదు ఉపసంహరణలు విలువలో 58 శాతం, పరిమాణంలో 74 శాతం వృద్ధిని నమోదు చేశాయి’ అని నివేదిక తెలిపింది. బీమా, ఈ–కామర్స్, రుణాల వంటి విభిన్న సేవలను అందించే సాధనాలతో స్థానిక రిటైలర్లను సన్నద్ధం చేయడం ద్వారా.. అట్టడుగు స్థాయిలో ఆర్థిక లభ్యత, ఆర్థిక పురోగతికి కీలక సహాయకులుగా మారడానికి వారిని శక్తివంతం చేస్తున్నాముని పేనియర్‌బై వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. -
మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్‌ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అమెజాన్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్‌ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్‌ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. -
పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్ డివైడ్’
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ‘డిజిటల్ డివైడ్ ’అనేది క్రమంగా తగ్గుతోంది. రోజువారీ జీవన విధానం, అలవాట్లలో వచ్చిన మార్పులుచేర్పులతోపాటు అందరికీ ఆధునిక సాంకేతిక పరిజాŠక్షనం అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. డిజిటల్ విప్లవం అనేది వివిధ రూపాల్లో విస్తరించడంతో అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు స్మార్ట్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఆధునిక సాంకేతికతను పట్టణ, గ్రామీణ తేడాలు లేకుండా ఉపయోగించుకోగలుగుతున్నారు. 95.1 శాతం కుటుంబాలు (గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతం, పట్టణాల్లో 97.1 శాతం) టెలిఫోన్/ మొబైల్ సౌకర్యాలు కలిగి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గతంతో పోలి్చతే..ఇది మెరుగైన పరిస్థితి కాగా, మొబైల్ టెక్నాలజీ వినియోగంలో రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యఉన్న చిన్న వ్యత్యాసం కూడా చెరిగిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నిర్వహించిన కాంప్రహెన్సివ్ అన్యూవల్ మాడ్యువల్ సర్వేలో అనేక అంశాలు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండమాన్, నికోబార్‌లోని కొన్ని గ్రామాల్లో మినహా దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 3,02,086 కుటుంబాలను (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) కలిశారు. మొత్తంగా 12,99,988 (గ్రామాల్లో 7,85,246 మంది, పట్టణాల్లో 5,14,742 మంది) మంది నుంచి వివరాలు సేకరించారు.మొబైల్, ఇంటర్నెట్ వినియోగం, ఐసీటీ స్కిల్స్, ఔట్ ఆఫ్ ప్యాకేట్ మెడికల్ ఎక్స్పెండీచర్, విద్య తదితర అంశాలపై ఈ సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా 95.7 శాతం గ్రామీణ యువత (పట్టణాల్లో 97 శాతం) మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. 15–25 ఏళ్ల మధ్యనున్న గ్రామీణ యువత 82 శాతం (పట్టణాల్లో 92 శాతం) ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు ⇒ 15–24 ఏజ్ గ్రూప్‌లో 78.4 శాతం యువత అటాచ్డ్ఫైల్స్తో మెసేజ్ పంపగలుగుతున్నారు. ఈ వయసులోని వారే 96.9 శాతం (వీరితో పురుషులు 97.8%, మహిళలు 95.9%) చదవడం, రాయడంతో పాటు సాధారణ ⇒ గణాంకాలు చేస్తున్నారు. 71.2 శాతం మంది కాపీ అండ్ పేస్ట్ టూల్స్ వినియోగిస్తున్నారు. 26.8 శాతం మాత్రమే ఆన్లైన్ సెర్చ్, ⇒ ఈ–మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంక్ నిర్వహణ చేయగలుగుతున్నారు. దేశంలో 9.9 శాతం కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 21.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం) డెస్్కటాప్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు కలిగి ఉన్నారు. ⇒ 18 ఏళ్లకు పైబడిన వారిలో 94.6 శాతం మందికి వ్యక్తిగత, ఉమ్మడి బ్యాంక్ ఖాతా, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్‌లో అకౌంట్, మొబైల్ మనీ సరీ్వస్ ప్రొవైడర్ ఖాతా కలిగి ఉన్నారు. ⇒ తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి 500 మీటర్లలోపు దూరంలోనే లోకెపాసిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (బస్సు,కారు, టాక్సీ, ఆటో వంటివి) సౌకర్యాలు 93.7 శాతం పట్టణ ప్రాంత జనాభాకు అందుబాటులో ఉన్నాయి. -
70,00,000 తాగునీటి కొళాయిలు
⇒ రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరీక్షల నిర్వహణలో మొత్తం 700 మార్కుల ప్రాతిపదికన ఆ రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే 699.93 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 657.10 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రెండున్నర లక్షల తాగునీటి వనరులు ఉండగా, నీటిశుద్ధి పరీక్షల అనంతరం 25,546 తాగునీటి వనరుల్లో నీరు వివిధ కారణాలతో కలుషితమైనట్టు గుర్తించగా, ఆయా ప్రాంతాల్లొ అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.45 లక్షల ఇళ్లు ఉంటే, అందులో 70.04 లక్షల ఇళ్లకు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికే తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ శానిటేషన్ 2023–24 ఆరి్థక సంవత్సరం వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేసింది. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటిని వారి ఇంటి ఆవరణలోనే అందజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో కలిసి 2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 60 శాతం గ్రామీణ ప్రాంత ఇళ్లలో తాగునీటి కుళాయిలు అందుబాటులోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ఇళ్లలో 73.38 శాతం ఇళ్లకు 2024 మార్చి నెలాఖరుకే అందుబాటులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. -
గ్రామాల్లో బ్యాంక్ సేవలు విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న రుణ గ్రహీతల అవసరాలపై దృష్టి సారించాలని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) కోరింది. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వార్తలను ప్రస్తావిస్తూ.. ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతలు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూ లు చేస్తుండడం, దీనికితోడు ప్రతిఫలం ఇవ్వని పంట మద్దతు ధరలు ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. బ్యాంకుల జాతీయీకరణ దినం సందర్భంగా ఏఐబీవోసీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలంటూ.. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతల ఉచ్చులో పడకుండా రైతులను కాపాడొచ్చని అభిప్రాయపడింది. కేవలం 74 వేల గ్రామాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఇటీవలి ఒక నివేదికను ఉటంకించింది. గ్రామీణ పేదలకు రుణ లభ్యత అన్నది ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలినట్టు ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. విలీనాల తర్వాత బ్యాంక్‌లు పెద్ద కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాల అందుబాటు తగ్గిందని.. దీంతో వారు ఎన్బీఎఫ్సీలను ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ఎన్బీఎఫ్సీ రంగం దోపిడీ పద్ధతులు ఎస్ఎంఈలపై పెద్ద భారాన్ని మోపుతోందంటూ.. అది వాటి వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు.. బ్యాంక్‌ల ప్రైవేటీకరణ, పెద్ద బ్యాంక్‌ల మధ్య స్థిరీకరణ అన్నవి ఆర్థిక సేవల మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలు ఎంత మాత్రం కోబోవని ఏఐబీవోసీ ప్రకటన పేర్కొంది. ప్రైవేటీకరణ అన్నది సామాజిక అవసరాల కంటే సాధ్యమైనంత లాభాలు పొందడానికి దారితీస్తుందని, అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 26 వరకు ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఉండగా, విలీనాలతో 12 బ్యాంక్‌లు మిగలడం తెలిసిందే. దీన్ని ప్రైవేటీకరణకు దొడ్డిదారిగా ఏఐబీవోసీ అభివరి్ణంచింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ల కృషిని ఈ చర్యలు పట్టించుకోకపోవడమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల విలీనంతో అవి మార్కెట్ వాటా ను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నాటికి మొత్తం డిపాజిట్లలో 66 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ల వాటా 2023 డిసెంబర్ నాటికి 59 శాతానికి క్షీణించినట్టు ప్రకటనలో వివరించింది. -
గ్రామీణ మార్కెట్‌పై ఎఫ్ఎంసీజీ ఆశలు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయని కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక అంచనా వేసింది. అమ్మకాల్లో 6.1 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు 4.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు ఫ్లాట్‌గా 4.2 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి స్థిరత్వం నెలకొంటే అక్కడి నుంచి భారీ మార్పు కనిపించొచ్చని అభిప్రాయపడింది. పట్టణాలతో సమానంగా సమీప భవిష్యత్తులో పల్లెల్లోనూ అమ్మకాలు ఊపందుకోవచ్చని తెలిపింది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు సగం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్టు గుర్తు చేసింది. ఎఫ్ఎంసీజీలో వృద్ధి జనాభా ఆధారంగానే ఉంటుంది కానీ, వినియోగం ఆధారంగా కాదని వివరించింది. ఇవీ సమస్యలు.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, గ్రామీణ గృహ పరిమాణంలో తగ్గుదల, యుటిలిటీల కోసం (టెలిఫోన్, విద్యుత్, పెట్రోల్ తదితర) ఎక్కువగా ఖర్చు చేస్తుండడం, పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టడం గ్రామీణ ప్రాతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగంలో స్తబ్దతకు కారణాలుగా కాంటార్ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత నుంచి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ వినియోగం పడిపోవడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలోనే ఇది పుంజుకుంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ ఇతర రంగాల మాదిరే ఎఫ్‌ఎంసీజీలోనూ ప్రీమియమైజేషన్ (నాణ్యమైన, ఖరీదైన బ్రాండ్ల వైపు మొగ్గు) ధోరణి వృద్ధి చెందుతోందని కాంటార్ నివేదిక తెలిపింది. ఇది మెరుగైన జీవన ప్రమాణాలను తెలియజేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని విభాగాలు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తున్నట్టు, దీంతో ప్రీమియం ఉత్పత్తులకు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపింది. ఆహారం, ఫేస్ స్క్రబ్/పీల్/మాస్్క, బాడీ వాష్, హెయిర్ కండీషనింగ్ సిరమ్, ముసేలి, కొరియన్ నూడుల్స్‌ను ఉదాహరణలుగా పేర్కొంది. -
నిరుద్యోగ భారత్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగిత శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. గత మే నెలలో 6.3 శాతం ఉండగా, జూన్ నాటికి 9.2 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత శాతంగా అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో డిమాండ్ తగ్గడంతో అక్కడ పనులు చేసుకునేవారిలో నిరుద్యోగం పెరిగింది.అదే సమయంలో ఆర్థిక రంగం దిగజారడం, ఇతర అంశాల కారణంగా పట్టణాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగశాతం 6.3 ఉండగా, జూన్‌లో 9.3కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూస్తే...మే నెలలో 8.6 ఉండగా, జూన్ నాటికి 8.9 శాతానికి పెరిగింది. ⇒ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రెండుచోట్లా మహిళల్లోనే నిరుద్యోగమనేది ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ⇒ దేశవ్యాప్తంగా మహిళల విషయానికొస్తే... పట్టణ ప్రాంతాల్లో 21.36, గ్రామీణ ప్రాంతాల్లో 17.1 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ⇒ పురుషుల విషయంలో నిరుద్యోగిత శాతం పట్టణ ప్రాంతాల్లో 8.9, గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతంగా ఉంది. ⇒ 2023 జూన్‌లో నిరుగ్యోగ శాతం 8.5 ఉండగా, ఈ ఏడాది ఇదే సమయానికి 9.2 శాతానికి పెరిగింది. ⇒ కన్జూమర్ పిరమిడ్స్ హోస్‌హోల్డ్ సర్వేలోని గణాంకాల ప్రాతిపదికగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఆయా వివరాలు వెల్లడించింది.జనవరి–మార్చి మధ్యలో 6.7 శాతం... పీఎల్ఎఫ్ఎస్ సర్వేదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో 6.7గా నిరుద్యోగశాతం ఉన్నట్టుగా పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) పేర్కొంది. 2013లో 5.42 శాతమున్న నిరుద్యోగ శాతం, కరోనా పరిస్థితుల కారణంగా 2020లో 8 శాతానికి, ఆ తర్వాత 2021లో 5.98 శాతానికి తగ్గి, 2022లో 7.33 శాతానికి, 2023లో 8.4 శాతానికి, 2024లో తొలి ఆరునెలల్లో 6.7 శాతానికి (జూన్‌లో 9.2 శాతానికి) చేరుకున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.15–29 ఏజ్ గ్రూప్ నిరుద్యోగంలో మూడోప్లేస్ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక నిరుద్యోగ శాతమున్న రాష్ట్రంగా కేరళ నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఈ ఏజ్ గ్రూప్ నిరుద్యోగుల్లో టాప్‌ఫైవ్ రాష్ట్రాలు కేరళ 31.8 శాతం, జమ్మూ,కశ్మీర్ 28.2, తెలంగాణ 26.1, రాజస్థాన్న్ 24, ఒడిశాలో 23.3 శాతం ఉన్నట్టు వెల్లడైంది.దేశవ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌లో మొత్తంగా నిరుద్యోగిత శాతం జనవరి–మార్చి మధ్యలో 17 శాతంగా (అంతకు ముందు అక్టోబర్–డిసెంబర్ల మధ్యలో పోల్చితే 16.5 శాతం నుంచి) ఉంది. ఇక ఏజ్ గ్రూపుల వారీగా చూస్తే (అన్ని వయసుల వారిలో నిరుద్యోగ శాతం) నిరుద్యోగిత శాతం 6.7 శాతంగా ఉంది.నిరుద్యోగానికి ప్రధాన కారణాలు...⇒ అధిక జనాభా⇒ తక్కువ స్థాయిలో చదువు, నైపుణ్యాల కొరత (ఒకేషనల్ స్కిల్స్)⇒ప్రైవేట్‌రంగ పెట్టుబడులు తగ్గిపోవడం⇒వ్యవసాయరంగంలో తక్కువ ఉత్పాదకత ⇒చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం కొరవడటం⇒మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిరంగాల్లో పురోగతి సరిగ్గా లేకపోవడం⇒అనియత రంగం (ఇన్ఫార్మల్ సెక్టార్) ఆధిపత్యం⇒ కాలేజీల్లో చదివే చదువు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరం పెరగడంమహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ఈ ఏడాది జనవరి–మార్చి నెలల మధ్యలో వివిధ వయసుల వారీగా నిరుద్యోగిత శాతంపై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేçషన్ (ఎంఎస్‌పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఇవి వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళల్లో అత్యధిక నిరుద్యోగుల శాతంలో తెలంగాణ 38.4 శాతంతో నాలుగో స్థానంలో నిలిచినట్టు ఈ సర్వే వెల్లడించింది. మహిళల్లో అత్యధికంగా నిరుద్యోగులు అంటే 48.6 శాతంతో జమ్మూ కశ్మీర్ మొదటిస్థానంలో నిలవగా...కేరళ 46.6 శాతంతో రెండోస్థానంలో, ఉత్తరాఖండ్ 39.4 శాతంతో మూడోస్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 35.9 శాతంతో ఐదో స్థానంలో నిలిచాయి. ⇒ పురుషుల్లో అత్యధిక నిరుద్యోగిత శాతమున్న రాష్ట్రంగా 24.3 శాతంతో కేరళ మొదటి స్థానంలో, బిహార్ 21.2 శాతంతో రెండోస్థానం, ఒడిశా, రాజస్తాన్‌లు 20.6 శాతంతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 19.6 శాతంతో నాలుగోస్థానంలో నిలిచాయి.ఏ అంశాల ప్రాతిపదికన...⇒16 ఏళ్లు పైబడినవారు పరిగణనలోకి⇒ నెలలో నాలుగువారాలపాటు పనిచేసేందుకు అందుబాటులో ఉండేవారు⇒ఈ కాలంలో ఉపాధి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు⇒ ఉపాధి కోల్పోయి మళ్లీ పనికోసం చురుగ్గా వెతుకుతున్నవారు.నిరుద్యోగుల శాతం లెక్కింపు ఇలా...నిరుద్యోగిత శాతం = నిరుద్యోగుల సంఖ్య/ఉద్యోగులు, ఉపాధి పొందిన సంఖ్య + నిరుద్యోగుల సంఖ్య -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్‌షాప్స్‌ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్‌బ్యాక్స్‌కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్‌యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
గ్రామాలకూ న్యాయవిద్య: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులను సైతం న్యాయవిద్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాంకేతికత మనకు సుదూరప్రాంత విద్యార్థులకు సైతం చేరువయ్యే సామర్థ్యాన్ని అందించింది. న్యాయ విద్య ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఆంగ్లం మాట్లాడే పట్టణ ప్రాంత పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇది అనుకూలంగా ఉంది’అని అన్నారు. ‘ఇటీవల అయిదు లా యూనివర్సిటీల్లో ఓ సర్వే చేపట్టాం. విభిన్న భాషా నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడ లేకపోవడమే కారణంతో ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నట్లు సర్వేలో తేలింది’అని సీజేఐ వెల్లడించారు. భాషా పరమైన అవరోధాలను అధిగమించేందుకు భాషిణి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఇందులో సుప్రీంకోర్టు 1950–2024 మధ్య వెలువరించిన 36 వేల పైచిలుకు తీర్పులను తర్జుమా చేసి ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి కోర్టుల్లో ఇంగ్లిష్ మాట్లాడలేని న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. న్యాయవిద్యను హిందీలో బోధిస్తే ఉత్తమ విద్యార్థులు తయారవుతారని వర్సిటీ యంత్రాంగానికి ఆయన సూచించారు. -
లైటింగ్ పరిశ్రమలో అగ్ర స్థానంపై విప్రో కన్ను
న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది. మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్లైన్లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు. అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్‌కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి. గృహోపకరణాల విభాగంలో విస్తరణ గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్‌టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్‌లో తాము మార్కెట్ లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. -
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకు బ్రాంచీలు ఏర్పాటు చేయాలంటూ పెద్దఎత్తున వినతులు వస్తున్న దృష్ట్యా అవసరమైన గ్రామాల్లో మరిన్ని బ్యాంకు బ్రాంచీలు నెలకొల్పాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి సూచించారు. విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగ్గా.. సమావేశ అంశాలను బ్యాంకర్ల కమిటీ ఆదివారం విడుదల చేసింది. కేంద్ర మంత్రి సూచనలివీ ♦ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఏ సూచనలు చేశారంటే.. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్యాంకు బ్రాంచిల ఏర్పాటుకు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లతో సర్వే జరిపించాలి. ♦ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సులను నిబంధనల మేరకు అనుమతించాలి. ♦ గిరిజన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో నీతి ఆయోగ్ ప్రకటించిన ఆకాంక్ష జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ జిల్లాల్లో కనెక్టివిటీ సమస్యలుంటే టెలీ కమ్యూనికేషన్ శాఖ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం ద్వారా అవసరమైన ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచిలు ఏర్పాటు చేయాలి. ♦ రాష్ట్రంలో 186 గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేవు. ఆయా గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఆ గ్రామాల్లో సర్వే నిర్వహించడంతో పాటు బ్రిక్ అండ్ మోటార్ బ్రాంచిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల 109 గ్రామాల్లో చాలా గ్రామాలు వెయ్యి కంటే తక్కువ జనాభాతో రహదారి, నెట్ వర్క్ కనెక్టివిటీ లేకుండా మండల ప్రధాన కార్యాలయాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి మేజర్ పంచాయతీల్లోని 11 ప్రాంతాల్లో కొత్తగా బ్యాంకు బ్రాంచిలు ఏర్పాటు చేయాలి. బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్యాంకులు కేంద్ర మంత్రి సూచనల మేరకు రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి లేదా రాజవొమ్మంగిలో ఏపీ జీవీబి బ్రాంచి ఏర్పాటు చేయనుంది. మారేడుమిల్లిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎటపాకలో ఎస్బీఐ, కొయ్యూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జనాభా ఆధారంగా ఆరు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. బొమ్మికలో స్టేట్ ఎస్బీఐ, గంగరేగువలసలో బ్యాంక్ ఆఫ్ బరోడా, మొండెంఖల్లులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మత్తుమూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా, పి.కోనవలసలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గురండిలో ఎస్బీఐ బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 3 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 21 గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్రిక్ అండ్ మోర్టార్ శాఖలు లేవని జిల్లాల లీడ్ బ్యాంక్ మేనేజర్లు గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సెంటర్ కూడా లేదని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో బ్యాంకింగ్ సేవల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఇదిగో సారూ... నా మేక టికెటు
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. -
పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్!
న్యూఢిల్లీ: మారిన జీవనశైలి, ఆహార నియమాలతో పట్టణం, పల్లె అని వ్యత్యాసం లేకుండా ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. దీనికితోడు వైద్య వసతులు పెరగడంతో పల్లెల్లోనూ ఔషధ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో ఫార్మసీ స్టోర్లు జోరుగా తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఏర్పడిన అవగాహన సైతం ఔషధ వినియోగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, ఏటా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో ఫార్మాసిస్టులు రావడం కూడా ఔషధ దుకాణాల సంఖ్య విస్తరణకు మద్దతుగా ఉంటున్నాయి. ఏటా 4,50,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటే, ఇందులో 40,000–45,000 వరకు సొంతంగా దుకాణాలను తెరుస్తున్నట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. దేశంలో 12 లక్షల మంది ఫార్మాసిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘‘ఫార్మాసిస్టులు పల్లె బాట పడుతున్నారు. కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు కనీసం 1,000–2,000 మంది జనాభా ఉన్న ప్రతి ఊరులోనూ ఫార్మసీ స్టోర్ ఉంది’’అని సింఘాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని, క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం పల్లెలు, చిన్న పట్టణాల్లో ఔషధ విక్రయాలు పెరగానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కీలకంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద 26,055 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 4.3 కోట్ల మంది చేరి వైద్యం పొందినట్టు 2022–23 ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,54,070 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రిస్కిప్షన్‌ను జారీ చేస్తే ఔషధాలను ప్రభుత్వ చానళ్ల ద్వారా లేదంటే ప్రైవేటు ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసుకుంటున్నట్టు సింఘాల్ తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఔషధాలకు డిమాండ్ ఏర్పడినట్టు చెప్పారు. భారత ఫార్మా మార్కెట్లో టైర్–2 నుంచి టైర్–6 వరకు పట్టణాల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా. ఔషధాలకు డిమాండ్ ఏర్పడడంతో ఫార్మసీ కంపెనీలు సైతం మార్కెటింగ్ సిబ్బందిని చిన్న పట్టణాల్లోనూ మోహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచుకుంటున్నాయి. తమకున్న విస్తృత నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటు ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నట్టు సన్‌ఫార్మా ప్రతినిధి తెలిపారు. ‘‘నేను దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజలు, మా కంపెనీ స్టాకిస్టులు, అమ్మకాల సిబ్బందితో మాట్లాడాను. రహదారులు, ఆస్పత్రులు, విద్యుత్ తదితర సదుపాయాల విస్తరణతో ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఉండాలనుకుంటున్నారు. మెట్రో పట్టణాలకు రావాలని అనుకోవడం లేదు. కరోనా తర్వాత సొంత గ్రామాల్లోనే ఉండాలన్నది వారి అభీష్టంగా ఉంది’’అని మ్యాన్ కైండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం సైతం అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ వైద్యుల అందుబాటు పెరిగినట్టు ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కృష్ణకుమార్ పేర్కొన్నారు. ‘‘మాకు 140 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఉన్నాయి. ఒక్కోటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఈ పాయింట్లను 300కు పెంచుతున్నాం. దేశంలో 85 శాతం ప్రాంతాలను చురుకోగలం’’అని వివరించారు. -
పల్లెకు పోదాం..
‘పల్లెకు పోదాం సినిమా చేద్దాం. ఛలో చలో’ అని పాడుకుంటున్నారు కొందరు హీరోలు. ఈ హీరోలతో వెండితెరపై పల్లె కథలను చూపించేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు. ఈ పల్లెటూరి కథల్లోకి వెళదాం. 1990లో ఓ గ్రామం నాగార్జున కెరీర్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చాలానే ఉన్నాయి. మరోసారి నాగార్జున ఓ విలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ నున్నారట. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ విలేజ్ స్టోరీని డెవలప్ చేశారు. అంతేకాదు... ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలిసింది. 1990 నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కానుంది. కేరాఫ్ స్టువర్టుపురం 1970లలో స్టువర్టుపురంలోని నాగేశ్వరరావు గురించి తెలియనివాళ్లు ఉండి ఉండరు. ఆయన జీవితంతో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం రూపొందింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, నూపుర్ సనన్ నాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఏ విధంగా గడిచింది? ఆయన్ను కొందరు దొంగ అని, మరి కొందరు పేదలకు హెల్ప్ చేసే ఆపద్భాందవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. పల్లెటూరి ఆటగాడు హీరో రామ్‌చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ సూపర్బ్. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో అన్నతమ్ములుగా రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నారని భోగట్టా. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇదని సమాచారం. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. భైరవకోన మిస్టరీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయట. ఆ గరుడ పురాణంలో మిస్ అయిన ఆ నాలుగు పేజీల కథే భైరవకోన అని హీరో సందీప్ కిషన్ అంటున్నారు. మరి.. ఆడియన్స్‌కు ఈ మిస్టరీ తెలియాలంటే థియేటర్స్‌కు రానున్న ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. రంగబలి రాజకీయం రంగబలి అనే విలేజ్‌లో జరిగే çఘటనలు, రాజకీయ కోణాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. కుప్పంలో హరోంహర చిత్తూరు జిల్లా కుప్పంలో ‘హరోంహర’ అంటున్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. 1989 చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కథగా ‘హరోం హర’ సాగుతుంది. సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదికేశవ ఆగమనం రాయలసీమలోని ఓ గ్రామంలో ఉన్న దేవాలయంపై మైనింగ్ మాఫియా చూపు పడింది. ఈ మాఫియాకు అడ్డుగా నిలబడతాడు రుద్రకాళేశ్వర్ రెడ్డి. ఈ గ్రామాన్ని రుద్రకాళేశ్వర్ రెడ్డి ఏ విధంగా రక్షించాడు అనేది తెలుసుకోవాలంటే జూలైలో వచ్చే ‘ఆదికేశవ’ సినిమా చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డి పాత్రలో హీరోగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఎస్. నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో... కథ ప్రకారం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారట విశ్వక్ సేన్. 1994 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాస్త గ్రే షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్లో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటన ఆధారంగా.... ‘గంగతలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు’ అనే పవర్ఫుల్ డైలాగ్ సాయిరామ్ శంకర్ నోట వచ్చింది ఓ సినిమా కోసం. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ జూరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రమణి జూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు మరికొందరు హీరోలు రెడీ అవుతున్నారు. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్డీఎఫ్సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
గ్రామీణ ప్రాంతాలపై పడిన నెస్లే దృష్టి.. అమ్మకాల వృద్ధికి కొత్త వ్యూహాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఈ ఏడాది రెండంకెల విక్రయాలపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ధరలపరమైన ఒత్తిళ్లు నిదానిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ నెట్వర్క్ విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి 20 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. వచ్చే 12 - 18 నెలల్లో 2,000కు పైగా జనాభా ఉన్న 1.2 లక్షల గ్రామాలను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 90వేల గ్రామాల్లో విక్రయాల నెట్వర్క్ ఉంది. నెస్లే హెల్త్‌సైన్స్ కింద ఫార్మసీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.. ‘‘ఎల్‌నినో కారణంగా వర్షాలపై మరీ ప్రతికూల ప్రభావం లేకపోతే తప్ప డిమాండ్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రెండంకెల వృద్ధి దిశగా అడుగులు వేస్తాం. అమ్మకాల్లో తిరిగి వృద్ధిని చూస్తున్నాం. మొదటి త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొస్తే అప్పుడు అమ్మకాల పరిమాణం, విలువ పరంగా మరింత సమతుల్యమైన వృద్ధిని నమోదు చేస్తాం’’అని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. గడిచిన ఆరేడేళ్లుగా కంపెనీ కాంపౌండెడ్‌గా ఏటా 10 - 11 శాతం మేర వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గిస్తారా..? ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దిగొస్తే ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు.. సరైన చర్యలపై దృష్టి పెడతామని నారాయణన్ బదులిచ్చారు. ఇప్పటికైతే ధరలు తగ్గించేటంత సానుకూల స్థితికి చేరుకోలేదన్నారు. రానున్న రోజుల్లో తాము కొనుగోలు చేసే ముడి పదార్థాల ధరలు చెప్పుకోతగ్గంత తగ్గుముఖం పడితే అప్పుడు ఉత్పత్తుల ధరలు, బరువు పరంగా సర్దుబాటు చేస్తామని చెప్పారు. పాల ధరలు భగ్గుమంటున్నాయని చెబుతూ.. ఇదే పరిస్థితి కొనసాగితే పాల ఆధారిత ఉత్పత్తుల ధరల ను సవరించాల్సి రావచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు 25 శాతానికి చేరుకుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కామర్స్ నుంచి 7 శాతం అమ్మకాలు వస్తున్నాయంటూ, ఇవి ఇంకా పెరగొచ్చన్నారు. -
అందనంత దూరాన ఆవాసం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ గృహాల కొరతను తీవ్రం చేస్తోంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో 1.9 కోట్ల గృహాల కొరత ఉంటే.. 2030 నాటికి ఇది 3.8 కోట్లుగా ఉండనుందని పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర గృహ, పట్టణ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా దాదాపు నాలుగు కోట్ల గృహాల కొరత ఏర్పడుతుందని పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో దాదాపు 36 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తుండగా, నిపుణులు సైతం ఇదే అంచనా వేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తుండడమే పట్టణీకరణకు ప్రధాన కారణమని, గ్రామీణ ప్రాంతాల నుంచి సామాన్య జనం నగరాల బాట పడుతున్నారని చెబుతున్నారు. భూముల ధరలు,నిర్మాణ వ్యయం పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు అమాంతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సొంతంగా ఓ గూడు దొరకడం గగనమవుతోంది. పట్టణాలు, నగరాల్లో వివాద రహిత భూములు లేకపోవడం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ఆచరణ సాధ్యమైన రెంటల్ మార్కెట్ లేకపోవడం తదితర అంశాలు గృహాల కొరతకు కారణమవుతున్నాయి, అందరికీ అందుబాటు ధరలో గృహాలు ఉండేందుకు వీలుగా భూముల ధరలు, నిర్మాణ వ్యయం తగ్గేలా చర్యలు తీసుకోవడమేగాక, ఆర్థిక సహకారం కూడా అందిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పట్టణాల్లో ఒకప్పుడు భారీగా స్థలాలు సేకరించిన పలు కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకుని రాలేకపోయాయి. అలాంటి స్థలాలను గృహ నిర్మాణ రంగానికి కేటాయిస్తే పరిస్థితులు మెరుగు అవుతాయని అంటున్నారు. సింగిల్ విండో పద్ధతి బెటర్.. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు త్వరగా అనుమతులు రావడానికి వీలుగా సింగిల్ విండో పద్ధతిని కూడా అమలు చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ‘రెరా’(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) అనుమతుల పేరిట కొంతవరకు అలాంటి వెసులుబాటు వచ్చినా.. అది భారీ ప్రాజెక్టులకు మాత్రమే ఉపయోగపడుతోంది. మధ్య, దిగువ తరగతులకు అనుకూలంగా గృహాల నిర్మాణానికి అవసరమైన లే అవుట్లు, ఇళ్ల నిర్మాణానికి సులువుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అనుమతుల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, సకాలంలో అనుమతులు రాక నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడం వల్ల కూడా పేదలకు గృహాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం, క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం కేవలం ఆర్థికంగా వెనుకబడిన, దిగువ ఆదాయ వర్గాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని, వీటిని మధ్యాదాయ వర్గాలకు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మౌలిక సదుపాయాలూ సమస్యే.. గ్రామీణ ప్రాంతాల నుంచి 2030 నాటికి అదనంగా 8.33 కోట్ల మంది ప్రజలు నగరాలకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క గృహవసతే కాకుండా పరిశుభ్రమైన నీరు, ముగురునీటి పారుదల, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. పట్టణాలు, నగర జనాభాలో 17% మంది (అల్పాదాయ వర్గాలు) మురికివాడల్లోనే నివసిస్తున్నట్లు అంచనా. 71 శాతం ప్రజలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. 60 శాతం ప్రజలకు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ ఉంటే.. మరుగుదొడ్ల సౌకర్యం లేని మురికివాడలు సైతం ఉన్నాయి. గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలకు వస్తున్న వారి ఆదాయాల్లో మార్పుల కారణంగా నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భూ సేకరణ వ్యయానికీప్రోత్సాహకాలు ఇవ్వాలి అందుబాటులో ఉండే గృహాలకు సంబంధించి నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ఆకర్షించేందుకు కేంద్రం పలు రాయితీలను ప్రకటించింది. పన్ను ప్రోత్సాహకాలతో డెవలపర్లను, వడ్డీ రాయితీలతో కొనుగోలుదారులను సంతృప్తి పరుస్తోంది. అయితే ప్రధాన నగరాల్లో ఈ ప్రాజెక్టులకు భూమి సేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. అందువల్ల కేంద్రం ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ వ్యయాలపై కూడా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. – అన్షుల్ జైన్, ఎండీ, కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా మౌలిక వసతులు కల్పించాలి నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా గృహాలను నిర్మించాలంటే స్థలం కొరత ప్రధాన సమస్య. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అలా వెళ్లాలంటే శివారుల్లో ముందుగా రహదారులు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. హైదరాబాద్ డెవలపర్ల విషయానికొస్తే.. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు గ్రిడ్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయాలి. అప్పుడే ఓఆర్ఆర్ పరిధిలో ఈ తరహా గృహాల నిర్మాణం ఊపందుకుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి. స్థానిక సంస్థల ఫీజులను తగ్గించాలి. – శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ నెరవేరని పీఎంఏవై లక్ష్యం పీఎంఏవై పథకం కింద 2015 నుంచి 2022 మధ్య మొత్తంగా 1.23 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు లబ్ది దారులకు అప్పగించింది అందులో సగమే. 61 లక్షల గృహాలను మాత్రమే అందించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్షలో బయటపడింది. వాస్తవానికి 1.07 కోట్ల గృహాల పనులు ప్రారంభించినా.. అన్నీ పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు లేని కారణంగా 5.61 గృహాలను లబ్ది దారులకు అందించలేకపోవడం గమనార్హం. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల వాటాతో పాటు లబ్ధిదారుల వాటా కూడా ఉంటుంది. అయితే పలు రాష్ట్రాలు తమ వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీగుర్తించింది. -
హెచ్డీఎఫ్సీ రుణాల్లో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మార్చి చివరినాటికి రుణాల్లో 16.9 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ‘2022 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు రూ.13.6 లక్షల కోట్లు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో వాణిజ్య రుణాలు 30 శాతం, గ్రామీణ ప్రాంత రుణాలు 9.5 శాతం వృద్ధి సాధించాయి. దేశీయ రిటైల్ రుణాలు దాదాపు 21 శాతం, కార్పొరేట్, టోకు రుణాలు 12.5 శాతం దూసుకెళ్లాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి 31 నాటికి డిపాజిట్లు 20.8 శాతం ఎగసి రూ.18.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో హోమ్ లోన్ ఏర్పాటు కింద డైరెక్ట్ అసైన్మెంట్ రూట్ ద్వారా బ్యాంక్ రూ.9,340 కోట్ల రుణాలను మార్చి త్రైమాసికంలో కొనుగోలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీని 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు 2022 ఏప్రిల్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంగీకరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ, లేదా మూడవ త్రైమాసికంలో విలీనం పూర్తి అయ్యే అవకాశం ఉంది. -
నెట్ ఇంట పల్లెలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతంలో ‘ఇంటర్నెట్’వేగంగా విస్తరిస్తోంది. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా గ్రామాల్లో 40 శాతం ఇంటర్నెట్ వినియోగం పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం 72 కోట్ల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని తేల్చిన సర్వే... వారిలో గ్రామాల్లో 42.5 కోట్ల మంది, పట్టణాల్లో 29.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రముఖ పరిశోధన సంస్థ నీల్సెన్ ‘ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్–2023’ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల మందిపై సర్వే చేపట్టి ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే 12 ఏళ్లకు పైబడిన 45 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు వీడియో కంటెంట్ల వీక్షణ, కాలింగ్‌లో నిమగ్నమవుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. మొత్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మహిళల ఇంటర్నెట్ వినియోగంలో 35 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. నివేదికలో ఏముందంటే... ♦ మహిళలు, గ్రామీణ భారతం, అల్పఆదాయవర్గాల ఇళ్లలో ఇంటర్నెట్ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. సగం గ్రామీణ భారతం ఆన్లైన్ సేవల వినియోగంలో 2021తో పోలిస్తే 2022లో నెట్ వాడకం 40 % పెరిగింది. ♦ అదే కాలానికి మహిళల నెట్ వినియోగం 35%, విద్య, ఆదాయపరంగా చివరగా ఉన్న వర్గాల్లో 30% పెరిగింది. ♦ స్మార్ట్ఫోన్ల ద్వారా సమాచారం, వీడియోలషేరింగ్ అధికంగా కొనసాగుతోంది. ♦ 2021తో పోలిస్తే 43% డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి ♦ ప్రాంతీయ భాషల ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదలతో వీడియోల వీక్షణ పెరిగింది. ♦ షార్ట్ వీడియోలు, మ్యూజిక్ల వ్యాప్తిలో వృద్ధి నమోదైంది. ♦ మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 90% రోజువారీ ఉపయోగిస్తున్నవారే. ♦ ప్రతి ముగ్గురిలో ఒకరు బ్యాంకింగ్, ఇతర చెల్లింపుల కోసం నెట్‌ను వాడుతున్నారు. ♦ గ్రామీణ భారతంలో 8.5 కోట్ల మంది షేరింగ్ ద్వారా ఇతరులతో కలిసి వీడియోలు వీక్షించడంతోపాటు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ♦ తక్కువ ధర హ్యాండ్సెట్ల ద్వారా అత్యధికంగా స్మార్ట్‌ఫోన్ షేరింగ్ అవుతోంది. ♦ కామ్స్టోర్ డేటా ప్రకారం యూట్యూబ్‌కు 46.3 కోట్ల మంది యునిక్ విజిటర్స్ ఉన్నారు. ♦ మెటా (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ కలిపి)కు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది యూజర్లు ఉండగా ఆయా యాప్‌ల వినియోగాన్ని బట్టి యూజర్లు పెరుగుతున్నారు. -
ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఆర్థిక సేవలు అందించే దిశగా పారిశ్రామిక దిగ్గజం ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న రైతుల ఆర్థిక సర్వీసుల అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని తెలిపింది. రైతు రుణాలు, బంగారంపై రుణాలు మొదలైనవి అందించడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. ఐటీసీకి చెందిన ఐటీసీమార్స్ అనే అగ్రిటెక్ యాప్ ద్వారా రైతులకు చేరువ కానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వివరించింది. అలాగే 656 గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ శాఖల ద్వారా విస్తృతమైన సాధనాలు, సర్వీసులు అందించగలమని యాక్సిస్ బ్యాంక్ భారత్ బ్యాంకింగ్ విభాగం హెడ్ మునీష్ సర్దా తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు తమ ఈ–చౌపల్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారని ఐటీసీ అగ్రి బిజినెస్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రాయ్ పేర్కొన్నారు. -
గ్రామీణ ఎఫ్ఎంసీజీ వినియోగం పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు రానున్న త్రైమాసికాలలో పుంజుకుంటాయని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వీ అగర్వాల్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు దిగొచ్చినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల వ్యయాలతో ఉపాధి కల్పన, అభివృద్ధికి మద్దతునిస్తాయని, అంతిమంగా అది ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. గత ఐదు త్రైమాసికాల్లో గ్రామీణంగా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ మందగమనాన్ని చూస్తోంది. ‘‘మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఇన్ఫ్రా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డిమాండ్‌ను పెంచుతుంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు. డీ2సీ బ్రాండ్లపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. -
మహిళా కార్మికుల ముందంజ
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా శ్రామిక శక్తి నాలుగేళ్లలో 6.4 శాతం మేర పెరిగింది. పురుషుల కన్నా మహిళా కార్మికుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2017–18లో మహిళా కార్మిక శక్తి 23.1 శాతం ఉంటే 2020–21 నాటికి అది 29.5 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ కాలంలో దేశంలో ఉపాధి, శ్రామిక శక్తిలో చోటుచేసుకున్న మార్పులపై నీతి ఆయోగ్ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2017–18లో దేశంలో 485.3 మిలియన్ల కార్మిక శక్తి ఉండగా 2020–21 నాటికి అది 563.7 మిలియన్లకు పెరిగింది. అంటే.. మూడేళ్లలో 16.15 శాతం మేర పెరిగింది. కార్మిక శక్తి పెరుగుదల పురుషులతో పాటు మహిళా జనాభాలో కూడా నమోదైంది. అలాగే, ఈ పెరుగుదల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో గ్రామీణ కార్మిక శక్తి 70.7 శాతం ఉండగా 2020–21లో 73 శాతానికి పెరిగింది. పట్టణాల నుంచి పల్లెలకు వలసలు ఇక కోవిడ్ సమయంలో ఆసక్తికరంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు జరిగాయని నివేదిక తెలిపింది. దీంతో ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శక్తి 8 శాతం మేర పెరుగుదల ఉంటే పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం తగ్గింది. మూడేళ్లుగా మహిళా కార్మిక శక్తి పురుషుల కన్నా ఎక్కువ శాతం పెరిగింది. ఈ పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. నిరుద్యోగ రేటూ తగ్గుముఖం మరోవైపు.. దేశంలో 2017–18 నుంచి నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2017–18లో నిరుద్యోగ రేటు 6.07 శాతం ఉండగా 2018–19లో 5.84 శాతానికి.. 2019–20లో 4.84 శాతానికి, 2020–21లో 4.33 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అదే సమయంలో.. రాష్ట్రంలో 2018–19లో నిరుద్యోగత రేటు 5.3 శాతం ఉండగా 2020–21 నాటికి 4.1 శాతనికి తగ్గింది. దేశంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు తక్కువగా ఉంది. కోవిడ్–19తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడినప్పటికీ కూడా పరిశ్రమ, సేవల రంగాల్లో 2019–20 నుంచి 2020–21 మధ్య ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పరిశ్రమల రంగంలో 2018–19లో 4.8 మిలియన్ల ఉద్యోగాలు జోడించగా 2019–20లో 3.4 మిలియన్ల ఉద్యోగాలు, 2020–21లో 7.6 మిలియన్ల ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, సర్వీసు రంగంలో కూడా 2018–19లో 10.1 మిలియన్ల ఉద్యోగాలు 2019–20లో 6 మిలియన్ ఉద్యోగాలు, 2020–21లో 2.3 మిలియన్ ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
అంతర్జాతీయ విపణిలోకి మహిళా స్టార్టప్‌లు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వి హబ్ (వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) అటు గ్రామీణ, ఇటు అంతర్జాతీయ స్థాయికి కార్యకలాపాలు విస్తరించేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది. వి హబ్‌లో పురుడు పోసుకుంటున్న మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఓ వైపు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను వి హబ్ సిద్ధం చేస్తోంది. ఆర్ధిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వాణిజ్యవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చేయూతను అందిస్తోంది. తమ వద్ద ఉన్న వినూత్న ఆలోచనలు, పరిష్కారాలకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను మహిళలు అధిగమించేందుకు అవసరమైన సాయాన్ని వి హబ్ వివిధ రూపాల్లో అందిస్తోంది. మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు మహిళల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలు, సంక్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారం చూపుతూ స్టార్టప్‌ల ద్వారా వాణిజ్యరూపంలో ఊతమిచ్చేందుకు 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వి హబ్ ఏర్పాటు చేసింది. వి హబ్‌లో ప్రస్తుతం మహిళల సారథ్యంలోని 84 స్టార్టప్‌లు ఇంక్యుబేట్ అవుతుండగా, వి హబ్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 914 మహిళా స్టార్టప్‌లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వి హబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్‌లలో ఎక్కువగా నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందినవి కాగా, 25 శాతం చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగాలు, 13 శాతం ఆరోగ్య, లైఫ్‌సైన్సెస్ రంగాలు కాగా మిగతావి ఇతర రంగాలకు చెందినవి. స్టార్టప్‌లు తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు అవసరమైన సాయంతో పాటు సాంకేతిక సాయం అందించే మెంటార్లను (మార్గదర్శకులు) కూడా వి హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ తదితరాల ద్వారా మహిళా స్టార్టప్‌లకు వి హబ్ రూ.83 కోట్ల మేర నిధులు సమకూర్చింది. అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం ఇటు మారుమూల ప్రాంతాల్లో విస్తరణ మహిళా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా మెరుగైన వాణిజ్య అవకాశాలను పొందేందుకు వీలుగా వి హబ్ ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీలతోనూ మహిళా స్టార్టప్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక హైదరాబాద్‌కే కార్యకలాపాలను పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలపైనా వి హబ్ దృష్టి సారించనుంది. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్టార్టప్ సంస్కృతిపై అవగాహన కల్పించాలని వి హబ్ నిర్ణయించింది. మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం రాష్ట్రంలో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా మహిళా వాణిజ్యవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించడం, వారి ఆలోచనలకు స్టార్టప్‌ల ద్వారా వాణిజ్య రూపం ఇవ్వడం, వారికి అవ సరమైన పెట్టుబడి, సాంకేతిక, వాణిజ్య సల హాలు, మార్గదర్శనం ఇవ్వడంలో వి హబ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్టార్టప్‌లు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. – దీప్తి రావుల, సీఈఓ, వి హబ్ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. ఇప్పుడు వాణిజ్యవేత్తను గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన నేను వి హబ్ ప్రోత్సాహంతో వాణిజ్యవేత్తగా మారాను. స్టార్టప్ ద్వారా బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ నెట్వర్క్ తదితరాల్లో ఇక్కడ మార్గదర్శకత్వం లభించింది. ప్రస్తుతం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారం చేస్తున్నా. ఎంబ్రాయిడరీ స్టూడియో నుంచి మొదలైన నా ఆలోచన ప్రస్తుతం ఎంబ్రాయిడరీ మెషీన్ల దాకా విస్తరించింది. ప్రస్తుతం రూ.1.2 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నా వ్యాపారం సాగుతోంది. – భవ్య గుమ్మడి -
రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2024 చివరి నాటికి 10,000 సినిమా హాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. ఇందుకోసం అక్టోబర్ సినిమాస్‌తో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష చిన్న థియేటర్లను నెల కొల్పాలన్నది లక్ష్యం. ఒక్కో కేంద్రం 100-200 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. సీఎస్‌సీని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేస్తోంది. 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న 1 లక్ష చిన్న సినిమా థియేటర్లను తెరవాలనే లక్ష్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ వెల్లడించారు. (ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు) 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10,000 సినిమా హాళ్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని అక్టోబర్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దేశాయ్ తెలిపారు. వీడియో పార్లర్ సినిమా లైసెన్సు ఉన్న ఈ సినిమా హాళ్లను నడపాలంటే దాదాపు రూ.15 లక్షల పెట్టుబడి అవసరమన్నారు. గ్రామీణ స్థాయి వ్యాపారులకు కొత్త అవకాశాలను ఈ థియేటర్లు కల్పిస్తాయని సీఎస్సీ భావిస్తోంది. సీఎస్సీ కార్యకలాపాలకు ఇవి కేంద్రాలుగా మారతాయని ఆశిస్తోంది. (కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!) -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
‘ఫ్యామిలీ డాక్టర్’తో మెరుగైన వైద్య సేవలు
హిందూపురం: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటివద్దే మెరుగైన వైద్య సేవలందుతాయని కలెక్టర్ బసంత్‌కుమార్ అన్నారు. విలేజ్ క్లినిక్‌లో ఓ డాక్టర్, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, వలంటీర్లు ఉంటారని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని గోళాపురం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్‌ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న గర్భిణితో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తూమకుంట పారిశ్రామికవాడలోని విప్రో, ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీలో వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కారి్మకుల స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఫ్యామిలీ డాక్టర్‌తో సంపూర్ణ రక్షణ పుట్టపర్తి అర్బన్: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానిక పాఠశాల వద్ద ఓపీ నిర్వహించగా, మధ్యాహ్నం వరకూ గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులు వంటి వాటికి మందులు తీసుకున్నారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని, గర్భిణులు, బాలింతల ఇళ్లకే వెళ్లి వైద్యలు పరీక్షించి మందులు ఇచ్చారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి, నిరుపేదలకు ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి నెలా వైద్య బృందం గ్రామానికి విచ్చేసి రోజంతా గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి లక్ష్మానాయక్, పుట్టపర్తి వైద్యాధికారి నాగరాజు నాయక్, సీహెచ్ఓ నగేష్, రమణయ్య, సూపర్వైజర్లు చంద్రకళ, రమణ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి ) -
8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒక్కరోజు నీరు సరఫరా అవుతుండగా, 74% మందికి వారమంతా అందుతున్నట్లు కేంద్రం జల్‌శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరో 4% గృహాలకు వారంలో ఐదారు రోజులు, 14% మందికి కనీసం మూడు, నాలుగు రోజులు నీరు అందుతోందని ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తమ్మీద సరాసరిన రోజుకు మూడు గంటలు చొప్పున నీరు సరఫరా అవుతున్నట్లు వివరించింది. తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా అందే నీటితో రోజువారీ అవసరాల్లో 80% వరకు తీరుతున్నట్లు ప్రతి ఐదుగురిలో నలుగురు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీల్లో కుళాయి కనెక్షన్లు లేని గృహాలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. కనీసం ఆరు రాష్ట్రాల్లోని 30%పైగా గృహాలకు గత వారం రోజులుగా కుళాయి నీరు కాలేదని వెల్లడైంది. ‘హర్ ఘర్ జల్’ పథకం అమలవుతున్న 91% గృహాల్లోని కుళాయిలు సర్వే చేపట్టిన రోజు పనిచేస్తున్నట్లు గుర్తించారు (జాతీయ స్థాయిలో ఇది 86%). 91% గృహాలకు 88% గృహాలకు అవసరాలకు సరిపోను (రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్లకు మించి) నీరు అందుతుండగా, 84% ఇళ్లకు రోజూ సరఫరా అవుతోంది. 90% గృహాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది. -
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్‌లోని యాక్సెస్ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్‌లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
గ్రామగ్రామాన సు‘రక్షిత’ నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత సురక్షితమైన తాగు నీటిని ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి నిరంతరం పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడైనా కలుషితాలు ఉంటే, ఆ నీటి శుద్ధికి చర్యలు చేపడుతోంది. ఫ్లోరైడ్ తదితర కలుషితాల్లేవని నిర్ధారించుకున్నాక ప్రజలు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్న తాగు నీటిలో 97.15 శాతం స్వచ్ఛమైనదని పరీక్షలు తేటతెల్లం చేస్తున్నాయి. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు మధ్య ఏడాది కాలంలో మొత్తం 9,51,337 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించింది. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఒక విడత అన్ని గ్రామాల్లో బోర్లు, బావులు, చెరువులు, మంచి నీటి సరఫరా పథకాల నీటికి ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. అవసరమైతే ఏడాదిలో రెండో సారి కూడా పరీక్షలు చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని బోర్ల నీటికీ కూడా గత ఏడాది రెండు విడతలు కెమికల్, హానికర సూక్ష్మ క్రిముల పరీక్షలు చేసినట్లు ఎస్డబ్యూఎస్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ హరే రామనాయక్, చీఫ్ కెమిస్ట్ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. గ్రామాలకే నీటి పరీక్ష కిట్లు సాధారణంగా గ్రామాల్లో తాగు నీటి శాంపిల్స్‌ను ఆర్‌డబ్ల్యూఎస్‌కు అనుబంధంగా పనిచేసే 107 ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. గత మూడేళ్లుగా తాగే నీటి నాణ్యతపై అనుమానం కలిగినప్పుడు అక్కడికక్కడే పరీక్షించేందుకు ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఎఫ్‌టీకే కిట్లను సరఫరా చేస్తోంది. వీటితో 8 రకాల ప్రమాదకర రసాయనాలను గుర్తించొచ్చు. ఒక్కొక్క కిట్‌తో వంద శాంపిల్స్‌ను పరీక్షించొచ్చు. ఈ ఏడాది ఈ కిట్లతో పాటు నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించే హెచ్‌టూఎస్ కెమికల్ సీసాలను కూడా పంపిణీ చేశారు. మార్చిలోనే 7.50 లక్షల హెచ్‌టూఎస్ సీసీలు పంపిణీ చేసినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నీటిని పరీక్షించే విధానంపై గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. దేశంలో ఏపీనే ఫస్ట్ గడిచిన ఏడాది కాలంలో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల్లో (ల్యాబ్‌లలో) పరీక్షల నిర్వహణలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 వరకు 6,12,458 శాంపిల్స్‌కు ల్యాబ్‌లలో కెమికల్, బ్యాకీరియా పరీక్షలు చేశారు. గ్రామాల్లోని ఎఫ్‌టీకే కిట్లతో మరో 3,38,879 పరీక్షలు జరిపారు. ఇలా పూర్తిస్థాయి శాస్త్రీయంగా ఉండే ల్యాబ్ పరీక్షల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (5.35 లక్షలు), పశ్చి మ బెంగాల్ (5.31 లక్షలు), మధ్య ప్రదేశ్ (5.28 లక్షలు) ఉన్నాయి. నాణ్యమైన నీరే రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీరు ఎంతో సురక్షితమైనదని అన్ని పరీక్షల్లోనూ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఏడాది మొత్తంలో చేసిన పరీక్షల్లో 97.15 శాతం నీరు సురక్షితమైనదని తేలింది. 2.85 శాతం శాంపిల్స్‌లో మాత్రమే కలుషిత కారకాలు గుర్తించారు. ల్యాబ్‌లో 6.12 లక్షల శాంపిల్స్‌కు పరీక్షలు చేయగా 25,140 నమూనాల్లో కలుషితాలను గుర్తించారు. 3.38 లక్షల ఎఫ్‌టీకే పరీక్షల్లో 3,077 నమూనాల్లో కలుషితాలు ఉన్నట్టు గుర్తించారు. కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ నీటిలో అత్యధికంగా కలుషితాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. -
పల్లెకు పోదాం చలో చలో.. రివర్స్ మైగ్రేషన్‌కు మోడల్‌గా నిలిచిన మన్దీప్ కౌర్
పట్టణాల్లో ఉపాధి వెదుక్కుంటూ చాలామంది పట్నం బాట పడుతుంటే, పల్లెకళ మాయమవుతోంది. ఏ మూల చూసినా నిరుపేద నిశ్శబ్దం. అలాంటి పల్లెల్లో పంజాబ్‌లోని తంగ్రా కూడా ఒకటి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామం గురించి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు తెలుసో తెలియదుగానీ మన్‌దీప్‌కౌర్ పుణ్యమా అని ఇప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది. ‘రివర్స్ మైగ్రేషన్’కు మోడల్‌గా నిలిచింది. ‘రూరల్ ఐటి మోడల్’ కాన్సెప్ట్‌కు అపారమైన బలాన్ని ఇచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మన్దీప్ చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ‘మన జీవితాలు మారాలంటే చదువు తప్ప మరోదారి లేదు’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన మన్‌దీప్‌కు రహేజా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం పాతికవేలు. ఆ తరువాత... బ్యాంకాక్‌కు చెందిన ప్రసిద్ధనగల కంపెనీలో ఉద్యోగం చేసింది. అక్కడ మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. వివాహం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు అమెరికా వెళ్లింది కౌర్. భర్త ఐటీ ప్రొఫెషనల్. అక్కడ ఉన్నప్పుడు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేసింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంటే ఆయన సానుకూలంగా స్పందించారు. అలా ‘శింబాక్వార్జ్’ రూపంలో తొలి అడుగుపడింది. ఈ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన కౌర్ తన స్వగ్రామం తంగ్రాలో ‘శింబాక్వార్జ్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లెటూరిలో ఐటీ కంపెనీ ఏమిటి! అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాలేదు. మౌలిక వసతుల లేమి అనేది మరో సమస్య. అయితే ఆమె సంకల్పబలానికి ఇవేమీ అడ్డుకాలేదు. తన సేవింగ్స్‌తో కంపెనీ మొదలుపెట్టింది. ప్రారంభంలో ముగ్గురు ఉద్యోగులు ఉండేవారు. ఐఐటీ, ఐఐఎంఎస్ క్యాంపస్‌లలో నుంచి చురుకైన స్టూడెంట్స్‌ను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారు. తంగ్రా గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతీ,యువకులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ ఊళ్లోనే, తమ దగ్గరి ఊళ్లోనే ఐటీ కంపెనీ మొదలైందని తెలిసి కొద్దిమంది చేరారు. అలా కంపెనీ ప్రస్థానం మొదలైంది. కొద్దికాలంలోనే మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కన్సల్టేషన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్...మొదలైన విభాగాల్లో ‘శింబాక్వార్జ్’ దూసుకుపోయింది. ఉద్యోగుల సంఖ్య వందకు పెరిగింది. కంపెనీ పుణ్యమా అని ఊళ్లో సందడి పెరిగింది. కొత్త కళ వచ్చింది. అయితే కరోనా కఠోర సమయంలో పెద్ద సవాలు ఎదురైంది. పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలిగిస్తూనో, జీతాలు బాగా తగ్గిస్తూనో ఉన్న కాలం అది. ‘శింబా’ కంపెనీ సంక్షోభంలోకి వెళ్లింది. ‘అలాంటి కఠిన సమయంలోనూ ఏ ఒక్క ఉద్యోగిని కంపెనీ నుంచి తీసివేయాలని, జీతం తగ్గించాలనుకోలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అవసరం అయితే జీరో నుంచి మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్. గడ్డుకాలం పూర్తయిన తరువాత... కంపెనీ మళ్లీ ఊపందుకుంది. ‘స్మైల్స్ కేర్’ అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పి గ్రామాలలోని అట్టడుగువర్గాల ప్రజలకు సేవ చేస్తుంది కౌర్. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖీ సమావేశం అయిన మన్‌దీప్‌కౌర్, ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది. -
పల్లెటూరును చదివేద్దాం
సాక్షి, అమరావతి: ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాప్ 50 ర్యాంకులు సాధించిన వారిలో నవీన్ ఒకడు. ప్రముఖ ఐఐటీలో సీటు కూడా వచ్చింది. రెండో సంవత్సరంలో తాను చదవాల్సిన కోర్సుల్లో ‘అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్లీహుడ్’ అనేది ఒక సబ్జెక్ట్. ఈ కోర్సులో ప్రత్యేక అసైన్మెంట్గా అతడు ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి, స్థానికంగా అందరితో చర్చించి.. గ్రామంలో ప్రస్తుతం పంచాయతీ పాలన ఎలా కొనసాగుతోంది? ఏం చేస్తే మరింత సమర్థవంతంగా పాలన సాగుతుంది? తదితర విషయాలపై వీడియో ప్రజెంటేషన్ లేదా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కార మార్గాలు సూచిస్తే.. గ్రామీణాభివృద్ధిలో ఇటు ప్రభుత్వాలు, అటు స్వచ్ఛంద సంస్థలు వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా పల్లె ప్రాంతాలకు వేగంగా అభివృద్ధి ఫలాలను అందివ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. సమగ్ర పరిశీలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీ, పీజీ స్థాయిలో గ్రామాల్లో స్థానిక పరిస్థితులపై అధ్యయానికి సంబంధించి పలు కోర్సులను ప్రవేశపెట్టబోతుంది. ఐఐటీలతో సహా ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులు ఆయా కోర్సుల్లో భాగంగా గ్రామాలను స్వయంగా సందర్శిస్తారు. స్థానికంగా ఉండే స్వయం సహాయక సంఘాల మహిళలతో, ఉపాధి హామీ పథకం కూలీలతో భేటీ అవుతారు. స్థానిక పరిస్థితులపై సర్వే చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగస్వామ్యులవుతారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు.. వాటికి నిధుల సమీకరణ గురించి పరిశీలిస్తారు. గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వాటి నిర్వహణలో ఉన్న లోపాలు, పరిష్కారాల గురించి అధ్యయనం చేస్తారు. మొత్తంగా విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలు, పరిశీలన ఆధారంగా గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ నివేదిక అందజేయాల్సి ఉంటుంది. సీసీసీ కోర్సులు ఇలా.. గ్రామీణ ప్రజల జీవనశైలి, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆధ్యయనానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) ప్రధానంగా నాలుగు రకాల (ఇవి కాకుండా ఇంకా ఉంటాయి) కోర్సులను రూపొందించింది. వాటి వివరాలను అన్ని ఉన్నత విద్యా సంస్థలకు అందజేసింది. యూనివర్సిటీ, ఉన్నత విద్యా సంస్థల్లో ఏ కోర్సు చదివే విద్యార్థులైనా కామన్‌గా ‘కంపల్సరీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కోర్సు (సీసీసీ)’ పేరుతో ఉన్న ఈ కోర్సుల్లో కొన్నింటిని తప్పనిసరిగా చదవాల్సిందే. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు మొత్తం కోర్సులో సగం సమయం గ్రామాల్లోనే గడపాల్సి ఉంటుంది. వేగంగా అభివృద్ధికి బాటలు పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ–ప్రైవేట్ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి వచ్చే సూచనలు కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. తద్వారా భవిష్యత్‌లో ప్రభుత్వాలు మరింత వేగంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అప్రిసియేషన్ ఆఫ్ రూరల్ సొసైటీ: గ్రామీణ ప్రజల జీవనశైలి – కొన్నిరకాల కట్టుబాట్లకు ప్రజలు ఇచ్చే విలువ – గ్రామాల్లో అందుబాటులో ప్రత్యేక వనరులు తదితర అంశాలపై ఈ కోర్సు ఉంటుంది. అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్లీహుడ్: గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం,ఇతర వృత్తులతో పాటు ఉపాధి కోసం వలసలు తదితర అంశాలుంటాయి. రూరల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగామ్స్: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఉంటుంది. రూరల్ అండ్ లోకల్ ఇనిస్టిట్యూషన్స్: గ్రామాల్లో పంచాయతీ పాలన సాగుతున్న తీరు, గ్రామ సభ ఏర్పాటు, గ్రామ స్థాయిలో అధికార వ్యవస్థ తదితర అంశాలుంటాయి. కొత్త ఐడియాలకు ఆహ్వానం పలకడమే ప్రజా ప్రతినిధులు, అధికారుల వ్యవస్థ ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిపై మరింత ఫోకస్ అవసరం. విద్యార్థులనూ భాగస్వామ్యం చేయడం ద్వారా ఆ సమస్యల మూలాలను అన్వేషించడాకి అవకాశం ఉంటుంది. మన విద్యా విధానంలో ఇప్పటికే కొంత మేర గ్రామీణ అంశాలు ఉన్నప్పటికీ అది నామమాత్రమే. ఇప్పుడు ఉన్నత విద్యలో క్రెడిట్ బేస్డ్ సిస్టమ్‌లో డిజైన్ చేసిన కోర్సుల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి కొత్త ఐడియాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. నేటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ రకమైన ఒరవడి విద్యార్థి దశలోనే కల్పించడం ద్వారా భారతదేశ గ్రామీణ వ్యవస్థలో పెను మార్పులు రావడానికి దోహదపడుతుంది. – ఎం.ప్రసాదరావు,రిటైర్డు ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ -
2025 నాటికి కోటి మంది విద్యార్థులకు ఉచిత విద్య: బైజూస్
న్యూఢిల్లీ: విద్యా సంబంధిత టెక్నాలజీ కంపెనీ బైజూస్ ఉచిత విద్యా కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని కోటి మంది విద్యార్థులకు ఉచితవిద్య అందించనున్నట్టు తెలిపింది. 2025 నాటికి 50 లక్షల మందికి ఉచిత విద్య అందించాలన్న లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. ఇందులో ఇప్పటికే 34 లక్షల మందిని ఉచిత విద్యా కార్యక్రమం ద్వారా చేరుకున్నట్టు బైజూస్ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకులనాథ్ తెలిపారు. ఉచిత విద్య అందించేందుకు బైజూస్ 128 స్వచ్చంద సంస్థలతో (ఎన్జీవోలు) భాగస్వామ్యం కుదుర్చుకోవడం గమనార్హం. -
ఏ నూనె వాడుతున్నారు.. ఏ నీళ్లు తాగుతున్నారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వేరియంట్లతో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) శాస్త్రవేతలు మారుమూల గ్రామాల్లో అధ్యయనం మొదలుపెట్టారు. గ్రామీణులపై అది ఏవిధంగా ప్రభావం చూపుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి అలవాట్లు, జీవనశైలి గురించి పరిశీలనలు జరుపుతున్నారు. ‘ఏ వంట నూనె వాడుతున్నారు. బోరు నీరు తాగుతున్నారా. భోజనంలో చిరుధాన్యాలు, పండ్లు ఏమైనా తీసుకుంటున్నారా. రోజులో ఎన్నిగంటలు వ్యవసాయ పని చేస్తున్నారు. వారంపాటు చేను పనికి వెళ్లకపోతే ఆరోగ్యం ఎలా ఉంటోంది.. ఇలాంటి ప్రశ్నలను ప్రజలకు సంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్) ప్రతినిధులతో కలసి సంగారెడ్డి జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ ప్రశ్నావళిలో 40కిపైగా ప్రశ్నలు, ఉపప్రశ్నలున్నాయి. ఒక్క కేసూ నమోదుకాని గ్రామాల్లో.. ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాని గ్రామాలు, అత్యధికంగా కోవిడ్ వచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఐసీఎంఆర్ ఈ సర్వే చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీరాబాద్ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కరస్‌గుత్తి పీహెచ్సీ పరిధిలో ఉండే ఈ మారుమూల గ్రామంలో ఐసీఎంఆర్ బృందం సర్వే చేసిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గణపతిరావు తెలిపారు. మరోవైపు అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాక్స్‌నగర్ పీహెచ్సీ పరిధిలో కూడా ఈ సర్వే చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచీ వివరాల సేకరణ.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి జీవనశైలి ఎలా ఉందనే కోణంలోనూ శాస్త్రవేత్తలు వివరాలు రాబట్టారు. వ్యాక్సిన్ వేసుకోనివారు, కేవలం ఒక్క డోసు మాత్రమే వేసుకున్న వారు, రెండోడోసు వేసుకున్నవారు, బూస్టర్ డోసు కూడా వేసుకున్నవారు.. ఇలా వివిధ పారామీటర్లలో ప్రజలను ఎంపిక చేసుకుని వివరాలు సేకరించారు. రక్త నమూనాలూ సేకరణ సర్వే సందర్భంగా ఐసీఎంఆర్ బృందం సంబంధిత వ్యక్తుల నుంచి 3 ఎం.ఎల్. చొప్పున రక్తనమూనాలను తీసుకుంటోంది. ఒక్కో గ్రామంలో సుమారు 20 నుంచి 40 మందిని సర్వే చేసి వివరాలను రాబడుతోంది. సర్వేలో భాగంగా స్త్రీలు, పురుషుల నుంచి వివరాలు రాబడుతోంది. ఇదీ ఉద్దేశం.. కోవిడ్–19 సంక్రమణ, వ్యాప్తిని నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఈ వైరస్ నియంత్రణ, రానున్న రోజుల్లో మార్గదర్శకాల జారీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సర్వే చేస్తున్నవారికి ఉద్దేశాన్ని వివరిస్తూ కరపత్రాలను కూడా అందజేస్తున్నారు. -
Oscar Nomination 2022: ఆస్కార్ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు
‘రైటింగ్ విత్ ఫైర్’.... ఆస్కార్ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్‌పేపర్ (వీక్లీ) గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు. ‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్ లహరియా’ మహిళా జర్నలిస్టులు. 2002లో ‘ఖబర్ లహరియా’ వారపత్రిక చిత్రకూట్ (బుందేల్ ఖండ్)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు. ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’. దర్శకురాలు రింతు థామస్ మరో దర్శకుడు సుస్మిత్ ఘోష్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది. 2022 సంవత్సరానికి ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్‌లిస్ట్ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉంటే ఆస్కార్ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రాల తర్వాత ఆస్కార్ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్ నామినేషన్స్‌కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్ ఎంట్రీ ‘కూడంగళ్’ షార్ట్‌లిస్ట్‌లో నిలువలేదు. కాని ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ దేని గురించి? ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‘ అనే ఎన్జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే. ‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్ రిపోర్టర్. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్ అంతా మహిళల బాధ్యతే. సవాళ్లు ఎన్నో... దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్. ‘ఖబర్ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్ రిపోర్టర్ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు. దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు. సెల్ఫోన్లే కెమెరాలుగా పదిహేనేళ్ల పాటు ప్రింట్ ఎడిషన్‌ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘రైటింగ్ విత్ ఫైర్’కు ఆస్కార్ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం -
క్షుద్ర పూజలతో వణికిపోతున్న వికారాబాద్ ప్రజలు.. పుర్రె, విగ్రహం లభ్యం
దోమ (వికారాబాద్): పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి హైటెక్ సమాజంలోనూ మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి కోవలోకి వచ్చే ఘటనలు కొన్ని దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తరచూ జరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వారం రోజుల క్రితం ఖమ్మం నాచారం గ్రామం చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతాంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేకెత్తించింది. దీంతో పూజలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుప్త నిధుల అన్వేషణలో.. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల అన్వేషణలో పడి పూజలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మండల పరిధిలోని దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామల మధ్యలో ఉన్న ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండయపల్లిలోని పోచమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలను జరిపారు. బడేంపల్లిలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. గుండాల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో క్షుద్రపూజలు చేస్తూ తవ్వాకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ విగ్రహంతో పాటు ఓ మనిషి పుర్రె లభ్యమైనట్లు గ్రామస్తులు అనుమానించి అధికారులకు తెలిపారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఓ కారు గుర్తించి తనిఖీ చేశారు. కారులో గుప్త నిధుల్లో వెలికి తీసిన ఓ విగ్రహం బయటపడింది. బయటపడ్డ విగ్రహం పోలీసులకు అప్పగించారు. మంత్రతంత్రాలను నమ్ముతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా మంత్రాలు చేసే వ్యక్తుల దగ్గరకు వెళ్లి క్షుద్రపూజలతో పాటు తదితర పూజలు నిర్వహించుకుంటున్నారు. వీటిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలం దగ్గరకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుని క్షుద్రపూజలు, మూఢనమ్మాకాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గుండాల సమీపంలో గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం, ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుప్తనిధుల కోసం తవ్వకాలు భయాందోళనకు గురవుతున్నాం... గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఇలాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. – యాదయ్య, ఖమ్మంనాచారం గ్రామం అవగాహన లేకపోవడం వల్లే.. మూఢనమ్మకాలపై పల్లెవాసులకు అవగాహన లేకపోవడం వల్లే మంత్రాలను నమ్ముతున్నారు. ఆయా గ్రామాలలో మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులంటూ ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వాటితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూఢనమ్మకాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి. – నిమ్మలి వెంకటమ్మ, కొండయపల్లి -
ఇక ‘104’ వైద్యసేవలుండవ్
సాక్షి, హైదరాబాద్: పల్లెరోగులకు సేవలందించిన సంచార వైద్యవాహనం ఇక కనుమరుగు కానుంది. ‘104’వైద్య సంచార వాహన సేవలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అక్కడే నెలనెలా వైద్యపరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా మందులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం ‘104’వాహనసేవలను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతినెలా 20వ తేదీ వరకు నిర్దేశిత గ్రామాల్లో ఈ వాహనాలు సంచరిస్తుంటాయి. ఆ సంచార వైద్యవాహనంలో వైద్యుడు, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ, అందులో పనిచేస్తున్న దాదాపు 1,250 మంది ఉద్యోగులను ఆ శాఖలోనే ఇతర పథకాల పరిధిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న జీవనశైలి వ్యాధుల నివారణ పథకం ద్వారా ఇంటింటికీ మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు, త్వరలో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో ‘104’సేవలను నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
Work From Village: పల్లెల్లో వర్క్‌ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్‌లింక్ దృష్టి
న్యూఢిల్లీ: పొలం గట్టున కూర్చునో.. మంచె మీద కంప్యూటర్ పెట్టుకునో.. పెరట్లో చెట్టు నీడన.. ఊరిపట్టున ఉంటూనే వర్క్‌ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేసే అవకాశం అతి త్వరలోనే రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని కుదిరితే అతి త్వరలో వైర్‌సెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పల్లెలను పలకరించనున్నాయి. నీతి అయోగ్ నిర్ణయంతో అమెరికాకు చెందిన బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థ స్టార్‌లింక్ తన కార్యకలాపాల్లో భాగంగా భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం దేశీ టెలికం కంపెనీలతో జట్టు కట్టాలని భావిస్తోంది. స్టార్‌లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఈ విషయాలు తెలిపారు. జిల్లాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రణాళికకు సంబంధించి నీతి ఆయోగ్ ఫేజ్–1లో గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత తాము బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టార్గెట్ రూరల్ గ్రామీణ జిల్లాల్లో 100 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ఇతర సంస్థలతో కూడా తాము కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భార్గవ చెప్పారు. దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమయ్యే టెర్మినల్స్ ను కంపెనీ భారత్‌లో తయారు చేయబోతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్థానికంగా వాటి ని ఉత్పత్తి చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని పేర్కొ న్నారు. స్టార్‌లింక్ మెరికాకు చెందిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్కు స్టార్‌లింక్ అనుబంధ సంస్థ. ఇది ఇటీవలే భారత్‌లో కంపెనీ పేరు నమోదు చేసుకుంది. ఉపగ్రహ సాంకేతికత ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో 5,000 పైచిలుకు ప్రీ–ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వైర్లెస్ స్టార్‌లింక్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్ (లియో) మోడ్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పోల్స్, వైర్లు, ఫిక్స్డ్ ఏరియా వంటి చిక్కులు లేకుండా లియో ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పొందవచ్చు. కరోనా తర్వాత వర్క్‌ఫ్రం విధానం పాపులర్‌గా మారింఇ. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేక చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేశారు. ఇక ఊర్లకు వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వస్తే అక్కడ కూడా వర్క్‌ఫ్రం హోం కల్చర్ చేసుకునేందుకు వీలవుతుంది. -
మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలు అందించేందుకు స్పేస్ టెక్నాలజీ, టెలికం సాంకేతికల మేళవింపు తోడ్పడగలదని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో సమ్మిళిత వృద్ధి సాధ్యపడగలదని పేర్కొన్నారు. అంతరిక్ష టెక్నాలజీలు, ఉపగ్రహ కంపెనీల సమాఖ్య ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు, ఎడారి గ్రామాలు మొదలైన ప్రాంతాలకు సంప్రదాయ విధానాల్లో డిజిటల్ సేవలను చేర్చడం కష్టం. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు స్పేస్ టెక్నాలజీలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నా‘ అని ఆయన వివరించారు. స్పెక్ట్రంపై తగు సూచనలివ్వండి.. స్పెక్ట్రం నిర్వహణ తదితర అంశాల విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించిన విధానాల రూపకల్పనకు తగు సిఫార్సులు చేయాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. స్పెక్ట్రం విషయంలో స్పేస్, టెలికం రంగాలు రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవేనని ఆయన చెప్పారు. ఫైబర్, టెలికం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంక్షోభాల నిర్వహణ, ప్లానింగ్, రైళ్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేస్.. ఎక్కువగా స్పేస్ టెక్నాలజీలనే వినియోగిస్తోందని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేస్ విభాగం మరింత సమర్ధమంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే సాధనాల గురించి రైల్వే, స్పేస్ విభాగాల అధికారులతో చర్చించి, అధ్యయనం చేయాలని, తగు పరిష్కార మార్గాలు సూచించాలని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌పీఏ ఆవిషఅకరణతో పరిశ్రమ, రీసెర్చ్ సంస్థలు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, తయారీ సంస్థలు, రైల్వేస్ వంటి సర్వీస్ సంస్థలు మొదలైన వాటికి కొత్త అవకాశాలు లభించగలవని వైష్ణవ్ చెప్పారు. త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి.. స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించాలని, నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు వేగవంతమయ్యేలా చూడాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సరి చేయాలని స్పేస్ సంస్థలు కోరాయి. తక్కువ వ్యయాల భారంతో రుణాలు లభించేలా తోడ్పాటు అందించాలని స్టార్టప్ సంస్థలు, చిన్న.. మధ్య తరహా కంపెనీలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘చాలా మటుకు అనుమతుల ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయి. అనుమతులు లభించడానికి ఏడాదిన్నర పైగా పట్టేస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఈ రంగాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నాం. పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తుంటే, పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది‘ అని ప్రధానితో ఆన్లైన్లో పరిశ్రమ వర్గాలు నిర్వహించిన చర్చల సందర్భంగా భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తదితరులు కోరారు. దిగ్గజాలకు సభ్యత్వం.. ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్అండ్టీ నెక్సŠట్ సీనియర్ ఈవీపీ జయంత్ పాటిల్ చైర్మన్‌గాను, భారతి ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వత్స్ వైస్ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ దిగ్గజాలు లార్సన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్టెల్, నెల్కో (టాటా గ్రూప్), మ్యాప్‌మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, వన్‌వెబ్, అనంత్ టెక్నాలజీ మొదలైనవి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రెజ్, బీఈఎల్ తదితర సంస్థలకు సభ్యత్వం ఉంది. -
మహిళా మేనేజ్మెంట్ పొజిషన్లలో, పట్టణాలకంటే గ్రామీణ మహిళల హవా
న్యూఢిల్లీ: సీనియర్, మధ్యస్థాయి మేనేజ్మెంట్ పొజిషన్ల(ఉద్యోగాల)లో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్వో) ఒక నివేదికలో పేర్కొంది. 2019–20 ఏడాదికిగాను మేనేజ్మెంట్ స్థాయి సిబ్బంది మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంఖ్య 21.5 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. ఇదే సమయంలో పట్టణాలలో ఈ సంఖ్య 16.5 శాతమేనని తెలియజేసింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మొత్తం సీనియర్, మధ్యస్థాయి మేనేజ్మెంట్ సిబ్బందిలో పట్టణాలు, గ్రామాలలో కలిపి మహిళా వర్కర్ల నిష్పత్తి 18.8 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. 2019 జులై– 2020 జూన్ మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను రూపొందించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే -
సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్: 539 కొత్త 104 వాహనాలు
సాక్షి, అమరావతి: గ్రామీణ, మూరుమూల ప్రాంతాల ప్రజలకు వారి ముంగిటే నాణ్యమైన వైద్య సేవలు రానున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చేందుకు 539 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు కొనుగోలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. మిగతా వాహనాల కొనుగోళ్లకు చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున మొత్తం 656 కొత్త వాహనాల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రజలకు అక్కడే వైద్య సేవలందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలకూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేయడం ద్వారా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా మండలానికి రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 మొబైల్ మెడికల్ యూనిట్వాహనం, ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మండలానికి రెండు చొప్పున 104 వాహనాలను సమకూర్చేందుకు కొత్తగా మరో 539 కొనుగోలు చేస్తున్నారు. టెండర్లలో ఎల్–1గా నిలిచిన సంస్థ పేర్కొన్న ధరకు మళ్లీ రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో సాధకబాధకాలను తెలుసుకుని పటిష్టంగా ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 258 మండలాల్లో నవంబర్ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 1,195 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. జనాభాను దృష్టిలో పెట్టుకుని.. జనాభాను దృష్టిలో పెట్టుకుని 104 వాహనాలను వినియోగించాలంటూ సీఎం ఆదేశించారని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో వినయ్‌చంద్ తెలిపారు. 539 కొత్త వాహనాల కొనుగోలుకు సుమారు రూ.89 కోట్లు వ్యయం అవుతుందన్నారు. వాటి నిర్వహణకు ఏడాదికి రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయానికి నెలకు కనీసం రెండుసార్లు 104 వాహనంలో వైద్యులు వెళ్లి ఉదయం ఓపీ చూస్తారన్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారని వివరించారు. కొత్త 104 వాహనాలు జవనరి 26 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఊళ్లకు బస్సులు బంద్!
►ఇది మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ– మద్దూర రహదారి. ఈ రెండు మండలాల పరిధిలో 65 ఊళ్లున్నాయి. గతంలో ఆరు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు, మరో ఆరు అద్దె బస్సులు నడిచేవి. ఇప్పుడు కేవలం మూడే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా పది, ఇరవై ఊళ్ల్లకే, కొన్ని సమయాల్లోనే నడుస్తున్నాయి. దీంతో జనం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ►నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రం నుంచి చెన్నంపల్లికి కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న జీపు ఇది. ఊళ్లకు బస్సులు లేక ప్రయాణికులు జీపులో, టాప్‌పైన కూడా కూర్చుని వెళ్తున్న దుస్థితి ఉంది. నాగర్‌కర్నూల్ డిపో పరిధిలో 77 పల్లె వెలుగు బస్సులుండగా.. వాటిలో 47 అద్దె బస్సులే. ఇప్పుడవి నడవకపోతుండటం, ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ప్రధాన రోడ్లకే పరిమితం కావటంతో పల్లెలకు బస్సులు సరిగా నడవడం లేదు. సాక్షి, హైదరాబాద్: ‘పల్లె బస్సు’మొహం చాటేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారవాణాకు కీలకమైన పల్లె వెలుగు బస్సు ఆగిపోయింది. ఒకటీ రెండు కాదు.. వేల ఊళ్లకు బస్సులు సరిగా నడవడం లేదు. ప్రధాన మార్గాల్లోని ఊర్లు, కొన్ని ముఖ్యమైన మండల కేంద్రాలు, గ్రామాలకు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. చిన్న గ్రామాలు, ప్రధాన రోడ్లకు దూరంగా ఉన్న ఊళ్లు, మారుమూల పల్లెలకు కొద్దినెలలుగా బస్సులు రావడం లేదు. దగ్గరిలోని పట్టణానికి వెళ్లాలన్నా, ఇతర ఊళ్లకు పోవాలన్నా ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. క్రమంగా ఆ ఊళ్లు ప్రజా రవాణాకు పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్‌లగ్జరీ వంటి సర్వీసుల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నా.. ఎక్కువ శాతం జనాభాకు పల్లె వెలుగు బస్సులే ఆధారమని, అవి లేకుంటే ఎలాగనే విమర్శలు వస్తున్నాయి. నష్టాలు, బకాయిలతో.. ఆర్టీసీలో ప్రస్తుతం 3,645 పల్లె వెలుగు బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలను అనుసంధానించి, ప్రజల రవాణా అవసరాలను తీర్చాల్సినవి అవే. ఆ బస్సులు సరిపోవడం లేదు. మరో రెండు వేల బస్సులు అదనంగా వస్తేనే ఊర్లకు ప్రజారవాణా సరిగా అందే పరిస్థితి. కానీ కొత్త బస్సులు రావడాన్ని పక్కనపెడ్తే.. ఉన్న బస్సులే ఆగిపోవడంతో జనం ఆగమాగం అవుతున్నారు. మొత్తం పల్లెవెలుగు బస్సు ల్లో ఆర్టీసీ సొంత బస్సులు 1,935 కాగా, మిగతావి ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె రూపంలో తీసుకుని నడుపుతున్న బస్సులు. గతంలో అద్దె బస్సులు పరిమితంగా ఉండేవి. 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె తర్వాత వాటి సంఖ్య 3,300కు పెరిగింది. ఇందులో పల్లె వెలుగు సర్వీసుల కింద నడుస్తున్నవి 1,710 బస్సులు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో అద్దె బస్సులకు బిల్లుల చెల్లింపు కొంతకాలంగా నిలిచిపోయింది. దానికితోడు కరోనా లాక్డౌన్లు, జనం ప్రయాణాలు తగ్గిపోవడంతో ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారింది. అద్దె బస్సుల బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటీవలే రూ.25 కోట్లు మాత్రం చెల్లించారు. అయితే అద్దె బస్సులు తిరిగితే ప్రతి నెలా బకాయిలు పెరుగుతూనే ఉంటాయన్న ఉద్దేశంతో కొన్నింటిని ఆపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అద్దె బస్సుల్లో ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసులను కొనసాగించి.. పల్లె వెలుగు బస్సులను నిలిపివేసింది. దీంతో కేవలం ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులు మాత్రమే గ్రామాలకు తిరుగుతున్నాయి. ఉన్నవన్నీ ప్రధాన రూట్లకే పరిమితం కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనటం లేదు. పాతవి మూలనపడిన కొద్దీ అద్దె బస్సులను తీసుకుంటూ తిప్పుతోంది. ఇప్పుడు అద్దె బస్సులు ఆగిపోవడంతో.. పల్లె వెలుగు బస్సుల్లో చాలా వాటిని ప్రధాన రూట్లకు మళ్లించింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో రెండువేల జనా భా ఉన్న తాడూరు గ్రామానికి ఇటీవలి వర కు ఆరు పల్లె వెలుగు బస్సులు వచ్చేవి. సిద్దిపేట వెళ్లాలన్నా, మండల కేంద్రం చేర్యాలకు వెళ్లాలన్నా అవే ఆధారం. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా రావటం లేదు. ఇలాంటి ఊళ్లు ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామ–సిర్సా గ్రామాల మధ్య పరిస్థితి. గతంలో బస్సులు తిరిగిన ఈ రహదారిలో ఇప్పుడన్నీ ప్రైవేటు వాహనాలే కనిపిస్తున్నాయి. బడులు లేవని చెప్తూ.. మొత్తం పల్లె వెలుగు బస్సుల్లో వెయ్యి సర్వీసుల వరకు పాఠశాల విద్యార్థుల కోసం కేటాయించారు. బడుల వేళలకు అనుగుణంగా వాటి సమయాలు నిర్ధారించి ఊళ్లకు తిప్పేవారు. ఇప్పుడు కోవిడ్ వల్ల బడులు మూసి ఉండటంతో ఆ ట్రిప్పులన్నింటినీ రద్దు చేశారు. బడి సమయాల కోసం ఒక్కో బస్సు కనీసం మూడు, నాలుగు ట్రిప్పులు తిరిగేవి. అంటే ఈ లెక్కనే మూడు, నాలుగు వేల ట్రిప్పులు రద్దయ్యాయి. విద్యార్థుల సౌకర్యం కోసం వేసినా.. వాటిలో సాధారణ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించేవారు. వారికీ రవాణా వసతి దూరమైంది. ప్రయాణం.. ప్రమాదం ఊళ్లలో ఇటీవల ఆటోలు, జీపుల సంఖ్య పెరిగింది. యువతకు ఉపాధి పేరుతో అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. చాలామంది యువకులు సరిగా డ్రైవింగ్ రాకున్నా ఆటోలు, జీపులు నడుపుతున్నారు. దానికితోడు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకోవడం, రోడ్లు బాగోలేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు పల్లె వెలుగు బస్సు ల్లేక జనం పూర్తిగా ఆటోలు, జీపులనే ఆశ్రయించాల్సి వస్తోంది. వాటిని నడిపేవారు అడ్డగోలుగా జనాన్ని ఎక్కిస్తున్నారు. ఇలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏమిటన్న ఆం దోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వీటిని అడ్డుకుంటే రవాణా వసతి ఉండదన్న ఉద్దేశంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అన్నిచోట్లా అదే దుస్థితి ►మంచిర్యాల జిల్లాలో ఏకైక బస్సు డిపో మంచిర్యాల. ఇక్కడ 141 బస్సులున్నాయి. అందులో 61 అద్దెబస్సులు కాగా.. 80 ఆర్టీసీ సొంత బస్సులు. నిత్యం 25 వేల మంది ప్రయాణిస్తుంటారు. రోజుకు సగటున 23 లక్షల ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్ నాటి నుంచి అంటే నాలుగు నెలలుగా అద్దె బస్సులు నడవటం లేదు. మొత్తం 323 గ్రామాలకుగాను 120 రూట్లు ఉన్నా.. ప్రస్తుతం 58 రూట్లలోనే బస్సులు నడిపిస్తున్నారు. పల్లె ప్రాంతాలకు బస్సులు లేక ఇబ్బంది ఎదురవుతోంది. ►మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని కొండాపూర్ జనాభా 4 వేలకుపైనే. అయినా ఈ ఊరికి ఒక్క బస్సు కూడా రావటం లేదు. జనం ఊరుదాటాలంటే ప్రైవేటు వాహనం ఎక్కాల్సిందే. ►వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల పరిధిలో 239 పల్లె వెలుగు రూ ట్లు ఉన్నాయి. ప్రస్తుతంఅందులో 136 రూట్లకు సర్వీసులు నడవటం లేదు. ►యాదగిరిగుట్ట డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులకు సంబంధించి అద్దె బస్సులు 38కాగా, ఆర్టీసీ సొంత బస్సు లు 9 మాత్రమే. ఇప్పుడు అద్దె బస్సు లన్నీ నిలిచిపోవడంతో గ్రామాలకు ప్రజారవాణా ఆగిపోయింది. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో 239 ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులే తిరుగుతున్నాయి. 234 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ►మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులు 453 మాత్రమే తిరుగుతున్నాయి. 389 అద్దె బస్సులు ఊళ్లకు వెళ్లటం లేదు. -
వారికోసం కొత్త ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేసిన సోనూసూద్..!
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. లాక్డౌన్ సమయంలో అనేక మందిని వారి సొంత ఊర్లకు చేరవేయడంలో సోనూసూద్ ఎంతగానో కృషి చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రయాణికుల అవసరాల కోసం సరికొత్త ప్లాట్‌ఫాంను సోనూసూద్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ట్రావెల్ ఏజెంట్ల కోసం ‘ట్రావెల్ యూనియన్’ అనే ప్లాట్‌ఫాంను సోనూసూద్ లాంచ్ చేశారు. సోనూసూద్ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాట్‌ఫాం భారత తొలి గ్రామీణ బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్) ట్రావెల్ టెక్‌ప్లాట్‌పాంగా నిలవనుంది.దీంతో గ్రామీణ ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణసేవలను పొందనున్నారు. గ్రామీణ స్థాయిలో ట్రావెలింగ్ సెక్టార్ అసంఘటితంగా ఉంది. టైర్ 2 పట్టణాల్లోని ప్రయాణికులకు సేవలను అందించడానికి పలు ట్రావెలింగ్ సంస్థలు పెద్దగా మొగ్గుచూపడంలేదు. గ్రామీణ ప్రయాణికుల కోసం ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్స్ అసలు లేవని ట్రావెల్ యూనియన్ సంఘాలు పేర్కొన్నాయి. సోనూసూద్ ఏర్పాటుచేసిన ప్టాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులకు తక్కువ ధరలోనే ప్రయాణాలను, ఇతర సదుపాయాలను ఆఫర్ చేయవచ్చునని ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫాం మల్టిపుల్ ట్రావెల్ సర్వీస్ పార్టనర్లతో భాగస్వామాన్ని కల్గి ఉంది. అంతేకాకుంగా ఐఆర్సీటీసీ, 500కు పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలను, 10,000కు పైగా బస్ ఆపరేటర్లను, 10 లక్షలకు పైగా హోటల్ సదుపాయాలను ఈ ప్లాట్ ఫాం ద్వారా యాక్సెస్ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ట్రావెల్ యూనియన్ ప్లాట్‌ఫాం ఇంగ్లీష్, హిందీ భాషలో అందుబాటులో ఉంది. త్వరలోనే మరో 11 రిజనల్ భాషల్లో సేవలను అందించనుంది. రూరల్ బీ2బీ ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫాం ‘ట్రావెల్ యూనియన్’ లాంచ్ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ... “లాక్డౌన్ సమయంలో ప్రయాణాల విషయంలో గ్రామీణ భారతీయులు ఎదుర్కొనే సవాళ్లను నేను ప్రత్యక్షంగా చూశాను. గ్రామీణ ప్రయాణికులు ముందుగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం లేదు. వారి ప్రయాణాల కోసం మల్టీపుల్ ట్రావెల్ ఆపరేటర్లను సంప్రదించాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులు ఏలాంటి అడ్డంకులు లేని ప్రయాణ అనుభూతిని పొందవచ్చునని తెలిపారు. -
పట్టణ, గ్రామీణ ఉపాధికి సెకండ్ వేవ్ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయం, లాక్డౌన్ ఆంక్షలు ఉద్యోగ భారతాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో వారపు నిరుద్యోగిత రేటు బాగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు భారీగా ఎగిసింది. జూలై 25తో ముగిసిన వారంలో ఇది 6.75 శాతానికి పెరిగిందని తాజా డేటా వెల్లడించింది. అంతకు ముందు వారం ఇది 5.1 శాతం ఉంది. ప్రస్తుత జాతీయ నిరుద్యోగిత రేటు 7.14 శాతంగా ఉండగా, అంతకుముందు వారంలో ఇది 5.98 శాతంగా ఉంది అయితే గ్రామీణ పప్రాంతంతో పోలిస్తే పట్టణ ఉపాధిలో స్వల్ప పెరుగుదల నమోదైంది. జూలై 25 తో ముగిసిన వారంలో పట్టణ నిరుద్యోగం 8.01 శాతంగా నమోదైంది. అంతకుముందు వారం క్రితం 7.94 శాతంగా ఉంది. అయితే పట్టణాల్లో కోవిడ్ నిబంధనలను సడలించినప్పటికీ పట్టణ నిరుద్యోగిత రేటు గ్రామీణ, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. జూలై 25 తో ముగిసిన వారంలో మొత్తం నిరుద్యోగిత రేటు పెరిగినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ తరువాత గత మూడు నెలలకంటే పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎంఐఈ పేర్కొంది. జూన్‌లో నెలవారీ జాతీయ నిరుద్యోగిత రేటు 9.17 శాతంగా ఉండగా, పట్టణ నిరుద్యోగం 10.07 శాతం, గ్రామీణ భారతదేశంలో 8.75 శాతంగా ఉంది. మెరుగైన వాతావరణానికి తోడు, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం లాంటివి దీనికి సాయపడినట్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవేవ్తో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు అమలు కావడంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో గ్రామీణ, పట్టణ ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. అయితే మే నెలలో 11.9 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్ 1 నాటికి 9.17 శాతానికి దిగి వచ్చింది. -
పెరిగిన డిజిటల్ లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలే కీలకం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో గడిచిన 18 నెలల్లో డిజిటల్ లావాదేవీలు అనూహ్యంగా పెరిగినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు ఇక ముందూ కీలక పాత్ర పోషిస్తాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి. కానీ, భౌతిక పరమైన సేవల అవసరం కూడా ఉంటుంది. భౌతికంగా అక్కడ శాఖల నిర్వహణ ఉండాల్సిందే’’ అని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్ కత్పాలియా అభిప్రాయపడ్డారు. గ్రామీణ భారతానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కోటక్ మహీంద్రా బ్యాంకు జాయింట్ ఎండీ దీపక్‌గుప్తా.. రిటైల్ కస్టమర్లు భౌతిక, డిజిటల్ నమూనాలను అనుసరిస్తున్నా.. ఇతర కస్టమర్లు ఇప్పటికీ నగదు పరమైన లావాదేవీలే ఎక్కువగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి భౌతిక, డిజిటల్‌తో కూడిన ఫిజిటల్ నమూనా అవసరమని ఎన్పీసీఐ ఎండీ, సీఈవో దీలీప్ ఆస్బే అన్నారు. చదవండి : నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు -
గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది. చిన్నచిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లె ప్రజల అవగాహనారాహిత్యం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు, ప్రామాణిక నియమావళిని (ఎస్ఓపీ) జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కరోనా బారినపడినప్పటికీ లక్షణాలు లేనివారి కోసం, హోం ఐసోలేషన్‌లో ఉండడం సాధ్యం కాని బాధితుల కోసం 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలో సరిపడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్ఏటీ) కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే... ► శ్వాస, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై నిఘా పెట్టాలి. కరోనా కేసులు గుర్తించి వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. ► ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉంచాలి. ► లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన వారిని క్వారంటైన్లో ఉంచాలి. 80 నుంచి 85 శాతం కేసుల్లో లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఆసుపత్రి అవసరం లేదు. ఇంట్లో లేదా కరోనా కేర్ సెంటర్లో ఐసోలేషన్ సదుపాయం కల్పించాలి. కుటుంబ సభ్యులూ క్వారంటైన్ పాటించాలి. ► కరోనా రోగులకు పారాసిటమాల్, ఐవెర్‌మెక్టిన్, దగ్గు సిరప్, మల్టీ విటమిన్ల్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలి. ► శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా తక్కువ, ఛాతీ భాగంలో నొప్పి, మానసిక ఆందోళన ఉన్న వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి. ► ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయం కల్పించాలి. ► తక్కువ, లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు, మోడరేట్ కేసుల వారిని డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్‌కు, తీవ్రంగా ఉన్న కేసులు డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రులకు పంపాలి. ► కేసుల సంఖ్య, కరోనా తీవ్రత బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పకుండా చేయాలి. ► పట్టణ శివారు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో 30 పడకలుండాలి. గిరిజన ప్రాంతాల్లో.... గ్రామీణప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతా ల్లో అదనపు సవాళ్లు ఉండడంతోపాటు ఆరోగ్య సేవలు తక్కువగా, సామాజికంగా, ఆర్థికంగా భౌగోళికంగానూ దూరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో.... ► ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత గ్రామ సభ తీసుకోవాలి. కోవిడ్–కేర్ కార్యక లాపాల్లోనూ కీలకపాత్ర పోషించాలి. ► మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసి కోవిడ్‌కేర్ సెంటర్లతో అనుసంధానించాలి. ► ఎంఎంయూల్లో వైద్యాధికారి, ఫార్మాసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. -
Narendra Modi: స్థానిక కట్టడియే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అధిక పాజిటివిటీ రేటున్న జిల్లాల్లో స్థానిక కట్టడియే ప్రస్తుత దశలో అత్యంత కీలకమన్నారు. కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళికను రూపొందించాలని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించడంతో పాటు ఇతరత్రా అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ప్రాణవాయువును అందించే ఇతరత్రా ఉపకరణాల వినియోగంపై ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని, వీటి వినియోగానికి వీలుగా గ్రామీణ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. మహానగరాల్లో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలను వేగవంతం చేసింది. పారదర్శకంగా గణాంకాలు వెల్లడించాలి దేశంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నియంత్రణకు స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు.. రెండింటినీ ఉపయోగించి కరోనా పరీక్షలను మరింత పెంచాలని ప్రధాని ఆదేశించారు. రాష్ట్రాలు పారదర్శకంగా కోవిడ్–19 గణాంకాలను వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారు. తమ ప్రభుత్వాల కృషిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా గణాంకాలను కేంద్రానికి నివేదించాలని ఆయన అన్నారు. కొత్త కేసులు, మరణాల సంఖ్యలు పలు రాష్ట్రాలు తక్కువ చేసి చూపుతున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా మహమ్మారి సంక్రమణను ఆపేందుకు అవసరమైన ఇంటింటికీ పరీక్షలు, నిరంతర నిఘాకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన ఆరోగ్య పరికరాలను అందించి ఈ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో హోం ఐసోలేషన్, చికిత్సకు సంబంధించి అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌ను సులభతరమైన భాషలో అందుబాటులో ఉంచాలని మోదీ అధికారులను కోరారు. వెంటిలేటర్ల ఉపయోగంపై మదింపు చేయండి అంతేగాక కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయన్న నివేదికలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అందించిన వెంటిలేటర్లు ఏమేరకు ఉపయోగంలో ఉన్నాయో మదింపు చేయాలన్నారు. వీటిని ఇన్స్టాల్ చేసి, పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వెంటిలేటర్లను సరిగ్గా వినియోగించేలా ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైతే మరోసారి శిక్షణ అందించాలన్నారు. దేశంలో కోవిడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం శాస్త్రవేత్తలు, విషయ నిపుణుల మార్గనిర్దేశనంలో జరుగుతోందని, అది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వారానికి 1.3 కోట్ల టెస్టులు అంతకుముందు ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో దేశంలో కోవిడ్ పరిస్థితులపై అధికారులు మోదీకి వివరించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల కరోనా పరీక్షలు జరగగా, ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్న పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు గురించి ప్రధానికి వివరించారు. ఇటీవల రోజుకి 4 లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య హెల్త్ వర్కర్స్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం తగ్గుతోందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, టెస్ట్‌లు, ఆక్సిజన్ లభ్యత, మౌలిక సదుపాయాలు, వ్యాక్సినేషన్ రోడ్ మ్యాప్ పరిస్థితులను ప్రధానికి అధికారులు వివరించారు. -
కారు.. పల్లె‘టూరు’!
కరోనా వైరస్ వాహన విక్రయాలను కాటేసింది. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి. కరోనా కల్లోలం, ఆర్థిక మందగమనం సెగ పెద్దగా తాకని గ్రామీణ మార్కెట్లు తమను గట్టెక్కిస్తాయని వాహన కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆ ఆశలను గ్రామీణ మార్కెట్లు నెరవేర్చాయి. భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. పల్లె మార్కెట్ల దన్నుతో వాహన రంగం పుంజుకుంది. గ్రామీణ మార్కెట్లలో మరింత పుంజుకోవడానికి కంపెనీలు చేసిన, చేస్తున్న ప్రయత్నాలపై ‘సాక్షి బిజినెస్’ స్పెషల్ స్టోరీ.... కరోనా మహమ్మారి వాహన రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. లాక్డౌన్ కారణంగా టూ వీలర్లు, కార్ల అమ్మకాలు అసలే జరగలేదు. మే నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు. గత పదేళ్లలో వాహన విక్రయాలకు సంబంధించి అత్యంత అధ్వానమైన నెల ఇదే. లాక్డౌన్ ఆంక్షలు పాక్షికంగా సడలించిన తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాయి. కరోనా కల్లోలం కారణంగా పట్టణ మార్కెట్, పట్టణాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. అయితే గ్రామాల్లో కరోనా కల్లోలం పెద్దగా లేకపోవడం, గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కరోనా కల్లోలం ప్రభావం స్వల్పంగానే ఉండటంతో వాహన కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెబాట పట్టాయి. గ్రామీణులను ఆకర్షించడానికి మొబైల్ షోరూమ్స్ ఏర్పాటు చేశాయి. రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నాయి. ఫలించిన ప్రయత్నాలు... ఆరు నెలల కాలంలో ఈ ప్రయత్నాలు ఫలించాయి. వాహన విక్రయాలు మెల్లమెల్లగా రికవరీ అయ్యాయి. పండుగల సీజన్లో బాగా పుంజుకున్నాయి. గ్రామీణ మార్కెట్ల దన్నుతోనే వాహన విక్రయాలు కళకళలాడాయి. వాహన కంపెనీలకు భవిష్యత్తుపై భరోసాను కూడా గ్రామీణ మార్కెట్లే ఇచ్చాయి. ఇక ఇప్పుడు పట్టణ మార్కెట్లు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. వెయ్యి కొత్త షోరూమ్‌లు... ఆర్థిక మందగమనం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటంతో దాదాపు 300కు పైగా వాహన షోరూమ్‌లు మూతపడ్డాయి. పులి మీద పుట్రలా ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కల్లోలం కూడా జత అయింది. దీనికి లాక్డౌన్ ఆంక్షలు తోడయ్యాయి. ఫలితంగా పరిస్థితులు మరింత అస్తవ్యస్తం కావాలి. అంటే మరిన్ని షోరూమ్‌లు మూతపడాల్సి ఉంది. కానీ లాక్డౌన్ ఆంక్షలు సడలిన తర్వాత వాహన కంపెనీలు కొత్తగా వెయ్యికి పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ప్రారంభించాయి. వీటిల్లో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడానికి టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు ఆయా గ్రూప్కంపెనీల తోడ్పాటు ఇతోధికంగా ఉపయోగపడింది. టాటా మోటార్స్ కంపెనీ తన ఇతర గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేసింది. వీటన్నిటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ వాటా 5% పెరిగి 43 శాతానికి, మహీంద్రా వాటా 6% పెరిగి 53 శాతానికి చేరాయి. మొబైల్, చిన్న షోరూమ్‌లు... టాటా మోటార్స్ కంపెనీ మొబైల్ షోరూమ్స్‌ను ఏర్పాటు చేసింది. తక్కువ వ్యయాలతోనే వీటిని ఏర్పాటు చేసి, గ్రామీణులకు టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు వేగంగా విక్రయానంతర సేవలందించే నిమిత్తం వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ ఒకడుగు ముందుకు వేసి జిప్ సర్వీస్ పేరుతో బైక్‌ల ద్వారా ఈ సేవలందిస్తోంది. పట్టణాల్లోని షోరూమ్‌ల్లో నాలుగో వంతు ఉండేలా చిన్న చిన్న షోరూమ్స్‌ను వాహన కంపెనీలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మకాలు పుంజుకోవడానికి ఇవి బాగానే తోడ్పడ్డాయి. వాహన కంపెనీలు స్టూడియో స్టోర్స్, షోరూమ్ లైట్, ఎమర్జింగ్ మార్కెట్ అవుట్‌లెట్స్, స్మార్ట్ షోరూమ్ పేర్లతో చిన్న షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. కియా కంపెనీ స్మార్ట్ అవుట్లెట్ పేరుతో చిన్ని చిన్న కార్ల షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. డిజిటల్ జోరు... కరోనా కల్లోలం కారణంగా ప్రజలు బయటకు రావడం తగ్గింది. దీంతో కార్ల కంపెనీల షోరూమ్స్ వెలవెలపోతున్నాయి. దీనిని అధిగమించడానికి హ్యుందాయ్ కంపెనీ ‘క్లిక్ టు బై’ పేరుతో డిజిటల్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. కారు కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారుడు షోరూమ్‌కు వెళ్లకుండానే క్లిక్ టు బై డిజిటల్ షోరూమ్‌లో నచ్చిన కారును ఎంచుకొని హోమ్ డెలివరీ పొందవచ్చు. కొత్తగా మన మార్కెట్లోకి వచ్చిన కియా మోటార్స్, ఎమ్జీ మోటార్ కంపెనీలు డిజిటల్ షోరూమ్‌ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయి. వినూత్నమైన స్కీమ్‌లు... ఆర్థిక మందగమనం, కరోనా కల్లోలం కారణంగా పట్టణాల్లో వాహన విక్రయాలు కుదేలయ్యాయి. చాలా మంది ఆదాయాలు తగ్గడంతో అమ్మకాల కోసం వాహన కంపెనీలు కొత్త దారులు వెదుకుతున్నాయి. ఆదాయాలు పడిపోవడంతో చాలామంది వాహనాలు కొనలేకపోతున్నారు. దీన్ని అధిగమించడానికి సబ్స్క్రిప్షన్, లేదా లీజు ద్వారా వాహన వాడకం తదితర ఆకర్షణీయ స్కీమ్‌లను వాహన కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగం పోయిన పక్షంలో ఈఎమ్ఐల చెల్లింపుల్లో వెసులుబాటును ఇవ్వడం వంటి వినూత్నమైన స్కీమ్‌లను వాహన కంపెనీలు అందిస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాట ఇలా ► మహీంద్రా: ఫార్మ్ ఎక్విప్మెంట్ డివిజన్‌తో కలసి 475 కొత్త అవుట్‌లెట్స్ ఏర్పాటు. ► టాటా మోటార్స్: గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ వ్యూహం అమలు. ► మారుతీ సుజుకీ: 12,500 రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం. ► హ్యుందాయ్: కొత్త విధానంలో షోరూమ్‌ల ఏర్పాటు, బైక్‌ల ద్వారా విక్రయానంతర సేవలు అందిస్తోంది. ► కియా మోటార్స్, ఎమ్జీ మోటార్: డిజిటల్ షోరూమ్‌ల ఏర్పాటు, సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత. ► టయోటా కిర్లోస్కర్: కొత్తగా వంద సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటు. కొత్త ఏడాదిలో ధరలకు రెక్కలు..! ముంబై: కొత్త ఏడాదిలో కారు కొనడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు ఏడాది ప్రారంభంలోనే నిరాశ ఎదురుకానుంది. పలు కార్ల కంపెనీలు జనవరి 1 నుంచి తమ మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ఇందుకు కారణం. ఆటో రంగంలో తలెత్తిన సంక్షోభంతో పాటు కోవిడ్ ప్రేరేపిత లాక్‌డౌన్‌తో 2020లో కార్ల అమ్మకాలు, ఎగుమతులు భారీగా తగ్గిపోవడంతో వాహన కంపెనీలు తప్పనిసరిగా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతీ సుజుకీ...: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ‘‘గత ఏడాది కాలంగా కార్ల తయారీ వ్యయాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది’’ అని కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయం మోడల్ ప్రాతిపదికన మారుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది. అదే దారిలో ఫోర్డ్ ఇండియా కూడా... మారుతీ సుజుకీ దారిలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా కూడా వచ్చే జనవరి 1 నుంచి తన అన్ని రకాల మోడళ్లపై ధరలను ఒకశాతం నుంచి 3% వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఆయా మోడళ్లను బట్టి ఈ పెంపు రూ.5వేల నుంచి రూ. 35 వేలు దాకా ఉండొచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ఇన్పుట్ వ్యయాల కారణం ధరలను పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే 2020 ఏడాది ముగిసే లోపు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధరల సెగలు తగలవని వినయ్ వివరించారు. -
గ్రామీణ ప్రాంతాల్లో మ్యుటేషన్ ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజును ఖరారుచేసింది. ఫీజు కింద సదరు ఆస్తి విలువలో 0.1 శాతం లేదంటే రూ.800 (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం జీవో నంబర్–46 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రమంతటా గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర స్థిరాస్తులపై హక్కుల బదిలీ కోసం ఒకేరకమైన ఫీజు వసూలు చేస్తారు. గతంలో గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు ఆయా గ్రామాల్లో మ్యుటేషన్ ఫీజు నిర్ధారించే ఆనవాయితీ ఉంది. దీంతో మ్యుటేషన్ ఫీజు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉండేది. తాజా ఉత్తర్వులతో మ్యుటేషన్ ఫీజు ఖరారు అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ధరణి ద్వారా గ్రామాల్లోనూ ఏకరూప రుసుము అమలవుతుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కుల బదిలీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల వంటి లావాదేవీలకు ఇది వర్తి స్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
గ్రామాల్లో సగం కుటుంబాలకు.. ఉపాధి
అనంతపురం జిల్లా చినకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో 1,166 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 79,739 పనిదినాల ద్వారా రూ.1,85,69,000 వేతనాలుగా పొందాయి. అంటే.. సగటున ప్రతి కుటుంబం ఏడు నెలల కాలంలో రూ.15,925 చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద దోర్నాలలో 1,858 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 82,422 రోజుల పనిదినాల ద్వారా రూ.1,84,33,000 వేతనాలుగా పొందాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దాదాపు సగం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో 96 లక్షల కుటుంబాలు ఉన్నాయని అంచనా. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 46,39,981 కుటుంబాలకు పథకం కింద ప్రభుత్వం పనులు కల్పించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు కూలీలు రూ.4,913 కోట్ల మేర పనులు చేయగా..రూ.4,858 కోట్లు మేర చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. 2006లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 14 ఏళ్ల కాలంలో.. ఒక ఆర్థిక ఏడాది సమయంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇంత ఎక్కువ సంఖ్యలో కుటుంబాలకు పథకం కింద పనులు కల్పించిన దాఖలాలు లేవని.. ఇదో రికార్డని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రమంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గ్రామాల్లో వ్యవసాయ పనులు పెద్దగా లేకపోయినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించలేకపోయారు. 2016–17 ఆర్థిక ఏడాదిలో 39.91 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందగా.. 2017–18లో 39.94 లక్షల కుటుంబాలే పనులు పొందాయి. యాక్టివ్ కూలీ కుటుంబాలు.. 54.89 లక్షలు ఉపాధి హామీ పథకంలో పనుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,43,508 కుటుంబాలు నమోదు చేసుకొని జాబ్‌కార్డులు పొందినప్పటికీ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాల ప్రకారం యాక్టివ్ కూలీ కుటుంబాలు 54.89 లక్షలుగా ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో కనీసం ఒక్క రోజు అయినా పనులు కావాలని కోరి, చేసిన వారినే యాక్టివ్ జాబ్‌కార్డు కుటుంబాలుగా ఆ శాఖ గుర్తిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో యాక్టివ్ జాబ్‌కార్డు కుటుంబాలుగా గుర్తింపు పొందిన వాటిలో దాదాపు 90 శాతం ఈ ఆర్థిక ఏడాది పనులు పొందాయి. 3,33,989 కుటుంబాలు పూర్తి స్థాయిలో వంద రోజుల పనులు పూర్తిచేశాయి. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 60,01,097 కుటుంబాలు పనులు పొందాయి. కరోనా, లాక్డౌన్ వంటి కారణాలతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. -
కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా తన బ్యాంకింగ్ కరస్పాండెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కస్టమర్‌కు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారి సమిత్ భగత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 11వేల మంది కరస్పాండెట్లకు మరో అదనంగా 14వేల మందిని నియమిస్తామని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారు కొత్త ఖాతాను తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, పేమెంట్ ప్రొడెక్ట్‌లు, లోన్ క్లోజింగ్ లాంటి సదుపాయాలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ఆమె వివరించారు. అలాగే కరస్పాండెంట్ల వ్యవస్థను మరింత బలపరించేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వ కామన్ సర్వీసు సెంటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకునే యత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
గ్రామాలలోకి టెకీల జీవన విధానం..
ముంబై: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని) వెసలుబాటు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ నిపుణులు తమ గ్రామాలకు చేరుకున్నారు. అయితే సిటీ కల్చర్‌కు అలవాటు పడిన టెకీలు గ్రామీణ జీవన విధానానికి అలవాటు పడలేకపోతున్నారు. అయితే భారీ వేతనాలు పొందుతున్న టెకీలు తమ గ్రామాలలోనే అత్యాధునిక సౌకర్యాలు కల్పించుకోవడానికి ప్రాధాన్యతిస్తున్నారు. స్టార్ట్టీవీ, ఆఫీస్‌లో ఉన్న విధంగా గోడలకు సీలింగ్ చేయించడం, ఉన్నంతలో కాన్పరెన్స్ రూమ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ అంశంపై సికెందర్ అనె టెకీ స్పందిస్తూ.. తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని ఐటీలో వంద శాతం నైపుణ్యత కావాలంటే కచ్చితంగా కెఫీన్ కలిగిన కాఫీ ఉండాల్సిందేనని తెలిపారు. అయితే మెజారిటీ టెకీలు నగరంలో ఉన్న ఆహార పదార్థాలను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. గ్రామాలలో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలకు టెకీలు ప్రాధాన్యమిస్తున్నారు. (చదవండి: కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..) -
గ్రామాలకు వైభవం
శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉండే జీరుపాలెం, జగన్నాథపురం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఎన్‌హెచ్–16 జాతీయ రహదారి నుంచి ఈ గ్రామాలను, రూ.8 కోట్లతో రణక్షేత్రం మండలంలోని 21 చిన్న, చిన్న గ్రామాలను కలుపుతూ 15 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనంతపురం జిల్లాలో సుమారు వెయ్యి జనాభా ఉండే రేకులకుంట గ్రామంలో ప్రస్తుతం రూ.79.30 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.40 లక్షలతో సచివాలయ భవనం, రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆరు నెలల కిందటే ఆ గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. సాక్షి, అమరావతి: ఏడాది కాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారానే రూ.11,192 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు వసతికి నోచుకోని చాలా గ్రామాలకు కొత్తగా తారు రోడ్లను మంజూరు చేసింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో రోడ్డు వేయడానికి ఇంకొన్ని చోట్ల అనుమతిచ్చింది. చాలా గ్రామాల్లో హెల్త్ క్లినిక్ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకొని గత ప్రభుత్వం ఎన్నికలకు ముం దు అనుమతిచ్చిన రూ.4,404 కోట్ల రోడ్ల పనులనూ కలుపుకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లకు పైబడి ఒక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా అభివృద్ధి పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఏడాది కాలంలో కొత్తగా మంజూరు చేసిన పనులివే.. ► మారుమూల గ్రామాలను, వాటికి సమీపంలోని పెద్ద గ్రామం లేదా పట్టణానికి కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కి.మీ. పొడవునా కొత్తగా రోడ్డు నిర్మాణ పనులకు గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ పనులకు మొత్తం రూ.1,950 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2,214 కి.మీ. పొడవునా 284 పనులు గుర్తించి, ఇప్పటికే టెండరు ప్రక్రియను మొదలుపెట్టారు. ► రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ పథకంలో భాగంగా మరో రూ.755 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ► రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,356 కోట్ల వ్యయంతో 10,876 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రభు త్వం అనుమతి తెలపగా.. ఇప్పటికే దా దాపు అన్ని పనులు మొదలయ్యాయి. దాదాపు 127 చోట్ల పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. ► గ్రామాల్లో వైద్య సేవలందించడానికి రూ.2,245 కోట్ల వ్యయంతో 10,062 గ్రామాల్లో హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి అనుమతి తెలపగా, 802 చోట్ల ఆయా భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ► 8,567 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.1,511 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రస్తుతం 506 గ్రామాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ► అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి రూ.375 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. పంచాయతీ భవనం లేకుంటే రూ.80 లక్షల పనులు పంచాయతీ భవనం కూడా లేని మా గ్రా మానికి హెల్త్ క్లినిక్ భవనం, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఏడాది కాలంలో దాదాపు రూ.80 లక్షల విలువ చేసే పనులు మా ఊరులో మొదలయ్యాయి. – సాకే లక్ష్మినారాయణ, రేకులకుంట, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా పనులన్నీ ప్రారంభం గ్రామీణ ప్రాం తాల్లోని ప్రతి నివాసిత ప్రాం తానికి రోడ్డు వసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ భవనాలను నిర్మించాలన్నది ఈ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు. అందుకనుగుణంగా ఆయా పనుల్లో మూడో వంతు ఇప్పటికే మొదలయ్యాయి. – సుబ్బారెడ్డి, ఈఎన్సీ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం -
సిమెంటు కంపెనీల పల్లెబాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దేశవ్యాప్తంగా అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. ఇందులో సిమెంటు రంగం కూడా ఒకటి. కార్మికులు లేక నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సిమెంటుకు డిమాండ్ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతుండడం కంపెనీలకు కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు కంపెనీలు గ్రామాలపై దృష్టిపెట్టాయి. అయితే కార్మికులు తిరిగి వస్తేనే నిర్మాణ రంగం గాడిన పడుతుందన్నది కంపెనీల మాట. జనవరి–మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. గ్రామీణ ప్రాంతాలే ఆధారం... ప్రస్తుతం జరుగుతున్న సిమెంటు వినియోగంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లో నిర్మాణాలు చాలా మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే అధికంగా పట్టణేతర ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు 30% మాత్రమే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కార్మికులు తిరిగి వస్తేనే సిమెంటుకు మంచి రోజులని వ్యాఖ్యానించారు. ప్లాంట్లలో తయారీ 25–30 శాతానికి పడిపోయిందన్నారు. ఇది జూలై–సెప్టెంబరులో 40–50%కి చేరుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. కార్మికుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టుబడులు చేస్తుందని తాము భావిస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి–మార్చికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. పదేళ్లుగా ధర అక్కడే..: తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా సిమెంటు బస్తా ధర రూ.350 చుట్టూ తిరుగుతోందని రవీందర్ రెడ్డి అన్నారు. ‘ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా ఆ స్థాయిలో ధర పెరగలేదు. ప్లాంట్లలో ఉత్పత్తి 60–65 శాతమైతే బస్తా ధర రూ.350 ఉన్నా సరిపోతుంది. తయారీ 10% తగ్గితే బస్తాపైన వ్యయం రూ.25–30 అధికం అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ల సామర్థ్యం 25–30%కి పరిమితమైంది. ఉత్పత్తి లేకున్నా సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ కంపెనీలకు భారమే. గతేడాది సగటుతో పోలిస్తే ధర 1% మాత్రమే పెరిగింది. జీఎస్టీ 28 శాతం ఉంది. దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం’ అని వివరించారు. ఇక రవాణా సమస్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరాపై కంపెనీలు దృష్టిపెట్టాయి. కరోనా నియంత్రణలోకి వస్తేనే రవాణా సమస్యల నుంచి గట్టెక్కుతామనేది కంపెనీల మాట. సిమెంటు అమ్మకాలు ఇలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో 23 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. కోవిడ్–లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్‌లో ఇది 3.65 లక్షల టన్నులకు దిగొచ్చింది. అమ్మకాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇదే తక్కువ పరిమాణం. మే నెలలో ఇరు రాష్ట్రాలు చెరి 7 లక్షల టన్నుల విక్రయాలు సాధించాయి. ఇందులో ఒక లక్ష టన్నుల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డర్లే ఉంటాయి. ఇక 2019 మే నెలలో 22 లక్షల టన్నులు కాగా, అదే ఏడాది జనవరిలో అత్యధికంగా 31 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే జూన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది. -
ఇన్ఫ్రా అభివృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇవి బహుళ విధాలుగా సానుకూల ప్రభావాలు చూపగలవని ఆయన వివరించారు. భారత్ స్వయం సమృద్ధమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను నిర్మించుకోవడం కీలకమని ఠాకూర్ వివరించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చే అయిదేళ్లలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ. 111 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ గత నెలలో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కంపుకొడుతున్న గ్రామాలు
సాక్షి, కొత్తూరు : ప్రత్యేకాధికారుల పాలనలోనూ పంచాయతీల్లో ప్రత్యేకత కానరావడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీల్లో పూడికలు, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. అంటు రోగాలు వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపుకొడుతున్న గ్రామాలు కొత్తూరు మండలంలో మండల కేంద్రంతో పాటు నివగాం, దిమిలి, పారాపురం, కలిగాం అఫీషియల్ కాలనీ, ఎన్ఎన్ కాలనీతో పాటు మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎల్.ఎన్.పేట మండలంలో ఎల్‌ఎన్‌పేట, యంబరాం, గొట్టిపల్లి, దబ్బపాడు తదితర గ్రామాల్లో మురుగుకాలువల్లో పూడిక తీతపనులు చేపట్టకపోవడంతో వీధుల్లో మురుగునీరు ప్రవహిస్తోంది. హిరమండలం మండలంలో రెల్లివలస, పిండ్రువాడ, హిరమండలం, మహలక్ష్మీపురం తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. మెళియాపుట్టి మండలంలో చాపర, చీపురుపల్లి, గొప్పిలి గ్రామాల్లో ఆరు నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. పాతపట్నం మండలంలో మండల కేంద్రంతో పాటు ఏఎస్ కవిటి, నల్లబొంతు, బూరగాంతో పాటు మరికొన్ని గ్రామాల్లో అపారిశుద్ధ్యం అలముకుంది. స్పందించని అధికారయంత్రాంగం పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తికావడంతో వారిస్థానంలో ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు వారికి పూర్తిస్తాయిలో అధికారాలు ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో మురుగు కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిసుతన్నాయి. దుర్గంధం, దోమలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా అధికారులు, పాలకుల్లో స్పందన లేకపోవడం దారుణం. నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు స్వచ్ఛభారత్ లక్ష్యంలో భాగంగా అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లోని చెత్తను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించేందుకు ప్రతీ పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలు కేటాయించారు. అయితే వాటిని ఇప్పటి వరకు వినియోగించిన దాఖలాలు లేవు. వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రిక్షాలు మూలకు చేరాయి. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన చెత్తశుద్ధి కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బోరు చుట్టూ మురుగు మంచినీటి బోరు చుట్టూ మురుగునీరు చేరడంతో బోరుకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. – బొమ్మాలి నగేష్, కొత్తూరు రోగాల బారిన పడుతున్నాం మురుగుకాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో ఇళ్ల ముందు మురుగు నిల్వ ఉంటోంది. దుర్గంధంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. రోగాల బారిన పడుతున్నాం. కూలి డబ్బులు మందులకే సరిపోతున్నాయి. – పి.రాజేశ్వరి, బీసీ కాలనీ, కొత్తూరు ఇళ్లలో ఉండలేకపోతున్నాం మురుగుకాలువలు నిండిపోవడంతో రోడ్డుపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షం కురిస్తే మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. దుర్గంధం వెదజల్లుతుండడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. – కొయిలాపు రాజారావు, కొత్తూరు ఇళ్ల ముందు నిల్వ ఉంటోంది కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మేమే కాలువలను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. – నిద్దాన లక్ష్మమ్మ, రెల్లి వీధి పారిశుద్ధ్య పనులు చేపడతాం మండలంలోని పలు పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించినట్లు గుర్తించాం. వెంటనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అక్కడి సిబ్బందికి ఆదేశించాం. అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – నారాయణమూర్తి, ఈవోపీఆర్డీ, కొత్తూరు -
గుజరాత్లో విద్యుత్ బకాయిల మాఫీ
అహ్మదాబాద్ : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరిన కొద్దిగంటలకే రైతు రుణ మాఫీని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వం రూ 650 కోట్ల మేర విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు బకాయి పడిన విద్యుత్ బిల్లుల మాఫీపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.22 లక్షల కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులు పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీతో రూ 650 కోట్ల మేర లబ్ధి పొందుతారని గుజరాత్ విద్యుత్ శాఖ మంత్రి సౌరభ్ పటేల్ తెలిపారు. విద్యుత్ చౌర్యం, బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఈ కనెక్షన్లను తొలగించామని వీటిలో గృహ, వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీతో ఆయా కనెక్షన్లను పునరుద్ధరిస్తారు. కాగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాల మాఫీ ప్రకటించడం, ప్రధాని మోదీ రైతులకు మేలు చేసేవరకూ విశ్రమించనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో రుణ మాఫీ ప్రకటించాలని పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు. -
బిల్లులు అందేనా!
సాక్షి, మల్దకల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలందరికీ సకాలంలో కూలి డబ్బులు అందక, కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. పనులు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో కూలీలు డబ్బులు రాక, పనులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో మండలంలోని ఉలిగేపల్లిలో దాదాపు 200 మంది కూలీలు కూలి పనులు, వ్యవసాయ పొలాలను చదును చేయడం, ముళ్లచెట్లను తొలగించడంతో పాటు వివిధ ఉపాధి హామీ పనులు చేయగా.. రూ.3 లక్షల 90 వేలకు పైగా బిల్లులు అందాల్సి ఉంది. పనులు చేసిన కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఖాతాలో డబ్బులను జమ చేయకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు కూలీలు గతంలో ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో విచారణ జరిపించి కూలీలకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు కూలీలు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంకుడు గుంతల పరిస్థితి... అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఉలిగేపల్లిలో 125 మరుగుదొడ్లు, అమరవాయిలో 40 మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోగా.. లబ్ధిదారులకు నేటికీ బిల్లులు అందలేదు. వారితో పాటు నిర్మించుకున్న కొంత మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగా.. మిగిలిన వారికి నేటివరకు అందలేదు. దాదాపు రూ.2 లక్షలకు పైగా మరుగుదొడ్ల బిల్లులు, లక్షకు పైగా ఇంకుడు గుంతల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం లబ్ధిదారులు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. మంజూరైన వెంటనే జమచేస్తాం.. ఉలిగేపల్లిలో ఉపాధి కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. మంజూరైన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. అదే విధంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు బిల్లులు విషయమై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. – రాజారమేష్, ఎంపీడీఓ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది.. గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు బిల్లులు చెల్లించలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. ఇక వస్తాయన్న ఆశ సన్నగిల్లింది. అధికారులు స్పందించి కూలీలు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. – రాముడు, ఉలిగేపల్లి మరుగుదొడ్లు బిల్లు ఇస్తాలేరు.. ఉలిగేపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.12 వేలు అందజేస్తామని చెప్పారు. దీంతో అప్పులు చేసి మరీ నిర్మించుకున్నాం. ఇప్పటి వరకు బిల్లులు అందించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మరుగుదొడ్ల బిల్లులు అందిస్తే బాగుంటుంది. – నర్సింహులు, ఉలిగేపల్లి -
మారుమూల గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు సీఎస్‌సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్ ఏజెన్సీలు.. కొత్తగా బుక్ చేసే ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్ సిలిండర్‌పై రూ.2, సీఎస్సీకి సిలిండర్ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్‌సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సీఈవో దినేశ్ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. -
అభివృద్ధికి ఆమడ దూరంలో పల్లెలు
తమ నాలుగేళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనీ, గ్రామాలు సకల సదుపాయాలతో అలరారుతున్నాయని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. అభివృద్ధికి చాలా పల్లెలు ఇంకా ఆమడదూరంలో ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పేర్కొంది. విద్యుత్ ఏదీ? దేశంలోని 5,97,608 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా 100 శాతం విద్యుదీకరణ సాధించామని కేంద్రం ప్రకటించింది. కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 2.3 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 89 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది. మొబైల్ సేవలు మొబైల్ ఫోన్ సేవలు ప్రారంభమై ఇప్పటికి 23 ఏళ్లు గడిచినా ఇంకా 43,000 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి రాదు. నెట్వర్క్ ఉన్నచోట్ల సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు దేశంలోని 2.89 లక్షల గ్రామాల్లో స్వచ్ఛమైన తాగు నీరు పాక్షికంగానే అందుబాటులో ఉందని ఇటీవల కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుతం 62,582 గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నట్లు చెప్పింది. గ్రామీణ రహదార్లు కేంద్రం 2000లో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 1,78,184 గ్రామాల రహదార్లను అనుసంధానించాలన్నది లక్ష్యం. వీటిలో 31,022 గ్రామాలకు రహదారులనే వేయలేదు. విద్య గ్రామీణ ప్రాంతాల్లో 14–18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లో 25% (8 కోట్ల మంది) మాతృభాషలోని పాఠ్య పుస్తకాలనే చదవలేకపోతున్నారు. సగం మందికిపైగా లెక్కలు (మూడంకెల సంఖ్యను ఒక అంకెతో గుణించడం) కూడా రాదు. ఆస్పత్రులు 2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో 19 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ)22 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) 30 శాతం సిబ్బంది కొరత ఉంది. 30 వేల మందికి ఒక పీహెచ్సీ, 1.20 లక్షల మందికి ఒక సీహెచ్‌సీ ఉన్నాయి. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత 12% ఉంది. నర్సుల కొరత 60% దాకా ఉంది. 73% ఉప ఆరోగ్య కేంద్రాలు శివారు గ్రామాలకు 3 కి.మీ. పైగా దూరంలో ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల్లో 99 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. -
నిరుపేదలకు సౌభాగ్యం
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా అంధకారంతో సావాసం చేయక తప్పని స్థితిలోనే ఉంటున్న నాలుగు కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘సౌభాగ్య’(ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) పథకాన్ని సోమవారం ప్రారంభించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి... అంటే మరో 15 నెలలకు ఈ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం అందించాలన్నది పథకం లక్ష్యం. దేశ ప్రగతి గురించి మనం ఎంతగా మాట్లాడుకుంటున్నా, కొన్ని రంగాలకు సంబం ధించి కళ్లు చెదిరే గణాంకాలు కనబడుతున్నా వెలుగుకు నోచని నిరుపేద కుటుం బాల స్థితిగతులు ప్రభుత్వాల పనితీరును వెక్కిరిస్తూనే ఉన్నాయి. విద్యుత్ స్థాపక సామర్ధ్యం, విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. థర్మల్ విద్యుత్, జల విద్యుత్లతోపాటు పవన, సౌర, బయోమాస్ విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు కూడా బాగా పెరిగాయి. వీటన్నిటి పర్యవసానంగా మిగులు విద్యుత్ ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ చిత్రమేమంటే వేలాది గ్రామాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సౌకర్యం ఉన్న పట్టణాల్లో, గ్రామాల్లో సైతం కోట్లాదిమంది ప్రజలు కిరోసిన్ దీపాలతోనే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షలకు మించిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితి ఉంటే తెలంగాణలో వీటి సంఖ్య 11లక్షలు. ‘అందరికీ విద్యుత్’ కార్య క్రమంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలూ చేరాయి గనుక ఎక్కడినుంచి ఎక్క డికైనా విద్యుత్ సరఫరా చేయడానికి వీలుంది. కొరత ఉన్న రాష్ట్రాలు దాన్ని విని యోగించుకుంటున్నాయి కూడా. అయినా విద్యుత్ అందని గ్రామాలూ, ఇళ్లూ ఉండటం ఒక వైచిత్రి. ఈ పరిస్థితిని సరిచేయాలని ఇంతకుముందున్న యూపీఏ ప్రభుత్వం ప్రయ త్నించింది. రాజీవ్‌గాంధీ గ్రామీణ్ విద్యుదీకరణ్ యోజన(ఆర్‌జీజీబీవై) ప్రారం భించింది. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డీడీయూజీజేవై) మొదలుపెట్టింది. తమ పథకానికే ఎన్డీఏ సర్కారు పేరు మార్చిందన్న కాంగ్రెస్ నేతలు అప్పట్లో విమర్శించారు. డీడీయూజీజేవైకి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘సౌభాగ్య’ను అమల్లోకి తెచ్చింది. ఈ మూడు పథకాలకూ మధ్య పెద్ద తేడా ఏం లేదు. మూడింటి ఉద్దేశమూ నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించడమే. తేడా అల్లా వాటికి సంబంధించిన ప్రాతి పదికల్లోనే ఉంది. ఆర్‌జీజీబీవై, డీడీయూజీజేవైలకు దారిద్య్రరేఖకు దిగువునున్న (బీపీఎల్) కుటుంబాల గణాంకాలు తీసుకుంటే... ‘సౌభాగ్య’కు సాంఘికార్ధిక, కుల సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకొచ్చిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానన్నప్పుడు దానికి వ్యతిరేకంగా సాగిన ప్రచారాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అలా ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పట్లో చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌ను ఆర్ధికవేత్త కూడా అయిన ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ గట్టిగా వ్యతిరేకించారు. కానీ దాన్ని జయప్రదంగా అమలు చేయడమే కాదు... తన పాలనాకాలంలో వైఎస్ ఇతరత్రా విద్యుత్ చార్జీలను సైతం పెంచలేదు. ఇప్పుడు ప్రారంభించిన ‘సౌభాగ్య’ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. మధ్య ఆదాయం ఉన్న కుటుంబాలు కనెక్షన్‌కు రూ. 500 చెల్లించాలి. అయితే దాన్ని పది వాయిదాల్లో చెల్లించే సౌకర్యాన్ని కల్పించారు. అయితే ఇలాంటి పథకాలు జయప్రదం కావాలంటే కనెక్షన్ల వరకూ రాయితీలిచ్చి ఊరుకుంటే సరిపోదు. విద్యుత్ చార్జీల వసూలు విషయంలోనూ ఉదారంగా ఉండాలి. ఈ పథకం కింద విద్యుత్ సౌకర్యం పొందినవారి నుంచి నిర్దిష్ట మొత్తం వసూలు చేస్తామన్న హామీ ఉంటే అలాంటివారు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడానికి సిద్ధపడతారు. మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లు కట్టాలంటే ఆ నిరుపేద కుటుంబాలు సిద్ధపడవు. తమకొచ్చే అంతంతమాత్రం ఆదాయంతో ఏ నెల ఎంత బిల్లు వస్తుందో తెలియని విద్యుత్‌ను వినియోగించడం వారికి తలకుమించిన భారమవుతుంది. పైగా మీటర్ల నాణ్యతపైన కూడా వారికి నమ్మకం లేదు. తాము వాడిన కరెంటుకు మించి బిల్లు వస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందన్న భయం వారిని పీడిస్తుంది. నిజానికి గతంలో ప్రవేశపెట్టిన రెండు పథకాలూ ఆశించినంతమేర విజయవంతం కాకపోవడానికి కారణమిదే. ఈ అంశాన్ని పరి గణనలోకి తీసుకోనట్టయితే ‘సౌభాగ్య’ కూడా అదే ఫలితాన్నిస్తుంది. అసలు విద్యుదీకరణ ప్రాతిపదికలే మన దేశంలో సక్రమంగా లేవు. ఒక గ్రామంలో పంచాయతీ కార్యాలయం, ఆరోగ్యకేంద్రం, సామాజిక కేంద్రం, పాఠశాల వగైరా ప్రజోపయోగ సంస్థలకు విద్యుత్ సౌకర్యం ఉండి, కనీసం 10 శాతం ఇళ్లకైనా విద్యుత్ అందుతుంటే ప్రభుత్వం దృష్టిలో ఆ గ్రామ విద్యుదీకరణ పూర్తయినట్టు లెక్క. గ్రామంలోని ఇళ్లన్నిటికీ విద్యుత్ సౌకర్యం లేనప్పుడు ఆ విద్యుదీకరణ వల్ల ప్రయోజనం ఏమిటి? దేశంలో ఒకపక్క ఎంతో కొంత విద్యుత్ మిగులు ఉంటుంటే అసలు ఆ సౌకర్యమే లేని ఊళ్లూ, ఇళ్లూ ఇప్పటికీ ఉండటం నిరాశ కలిగిస్తుంది. పౌరుల వార్షిక సగటు విద్యుత్ వినియోగం (కిలోవాట్ అవర్) ఎంతన్న అంశంపై మూడేళ్లక్రితం ప్రపంచబ్యాంకు విడుదల చేసిన గణాంకాలు దిగ్భ్రమ కలిగిస్తాయి. మనకంటే ఎంతో చిన్నవనుకునే దేశాలూ, అభివృద్ధిలో అంతంతమాత్రంగా ఉన్న దేశాలూ సగటు వినియోగంలో మనకంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. మన దేశంలో వార్షిక తలసరి వినియోగం 806 ఉంటే అల్జీరియాలో అది 1,356, లిథువేనియాలో 3,821. గత పథకాల్లోని లోటుపాట్లను అధ్యయనంచేసి అవి పునరావృతం కాకుండా చూస్తేనే రూ. 16,320 కోట్లు వ్యయం కాగల ‘సౌభాగ్య’ విజయవంతమవుతుంది. సంకల్పం ఒక్కటే సరిపోదు... అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళిక కూడా ముఖ్యం. -
గ్రామీణ ప్రాంతాలకు 3జీ సేవలు
అనంతపురం రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు 3జీ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ శ్రీకారం చుట్టినట్లు సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన టెక్నికల్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. జిల్లాకు నూతనంగా 45 3జీ టవర్లు మంజూరయ్యాయని, జూలై మొదటి వారంలోపు వినియోగదారులకు 3జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు. గోళ్ల, కణేకల్, కొట్నూరు, న్యామద్దల, పేరూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఒక 3జీ టవర్‌తో నాలుగు కిలోమీటర్ల వరకు మెరుగైన నెట్వర్క్ ఉంటుందన్నారు. నూతన నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్: నెక్ట్స్ జనరేషన్ నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హిందూపురం, ధర్మవరం పట్టణ కేంద్రాల్లోని బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్లలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ నెట్వర్క్ రాకతో ల్యాండ్ లైన్‌కు సైతం వీడియో కాల్ మాట్లాడుకునే ఆవకాశం ఉండడంతో పాటు మొబైల్స్ కాల్ వాయిస్ ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. ఎన్జీఎల్ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న 116 ఎక్స్ఛేంజ్లలో అమర్చుతున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. -
లింగ నిష్పత్తిలో గ్రామాలే మెరుగు
న్యూఢిల్లీ: దేశంలో లింగ నిష్పత్తిలో గ్రామీణ ప్రాంతాలు పట్టణాల కన్నా మెరుగైన స్థానంలో ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 991 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 1,009గా ఉండగా పట్టణాల్లో 956గా ఉందని 2015–16 ఏడాదికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4(ఎన్ఎఫ్హెచ్ఎస్–4) పేర్కొంది. జనన సమయంలో లింగనిష్పత్తి దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 914 నుంచి 919కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 899గా నమోదైందని తెలిపింది. హరియాణాలో జనన సమయంలో లింగ నిష్పత్తి 762(2005–06) నుంచి 836కి పెరిగిందని తెలిపింది. కాని అక్కడి గ్రామాల్లో మాత్రం ఇది 785కే పరిమితమైంది. మధ్యప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జనన సమయంలో లింగ నిష్పత్తి 927కి తగ్గింది. పట్టణాల్లో ఇది 899. ఆ రాష్ట్రంలో మొత్తం లింగ నిష్పత్తి 973 కాగా గ్రామాల్లో ఇది 933గా నమోదైంది. రాజస్తాన్ గ్రామాల్లో లింగ నిష్పత్తి 973 కాగా, పట్టణాల్లో 928గా ఉంది. లింగ నిష్పత్తిలో పట్టణాలు, ఇతర ప్రాంతాల మధ్య అంతరం అస్సాంలో స్పష్టంగా కనిపించింది. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మొత్తం లింగ నిష్పత్తి 929గా నమోదైంది. -
గ్రామాల్లో కరెంటు కష్టాలు
– లైన్మెన్ల కొరత – 984 పోస్టులకు గానూ 585 ఖాళీ అనంతపురం అగ్రికల్చర్ : అవసరమైన విద్యుత్ సిబ్బంది లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, గ్రామస్తులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ ఫీజు పోటే వేసేవారు దిక్కులేరు. పెనుగాలులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా విద్యుత్ సరఫరా ఆదిపోయన సందర్భంలో పునరుద్ధరణకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రైతులే ఫీజులు వేసేందుకు యత్నించి మృత్యుపాలైన సంఘటనలు లేకపోలేదు. వేధిస్తోన్న లైన్మెన్ల కొరత సదరన్ వపర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) ‘అనంత’ విద్యుత్ సర్కిల్ పరిధిలో అనంతపురం, హిందూపురం, కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం సబ్ డివిజన్లు ఉన్నాయి. వివిధ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉండడంతో అటు ఆ శాఖ అధికారులు ఇటు వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా లైన్మెన్ల కొరత వేధిస్తోంది. అసిస్టెంట్ లైన్మెన్లు 535 మంది ఉండాల్సి వుండగా 231 మంది పనిచేస్తున్నారు. జూనియర్ లైన్మెన్లు 449 మందికిగాను 168 మంది పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల పరిధిలో 585 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్‌ఇంజనీర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. మొత్తం 917 పోస్టులు ఖాళీ జిల్లా విద్యుత్ శాఖలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఇందులో 2,916 పోస్టులకు గానూ 917 ఖాళీగా ఉన్నాయి. లైన్‌మన్లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్‌ఇంజనీర్లు, సీనియర్, లైన్‌మన్ డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్టినేట్లు విభాగాల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నియామకాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని ఆ శాఖ అధికావర్గాలు చెబుతున్నాయి. విద్యుత్‌శాఖలో ఖాళీలు ఇలా... ––––––––––––––––––––––––––––––––––––––– విభాగం మొత్తం పోస్టులు పనిచేస్తున్నవారు ఖాళీలు ––––––––––––––––––––––––––––––––––––––– ఇంజనీరింగ్ 240 218 22 అకౌంట్స్ 734 563 171 ఓ అండ్ ఎం 1942 1218 724 ––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 2916 1,999 917 ––––––––––––––––––––––––––––––––––––––– -
కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు తేదీ పెంపు
న్యూఢిల్లీ: దేశంలో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబర్ 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ కిందకు వచ్చే వారి ఇంకా డిజిటల్లోకి మారకపోతే వారికి జనవరి 31వరకు గడువిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీకానుంది. -
వైద్యులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు !
- బేడీలు వేసి పనిచేయించాలేమో - శాసనసభలో వైద్యులపై మంత్రి రమేష్ కుమార్ ఆక్రోశం బెంగళూరు: గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా లేని వైద్యులకు బేడీలు వేసి.. పనిచేయాలని నిర్భందించాలేమోనని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి రమేష్‌కుమార్ శాసనసభలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఉమేష్‌కత్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్రంలో 53 వైద్య విద్యా కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు. వైద్య విద్య కళాశాలల నుంచి ప్రతి ఏడాది ఐదు వేల మంది ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేస్తున్నారని, అదేవిధంగా సుమారు 2,500 మంది పీజీ వైద్యను పూర్తి చేస్తున్నారన్నారు. అయితే వీరిలో చాలా మంది రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడటం లేదన్నారు. పేదలు కడుతున్న పన్నులతో తాము చదువుకున్నామన్న జ్ఞానం ఉండటం లేదన్నారు. అందువల్లే పేదలకు సేవ చేయడానికి ముందుకు రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశా వారికి బేడీలు వేసి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని కట్టుదిట్టమైన చట్టాలు చేయాలనేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజణ్ణ కలుగజేసుకుని ’మీరు బాధపడకండి. కఠిన చట్టాలు చేసి వారి చేత పనిచేయించుకుందాం.’ అని పేర్కొన్నారు. దీంతో తేరుకున్న రమేష్‌కుమార్ సాధారణ వైద్యులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గైనకాలజిస్ట్ తదితర నిపుణులైన వైద్యుల కొరత చాలా ఉన్న మాట వాస్తవమేనన్నారు. సమస్య పరిష్కారం కోసం వైద్య విద్యలో పీజీ డిప్లొమో కోర్సును ప్రారంభించనున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి రోజు లేదా గంటల ప్రతిపాదికన కూడా వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రమేష్‌కుమార్ శాసనసభకు తెలిపారు. అదేవిధంగా ప్రతి తాలూకా ఆసుపత్రుల్లో ఒక సైకాలజిస్ట్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఉభయ సభల్లో వివిధ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి... - ప్రస్తుతం వసతి పాఠశాల్లో ఖాళీగా ఉన్న 5,264 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ తెలియజేశారు. - బెంగళూరు నగరంలో 5420 హోర్డింగులు ఉండగా కొన్ని చోట్ల అనధికార అడ్వర్టైజ్మెంట్పోస్టర్లు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇందుకు సంబంధించిన వారి నుంచి రూ.326 కోట్లు అపరాద రుసుం వసూలు కావాల్సి ఉందని బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ తెలిపారు. - బెంగళూరులో అక్రమంగా నివశిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న 48 మంది విదేశీయులను ఇప్పటికే అరెస్టు చేశామని హోంశాఖ మంత్రి పరమేశ్వర్ తెలిపారు. - రాష్ట్రంలో 3.12 కోట్ల రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకూ 3.9 కోట్ల కార్డులకు ఆధార్ సంఖ్యను జతచేర్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టీ ఖాదర్ తెలిపారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే ఆధార్ కార్డు జత చేయని రేషన్ కార్డులను ఇప్పటి వరకూ రద్దు చేయలేదన్నారు. -
మళ్లీ మొదటికి!?
– గ్రామాల్లో నిలిచిన మీ–సేవ కేంద్రాల ప్రక్రియ – రద్దు దిశగా 158 కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్ అనంతపురం అర్బన్ : గ్రామాల్లో కొత్తగా మీ–సేవ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మరోమారు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది. అనుమతి కోసం హైదరాబాద్‌లోని సంస్థ అధికారుల దష్టికి ఇక్కడి అధికారులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. నిబంధనల మేరకు దరఖాస్తులు పూర్తి చేయని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 158 కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 158 గ్రామాలను గుర్తించడంతో పాటు దరఖాస్తు చేసుకోవాలంటూ నోటిఫికేషన్ని మూడు నెలల క్రితం జారీ చేశారు. అయితే 158 గ్రామాలకు 82 గ్రామాల్లో మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. మిగతా 76 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు రాలేదని సమాచారం. 244లో కేవలం రెండింటికే అర్హత మీ–సేవ ఏర్పాటు చేసేందుకు 82 గ్రామాల్లో నుంచి వచ్చిన 244 దరఖాస్తుల్లో కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి పాస్ సర్టిఫికెట్, కంప్యూటర్ కోర్సు చేసినట్లు సర్టిఫికెట్, ఆధార్ కార్డు తప్పని సరిగా జత చేయాలనే నిబంధన ఉందని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను ప్రకారం రెండు దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు. మిగతా 242 దరఖాస్తులు నిబంధనల మేరకు లేకపోవడం పక్కకు పెట్టినట్లు తెలిసింది. మళ్లీ నోటిఫికేషన్ దిశగా... మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మరో దఫా నోటిఫికేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర స్థాయి నుంచి అనుమతి తప్పని సరి అన్నారు. దీంతో విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ మరోమారు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన వెంటనే, 158 కేంద్రాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని వారు తెలిపారు. మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు మారోమారు నోటిఫికేషన్ జారీ చే స్తే గతంలో చేసుకున్న దరఖాస్తులు చెల్లవని అధికారులు తెలిపారు. నవంబరు ఒకటి తరువాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని, అప్పుడు అందరూ కొత్తగా మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. -
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యం
– జీవనోపాధుల మెరుగుకు ప్రత్యేక చర్యలు – డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి చిత్తూరు (కలెక్టరేట్): గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా కషి చేయాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో వెలుగు సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ముందస్తుగా నిధులను వెలుగు ఆధ్వర్యంలో సమకూర్చాలన్నారు. పనులు పూర్తయిన వాటికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి రికవరీ చేసుకోవాలన్నారు. వర్మీకంపోస్టు తయారీ తొట్టెల నిర్మాణాలను కూడా మహిళా రైతుల పొలాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మించిన మరుగుదొడ్లు, వర్మీకంపోస్టులను జియోట్యాగింగ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రతి క్లస్టర్ కో ఆర్డినేటర్ ఈ ఏడాదిలోగా రెండు పంచాయతీలను పూర్తి స్థాయిలో అభివద్ది పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజి ద్వారా పొందిన రుణాలను పూర్తిగా చెల్లించి, మరో రుణంకోసం ఎదురు చూస్తున్న సంఘాలకు వెంటనే రుణాలు అందించాలన్నారు. సంఘాల్లోని మహిళలకు వ్యవసాయేతర జీవనోపాధుల మెరుగుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో స్త్రీనిధి ఏజీయం వెంకటప్రకాష్‌నాయుడు, డీపీయంలు ప్రభావతి, నరసింహారెడ్డి, రవి, సీసీలు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు
‘టెలేఖ’ స్టార్టప్ కంపెనీ బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: నగరాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ కంపెనీలను ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలకొల్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో త్వరలో నెలకొల్పబోయే ‘టెలేఖ నెట్వర్కింగ్ టెక్నాలజీ’ స్టార్టప్ సంస్థ బ్రోచర్‌ను మంగళవారం సచివాలయంలో ఈటల ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంస్థలు నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు వారి నైపుణ్యాన్ని వినియోగించుకునే అవకాశం సంస్థలకు లభిస్తుందన్నారు. సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ‘టెలేఖ’ సీఈవో పొన్నం రోహిత్‌చంద్ర మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే ఉద్దేశంతోనే హుజూరాబాద్‌లో సంస్థను నెలకొల్పుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టెలేఖ ప్రతినిధులు సచిన్, అనూష తదితరులు పాల్గొన్నారు. -
ఖేల్ ఖతమ్!
ప్రోత్సాహం లేని పైకా క్రీడలు కేవలం 11 మండలాల్లోనే అమలు నిధులున్నా ప్రయోజనం శూన్యం అటకెక్కిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం మచిలీపట్నం : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించి వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో అంతంతమాత్రంగానే అమలవుతోంది. ఏటా ఆగస్టులో ప్రారంభమై జనవరితో ముగిసే పైకా క్రీడల పోటీల నిర్వహణ ఆశించిన స్థాయిలో జరగడం లేదని క్రీడాకారులంటున్నారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, పీఈటీల మధ్య సమన్వయం కొరవడడంతో క్రీడాకారులను వెలికితీసే కార్యక్రమం ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది. రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ కార్యక్రమం జిల్లాలోని 11 మండలాల్లోని 129 పంచాయతీల్లో అమలుచేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమం కింద ఒక్కొక్క పంచాయతీకి రూ. 10 వేల నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఆటస్థలం లేదని, పీఈటీలు లేరనే కారణం చూపి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.క్రీడాపరికరాలకు సంబంధించి బ్రాండెడ్ కంపెనీ పరికరాలు పంపిణీ చేసినా అవి పాఠశాలల్లో అటక దిగని పరిస్థితి నెలకొంది. సర్వశిక్షాభియాన్ ద్వారా ఈ పంచాయతీలకు నిధులు విడుదలవుతున్నా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో, ఎలాంటి క్రీడలు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. పది క్రీడాంశాలు.... రాజీవ్‌గాందీ ఖేల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 16 సంవత్సరాల్లోపు క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పాఠశాలలతో పాటు వివిధ క్రీడల్లో నిష్ణాతులుగా ఉన్న వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, ఫుట్‌బాల్ వంటి క్రీడలతో పాటు బాక్సింగ్, ఆర్చరీ, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, ఇతర అథ్లెటిక్స్ విభాగాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. క్రీడలకు సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయాలి. ఒక్కొక్క పంచాయతీ నుంచి 15 మంది లేదా మండలస్థాయిలో 30 నుంచి 50 మంది మెరికల్లాంటి క్రీడాకారులను ప్రోత్సాహించాలి. అయితే ఇది ఎక్కడా అమలుచేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి పైకా పోటీలను నిర్వహించారు. ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల నిర్మాణానికి ప్రతిపాదనలు .... జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 11 మండలాలను ఎంపిక చేశారు. ఒక్కొక్క మండలంలో ఆరు నుంచి ఏడు ఎకరాల భూమి కేటాయిస్తే ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు నిర్మించాల్సి ఉంది. ఇండోర్ స్టేడియానికి రూ. 80 లక్షలు, అవుట్డోర్ స్టేడియంకు రూ. 80 లక్షలతో పాటు మరో 15 లక్షల విలువైన క్రీడా పరికరాలను రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ పథకం ద్వారా కేటాయించే ప్రతిపాదన ఉంది. జిల్లాలోని 11 మండలాల నుంచి ఈ ప్రతిపాదనలను పంపారు. వీటికి అనుమతులు వస్తే ఒక్కొక్క స్టేడియంలో ముగ్గురు పీఈటీలను ప్రత్యేకంగా నియమించి వివిధ విభాగాల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సద్వినియోగం చేసుకోవాలి కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఉద్దేశం బాగానే ఉన్నా ఈ ఫలాలు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా లేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో పీఈటీలు లేరు. ఇలాంటి చోట్ల స్థాని కంగా ఉన్న క్రీడాకారులను విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా నియమించాల్సిన అవసరం ఉందని క్రీడానిపుణులు చెబుతున్నారు. పైకా క్రీడలకు సంబంధించిన అధికారులు, పీఈటీలు సమన్వయంతో పనిచేస్తే గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందించినట్లుగా ఉంటుందని పలువురు క్రీడాకారుల అభిప్రాయంగా ఉంది. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పీఈటీల సహకారం తీసుకుంటున్నట్లు డీఎస్డీవో రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
కేవలం టాయిలెట్స్ మాత్రమే సరిపోవు...
గ్రామీణ భారతం గ్రామీణ భారతావనికి కేవలం అప్పటికప్పుడు ఇచ్చే పరిష్కారాల కంటే నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, ఎదగాలనే కాంక్ష, ఆత్మవిశ్వాసం వంటివే అవసరం. ఊహాలోకం, వాస్తవం ఎన్నో ఏళ్లుగా భారతదేశంలోని పల్లెలను ఆవరించి ఉన్న పేదరికం నుంచి విముక్తి కోసం స్కూళ్లలో భవనాలు నిర్మించడం, మరుగుదొడ్లు కట్టించడం వంటివి సరిపోతాయా? నిజానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ అవసరం. మన నిజమైన అంతర్గత శక్తులను వెలికితీయకుండా తూతూమంత్రంగా కొన్ని పరిష్కారాలు సూచిస్తే సరిపోతుందా? నిజానికి గ్రామీణ భారతం పూర్తిగా బాగుపడాలంటే ఇంతకంటే ఎక్కువ అవసరం. స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 68 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడో అమలు చేసిన నమూనా ప్రయోగాలకంటే భారతీయ పల్లెలకు మరింత ఎక్కువ కావాలి. గత 33 ఏళ్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా , ఆయన భార్య జరీనా తమ స్వీడిష్ ఫౌండేషన్ సహకారంతో మహారాష్ట్రలోని ఎన్నెన్నో పల్లెల్లో తిరుగుతున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం ఏదో నమూనా ఫ్రేమ్‌వర్క్ కంటే, అక్కడి స్థానికంగా తెలివితేటలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. మన దేశ జనాభాలో దాదాపు సగానికంటే ఎక్కువ పల్లెల్లోనే ఉంది. అందుకే ఐదొందల నుంచి వెయ్యి పల్లెలను తీసుకొని, ఏదో అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది అంత ప్రభావవంతంగా ఉండదని ఆ దంపతుల భావన. వారి ఉద్దేశం ప్రకారం: మనం నిజమైన అభివృద్ధినీ, గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన పరిస్థితులను కావాలనుకుంటే మనం నాలుగు అంశాలను కోరుకోవాలి. అవి... నమ్మకం (ట్రస్ట్), సహానుభూతి (ఎంపథీ), యువతలో ఎదగాలనే ఆకాంక్ష (యాస్పిరేషన్), వాళ్లు మరింత బలోపేతం కావడం (ఎంపవర్మెంట్). మనలో ఉన్న అపనమ్మకం అనే అగాధాన్ని దాటేంతగా బలం సమకూర్చుకోవాలి. అయితే యువతలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పడం అనేది రాత్రికి రాత్రి అయ్యే పనికాదు. చిన్న చిన్న అడుగులు... పెద్ద ప్రభావం... పైన పేర్కొన్న నాలుగంశాలూ పాటిస్తే, ఆ తర్వాత మన గ్రామీణ జీవనచిత్రంలో మరింత మెరుగైన మార్పులు వస్తాయి. గ్రామీణుల్లో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. చాలా పల్లెల్లో తాగడానికి అవసరమైన నీళ్ల కోసం... ఏదో రెండు పంపులు వేయడం కంటే... దానికి 20 రెట్లు ఎక్కువగా ఖర్చయినా, శాశ్వత మంచినీటి వసతి కల్పించాలి. మనలను ఎయిత్, నైన్త్, టెన్త్ చదివించడం కంటే టెన్త్ చదివాక ఏం చేస్తామనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్ తర్వాత గ్రాడ్యుయేషన్ వరకూ చదివేవారు తగ్గుతున్నారు. మన చిన్నారులు, యువత కోసం నిన్నటి కంటే మెరుగైన రేపటిని కల్పించాలి. మనకు పుష్కలమైన మానవ వనరులున్నాయి. అయితే మనకు నిజంగా లేనిది నైపుణ్యంలో మెరుగుదల, వృత్తిపరమైన శిక్షణ, ఎదగాలనే తీవ్రమైన కాంక్షను యువతలో కల్పించడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం. మన పల్లెల్లో నిక్షిప్తమై ఉన్న, నిగూఢ నైపుణ్యాలకు పదును పెట్టేలా చేయాలి. మన భారతీయ పల్లెలోని పనిచేసే సేనలను, వర్క్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయాలి. -
'నిర్లక్ష్య టీచర్లను సహించలేను'
సిమ్లా: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనను నిర్లక్ష్యం చేసే ఏ ఉపాధ్యాయుడిని సహించబోమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అన్నారు. సెలవులు మంజూరు కాకుండానే పాఠశాలకు గైర్హాజరయితే వారిని పూర్తిగా డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు విద్యనందించే విషయంలో తాను రాజీపడబోనని, ఎలాంటి అవసరాలున్న అందిస్తాను కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకోనని అన్నారు. ఆదివారం అనూహ్యంగా ఓ గ్రామాన్ని సందర్శించి అక్కడ గుమిగూడిన పెద్దలతో మాట్లాడారు. ఒక్కపాఠశాలలే కాకుండా రెవెన్యూ ఆఫీసుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు గైర్హాజరు ఎట్టి పరిస్థితుల్లో అవకూడదని అన్నారు. ఈ విషయాలపై ప్రధానంగా గ్రామ పెద్దలు, గ్రామాధికారులు పర్యవేక్షణ కలిగి ఉండాలని చెప్పారు. -
ఇదెక్కడి దౌర్భాగ్యం!
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది తమిళనాడు ప్రభుత్వ పాలన. గ్రామీణ ప్రాంతాలకు సరైన బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో పలువురు గ్రామీణ విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. తళి నియోజకవర్గంలోని దాసరపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు ఏడు గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి పాఠశాలల వేళకు బస్సు సౌకర్యం లేదు. దీంతో గంటల తరబడి రోడ్డుపక్కనే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో బడిలో చదువులు వల్లె వేయాల్సిన విద్యార్థులు రోడ్డుపక్కనే బారులుదీరి కూర్చొని పాఠాలు చదువుకోవడం ప్రారంభించారు. పాఠశాల వేళకు ఓ బస్సు ఏర్పాటు చేస్తే ఈ విద్యార్థుల వెతలు తీరుతాయని పలువురు అంటున్నారు. -
సమీకృత అభివృద్ధికి ‘గ్రామజ్యోతి’
-
సమీకృత అభివృద్ధికి ‘గ్రామజ్యోతి’
ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం ⇒ గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేక కార్యక్రమం ⇒ గ్రామ స్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలు, అమలు ⇒ విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ⇒ వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సమీకృత అభివృద్ధి కోసం ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించనుంది. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామజ్యోతి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి రూ.రెండు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు అభివృద్ధి నిధులను అందివ్వాలని సీఎం సంకల్పించారు. పంచాయతీరాజ్ వ్యవస్థనుబలోపేతం చేయడం, గ్రామ పంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం, గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేయడం.. గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత ్వం పేర్కొంటోంది. ఈ కార్యక్రమ విధి విధానాలను రూపొందించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. మంత్రివర్గ ఉపసంఘం వారంలోగా నివేదిక ఇవ్వాలని సీఎం నిర్ధేశించారు. మన ఊరు-మన ప్రణాళికతో భూమిక ప్రభుత్వం గతేడాది నిర్వహించిన మనఊరు-మన ప్రణాళిక గ్రామజ్యోతి కార్యక్రమానికి భూమిక కానుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పలానా గ్రామమే ప్రత్యేకం అనికాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామం అవసరాలను తీర్చడమే ప్రభుత్వ సంకల్పంగా ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక మేరకు గ్రామజ్యోతి కార్యక్రమ విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఈ నెల 30న అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆదర్శం మరుగు
ఇది కౌతాళం ఎంపీపీ లక్ష్మి ఇల్లు. ప్రజాప్రతినిధిగా సమాజంలో అత్యున్నత గౌరవం పొందుతున్న ఈమె ఇంట్లో మరుగుదొడ్డి లేదంటే నమ్మలేని నిజం.వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన నాయకులే ఆరుబయటకు వెళ్తుంటే.. మార్పు ఎలా సాధ్యం. ఆత్మకూరుమండల పరిషత్ అధ్యక్షురాలు సౌజన్య.. కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడు సర్పంచ్ నాగన్న.. కురుకుంద ఎంపీటీసీ సభ్యురాలుశిరీష.. కౌతాళం ఎంపీటీసీ-2 సభ్యురాలు నర్సమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే మరుగుదొడ్డి లేని నేతల జాబితా చాంతాడు. - మరుగుదొడ్డీ లేని ప్రజాప్రతినిధులు - జిల్లాలో 6వేల మంది ఇళ్లలో ఇదే పరిస్థితి - అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం - నీరుగారుతున్న లక్ష్యం కర్నూలు సిటీ: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. కనీసం నాయకుల్లోనూ మార్పు తీసుకురాలేని పరిస్థితి. ఆర్థిక స్థోమత ఉండి కొందరు.. లేక మరికొందరు ఇప్పటికీ బహిర్భూమికి ఆరుబయటకే వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నేతల తీరు నవ్వులపాలు చేస్తోంది. స్వచ్ఛ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నా.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించాలనే లక్ష్యం ఎంచుకున్నా.. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్దకడబూరు మండలంలో 15 మంది సర్పంచ్‌లు ఉండగా 7గురు, 16 మంది ఎంపీటీసీల్లో 5గురు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించుకోవడం చూస్తే ప్రచారం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల మాట సరేసరి. పల్లెల్లో ప్రజాప్రతినిధులు శివారులోని వాగులు, ముళ్లకంపల చాటులో కాలకృత్యాలు తీర్చుకోవడం ఇప్పటికీ సర్వసాధారణమే. పురుషుల మాట అటుంచితే.. మహిళలూ ఆరుబయటకే వెళ్లాల్సిన పరిస్థితి చూస్తే హైటెక్ అభివృద్ధి ఎక్కడనే విషయం ఇట్టే అర్థమవుతోంది. సెల్‌ఫోన్ విషయంలో చూపే శ్రద్ధ మరుగుదొడ్డి నిర్మించుకునే విషయంలో కనపర్చకపోవడం వారిలోని చైతన్యానికి నిదర్శనం. ప్రోత్సాహకం పెంచినా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మల భారత్ అభియాన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం గతంలో రూ.12వేలు చొప్పున మంజూరు చేసింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు దిశగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రోత్సాహకాన్ని రూ.15వేలకు పెంచింది. అయితే ఏడాది కావస్తున్నా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో నిర్మాణాలు లేకపోవడం గమనార్హం. నాయకా.. రాష్ట్ర ప్రభుత్వం మొదట గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులందరి ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు పంచాయతీ అధికారులతో సర్వే చేయించగా.. జిల్లాలోని 6,698 మంది ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్లు గుర్తించారు. ఇందులో ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు 412.. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు 462, వార్డు సభ్యులు 5514 మంది, 310 పంచాయతీ కార్యాలయాల్లో మగురుదొడ్లు లేనట్లు వెల్లడైంది. వీరందరికీ జూన్ లోపు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా ఎంచుకున్నా.. నేటికీ 10 శాతం మించకపోవడం స్వచ్ఛ భారత్‌పై అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. -
ఆటాడుకుందాం.. రా
బాల్ బ్యాడ్మింటన్ వూల్‌తో గుండ్రంగా 23 గ్రాముల బంతితో 12 నుంచి 24 మీటర్ల పొడవైన కోర్టులో ఆడే ఆటే బాల్ బ్యాడ్మింటన్. రాకెట్‌తో ఆడే ఆటలకు భారతదేశం పెట్టింది పేరు. ఇక్కడే పుట్టిన ఈ ఆట దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి ప్రాచుర్యం పొందింది. బాల్ బ్యాడ్మింటన్ బంతిపై పట్టుకు చక్కటి నైపుణ్యం ఎంతో అవసరం. సాయం సమయాల్లో ఓ రాకెట్తోపాటు మెత్తని బంతితో గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎంతో ఉత్సాహంతో ఆడుకుంటారు. ఆటలో ఎటువంటి ప్రమాదం జరగకుండా నిలకడతో ఆడుకునే ఆటగా ప్రసిద్ధం. తొలుత ఈ ఆట ఔట్‌డోర్ క్రీడగానే ఆడినా ఇటీవల కాలంలో ఇండోర్‌లోనూ ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆటగాళ్లకు మంచి పట్టున్న ఆటల్లో ఇది ఒకటి. చక్కటి నైపుణ్యం ప్రదర్శించిన ఆటగాళ్లకు స్టార్ ఆఫ్ ఇండియాతో సత్కరిస్తారు. తొలి జాతీయ చాంపియన్‌షిప్‌ను 1956లో ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించారు. విశాఖపట్నం ఆట ఇలా... జట్టులో ఏడుగురు ఆటగాళ్లున్నా ఆటకు దిగేది ఐదుగురే. 12 ఁ 12 మీటర్ల కోర్టులో ఇద్దరు ఫ్రంట్ పొజిషన్లో ఆడుతుంటే మరో ఇద్దరు బ్యాక్ పొజిషన్లో ఆడతారు. ఒకరు సెంటర్ ఆటగాడు. 29 పాయింట్లు సాధించిన జట్టుదే విజయం. డబుల్స్ ఆటలో జట్టుకు ఇద్దరితోనూ ఆడుతారు. నిబంధనలు రెండు విధాల ఆటకు ఒకేలా ఉంటాయి. నెట్ భూమికి రెండు మీటర్ల ఎత్తుగా ఉంటుంది. ఆడేది ఇలా... బంతిని కోర్టు కుడివైపు ఆటగాడు సర్వీస్‌తో ప్రారంభిస్తాడు. బంతి ప్రత్యర్ధి జట్టులోని కుడివైపు కోర్టులో నెట్‌కు తాకకుండా పడాలి. లేకుంటే ఫౌల్. పాయింట్ వస్తే కుడివైపు నుంచి ఎడమవైపుకు వెళ్ళి సర్వీస్ చేస్తాడు. బంతి ఈసారి ఎడమవైపు కోర్టులోకి వెళ్ళాలి. ఇలా పాయింట్లు వస్తున్నంత సేపు ఆదే ఆటగాడు ఆటను కొనసాగిస్తాడు. రిసీవ్ చేసుకున్న ఆటగాడు ఒక స్ట్రోక్లోనే తిరిగి ప్రత్యర్థి కోర్టులోకి పంపాలి. ఎటువైపు కోర్టులోకి పంపినా పర్వాలేదు. 8, 15, 22పాయింట్ల వద్ద కోర్టు మారాల్సి ఉంటుంది. సర్వీస్ మాత్రం అండర్ హాండ్గానే చేయాలి. నడుముకు పైభాగంలోకి వెళ్లకూడదు. విజయమిలా... మూడు గేమ్‌లుంటాయి. తొలి గేమ్ తర్వాత రెండు నిమిషాల విరామమిస్తే తర్వాత రెండు గేమ్‌లకు ఐదు నిమిషాలు విరామమంటుంది. రెండు వరుస గేమ్‌ల్ని ఓ జట్టు గెలుచుకుంటే మూడో గేమ్ ఆడకుండానే విజయం సొంతమవుతుంది. ప్రతి మ్యాచ్‌ను ఇద్దరు రిఫరీలతోపాటు ఒక అంపైర్ పర్యవేక్షిస్తుంటారు. ఆటలో నైపుణ్యాలు... రాకెట్ పట్టుకునే విధానం గ్రిప్ అయితే సర్వీసుల్లో లో, హై, ఫ్లిక్, స్క్రూ అనే విధంగా ఉంటాయి. రిటర్న్ ఇవ్వడం, బంతిని ఆటలో ఉంచడం, టాప్ స్పిన్ చేయడం, హఠాత్తుగా బంతిని డ్రాప్ చేయడం ఆటలో నైపుణ్యాలే. -
ఇదేనా నిర్వహణ!
బాన్సువాడ : గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి, ప్రజలకు ఫ్లోరైడ్ ర హిత మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కోట్లా ది రూపాయలతో రక్షిత తాగునీటి పథకాలను నిర్మించిం ది. వీటి నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలను కేటాయిస్తోంది. కానీ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మూ డు నెలల క్రితం జరిగిన జడ్పీ సమావేశంలో కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. కాంట్రాక్టర్ల తీరు కారణంగా ప్రజలు రో గాల బారిన పడుతున్నారనేది వాస్తవం. జిల్లావ్యాప్తంగా తాగునీటి నిర్వహణ పనులపై విమర్శలు వస్తున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో మొత్తం 18 ఫ్లోరైడ్ రహిత మంచినీటి సరఫరా పథకాలు ఉన్నాయి. ఒక్క బాన్సువాడ డివిజన్‌లోనే పది పథకాలు ఉండగా, నిజామాబాద్ డివిజన్లో ఎనిమిది ఉన్నాయి. బాన్సువాడ, దామరంచ, కోటగిరి, మందర్న, పైడిమల్, తగిలేపల్లి, బిచ్కుంద, నాగుల్గాం, బొల్లక్‌పల్లి, సోమార్పేట, యంచ, జాన్కంపేట, బాల్కొండ, చిన్నమావనంది, రామడుగు గ్రామాలలో వీటిని నిర్వహిస్తున్నారు. నిర్వహణ కోసం అధికారులు ఏటా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్టర్లుగా అవతారమెత్తుతున్న రాజకీ య పార్టీల నాయకులు సిండికేట్‌గా మారి, ఆ పనులను దక్కించుకొని, అధికారులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇష్టారీతిన మంచినీటి పథకాలను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఆటంకం కలుగుతుండగా, ప్రభుత్వ ఆదాయానికీ లక్షల రూపాయలలో గండి పడుతోంది. కలుషిత నీటిని సేవించి ప్ర జలు రోగాలబారిన పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ బాన్సువాడ డివి జన్ పరిధిలో బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్నీ, మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, గాంధారి, బిచ్కుంద తదితర మండలాలు ఉన్నారుు. ఏటా ఆయా మండలాలలో పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. గత పదేళ్ళుగా ఈ కాంట్రాక్ట్‌ల కోసం రాజకీయ నాయకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. పనులను కాంట్రాక్టర్లందరూ ఏకమై పర్సంటేజీల మాట్లాడుకొని, కార్యాలయంలోనే బేరసారాలు చేసుకొని టెండర్లు దక్కించుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఈసారి టెండర్లను నిర్వహించకుండా నేరుగానే పను లు కేటాయించారనే విమర్శలు వచ్చాయి. పథకాల నిర్వహణ మాత్రం అధ్వానం ప్రభుత్వం అంచనాలకు మించి నిధులు కేటాయిస్తోంది. నిర్వహణ పనులలో 50 శాతం కంటే అధికంగా మిగులుతున్నప్పటికీ, కాంట్రాక్టర్లు వీటిని సక్రమం గా నిర్వ హించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పనులు దక్కించుకొన్న వెం టనే వాటిని కిందిస్థాయి వర్కర్లకు అప్పగించి వారిని శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. పైప్లైన్లు దెబ్బతిన్నా పట్టించుకోకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు అందుతోంది. క్లోరినేషన్ శాతంలో తేడాలతో వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. బాన్సువాడ సబ్‌డివిజన్‌లో ప్రతీ ఏడాది సుమారు వెయ్యి మందికి పైగా అతిసార, డయేరి యా బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నీటి పైపులు పగిలిపోయినా, అందులో మురికినీరు చేరినా కాంట్రాక్టర్లు పట్టించుకోరు. వీటిని పర్యవేక్షించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం పర్సంటేజీలు తీసుకొని, నిర్లక్ష్యంగా వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. బాన్సువాడ పట్టణంలో ఫిల్టర్ బెడ్ నిర్మించి 15 ఏళ్లు గడుస్తోంది. దీని నుంచి ఆయా ప్రాంతాలకు ఏర్పాటు చేసిన పైపులు పగిలిపోవడంతో లీకేజీలు అధికమయ్యాయి. ఇక్కడ నీటిని శుద్ధి చేసే ఇసుకను తొలగించి, కొత్త ఇసుకను నింపాల్సి ఉంది. అయినా ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కలుషిత నీరు తాగడంతోనే ప్రజలు రోగాల భారిన పడుతున్నారని వైద్యులు పదేపదే పేర్కొంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
పల్లెల్లో ప్రైవేటు ఏటీఎంలు
కుల్కచర్ల: బ్యాంకులో ఖాతా ఉన్నా.. అందులో డబ్బులున్నా.. తీసుకోవడానికి ఒకప్పుడు క్యూ కట్టడం.. గంటల తరబడి వేచి చూడడం చేయాల్సి వచ్చేది. ఏటీఎంలు (ఆటోమేటిక్ టెల్లర్ మిషన్) వచ్చాక వినియోగదారుడికి వెసులుబాటు వచ్చింది. వీటితో బ్యాంకుకు వెళ్లకుండానే క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కలిగింది. అనతికాలంలోనే ఏటీఎంలకు ప్రాధాన్యం పెరిగిపోయిం ది. జేబులో ఏటీఎం కార్డుంటే చాలు ఎక్కడికి వెళ్లినా మన అవసరాల నిమిత్తం కావాల్సిన డబ్బులు తీసుకోవచ్చు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ ఏటీఎంలు ప్రస్తుతం మండల కేంద్రాలకు కూడా విస్తరించాయి. ఇప్పటివరకు జాతీయ బ్యాంకులైన ఎస్బీఐ, ఎస్బీహెచ్., ఆంధ్రాబ్యాంకు, పంజాబ్నేషనల్ బ్యాంకు, కెనరా, సిండికేట్, యూనియన్, ఐసీఐసీఐ బ్యాంకులు ఏటీఎం సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు జాతీయ బ్యాంకులే కాదు ప్రైవేటు సంస్థలు కూడా ఏటీఎం సేవలను అం దించడానికి ముందుకు వస్తున్నాయి. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రైవేటు సంస్థలు 33శాతం ఏటీఎంలను చిన్న పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇప్పుడు మండల కేంద్రాలు, చిన్నచిన్న గ్రామాల్లో సైతం ప్రైవేటు సంస్థలు ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. కుల్కచర్ల, గండేడ్, మహ్మదాబాద్, దోమ, పరిగి, పూడూరు, మన్నేగూడ తదితర గ్రామాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఇండీక్యాష్, ఇండియా వన్, మనిస్పాట్ తదితర ప్రైవేటు సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. ఐదుసార్లు ఉచితం.. జాతీయ బ్యాంకుల మాదిరిగానే ప్రైవేటు ఏటీఎంలలో ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా వినియోగించుకుంటే మాత్రం సేవా పన్నుకింద కొంతమొత్తం వసూలు చేస్తారు. ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన ఏటీఎంలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.