![FMCG industry hopeful of rural market bouncing back in coming quarters - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/VARDHAN-AGARWAL.jpg.webp?itok=vFJVLv3o)
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు రానున్న త్రైమాసికాలలో పుంజుకుంటాయని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వీ అగర్వాల్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు దిగొచ్చినట్టు చెప్పారు.
మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల వ్యయాలతో ఉపాధి కల్పన, అభివృద్ధికి మద్దతునిస్తాయని, అంతిమంగా అది ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. గత ఐదు త్రైమాసికాల్లో గ్రామీణంగా ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ మందగమనాన్ని చూస్తోంది. ‘‘మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఇన్‌ఫ్రా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డిమాండ్‌ను పెంచుతుంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు. డీ2సీ బ్రాండ్లపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment