Emami
-
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్
న్యూఢిల్లీ: 2024–25 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్‌గా ఇమామి లిమిటెడ్ ఎండీ హర్షవర్ధన్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.నవంబర్ 21న ఫిక్కీ 97వ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా ఉన్నారు.ఇదీ చదవండి: అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం -
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
గ్రామీణ ఎఫ్ఎంసీజీ వినియోగం పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు రానున్న త్రైమాసికాలలో పుంజుకుంటాయని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వీ అగర్వాల్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు దిగొచ్చినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల వ్యయాలతో ఉపాధి కల్పన, అభివృద్ధికి మద్దతునిస్తాయని, అంతిమంగా అది ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. గత ఐదు త్రైమాసికాల్లో గ్రామీణంగా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ మందగమనాన్ని చూస్తోంది. ‘‘మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఇన్ఫ్రా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డిమాండ్‌ను పెంచుతుంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు. డీ2సీ బ్రాండ్లపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. -
వంట నూనెల ధరలు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత కొన్ని నెలలుగా దేశీయంగా వంట నూనెలు ప్రియం కావడం వినియోగదార్లతోపాటు ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకసార్లు శుద్ధి, ముడి వంట నూనెల దిగుమతి సుంకాలను తగ్గించింది. సరఫరాను పెంచడానికి లైసెన్స్ లేకుండా శుద్ధి చేసిన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు వ్యాపారులను అనుమతించింది. ముడి పామాయిల్, కొన్ని ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలను ప్రారంభించడాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. భారత్‌లో ఏటా 2.25 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో దిగుమతుల వాటా ఏకంగా 65 శాతం దాకా ఉంది. -
ఇమామీ దూకుడు- ప్రెస్టేజ్ హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆస్తుల విక్రయ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన అంచనాలతో రియల్టీ కంపెనీ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇమామీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఇమామీ లిమిటెడ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 40 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 26 శాతం క్షీణించి రూ. 481 కోట్లను తాకింది. కోవిడ్ నేపథ్యంలోనూ ఇబిటా మార్జిన్లు 4.9 శాతం బలపడి 25.5 శాతానికి చేరాయి. ఈ కాలంలో 12 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా రూ. 192 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇమామీ లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 19 శాతం దూసుకెళ్లింది. రూ.306 వద్ద ట్రేడవుతోంది. ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్.. కంపెనీకి చెందిన లీజు ఆదాయ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేరు 5 శాతం( రూ. 10.5) ఎగసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 238ను అధిగమించింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌కు చెందిన అద్దె ఆదాయ ఆస్తులను 170 కోట్ల డాలర్లకు(రూ. 12,745 కోట్లు) బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
హడ్కో హైజంప్- ఇమామీ బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం హౌసింగ్ & అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) లిమిటెడ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోవైపు ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి హడ్కో భారీ లాభాలతో సందడి చేస్తోంటే.. ఇమామీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హడ్కో లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హడ్కో లిమిటెడ్ నికర లాభం 87 శాతం జంప్‌చేసి రూ. 441 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 27 శాతం పెరిగి రూ. 1900 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 33 శాతం అధికమై రూ. 545 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హడ్కో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 5.6 ఎగసి రూ. 33.5 వద్ద ఫ్రీజయ్యింది. ఇమామీ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఇమామీ లిమిటెడ్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 23.3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 19 శాతం నీరసించి రూ. 523 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 70 శాతం పడిపోయి రూ. 25 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలహీనపడి 18.8 శాతానికి జారాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇమామీ షేరు 6 శాతం పతనమై రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 205 దిగువకూ చేరింది. -
హీలియోస్ లైఫ్ స్టైల్లో 30 శాతం వాటా ఇమామికి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామి.. హీలియోస్ లైఫ్ స్టైల్లో 30 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మేల్ గ్రూమింగ్ (పురుష సౌందర్య సంబంధిత ఉత్పత్తులు) బ్రాండ్.. ‘ద మ్యాన్ కంపెనీ’ యాజమాన్య సంస్థ అయిన హీలియోస్ లైఫ్ స్టైల్లో వచ్చే ఏడాది చివరికల్లా 30 శాతం వాటాను కొనుగోలు చేస్తామని ఇమామి తెలిపింది. వాటా కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇమామి వెల్లడించలేదు. ఈ వాటా కొనుగోలుతో వేగంగా వృద్ధి్ద చెందుతున్న ఆన్లైన్ మేల్ గ్రూమింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లవుతుందని ఇమామి డైరెక్టర్ హర్ష వి అగర్వాల్ చెప్పారు. -
27మంది స్టార్స్ ఈ బ్రాండ్ అంబాసిడర్సే..
న్యూఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు, స్పోర్ట్స్ దిగ్గజాలు సౌరబ్ గంగూలీ నుంచి మేరి కోమ్ వరకు ఈ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్లే. కోట్ల కొద్దీ మొత్తాన్ని అడ్వర్టైజింగ్, ప్రమోషన్ల కోసం వెచ్చిస్తూ మార్కెట్లో తన హవా చాటుతోంది ఈ కంపెనీ. ఇంతకీ ఏ కంపెనీ అనుకుంటున్నారా? ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా పేరున్న ఇమామి కంపెనీ. ఓ వైపు మార్కెట్లో పెద్ద నోట్ల రద్దు ఉన్నప్పటికీ ఇమామి మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో రూ.443 కోట్ల మేర ప్రకటనలు, ప్రమోషన్ల కోసం వెచ్చించినట్టు తెలిసింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి 27 మందికి పైగా బాలీవుడ్ నటులు ఇమామి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలకు భిన్నంగా 2016-17లో తన మొత్తం రెవెన్యూలో 17.5 శాతాన్ని తన బ్రాండ్ బిల్డింగ్ కోసమే వెచ్చించింది ఇమామి. ఈ మొత్తంతో ప్రకటనల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. నవరత్న కూల్ టాల్క్, నవరత్న ఆయిల్, కేష్ కింగ్, బోరో ప్లస్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, జండూబామ్ వంటి ఉత్పత్తులు ఇమామికి చెందినవే. పెద్ద నోట్ల రద్దుతో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కస్టమర్ల డిమాండ్ క్షీణించింది. ఉత్పత్తి తగ్గింది. అయినప్పటికీ ఇమామి మాత్రం రూ.443 కోట్ల మేర మొత్తాన్ని ప్రకటనలు, ప్రమోషన్ల కోసం వెచ్చించడం గమనార్హం. గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.430 కోట్లనే ఈ కంపెనీ ఖర్చుచేసింది. ఇమామికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న నటుల్లో అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, మాధురి దీక్షిత్, జువీ చావ్లా, కరీనా కపూర్ ఖాన్, శిల్పాశెట్టి, శృతిహాసన్, పరిణీతి చోప్రా, యామి గౌతమ్, సోనాక్షి సిన్హా, తాప్సి, బిపాసా బసు, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, హుమా కురేషిలున్నారు. అంతేకాక స్పోర్ట్స్ దిగ్గజాలు మిల్కా సింగ్, సౌరబ్ గంగూలీ, ఎంఎస్ ధోని, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, మేరీ కోమ్, సుశిల్ కుమార్, కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్‌లు కూడా ఇమామిని ఎండోర్స్ చేసుకున్నారు. ఈ కంపెనీ కేవలం సంప్రదాయ ఏటీఎల్, బీటీఎల్ వంటి వాటిపైనే కాక, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఎక్కువగా వెచ్చిస్తోంది. ఇంటర్నెట్పై తమ కస్టమర్లను పెంచుకుంటున్నామని కంపెనీ చెప్పింది. అంతేకాక గ్లోబల్ మార్కెట్లో కూడా ప్రకటనలు, ప్రమోషన్లపై కంపెనీ దృష్టిసారించింది. -
ఇమామి చేతికి కేశ్‌కింగ్
డీల్ విలువ రూ.1,651 కోట్లు న్యూఢిల్లీ: హెయిర్, స్కాల్ప్‌కేర్ బ్రాండ్ కేశ్‌కింగ్‌ను రూ.1,651 కోట్లకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఇమామి కొనుగోలు చేసింది. కేశ్‌కింగ్ కొనుగోలుతో ఆయుర్వేద హెయిర్, స్కాల్ప్‌కేర్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఇమామి డెరైక్టర్ హర్ష వి.అగర్వాల్ చెప్పారు. తమ వృద్ధి వ్యూహంలో భాగంగా కేశ్‌కింగ్‌ను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ బ్రాండ్ కొనుగోలుకు అవసరమైన నిధులను తమ వద్ద మిగులుగా ఉన్న నగదు నిల్వలు, స్వల్ప, దీర్ఘకాలిక రుణాల ద్వారా ఒక నెలలోపు సమీకరిస్తామని కంపెనీ సీఈఓ (ఫైనాన్స్, స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్) ఎన్, హెచ్ భన్సాలి చెప్పారు. కొత్త కేటగిరీల్లోకి ప్రవేశించడానికి ఇమామి, దేశీ యంగా, అంతర్జాతీయంగా బ్రాండ్లను కొనుగోలు చేస్తోంది. కేశ్‌కింగ్ బ్రాండ్‌ను 2009లో సంజీవ్ జునేజా మార్కెట్లోకి తెచ్చారు. ఈ బ్రాండ్‌కింద తల నూనె, హెర్బల్ షాంపూ, కండీషనర్, ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్‌ను అందిస్తున్నారు. కేశ్‌కింగ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.