27మంది స్టార్స్‌ ఈ బ్రాండ్‌ అంబాసిడర్సే.. | From Amitabh Bachchan To Shah Rukh Khan, Emami Has 27 Bollywood Actors As Brand Ambassadors | Sakshi
Sakshi News home page

27మంది స్టార్స్‌ ఈ బ్రాండ్‌ అంబాసిడర్సే..

Published Mon, Jul 10 2017 7:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

27మంది స్టార్స్‌ ఈ బ్రాండ్‌ అంబాసిడర్సే.. - Sakshi

27మంది స్టార్స్‌ ఈ బ్రాండ్‌ అంబాసిడర్సే..

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌ నుంచి షారుఖ్‌ ఖాన్‌ వరకు, స్పోర్ట్స్‌ దిగ్గజాలు సౌరబ్‌ గంగూలీ నుంచి మేరి కోమ్‌ వరకు ఈ ప్రొడక్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లే. కోట్ల కొద్దీ మొత్తాన్ని అడ్వర్‌టైజింగ్‌, ప్రమోషన్ల కోసం వెచ్చిస్తూ మార్కెట్లో తన హవా చాటుతోంది ఈ కంపెనీ. ఇంతకీ ఏ కంపెనీ అనుకుంటున్నారా? ఎఫ్‌ఎంసీజీ దిగ్గజంగా పేరున్న ఇమామి కంపెనీ. ఓ వైపు మార్కెట్లో పెద్ద నోట్ల రద్దు ఉన్నప్పటికీ ఇమామి మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో రూ.443 కోట్ల మేర ప్రకటనలు, ప్రమోషన్ల కోసం వెచ్చించినట్టు తెలిసింది. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌ వంటి 27 మందికి పైగా బాలీవుడ్‌ నటులు ఇమామి ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇతర ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు భిన్నంగా 2016-17లో తన మొత్తం రెవెన్యూలో 17.5 శాతాన్ని తన బ్రాండ్‌ బిల్డింగ్‌ కోసమే వెచ్చించింది ఇమామి. ఈ మొత్తంతో ప్రకటనల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. నవరత్న కూల్‌ టాల్క్‌, నవరత్న ఆయిల్‌, కేష్‌ కింగ్‌, బోరో ప్లస్‌, ఫెయిర్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌, జండూబామ్‌ వంటి ఉత్పత్తులు ఇమామికి చెందినవే.

పెద్ద నోట్ల రద్దుతో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కస్టమర్ల డిమాండ్‌ క్షీణించింది. ఉత్పత్తి తగ్గింది. అయినప్పటికీ ఇమామి మాత్రం రూ.443 కోట్ల మేర మొత్తాన్ని ప్రకటనలు, ప్రమోషన్ల కోసం వెచ్చించడం గమనార్హం. గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.430 కోట్లనే ఈ కంపెనీ ఖర్చుచేసింది. ఇమామికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న నటుల్లో అమితాబ్‌ బచ్చన్‌, కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, మాధురి దీక్షిత్‌, జువీ చావ్లా, కరీనా కపూర్‌ ఖాన్‌, శిల్పాశెట్టి, శృతిహాసన్‌, పరిణీతి చోప్రా, యామి గౌతమ్‌, సోనాక్షి సిన్హా, తాప్సి, బిపాసా బసు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సూర్య, హుమా కురేషిలున్నారు. అంతేకాక స్పోర్ట్స్‌ దిగ్గజాలు మిల్కా సింగ్‌, సౌరబ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోని, సానియా మిర్జా, సైనా నెహ్వాల్‌, మేరీ కోమ్‌, సుశిల్‌ కుమార్‌, కథక్‌ డ్యాన్సర్‌ పండిట్‌ బిర్జు మహారాజ్‌లు కూడా ఇమామిని ఎండోర్స్‌ చేసుకున్నారు.

ఈ కంపెనీ కేవలం సంప్రదాయ ఏటీఎల్‌, బీటీఎల్‌ వంటి వాటిపైనే కాక, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైనా ఎక్కువగా వెచ్చిస్తోంది. ఇంటర్నెట్‌పై తమ కస్టమర్లను పెంచుకుంటున్నామని కంపెనీ చెప్పింది. అంతేకాక గ్లోబల్‌ మార్కెట్‌లో కూడా ప్రకటనలు, ప్రమోషన్లపై కంపెనీ దృష్టిసారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement