brand ambassadors
-
బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
మీరంతా భారత అంబాసిడర్లు: ప్రధాని మోదీ
ఇండోర్: ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాలి ‘‘ఎన్నారైఐలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రపంచ వేదికపై భారత్ పాత్ర మీ వల్లే బలోపేతం కానుంది. స్కిల్ క్యాపిటల్‌గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్‌కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్‌గా మారనుంది. భారత్ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం శుభపరిణామం. భారతీయులు ఎన్నో దేశాలకు వలస వెళ్లి శతాబ్దాలుగా స్థిరపడ్డారు. వారి జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టానష్టాలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత వర్సిటీలు చొరవ తీసుకోవాలి. వారి అనుభవాలు, జ్ఞాపకాలను ఆడియో–విజువల్, అక్షరరూపం నమోదు చేయాలి. శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యం జీ20 సారథ్య బాధ్యతను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఇది సరైన వేదిక. ప్రపంచంలో భారత్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. మన మాటకు, సందేశానికి ఎంతో విలువ ఉంది. కరోనా టీకాలను దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాం. మన అభివృద్ధి అసాధారణం, అద్వితీయం ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా మారింది. అత్యధిక స్టార్టప్‌లు ఉన్న మూడో దేశం మనదే. నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. కొన్నేళ్లుగా మనం సాధించిన ఘనతలు అసాధారణం, అద్వితీయం. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం కేవలం భారత్‌లోనే జరుగుతున్నాయి. మనకు అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఉంది. అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపించగల సత్తా మన సొంతం. ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. వారికి అవసరమైన సాయం కచ్చితంగా అందిస్తాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడాలని ఎన్ఆర్ఐలను కోరుతున్నాం. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విన్నవిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఎన్ఐఆర్లకు సూచించారు. సురక్షిత, చట్టబద్ధ వలసల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని విడుదల చేశారు. దర్శన్ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్ అవార్డు విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్కు ప్రదానం చేశారు. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్‌లోనే చదివా: గయానా అధ్యక్షుడు భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ పేర్కొన్నారు. ‘‘నేను భారత్‌లో చదువుకున్నా. భారతీయుల ప్రేమాభిమానాలు నాకు తెలుసు’’ అన్నారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని సురినామ్ అధ్యక్షుడు సంతోఖీ హర్షం వ్యక్తం చేశారు. -
విజయ్‌తో పాటుగా లక్కీ ఛాన్స్ కొట్టేసిన స్టార్ కమెడియన్..!
విలక్షణ బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్, స్టార్ కమెడియన్ వరుణ్ శర్మ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీమైట్రిప్.కామ్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమితులైనారు. ఈజీమైట్రిమ్ బ్రాండ్ అంబాసిడర్లను నియమించడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా విలక్షణ నటుడు విజయ్ రాజ్‌తో కలిసి వరుణ్ శర్మ కూడా మొదటిసారిగా బ్రాండ్ ప్రచారానికి జంటగా కలిసి పనిచేయడం విశేషం. వీరు వారి మాస్ అప్పీల్, బలమైన కనెక్ట్‌తో ఈజీమైట్రిప్. కామ్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచనున్నారు. ఈజీమైట్రిప్ సీఈవో కో-ఫౌండర్ నిశాంత్ పిట్టి మాట్లాడుతూ...కంపెనీకి ప్రచారకర్తలుగా వరుణ్ శర్మ, విజయ్ రాజ్ కలిగి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈజీమైట్రిప్‌తో ప్రయాణికులకు అవాంతరాలు లేని బుకింగ్ అనుభవం, జీరో కన్వీనియన్స్ ఫీజు, వైద్య కారణాల వల్ల పూర్తి వాపసు వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆన్లైన్ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చిందని అభిప్రాయపడ్డారు. వీరి భాగస్వామ్యంతో ఈజీమైట్రిప్ మరింత బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యంపై వరుణ్ శర్మ మాట్లాడతూ...ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో ఒకదానితో భాగస్వామిగా ఉన్నందుకు నేను చాలా గౌరవంగా, సంతోషంగా ఉన్నాను. వారు మేము ప్రయాణించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చారు, అసాధారణమైన బ్రాండ్ కనెక్ట్‌ని సృష్టించడానికి ఈజీమైట్రిప్‌తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. విజయ్ రాజ్ మాట్లాడుతూ... “ఈజ్‌మైట్రిప్ బ్రాండ్ కస్టమర్ సెంట్రిసిటీ , స్థిరమైన పనితీరుకు ప్రసిద్ధి చెందినందుకుగాను శుభాకాంక్షలను తెలియజేశారు. చదవండి: బీమా క్లెయిమ్స్ తిరస్కరణపై తస్మాత్ జాగ్రత్త.. సుప్రీం హెచ్చరిక -
అమృతాంజన్ బ్రాండ్ అంబాసిడర్లుగా చాను, పునియా
ముంబై: టోక్యో ఒలింపిక్ గేమ్స్ విజేతలైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్ హెల్త్‌కేర్ వెల్లడించింది. జాయింట్ మజిల్ స్ప్రే, పెయిన్ ప్యాచ్, బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్ తెలిపారు. టీవీ, డిజిటల్ ప్రకటనలతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో వీరు పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులుగా తమకు ఎదురయ్యే కండరాలు నొప్పులు మొదలైన సమస్యల నుంచి ఉపశమనానికి అమృతాంజన్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడ్డాయని మీరా బాయ్ చాను, బజరంగ్ పునియా తెలిపారు. -
వండర్‌షెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కృతి సనన్
హైదరాబాద్: కిచెన్వేర్ తయారీ సంస్థ వండర్‌షెఫ్ తాజాగా ప్రముఖ నటి కృతి సనన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆరోగ్యం, ఆహారం, సంప్రదాయం, ఆధునికత, కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే కృతి.. తమ బ్రాండ్‌కు సరైన ప్రతినిధిగా ఉండగలరని కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ రవి సక్సేనా తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెంచేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన ప్రకటనలను డిజిటల్ సహా పలు మాధ్యమాల్లో ఇస్తున్నట్లు సక్సేనా తెలిపారు. -
హెల్త్ ఓకే అంబాసిడర్‌గా..బ్రాండ్ 'బాబు'
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఉత్పత్తి చేస్తున్న హెల్త్ ఓకే మల్టీ విటమిన్, మినరల్ ట్యాబ్లెట్లకు సినీ నటులు మహేష్ బాబు, సుదీప్‌ను దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. త్వరలో హెల్త్ ఓకే ట్యాబ్లెట్ల ఉపయోగాలపై మహేష్, సుదీప్‌ల ప్రకటనలు దక్షిణాది ఛానళ్లలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. తద్వారా కస్టమర్లకు మరింత చేరువ అవుతామని మ్యాన్‌కైండ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హెల్త్ ఓకేతో జతకట్టడంపై ఇరువురు నటులు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల ప్రచారంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ సేల్స్ మేనేజర్ జోయ్ ఛటర్జీ తెలిపారు. -
కంపెనీలకు నిరసనల సెగ..
న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్ఆర్సీ అంశం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు .. టెక్ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాలసీబజార్, జోహో, యాక్సెంచర్ వంటి సంస్థలు ఎవరో ఒకరి పక్షం వహించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో వ్యాపార అవకాశాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎదురవుతున్నాయి. దీపిక బ్రాండ్‌పై జేఎన్‌యూ ఎఫెక్ట్.. వివాదాస్పద అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించే తీరు కంపెనీలకే కాకుండా.. స్వయంగా వారికి కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆగంతకుల చేతిలో దెబ్బలు తిన్న జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనకు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కూడా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని బ్రాండ్స్.. ఆమెతో రూపొందించిన పలు ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. వివాదం సద్దుమణిగే దాకా ఓ రెండు వారాల పాటు ఆమె ప్రకటనలు ఆపేయాలంటూ తమ క్లయింట్ నుంచి సూచనలు వచ్చినట్లు ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దేశీయంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో పదుకొణె కూడా ఒకరు. ఒకో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆమె రూ. 8 కోట్లు, సినిమాకు రూ. 10 కోట్ల పైగా తీసుకుంటారని టాక్. ఆమె లోరియల్, తనిష్క్, యాక్సిస్ బ్యాంక్ తదితర 23 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కష్టం.. ఇక, కంపెనీలపరంగా చూస్తే.. ఆన్లైన్లో బీమా పథకాలు మొదలైనవి విక్రయించే పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కారణంగా కష్టం వచ్చిపడింది. ఈ సంస్థ రాజకీయంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నటులైన అక్షయ్ కుమార్, మొహమ్మద్ జీషన్ అయూబ్‌లను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. అయితే, జేఎన్‌యూ, షహీన్ బాగ్ తదితర నిరసన ప్రదర్శనలకు అయూబ్ బాహాటంగా మద్దతు పలకడం పాలసీబజార్‌ను చిక్కుల్లో పడేసింది. అయూబ్ వైఖరిని పాలసీబజార్ సమర్ధిస్తోందా అన్నది బీజేపీ నేతల ప్రశ్న. ఈ వివాదంతో బాయ్కాట్పాలసీబజార్ హ్యాష్‌టాగ్ బాగా ట్రెండింగ్ అయ్యింది. అయితే, దీనిపై కంపెనీ ఎటువంటి వైఖరీ వెల్లడించలేదు. ఆరెస్సెస్ వివాదంలో జోహో, యాక్సెంచర్.. ఫిబ్రవరి 2న జరగబోయే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం.. జోహో, యాక్సెంచర్ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టింది. రెండు సంస్థల చీఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటమే ఇందుకు కారణం. చెన్నైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలన్న తన నిర్ణయాన్ని జోహో సీఈవో శ్రీధర్ వెంబు సమర్ధించుకున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్న నిఖిల్ పహ్వా, ఎ లదఖ్, సచిన్ టాండన్ వంటి çపలువురు యువ వ్యాపారవేత్తలు .. జోహోతో వ్యాపారానికి తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేశారు. ‘మిగతా వారంతా బాయ్‌కాట్ చేయాలని నేనేమీ పిలుపునివ్వడం లేదు. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ కార్యక్రమంలో వెంబు పాలుపంచుకుంటున్నందున.. నేను మాత్రం జోహోతో వ్యాపార లావాదేవీలను ఆపేసే పరిస్థితిలో ఉన్నాను‘ అంటూ టాండన్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు, యాక్సెంచర్ ఇండియా సీఈవో రామ ఎస్ రామచంద్రన్ తీరుపై సొంత సంస్థలోని ఉద్యోగుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యాక్సెంచర్ నైతిక నియమావళి ప్రకారం ప్రొఫెషనల్ హోదాలో ఉద్యోగులెవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కొందరు సిబ్బంది చెబుతున్నారు. తమ ఉద్యోగులు నిర్దిష్ట సిద్ధాంతాల పక్షం వహించడాన్ని యాక్సెంచర్ ఎంతవరకూ సమర్థిస్తుందన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు.. యాక్సెంచర్‌లోని మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయని ట్విట్టర్ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఏకంగా యాక్సెంచర్ గ్లోబల్ సీఈవో జూలీ స్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. వారు పోస్ట్‌లు చేశారు. అయిదేళ్ల క్రితం స్నాప్‌డీల్ ఉదంతం.. కంపెనీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పట్లో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్‌ఖాన్.. దేశంలో నెలకొన్న పరిస్థితులను తనను భయాందోళనలకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించడం స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమిర్‌ఖాన్‌తో పాటు స్నాప్‌డీల్‌ను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దెబ్బతో మళ్లీ ఆమిర్‌ఖాన్‌తో కాంట్రాక్టును స్నాప్‌డీల్ .. రెన్యూ చేసుకోలేదు. ఇటీవలే ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల యాప్ జొమాటోకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. హిందువేతర డెలివరీ బాయ్‌ని పంపించారనే కారణంతో ఓ యూజరు.. ఆర్డరును క్యాన్సిల్ చేశారు. అయితే, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. తమ డెలివరీ బాయ్‌కు మద్దతిచ్చారు. కొన్ని వివాదాలు.. నవంబర్, 2015: భారత్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందంటూ బాలీవుడ్ నటుడు, స్నాప్‌డీల్ బ్రాండ్ అంబాసిడర్ ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనతో స్నాప్‌డీల్ తెగదెంపులు చేసుకోక తప్పలేదు. ఏప్రిల్, 2018: కథువా రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ సాగిన ఉద్యమంలో నటి స్వరభాస్కర్ వివాదాస్పద ట్వీట్స్ చేశారు. దీంతో ఈకామర్స్ సంస్థ అమెజాన్.. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించింది. ఏప్రిల్, 2018: డ్రైవర్ ముస్లిం అనే కారణంతో వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు.. ఓలా ట్యాక్సీ రైడ్‌ను రద్దు చేసుకున్నారు. తాము మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తామంటూ ఓలా సంస్థ .. సదరు డ్రైవరు పక్షాన నిల్చింది. జూలై, 2019: ముస్లిం డెలివరీ బాయ్ వచ్చారనే కారణంతో జొమాటోలో చేసిన ఆర్డరును ఒక యూజరు క్యాన్సిల్ చేశారు. జొమాటో, దాని వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ .. డెలివరీ బాయ్ పక్షాన నిల్చారు. -
లాయిడ్ బ్రాండ్ అంబాసిడర్లుగా దీప్‌వీర్ జంట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియాకు కన్య్సూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ అయిన లాయిడ్ ప్రచార కర్తలుగా రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనేలు వ్యవహరించనున్నారు. దీప్‌వీర్ జంట తమ ఉత్పత్తులైన ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారని లాయిడ్ సీఈఓ శశి అరోరా ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ స్థానంలో వీరు నియమితులైనట్లు తెలిపారు. -
రాజస్తాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా షేన్ వార్న్
ముంబై: వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్న మెంట్లో పాల్గొనే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వార్న్ సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2011 వరకు రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత సీజన్లో రాయల్స్ జట్టుకు వార్న్ మెంటార్‌గా ఉన్నాడు. మరోవైపు ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు బ్లూ జెర్సీలతో ఆడిన రాయల్స్ జట్టు ఈ సీజన్లో పింక్ జెర్సీలు ధరించనుంది. -
స్వచ్ఛ సర్వేక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్లు!
రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకు కోసం బ్రాండ్ అంబాసిడర్లను నియమించారు. స్వచ్ఛతపై విస్తృత ప్రచారం కల్పించి మెరుగైన ర్యాంకు సాధించాలని పట్టుతో ముందుకెళ్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ సర్వేక్షన్–2018’ పేరుతో సర్వే నిర్వహిస్తోంది. 4,000 మార్కులు ఉండే ఈ సర్వే వచ్చే ఏడాది జనవరి 4 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలను పరిశుభ్రతలో భాగస్వామ్యం చేయడం కోసం స్వచ్ఛ సర్వేక్షన్ అంబాసిడర్లుగా బసంత్‌నగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, నటులు సాగర్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, యాంకర్, రేడియోజాకీ కత్తికార్తిక, కూచిపూడి డ్యాన్సర్ గుమ్మడి ఉజ్వలను నియమించారు. వీరితోపాటు ఎన్టీపీసీ సంస్థ ఈడీ డీకే దూబే, సింగరేణి సంస్థ డెప్యూటీ సూపరింటెండెంట్ యార్లగడ్డ పోలీస్, అడ్డగుంటపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజనర్సు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ ప్రశాంతి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. ‘మోదీ’ మెప్పుపొందిన నరహరి.. బసంత్‌నగర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, ప్రస్తుతం మధ్యప్రదేశ్ క్యాడర్లో పనిచేస్తున్నారు. ఇండోర్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన దేశంలో జరిగినస్మార్ట్ సిటీ పోటీల్లో ఇండోర్‌కు మొదటి ర్యాంకు తీసుకువచ్చారు. ప్రధానమంత్రి మోదీ నుంచి నరహరి ప్రత్యేక ప్రశంసలు పొందారు. సేవలకు అబ్బురపడిన మధ్యప్రదేశ్ సర్కారు, నరహరిని రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది. సామాజిక సేవకుడు విక్రమ్‌జిత్ దుగ్గల్.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్‌జిత్ దుగ్గల్ సామాజిక సేవలో తనదైన ముద్ర వేసుకున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురి మన్ననలు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల మారుమూల గిరిజన పల్లెలకు బయటి ప్రపంచాన్ని పరిచయం చేసిన ఐపీఎస్ ఆఫీసర్‌గా వారి హృదయాలు దోచుకున్నారు. గ్రామానికి రోడ్డు వేయించిన విక్రమ్‌జిత్ వారికి భాగ్యనగర్ అందాలు చూపించారు. కమిషనర్‌కు పుష్పగుచ్చం అందజేత.. మధ్యప్రదేశ్ రెవెన్యూ కార్యదర్శి పరికిపండ్ల నరహరిని రామగుండం బల్దియా స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంపట్ల, ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత మోహన్‌రెడ్డి, బల్క రామస్వామి, పరికిపండ్ల రాము, ఐత శివకుమార్, చెర్ల దీక్షిత్, ఐత దేవేందర్ తదితరులు గురువారం రాత్రి మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. రామగుండంను నూటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఆలయ ఫౌండేషన్ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. -
వ్యాపారవేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు!
ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్ - ఈఓడీబీపై వ్యాపారవేత్తలకు అవగాహన సదస్సు - 350 ఈఓడీబీ సంస్కరణలను అమల్లోకి తెచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అక్కడ కేంద్ర పరిశ్రమల శాఖ అధికారులను, ఆ శాఖ మంత్రిని కలుస్తుంటాను. ఇటీవల కొత్తగా బాధ్యత లు స్వీకరించిన మంత్రి సురేశ్ ప్రభును మర్యాదపూ ర్వకంగా కలిశాను. ‘దేశంలోనే అత్యంత ప్రగతి శీల రాష్ట్రానికి చెందిన మంత్రి ఇతను’ అని ఆయన నన్ను అక్కడున్న వారికి పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి ఈ రోజు దేశంలో ఉన్న గుర్తింపు అది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యంత ప్రగతి శీల, క్రీయా శీల ప్రభుత్వం’’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సరళీకృత వ్యాపారం (ఈఓడీబీ)పై శనివారం పారిశ్రామికవేత్త లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసి డర్లని కొనియాడారు. వ్యాపారవేత్తలు తమ అనుభ వాలను ఇతరులకు చెబుతుంటారని, వారి వల్ల రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న పరిస్థితి గురించి ఇతర పారిశ్రామికవేత్తలకు అవగాహన కలుగుతుం దన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు బాగుందా, అవినీతి ఉందా, వ్యాపారం చేయాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా యి, తదితర అంశాలపై ఇక్కడి పారిశ్రామికవేత్తలు చెప్పే సమాధానాలకే విశ్వసనీ యత అధికంగా ఉంటుందన్నారు. పరిశ్రమల మనుగడకు సహకరించాలి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను సరిగ్గా చూసుకుంటేనే కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు మార్గం ఏర్పడుతుందనికేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్ర మల సమస్యలను పరిష్కరించి వాటి మనుగడకు సహకరించాలని, కొత్త పరిశ్రమల రాకకు ఇది దోహదపడుతుందని సీఎం కేసీఆర్ తమకు చెబుతుం టారని, దాన్నే అమలు చేస్తున్నామన్నారు. సరళీకృత వ్యాపార విధానానికి సంబంధించి 373 సంస్కర ణల్లో ఇప్పటికే 350 సంస్కరణలను అమలు చేశా మని, మిగిలిన సంస్కరణలను అమల్లోకి తెస్తా మన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని ఇటీవల అసోచాం నివేదించిం దని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు లోటు పాట్లను సరిదిద్దుకోవడం ప్రగతిశీల ప్రభుత్వం చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. 13వ ర్యాంకు నుంచి ప్రథమ స్థానానికి.. ‘రెండేళ్ల నుంచి కేంద్రం రాష్ట్రాలకు ఈఓడీబీ ర్యాంకులు ఇస్తోంది. తొలి ఏడాది 13వ ర్యాంకు వచ్చినప్పుడు మేమంతా బాధపడ్డాం. ఇలా ఎందుకు జరిగిందని ఆత్మ విమర్శ చేసుకుంటే రెండు లోపాలు బయటపడ్డాయి. పారిశ్రామిక విధానం బాగా వచ్చినా, ఇంకా పూర్తిగా అమలు కాలేదని తేలింది. ఈఓడీబీ ర్యాంకులను మూల్యాంకనం చేసిన వారు ఇతర రాష్ట్రాలు చెప్పిన విషయాలను గుడ్డిగా పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని అనిపించింది. రెండో ఏడాది మాత్రం పట్టుదలతో 13వ ర్యాంకు నుంచి తొలి ర్యాంకుకు ఎగబాకడం సంతోషకరం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎడాపెడా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నోటీసులిచ్చి వేలం వేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరామని తెలిపారు. -
27మంది స్టార్స్ ఈ బ్రాండ్ అంబాసిడర్సే..
న్యూఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు, స్పోర్ట్స్ దిగ్గజాలు సౌరబ్ గంగూలీ నుంచి మేరి కోమ్ వరకు ఈ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్లే. కోట్ల కొద్దీ మొత్తాన్ని అడ్వర్టైజింగ్, ప్రమోషన్ల కోసం వెచ్చిస్తూ మార్కెట్లో తన హవా చాటుతోంది ఈ కంపెనీ. ఇంతకీ ఏ కంపెనీ అనుకుంటున్నారా? ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా పేరున్న ఇమామి కంపెనీ. ఓ వైపు మార్కెట్లో పెద్ద నోట్ల రద్దు ఉన్నప్పటికీ ఇమామి మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో రూ.443 కోట్ల మేర ప్రకటనలు, ప్రమోషన్ల కోసం వెచ్చించినట్టు తెలిసింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి 27 మందికి పైగా బాలీవుడ్ నటులు ఇమామి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీలకు భిన్నంగా 2016-17లో తన మొత్తం రెవెన్యూలో 17.5 శాతాన్ని తన బ్రాండ్ బిల్డింగ్ కోసమే వెచ్చించింది ఇమామి. ఈ మొత్తంతో ప్రకటనల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్న కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. నవరత్న కూల్ టాల్క్, నవరత్న ఆయిల్, కేష్ కింగ్, బోరో ప్లస్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, జండూబామ్ వంటి ఉత్పత్తులు ఇమామికి చెందినవే. పెద్ద నోట్ల రద్దుతో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కస్టమర్ల డిమాండ్ క్షీణించింది. ఉత్పత్తి తగ్గింది. అయినప్పటికీ ఇమామి మాత్రం రూ.443 కోట్ల మేర మొత్తాన్ని ప్రకటనలు, ప్రమోషన్ల కోసం వెచ్చించడం గమనార్హం. గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.430 కోట్లనే ఈ కంపెనీ ఖర్చుచేసింది. ఇమామికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న నటుల్లో అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, మాధురి దీక్షిత్, జువీ చావ్లా, కరీనా కపూర్ ఖాన్, శిల్పాశెట్టి, శృతిహాసన్, పరిణీతి చోప్రా, యామి గౌతమ్, సోనాక్షి సిన్హా, తాప్సి, బిపాసా బసు, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, హుమా కురేషిలున్నారు. అంతేకాక స్పోర్ట్స్ దిగ్గజాలు మిల్కా సింగ్, సౌరబ్ గంగూలీ, ఎంఎస్ ధోని, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, మేరీ కోమ్, సుశిల్ కుమార్, కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్‌లు కూడా ఇమామిని ఎండోర్స్ చేసుకున్నారు. ఈ కంపెనీ కేవలం సంప్రదాయ ఏటీఎల్, బీటీఎల్ వంటి వాటిపైనే కాక, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఎక్కువగా వెచ్చిస్తోంది. ఇంటర్నెట్పై తమ కస్టమర్లను పెంచుకుంటున్నామని కంపెనీ చెప్పింది. అంతేకాక గ్లోబల్ మార్కెట్లో కూడా ప్రకటనలు, ప్రమోషన్లపై కంపెనీ దృష్టిసారించింది. -
బ్రాండ్ అంబాసిడర్లు జర జాగ్రత్త!
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ వివాదానంతరం ఉత్పత్తుల ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిర్వర్తించే ప్రముఖ ఎండాసర్లకు మరింత బాధ్యత పెరిగింది. తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించాలని ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే పార్లమెంట్‌కు ఈ నివేదికను అందించనుంది. ప్రైవేట్ కంపెనీలకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాంట్రాక్టుపై సంతకం చేసేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది. వినియోగదారుల రక్షణ బిల్లు కింద ఈ ప్రతిపాదనలను పార్లమెంటరీ కమిటీ సిద్ధంచేసింది. ఎప్పడినుంచైతే తప్పుడు ఉత్పత్తులకు ప్రచారం నిర్వర్తిస్తున్నారో, అప్పటినుంచి ఉత్తత్పిదారుడితో పాటు వారికి బాధ్యత ఉంటుందని, జరిమానా కచ్చితంగా చెల్లించాల్సిదేనని కమిటీ తెలిపింది. ఉత్పత్తుల అమ్మకాల బట్టి కూడా తప్పుడు ప్రకటనలకు జరిమానా విధిస్తామని పార్లమెంటరీ కమిటీ హెడ్, టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. చాలామంది సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారని చెప్పారు. తప్పుడు ప్రకటనలకు ఎండాసర్లుగా ఉన్నట్టు మొదటిసారి తేలితే రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని, అదే రెండో సారి కూడా తప్పుడు ప్రకటనలు చేస్తే రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా కమిటీ ప్రతిపాదించింది. ఉత్పత్తుల అమ్మకాల బట్టి కూడా జరిమానా పెంచేవిధంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. జాతీయ అవార్డు గ్రహీతలకు, సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ బట్టి, వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నా వినియోగదారులు గుడ్డిగా నమ్మేస్తున్నారని కమిటీ పేర్కొంది. కల్తి ఆహార పదార్థాలను మంచివిగా తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం కఠినమైన తప్పవని కమిటీ హెచ్చరించింది. ఆ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల లైసెన్సులు సస్పెన్షన్ ఉంటాయని కమిటీ ప్రతిపాదించింది. -
ఇక ఆమిర్ స్థానంలో బిగ్ బీ, ప్రియాంక!
న్యూఢిల్లీ: నెలరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు కొత్త బ్రాండ్ అంబాసిడర్లను కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసింది. ఇక 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. వీరిద్దరినీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్టు తెలుస్తున్నది. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా ఈ ప్రచారానికి ముఖచిత్రంలా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ సేవలందించారు. అయితే ఇటీవల మత అసహనంపై ఆమిర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి. దీంతో 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన కాంట్రాక్ట్‌ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక భారత పర్యాటక రంగానికి ప్రచార సారథులుగా అమితాబ్, ప్రియాంక ప్రాచుర్యం కల్పించనున్నారు. -
స్వచ్ఛభారత్ అంబాసిడర్లతో రాష్ట్రపతి సమావేశం
-
మీరే బ్రాండ్ అంబాసిడర్లు..
టెన్నిస్ కోర్టులో రాకెట్‌తో అదరగొట్టే సానియా మీర్జా.. రెయిన్బో హోం చిన్నారులతో సందడి చేశారు. ‘మేక్ ఎ డిఫరెన్స్’ 8వ వార్షికోత్సవం సందర్భంగా ముషీరాబాద్‌లోని అమన్ రెయిన్బో హోంలో ఆదివారం పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. వారు అందించి బతుకమ్మను ఎత్తుకుని పిల్లల్లో ఒకరయ్యారు. అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. దేశానికి మీలాంటి పిల్లలే బ్రాండ్ అంబాసిడర్లని చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా అన్నధార బ్రోచర్‌ను రెయిన్బో హోం సీఈవో అనూరాధలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను సానియా ఆసక్తిగా తిలకించారు. -
డాబర్‌కు ప్రియాంక, సోనాక్షి ప్రచారం
డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ప్రచారకర్తల జాబితాలో ఇప్పుడో కొత్త తార చేరింది. ఇప్పటికే ఈ హెయిర్ ఆయిల్‌కు ప్రియాంకా చోప్రా ప్రచారం చేస్తుండగా.. ఆమెతో పాటు సోనాక్షి సిన్హాను కూడా కో-బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ డాబర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్లో ఒకే సమయంలో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఒకే ఉత్పత్తికి ప్రచారం చేయడం ఇదే మొట్టమొదటిసారి. అందులోనూ డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ విషయంలో ఇలా జరగడం అయితే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అవుతుంది. ఈనాటి మహిళల అవసరాలు తీర్చడానికి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఒక ఫేస్ లిఫ్ట్ తయారుచేసిందని, దాంతో తమ బ్రాండు మరింత యూత్‌ఫుల్‌గా తయారవుతుందని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆమర్కెటింగ్ హెడ్ ప్రవీణ్ జైపూరియర్ తెలిపారు. ఈ కొత్త గుర్తింపుతో తమ బ్రాండు ఈరోజు జీవనశైలికి అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు తారలతో కూడిన ప్రచార వీడియో త్వరలోనే విడుదల అవుతుందన్నారు. -
'రాయల్ స్టాగ్' అంబాసిడర్లుగా రణవీర్, అర్జున్!
న్యూఢిల్లీ: రాయల్ స్టాగ్ ఉత్పత్తులకు బాలీవుడ్ హీరోలు రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. రణ్ వీర్, అర్జున్ సింగ్ లిద్దరూ ఇటీవల విడుదలైన గూండే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. రాయల్ స్టాగ్ కంపెనీ ఫిలాసఫీ తెగనచ్చిందని ఇద్దరు హీరోలు ఓ ప్రకటన చేశారు. 'ఇది మీ జీవితం. బ్రహ్మండంగా ఆనందించండి. నేను సాధించాలని అనుకుంటే 100 శాతం ఇవ్వడానికి సిద్దంగా ఉంటాను అని అర్ధవచ్చే సందేశం తమకు నచ్చిందని రణ్ వీర్, అర్జున్ లు తెలిపారు. -
ఆటో డ్రైవర్లే దేశానికి బ్రాండ్ అంబాసిడర్లు
అవగాహన కల్పించిన డాక్టర్ వైఎస్సార్ నిథమ్ విద్యార్థులు రాయదుర్గం: విదేశీ పర్యాటకులను ఆక ర్షించడంలో ఆటో డ్రైవర్లు ముఖ్య భూమిక పోషించాలని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వీక్‌లో భాగంగా ఆదివారం విద్యార్థులు, అధ్యాపకులు ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట, గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ కూడలి, ఎల్అండ్టీ టవర్స్ ప్రాంతం, మాదాపూర్, శిల్పారామం, ట్రిపుల్ ఐటీ కూడలి ప్రాంతాల్లో నడిచే ఆటోలకు ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ ఆటో’ పేరిట ఏర్పాటు చేసిన స్టిక్కర్లను అతికించారు. ఆటో డ్రైవర్లే మనదేశ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని, విదేశీయులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సందడి చేసిన విదేశీ విద్యార్థులు... డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో విదేశీ విద్యార్థులు సందడి చేశారు. నిథమ్‌లోని స్ల్కప్చర్ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాల ప్రాధాన్యతను, పచ్చదనంతో కూడిన వాతావరణం, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నగరంలో ఉంటున్న నైజీరియా, దక్షిణాఫ్రికా, జాంబియా, భూటాన్, నమీబియా, మొజాంబిక్ వంటి దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ అండ్ మ్యూజియం మాజీ డెరైక్టర్ డాక్టర్ కేదారేశ్వరి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రవికుమార్ నండూరి, ప్రముఖ ఆర్కిటెక్చర్ మధు, డాక్టర్ వైఎస్సార్ నిథమ్ ప్రొఫెసర్ పి.నారాయణరెడ్డి వివిధ అంశాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ నిథమ్ కార్యక్రమ కోఆర్డినేటర్లు మిషెల్లి జే ప్రాన్సిస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
పంచామృతం: వాళ్ల పేరే ఒక బ్రాండ్..!
అనేక రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ వాటి మార్కెట్ రేంజ్‌ను పెంచుతూ, కోట్ల రూపాయల పారితోషకం తీసుకొంటున్న సెలబ్రిటీల సంగతి తెలిసిందే. తమకున్న ఫేమ్‌ను ఉపయోగించి రకరకాల బ్రాండ్ల విలువను పెంచడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీల స్థాయి మరింత ఎక్కువ! ఎంత అంటే వాళ్ల పేరే ఒక బ్రాండ్. ప్రత్యేకంగా ఏదో ఒక బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్చేయాల్సిన పని కాకుండా, సొంత పేర్లతోనే బ్రాండ్లను నెలకొల్పి మార్కెటింగ్ చేస్తున్న వాళ్లు కొంతమంది ఉన్నారు. సాదాసీదా సెలబ్రిటీలకు సాధ్యం అయ్యే పని కాదిది. కొందరికే సాధ్యం. వారెవరంటే... షరపోవా... ఈ రష్యన్ బ్యూటీ తన పేరును కొంచెం మార్చి క్యాండీల బ్రాండ్‌ను నెలకొల్పింది. ‘షుగర్‌పోవా’ పేరుతో క్యాండీలను ప్రమోట్ చేస్తోంది. ఆ మధ్య ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వరకూ తన పేరును ‘షుగర్ పోవా’ అని మార్చుకొంటానని నిర్వాహకులను రిక్వెస్ట్ కూడా చేసుకొంది షరపోవా. అయితే వాళ్లు అనుమతించలేదు. అయినప్పటికీ ఇప్పుడు ‘షుగర్‌పోవా’ స్వీట్స్ కు యూరప్‌లో మంచి గుర్తింపు ఉంది. తమ అభిమాన టెన్నిస్ తార పేరు మీద తయారైన వీటిని అక్కడి వాళ్లు తెగ చప్పరించేస్తున్నారు. వీరేందర్ సెహ్వాగ్... సచిన్ ఎమ్ఆర్ఎఫ్ తో ఫేమస్, గంగూలీ బ్యాట్ మీద బ్రిటానియా స్టిక్కర్ అందరికీ గుర్తే... మరి అలాంటి స్టార్ ఆటగాళ్లందరి కన్నా వీరేందర్ సెహ్వాగ్ ఒక విధంగా గ్రేట్. ఎందుకంటే వీరేందర్ సెహ్వాగ్ పేరు మీదే ఒక బ్యాట్ ఉంది కాబట్టి. భారత్ తరపున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తొలిసారి త్రిబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ వీరూ. పాకిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అతడూ 309 పరుగులు చేశాడు. ఆ స్ఫూర్తితో ‘ఎస్ఎస్’ బ్యాట్ల కంపెనీ ‘వీ 309’ పేరుతో బ్యాట్లు తయారు చేసింది. వీ ఫర్ వీరేందర్ అంటూ వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. సెహ్వాగ్ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆ బ్యాట్లనే వాడుతుంటాడు. బెక్‌హమ్... ఆటకన్నా స్టైల్స్‌తోనే ఎక్కువ గుర్తింపు ఉంది ఈ సాకర్స్టార్కు. ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా మార్కెట్లో మోస్ట్ హాట్ సెలబ్రిటీగా పేరు పొందిన బెక్‌హమ్ పేరుతోనూ బ్రాండ్ఉంది. ఫుట్‌బాల్‌కు బాగా క్రేజ్ ఉన్న దేశాల్లో డేవిడ్ బెక్‌హమ్ స్టైల్స్ పేరిట డిజైనర్ వేర్లు అందుబాటులో ఉంటాయి. శిల్పాషెట్టి... ఎస్ 2 పేరుతో శిల్పాషెట్టి సుగంధాలు వెదజల్లుతోంది. బిగ్ బ్రదర్ ఎపిసోడ్ తర్వాత శిల్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అదే ఊపులో శిల్పాషెట్టి పేరు మీద సెంట్లు విడుదల అయ్యాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో శిల్ప సెంట్ల సువాసనల ఘాటు తక్కువే కానీ... వ్యక్తిగతంగా తన పేరు మీద బ్రాండ్‌ను కలిగి ఉన్న అరుదైన సెలబ్రిటీగా శిల్పకు గుర్తింపు దక్కింది. జస్టిన్ బీబర్ జే-బీబ్ పేరుతో ఒక జెంట్స్ ఫెర్ఫ్యూమ్ ఉంది. కెనడియన్ పాప్‌గాయకుడు జస్టిన్ బీబర్ పేరు మీద ఈ బ్రాండ్మార్కెటింగ్ అవుతోంది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో వచ్చిన కీర్తి, డబ్బుకు అదనంగా సంపాదించడానికి బీబర్ ఈ బ్రాండ్‌ను మొదలు పెట్టాడు. బీబర్ పాటకు అడిక్ట్ అయిన వాళ్లు ఈ బ్రాండ్ ఫెర్ప్యూమ్కు కూడా అడిక్ట్ అవుతున్నారు. -
లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ
హైదరాబాద్: సినీతారల సబ్బుగా ప్రసిద్ధి చెందిన లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రముఖ సినిమా నటీనటులు, సమంత రుత్ ప్రభు, సిద్ధార్థ సూర్యనారాయణ్ వ్యవహరించనున్నారు. వీరిద్దరిపై బ్యాంకాక్‌లో చిత్రీకరించిన కొత్త టీవీ కమర్షియల్‌ను వచ్చే నెల 1 నుంచి ప్రసారం చేస్తామని లక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీవీసీని ప్రముఖ స్విట్జర్లాండ్ దర్శకుడు ఐవో వెజ్గార్డ్ దర్శకత్వంలో రూపొందిం చామని పేర్కొంది. ఘర్షణ చిత్రంలోని నిన్నే నిన్నే పాటను ఈ టీవీసీలో రిమిక్స్ చేశామని తెలిపింది. లక్స్ స్టార్ కావాలని తాను ఎప్పుడూ కలలు కంటూ ఉండేదాన్నని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. లక్స్ పేరు వినగానే సౌందర్యం, విలాసం, విశ్వాసం మదిలో మెదులుతాయని వివరించారు. లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.