Ease Mytrip: Signs Vijay Raaz And Varun Sharma As Its Brand Ambassadors- Sakshi
Sakshi News home page

EaseMyTrip: విజయ్‌తో పాటుగా లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన స్టార్‌ కమెడియన్‌..!

Published Wed, Dec 29 2021 5:42 PM | Last Updated on Wed, Dec 29 2021 5:53 PM

Easemytrip Signs Vijay Raaz And Varun Sharma As Its Brand Ambassadors - Sakshi

విలక్షణ బాలీవుడ్‌ నటుడు విజయ్‌ రాజ్‌, స్టార్‌ కమెడియన్‌ వరుణ్‌ శర్మ లక్కీ ఛాన్స్‌ కొట్టేశారు. ఇండియన్‌ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ ఈజీమైట్రిప్‌.కామ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా నియమితులైనారు.  ఈజీమైట్రిమ్‌ బ్రాండ్ అంబాసిడర్లను నియమించడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా విలక్షణ నటుడు విజయ్ రాజ్‌తో కలిసి వరుణ్ శర్మ కూడా మొదటిసారిగా బ్రాండ్ ప్రచారానికి జంటగా కలిసి పనిచేయడం విశేషం. వీరు వారి మాస్‌ అప్పీల్‌, బలమైన కనెక్ట్‌తో ఈజీమైట్రిప్‌. కామ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచనున్నారు. 

ఈజీమైట్రిప్‌ సీఈవో కో-ఫౌండర్ నిశాంత్ పిట్టి మాట్లాడుతూ...కంపెనీకి ప్రచారకర్తలుగా  వరుణ్ శర్మ, విజయ్ రాజ్‌ కలిగి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈజీమైట్రిప్‌తో ప్రయాణికులకు అవాంతరాలు లేని బుకింగ్ అనుభవం, జీరో కన్వీనియన్స్ ఫీజు, వైద్య కారణాల వల్ల పూర్తి వాపసు వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆన్‌లైన్ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చిందని అభిప్రాయపడ్డారు. వీరి భాగస్వామ్యంతో ఈజీమైట్రిప్‌ మరింత బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.



ఈ భాగస్వామ్యంపై  వరుణ్ శర్మ మాట్లాడతూ...ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకదానితో భాగస్వామిగా ఉన్నందుకు నేను చాలా గౌరవంగా, సంతోషంగా ఉన్నాను. వారు మేము ప్రయాణించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చారు,  అసాధారణమైన బ్రాండ్ కనెక్ట్‌ని సృష్టించడానికి ఈజీమైట్రిప్‌తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.  విజయ్ రాజ్ మాట్లాడుతూ... “ఈజ్‌మైట్రిప్ బ్రాండ్ కస్టమర్ సెంట్రిసిటీ , స్థిరమైన పనితీరుకు ప్రసిద్ధి చెందినందుకుగాను  శుభాకాంక్షలను తెలియజేశారు.

చదవండి: బీమా క్లెయిమ్స్‌ తిరస్కరణపై తస్మాత్‌ జాగ్రత్త.. సుప్రీం హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement