ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్‌ఏ నీల్‌సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.
ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్‌మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్‌మెంట్) వెనక్కినెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment