
హైదరాబాద్: రిలయన్స్ రిటైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అజియో మంగళవారం అథ్లెయిజర్ బ్రాండ్ ‘‘ఎక్సెలరేట్’’ను ఆవిష్కరించింది. భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బ్రాండ్ ప్రచారకర్తగా నియమితులయ్యారు.
క్రీడలు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు అవసరమయ్యే స్పోర్ట్ షూస్, అథ్లెటిక్, లైఫ్‌స్టైల్ పాదరక్షలు, ట్రాక్ ప్యాంట్, టీ-షర్టులతో పాటు ఇతర ఉపకరణాలు ఇందులో లభిస్తాయి. ఈ సరికొత్త ఉత్పత్తులు అజియో బిజినెస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. రూ.699 ప్రారంభ ధరతో గొప్ప ఆఫర్లు పొందవచ్చు.
ఎక్స్‌లరేట్ ప్రచారకర్తగా నియమితులు కావడంపై హార్ధిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. ‘డోంట్ బ్రేక్, ఎక్సెలరేట్’ అనే ట్యాగ్‌లైన్‌తో పాండ్యా ప్రచారం కల్పిస్తూ బ్రాండ్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తారని రిలయన్స్ రిటైల్ సీఈవో అఖిలేష్ ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment