AJIO.com
-
ఫ్యాషన్ స్టార్టప్స్‌లో అజియో పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 డైరెక్ట్ టు కస్టమర్ ఫ్యాషన్ స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టాలని లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీ అజియో భావిస్తోంది. ఈ స్టార్టప్స్ తయారు చేసే, విక్రయించే దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్ వంటి ఉత్పత్తులను డైరెక్ట్ టు కంన్జ్యూమర్ వేదిక అయిన అజియోగ్రామ్లో అందుబాటులో ఉంచనుంది. భారతీయ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగంలోని 200 బ్రాండ్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అజియోగ్రామ్లో వచ్చే ఏడాదికల్లా చేర్చనున్నట్టు వెల్లడించింది. ఈ బ్రాండ్స్ విస్తరణకు, ఆదాయ వృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు అజియో ప్రకటించింది. -
అజియో ‘బిగ్బోల్డ్’ సేల్.. భారీ డిస్కౌంట్లతోపాటు బహుమతులు!
ముంబై: అజియో ‘బిగ్ బోల్డ్ సేల్’ (Ajio Big Bold Sale) పేరుతో ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 1 నుంచి మొదలు కానుంది. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, హోమ్, డెకార్, బ్యూటీ, జ్యువెలరీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై మంచి డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఉత్పత్తులపై 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. బిగ్బోల్డ్ సేల్‌లో అధిక కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు ఐఫోన్ 14ప్రో, యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్, రూ.లక్ష విలువైన బంగారం, శామ్సంగ్ ఎస్23ను ఇస్తున్నట్టు పేర్కొంది. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు రూ.3 లక్షల విలువైన బంగారం గెలుచుకోవచ్చని ప్రకటించింది. -
రిలయన్స్ స్పెషల్ ప్రొడక్ట్స్, బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ ఆల్‌రౌండర్
హైదరాబాద్: రిలయన్స్ రిటైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అజియో మంగళవారం అథ్లెయిజర్ బ్రాండ్ ‘‘ఎక్సెలరేట్’’ను ఆవిష్కరించింది. భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బ్రాండ్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. క్రీడలు, ఫిట్నెస్ ఔత్సాహికులకు అవసరమయ్యే స్పోర్ట్ షూస్, అథ్లెటిక్, లైఫ్‌స్టైల్ పాదరక్షలు, ట్రాక్ ప్యాంట్, టీ-షర్టులతో పాటు ఇతర ఉపకరణాలు ఇందులో లభిస్తాయి. ఈ సరికొత్త ఉత్పత్తులు అజియో బిజినెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. రూ.699 ప్రారంభ ధరతో గొప్ప ఆఫర్లు పొందవచ్చు. ఎక్స్‌లరేట్ ప్రచారకర్తగా నియమితులు కావడంపై హార్ధిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. ‘డోంట్ బ్రేక్, ఎక్సెలరేట్’ అనే ట్యాగ్‌లైన్‌తో పాండ్యా ప్రచారం కల్పిస్తూ బ్రాండ్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తారని రిలయన్స్ రిటైల్ సీఈవో అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. -
అజియో ‘ఆల్‌స్టార్స్ సేల్’ ఆఫర్..ఇంకా చాలా సర్ప్రైజెస్!
బెంగళూరు: ఆన్లైన్ ఈ-ఫ్యాషన్ రీటైలర్ ఆజియో ఫెస్టివ్ సీజన్లో ‘ఆల్‌స్టార్స్ సేల్’ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్స్‌కు చెందిన 10 లక్షలకు పైగా భిన్న వస్త్రాలపై 50శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు తొలిసారి యాప్ సైన్ అప్ ద్వారా రూ.500 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. చదవండి : iphone14: గుడ్ న్యూస్.. భారీ ఆఫర్ ఎక్కడంటే? Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ -
అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
ట్రెండ్స్, సరికొత్త స్టైల్స్‌కు ఖ్యాతిగాంచిన భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటెయిలర్ అజియో జూలై 1, 2021 నుంచి జూలై 5, 2021 వరకు ఫ్యాషన్ శ్రేణి అమ్మకం బిగ్ బోల్డ్ సేల్ నిర్వహిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ అజియో బిగ్ బోల్డ్ సేల్ ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ, బోల్డెస్ట్ సేల్. 2500పైగా బ్రాండ్లకు చెందిన 6,00,000 స్టైల్స్‌పై 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దేశంలోని ప్రతీ కస్టమర్ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు చూడని ధరలు, ప్రతీ గంటకు స్పెషల్ డీల్స్, రివార్డులు, పాయింట్లను అజియో బిగ్ బోల్డ్ సేల్ అందిస్తోంది. ప్రపంచ ఖ్యాతిగాంచిన బ్రాండ్లు నైకీ, ప్యూమా, అడిడాస్, లివైస్, యూనైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్కు చెందిన స్టైల్స్ అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఈ మెగా ఈవెంట్ ద్వారా ఫ్యాషన్ ప్రపంచపు సుందరి సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్స్ గురు రణధావ, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, మౌనీ రాయ్ అమ్మకాలను ఉత్తేజితం చేస్తారు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందించేలా పాపులర్ శ్రేణులైన టీ-షర్ట్స్, జీన్స్, కుర్తాలు, స్నీకర్స్పై 50 నుంచి 90 శాతం వరకు ఆఫ్ సహ అన్ని స్టైల్స్‌పై తగ్గింపు ధరలను చూడవచ్చు. ధరల తగ్గింపు మాత్రమే కాదు ఈ సేల్ సందర్భంగా అనేక ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను అజియో ప్రారంభిస్తోంది. దేశంలోని ఫ్యాషన్ ప్రియులకు సరైన వేదికగా నిలుస్తున్న అజియో, స్త్రీలు, పురుషుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్స్ అందిస్తోంది. చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
అజియో ఆన్లైన్ మెగా ట్రేడ్ షో
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్ కు చెందిన ఫ్యాషన్ వేర్ ఆన్లైన్ వేదిక అజియో 'సంబంధం- 2020' పేరుతో ఆన్లైన్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్ షో ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణాలు చేసే రిస్క్‌ను తగ్గించేందుకు రిటైలర్లకు ఈ వేదికను అజియో అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాపారులు తమకు కావాల్సిన దుస్తుల్నికొనుగోలు చేసేందుకు 'సంబంధం డిజిటల్ ఫెస్టివల్ 2020' వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ మెగా ట్రేడ్ షో సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఈ ట్రేడ్ షోలో రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు కావాల్సిన దుస్తులను కొనుగోలు చేయవచ్చు. దుస్తులతో పాటు ఆఫీసులు, ఇళ్లకు కావాల్సిన లగ్జరీ, సేఫ్టీ ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఈవెంట్లో దేశానికి చెందిన 70,000కు పైగా రిటైలర్లు పాల్గొంటారని అంచనా. అజియో 'సంబంధం- 2020' ఆన్లైన్ ట్రేడ్ షోలో 1,300 పైగా బ్రాండ్లకు చెందిన లక్షలాది స్టైల్స్ అందుబాటులో ఉన్నాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టీవ్ కలెక్షన్ రూపొందించారు. చదవండి : అజియో బిగ్ సేల్ -
అజియో బిగ్ బోల్డ్ సేల్ షురూ
ముంబై : ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటైలర్ అజియో.కాం ఈనెల 11 నుంచి 15 వరకూ ‘బిగ్ బోల్డ్ సేల్’ ను ప్రకటించింది. స్టైల్, కమ్ఫర్ట్ను కోరుకునే కస్టమర్లందరికీ బోల్డ్ స్టైల్స్‌ను భారీ డిస్కౌంట్లతో బిగ్ బోల్డ్ సేల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2000కు పైగా బ్రాండ్స్ నుంచి 2,00,000 స్టైల్స్ ఇంతకుముందెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లతో సేల్‌లో సిద్ధంగా ఉన్నాయని అజియో.కాం వెల్లడించింది. నైక్, ప్యూమా, అదిదాస్, లెవీస్ వంటి దిగ్గజ బ్రాండ్లు అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇక 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్లతో పాటు టీ షర్ట్స్, జీన్స్, కుర్తాలపై ఆకర్షణీయ ఫ్లాష్ డీల్స్ ఉంటాయని వెల్లడించింది. సేల్‌లో భాగంగా పలు అంతర్జాతీయ బ్రాండ్లను లాంఛ్ చేస్తామని పేర్కొంది. 2016లో డౌట్ ఈజ్ ఔట్ అంటూ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది. చదవండి : లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ‘రకుల్’ -
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ‘రకుల్’
సాక్షి, ముంబై : ప్రముఖ ఆన్లైన్ ఫాషన్ ఇ-రిటైలర్ అజియో.కామ్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన ఫ్యాషన్ దుస్తులతో సందడి చేసింది. ముంబైలోని జియో గార్డెన్స్‌లో బుధవారం జరిగిన లాక్మే ఫ్యాషన్ 20వ ఎడిషన్‌లో ’లాంగ్ లివ్ బోల్డ్’ పేరుతో యువతీ యువకులకోసం ట్రెండీ,క్లాసీ దుస్తులను ప్రదర్శించింది. గ్లామర్, స్టయిల్,ఫ్యాషన్ ల కాంబినేషన్‌తో తీసుకొచ్చిన తమ సరికొత్త వస్త్రాలు రాబోయే వేసవి సీజన్లో వినియోగదారులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయని కంపెనీ తెలిపింది. 2016లో డౌట్ ఈజ్ ఔట్ అంటూ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తనదైన శైలి దుస్తులతో మరోసారి అదరగొట్టింది. ప్రముఖ స్టైలిస్ట్ మోహిత్ రాజ్ రూపొందించిన దుస్తులను ప్రదర్శించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అజియో రూపొందించిన స్టైలిష్ దుస్తుల్లో ర్యాంప్ మీద మెరిసారు. 2000 గ్లోబల్ సూపర్ బ్రాండ్లు, 2లక్షల 70వేల స్టైల్స్, విలక్షణమైన ప్రింట్లు, రంగులతో లాంగ్ లివ్ బోల్డ్ కలెక్షన్స్ ఆకట్టుకుంటాయనీ అజియో .కామ్ బిజినెస్ హెడ్ వినీత్ నాయర్ దీమా వ్యక్తం చేశారు.భారత దేశంలో ప్రధానంగా ఉన్న యంగ్ జనరేషన్ కోసం కంఫర్టబుల్, బోల్డ్ దుస్తులను తీసుకొచ్చామన్నారు. యువతుల కోసం జంప్ సూట్స్, క్యాజువల్ సూట్స్, క్రాప్‌టాప్స్ , డెనిమ్ జాకెట్స్, ఫ్లోరల్ ప్రింట్స్ మోడల్స్‌లో ఆకర్షణీయమైన దుస్తులను మోడళ్లు ప్రదర్శించారు. అలాగే యువకులకోసం తీసుకొచ్చిన ఫన్నీ బ్యాగ్‌లు జోడించిన ఓవర్సైజ్డ్ జాకెట్స్, జాగర్స్, క్లాసీ మిలటరీ ప్రింట్స్ హైలైట్‌గా నిలిచాయి.