ఫ్యాషన్‌ స్టార్టప్స్‌లో అజియో పెట్టుబడులు | AJIO Launches AJIOGRAM To Empower D2C Fashion Startups | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ స్టార్టప్స్‌లో అజియో పెట్టుబడులు

Published Fri, Nov 3 2023 6:26 AM | Last Updated on Fri, Nov 3 2023 6:26 AM

AJIO Launches AJIOGRAM To Empower D2C Fashion Startups - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 డైరెక్ట్‌ టు కస్టమర్‌ ఫ్యాషన్‌ స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టాలని లైఫ్‌స్టైల్, ఫ్యాషన్‌ ఈ–కామర్స్‌ కంపెనీ అజియో భావిస్తోంది. ఈ స్టార్టప్స్‌ తయారు చేసే, విక్రయించే దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్‌ వంటి ఉత్పత్తులను డైరెక్ట్‌ టు కంన్జ్యూమర్‌ వేదిక అయిన అజియోగ్రామ్‌లో అందుబాటులో ఉంచనుంది.

భారతీయ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ విభాగంలోని 200 బ్రాండ్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అజియోగ్రామ్‌లో వచ్చే ఏడాదికల్లా చేర్చనున్నట్టు వెల్లడించింది. ఈ బ్రాండ్స్‌ విస్తరణకు, ఆదాయ వృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు అజియో ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement