consumer
-
ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?
మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యాలు అధికమవుతున్నాయి. దానికితోడు ఇటీవల కేంద్ర బడ్జెట్ 2025-26లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుడి చేతిలో మరింత ఆదాయం ఉంచేందుకు ఆదాయ పన్ను శ్లాబులను సవరించడం, రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వినియోగదారులకు సంతోషం కలిగించే అంశమే అయినా ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.పెరుగుతున్న కొనుగోళ్లు..గత దశాబ్దంలో చాలా కుటుంబాల డిస్పోజబుల్ ఆదాయం(ఖర్చులుపోను మిగిలే మొత్తం) గణనీయంగా పెరిగింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, నిరంతరం విస్తరిస్తున్న వస్తువులు, సేవలతో వినియోగదారులు తమ జీవితాలను మెరుగుపరిచుకునేలా కొనుగోళ్లు చేస్తున్నారు. మునుపటి కంటే ఈ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రుణ సౌకర్యాలు, ఆన్లైన్ మార్కెట్ వాటా హెచ్చవుతుంది. సామాన్యుడి ఖర్చులు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.ఖర్చు పెంచేలా..కొనుగోలుదారుల ఖర్చు చేసే శక్తిని పెంచడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, తనఖా అవకాశాలు వినియోగదారులకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడానికి తోడ్పడుతున్నాయి. ఒకింత వారి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి మార్గాలను అందిస్తున్నాయి. తిరిగి చెల్లించే మార్గాల సంగతి అటుంచితే సులభంగా డబ్బు సమకూరడంతో ఆఫర్లపై ఆకర్షణ, వ్యయం పెరగడానికి, రిటైల్ రంగం అభివృద్ధికి దారితీసింది.పొదుపు చేసేలా..ఆర్థిక సంస్థలు, వ్యక్తులు అప్పు ఇస్తున్నారు కదా అని పూర్తిగా వీటికి బానిసైతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సులభమైన రుణ సౌలభ్యం వల్ల శక్తికి మించి ఖర్చు చేయాలనే ప్రలోభాలు కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, కేంద్ర ప్రకటిస్తున్న పన్నుల మినహాయింపుతో సమకూరుతున్న డబ్బును వృథా ఖర్చులకు కాకుండా, పెట్టుబడికి, పొదుపునకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వినియోగదారులు డబ్బు విషయంలో తర్కంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధాన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. -
ప్రమాణాలు నెలకొల్పడంలో సత్తా చాటాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలిగే సత్తా తమలోనూ ఉందని గుర్తించి, ముందుకెళ్లాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. విభిన్న ఆవిష్కరణలతో సంస్థలు మెరుగైన ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి టాప్ అయిదు దేశాల జాబితాలో యూరప్ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఆ లిస్టులో భారత్ లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణమైనవి కాకపోయినప్పటికీ మిగతా దేశాలు నెలకొల్పిన ప్రమాణాలను మనం పాటించాల్సిన అవసరం వస్తోందని నిధి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ విషయంలో భారత్‌లో గణనీయంగా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడంలో వెనకబడినట్లు చెప్పారు. అయితే, ఆ అంశంలో ముందుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదీ చదవండి: ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను అనుసంధానం చేయడం సహా నాణ్యతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు టెస్టింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం మొదలైన వాటిపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. -
295 ఫిర్యాదుల్లో 266 పరిష్కారం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)కు 2022–23లో 295 ఫిర్యాదులు అందగా.. వాటిలో 266 అదే ఏడాదిలో పరిష్కారమయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వెల్లడించింది. మండలి కార్యకలాపాలకు సంబంధించి 2022–23 ఆరి్థక సంవత్సరం నివేదికను ఏపీఈఆర్సీ సోమవారం విడుదల చేసింది. ఆ ఏడాదిలో సీజీఆర్‌ఎఫ్‌తో ఏపీఈపీడీసీఎల్‌లో 75 సార్లు, ఏపీఎస్పీడీసీఎల్లో 51 సార్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 13 సార్లు సమావేశమైనట్లు తెలిపింది. ఏపీఈపీడీసీఎల్‌కు రూ.33,500 జరిమానా కూడా విధించినట్లు పేర్కొంది. విద్యుత్ అంబుడ్స్‌మెన్‌కు వచి్చన 29 ఫిర్యాదుల్లో 28 పరిష్కరించినట్లు వివరించింది. స్టాండర్డ్స్ ఆఫ్ ఫెర్ఫార్మెన్స్ (ఎస్వోపీ)లో డిస్కంలు విఫలమైన కేసుల్లో జరిమానా విధించినట్లు తెలిపింది. ఆ ఏడాది 48 కేసులను విచారించి ఆదేశాలు వెలువరించినట్లు తెలిపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అమోదించినట్లు వెల్లడించింది. మండలి ఖర్చులు, ఆదాయాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
ఏ పెట్రోల్ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు
న్యూఢిల్లీ: వాహనం కలిగిన ప్రతీఒక్కరూ తమ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు తప్పనిసరిగా వెళుతుంటారు. అయితే ఇలా వెళ్లేవారిలో చాలా మందికి అక్కడ లభించే ఉచిత సర్వీసులు గురించి ఏమాత్రం తెలియదు. వినియోగదారుల వాహన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను ఆయా పెట్రోల్ బంక్‌లు అందిస్తాయి. అవేమిటో వాహనదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. బంక్‌లు అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరి.. ఆ ఉచిత సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.1. ఉచితంగా గాలిని కొట్టించుకోవచ్చుఏదైనా వాహనానికి గల టైర్లలో తగిన రీతిలో గాలి ఉండటం చాలా ముఖ్యం. పెట్రోల్ బంక్‌ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలికొట్టించుకోవచ్చు. బంక్లోగల ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా వాహనాల టైర్లలో గాలిని నింపుతారు. ఇందుకోసం బంక్‌లో ఒక ఉద్యోగిని నియమిస్తారు.2.ఫైర్ సేఫ్టీ డివైజ్ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే, అదే బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం వినియోగించుకున్నందుకు బంక్‌లో ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు.3. అత్యవసర కాల్ సౌకర్యంఅత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లోని టెలిఫోన్ నుంచి ఉచితంగా కాల్ చేయవచ్చు. అయితే వాహనదారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ జోరో అయినప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.4. ప్రథమ చికిత్స బాక్సువాహనదారులు ఏదైనా గాయం అయినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని మందులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ బాక్సులోని మందులు గడువు ముగియనివి అయి ఉండాలని గుర్తుంచుకోండి. పెట్రోల్ పంప్ యజమానులు ప్రథమ చికిత్స బాక్సులలోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి.5. మంచినీటి సౌకర్యంపెట్రోల్ పంపులో మంచినీటి సౌకర్యం కూడా ఉచితం. చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులు చల్లని, పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు.6. ఉచిత వాష్రూమ్వాహనదారులుతమ ప్రయాణంలో వాష్‌రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్‌లోని వాష్‌రూమ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ వాష్‌రూమ్‌లను సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంక్‌లోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.చాలా మంది వాహనదారులకు బంక్‌లలో అందించే ఈ సేవల గురించి తెలియదు. ఫలితంగా వారు ఇబ్బందులకు ఎదుర్కొంటుంటారు. పెట్రోల్ బంక్ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సేవలను ఉచితంగా అందించడం తప్పనిసరి. పెట్రోల్ బంక్‌లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోయినా, లేదా ఇందుకోసం ఛార్జీలు విధించినా వినియోగదారులు ఆ పెట్రోలియం కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి, దానిలో ఫిర్యాదు చేయవచ్చు.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
Deloitte: విలువను కోరుతున్న కస్టమర్లు
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని, తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల విషయంలో విలువకు ప్రాధాన్యమిస్తున్నారని డెలాయిట్ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్ వ్యాపారాలన్నింటా ఇదే ధోరణి కనిపిస్తున్నట్టు వివరించింది. ఖాళీ సమయాల్లో కార్యకలాపాలపై వినియోగదారులు తమ వ్యయాలను పెంచొచ్చని, దీంతో 2024–25లో ఏవియేషన్, హోటల్ పరిశ్రమలు మంచి పనితీరు నమోదు చేసే అవకాశాలున్నట్టు డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి క్షీణించొచ్చని అంచనా వేసింది. కరోనా అనంతరం కస్టమర్లు పెద్ద మొత్తంలో విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో 2024–25 సంవత్సరానికి అధిక బేస్ ఏర్పడినట్టు డెలాయిట్ ‘ఫ్యూచర్ ఆఫ్ రిటైల్’ నివేదిక వెల్లడించింది. ‘‘కొన్ని విభాగాల్లో ఆరంభస్థాయి ఉత్పత్తులతో పోల్చి చూస్తే ప్రీమియం ఉత్పత్తుల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. ఎల్రక్టానిక్స్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో ఇది కనిపిస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల పరంగా తమ కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకున్న కంపెనీలు దీన్నుంచి వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోగలవు’’ అని పేర్కొంది. చాలా విభాగాల్లో కస్టమర్లు పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి చోదకంగా నిలవగలదని తెలిపింది. ఈ ధోరణి నుంచి ప్రయోజనం పొందాలంటే కంపెనీలు తమను విశ్వసించే కస్టమర్లను కాపాడుకోవాలని, పనితీరు, విలువ పరంగా మెరుగైన ఉత్పత్తులతో వారికి చేరువ కావాలని సూచించింది. కస్టమర్లు, ఉత్పత్తులు, ఛానల్, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిటైలర్లు 8–20 శాతం ఇంక్రిమెంటల్ వృద్ధిని సాధించొచ్చని అభిప్రాయపడింది. -
ల్యాబ్ తయారీ మాంసం తింటారా?
‘మీరు ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం తింటారా?’ కన్జూమర్ ఇన్సైట్స్ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ఇటీవల వివిధ దేశాల ప్రజల్ని అడిగిన వెరైటీ ప్రశ్న ఇది. మామూలు మాంసాన్ని లొట్టలేసుకొని ఆరగించే నాన్‌వెజ్ ప్రియులకు ఈ ప్రశ్న పెద్దగా రుచించనట్లుంది!! అందుకే చాలా తక్కువ మంది నుంచే సానుకూల స్పందన వచ్చింది. కానీ ఇందులోనూ భారతీయులే కొంత పాజిటివ్‌గా స్పందించడం విశేషం. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు... అంటే అత్యధికంగా 20 శాతం మంది ల్యాబ్ మాంసం తినేందుకు సై అనగా ఫ్రాన్స్‌లో మాత్రం అతితక్కువగా కేవలం 9 శాతం మందే దీన్ని ట్రై చేస్తామన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ల్యాబ్ తయారీ మాంసం విక్రయాలకు అనుమతిచ్చిన రెండు దేశాల్లో ఒకటైన అమెరికాలోనూ (మరో దేశం సింగపూర్) దీన్ని తినడంపై పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 16 శాతం మంది అమెరికన్లే ఇందుకు రెడీ అన్నారు. ఈ సర్వేలో ఒక్కో దేశం నుంచి 2 వేల నుంచి 10 వేల మంది మధ్య నెటిజన్లు పాల్గొన్నారు. ఎలా తయారు చేస్తారు? కల్టివేటెడ్ లేదా కల్చర్డ్ మీట్‌గా పేర్కొనే ఈ మాంసం తయారీ కోసం ముందుగా జంతువుల నుంచి కొన్ని స్టెమ్ సెల్స్ (మూల కణాలు)ను బయాప్సీ ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత వాటికి ‘పోషక స్నానం’ చేయిస్తారు. అంటే కణ విభజన జరిగి అవి కొంత మేర రెట్టింపయ్యేందుకు వీలుగా పోషకాలతో కూడిన ద్రవంలో ముంచుతారు. అనంతరం అవి కణజాలం (టిష్యూ)గా వృద్ధి చెందేందుకు బయోరియాక్టర్‌లోకి చేరుస్తారు. జంతు ప్రేమికుల కోసం లేదా జంతు వధ ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ల్యాబ్ తయారీ మాంసం సూత్రప్రాయంగా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. -
కారణాలు చూపకుండా పరిధి విభజన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మూడు జిల్లా వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022 నాటి సర్క్యులర్‌ను పక్కన పెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చన్న న్యాయస్థానం.. ఆ నిర్ణయం మాత్రం పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరిధి మార్పు ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన వివరణ ఉండాలని పేర్కొంది. జిల్లా కమిషన్ల న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో రాసిన లేఖను సవాల్‌చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పి. శ్యామ్ కోసీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్చు చెప్పింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్–1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్–1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. కేసుల విభజనలో వివక్ష చూపుతున్నారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చని, న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలు చూపకుండా... దానిపై వివరణ లేకుండా విభజన చేయడం సరికాదని స్పష్టం చేసింది. -
మూడు రోజులకు ఒక టాటా స్టార్‌బక్స్
ముంబై: టాటా కన్జ్యూమర్, స్టార్‌బక్స్ జాయింట్ వెంచర్ కంపెనీ టాటా స్టార్‌బక్స్ (కాఫీ ఔట్లెట్స్) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2028 నాటికి దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని స్టోర్లను 1,000కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాగస్వాములకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించడం, కొత్త స్టోర్ల ప్రారంభంతో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్ కస్టమర్లు భారత కాఫీ రుచులను ఆస్వాదించేలా ప్రోత్సహించడం తమ విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. ఇరు సంస్థలు 2012లో చెరో సగం వాటాతో కూడిన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 పట్టణాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తూ, 4,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2028 నాటికి వెయ్యి స్టోర్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తామని, ఎయిర్పోర్టుల్లోనూ స్టోర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగుల సంఖ్యను 8,600కు పెంచుకుంటామని ప్రకటించింది. మహిళలకు శిక్షణ ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ) పరిశ్రమలో కెరీర్ కోరుకునే మహిళలకు వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నట్టు టాటా స్టార్‌బక్స్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో స్టోర్లలో పనిచేస్తూనే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఎఫ్అండ్బీ కంపెనీ తమదేనని పేర్కొంది. -
భారీ షాక్.. ఒక్కో యూజర్‌కు 4 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైన గూగుల్!
సాధారణంగా మనం మన గురించి ఆలోచించకుండా పక్కనోడి గురించి ఆలోచిస్తుంటాం. వాళ్లేం చేస్తున్నారు? వీళ్లేం చేస్తున్నారు? ఫలానా వాళ్ల పిల్లలు ఏం చేస్తున్నారు’ అని తెలుసుకునేందుకు అత్యుత్సాహం చూపిస్తుంటాం. ఇప్పుడు అలాంటి అత్యుత్సాహమే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కొంప ముంచింది. బదులుగా రూ.41 వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. సెర్చింజిన్ విభాగంలో గూగుల్ పెత్తనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర కంపెనీలు ఎదగనీయకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుందంటూ గూగుల్‌పై ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ సంస్థలు కోర్టు మెట్లక్కిన దాఖలాలు అనేకం ఉన్నాయి. 2020లో గూగుల్‌పై కేసు వాటిల్లో 2020లో అమెరికా న్యూయార్క్ కేంద్రంగా సేవలందించే బోయిస్ షిల్లర్ ఫ్లెక్స్నర్ ఎల్ఎల్పీ (Boies Schiller Flexner LLP) అనే న్యాయ సంస్థ గూగుల్‌పై కోర్టులో కేసు వేసింది. ‘‘ గూగుల్ బ్రౌజర్ ఇన్‌కాగ్నటోమోడ్‌తో పాటు ఇతర ప్రైవేట్ బ్రౌజర్లు ఉపయోగించే యూజర్లు వాటిల్లో ఏం వెతుకుతున్నారు అని సమాచారం తెలుసుకుంటుంది. ఆయా విభాగాలకు చెందిన సైట్లను వీక్షించే యూజర్లకు అనుగుణంగా యాడ్స్‌ను ప్రసారం చేస్తుంది. తద్వారా భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటుంది’’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు నుంచి బయట పడేందుకు గూగుల్ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. విచారణలో క్లాస్ యాక్షన్ పిటిషన్ పై పరిష్కారం కోసం గూగుల్ ప్రాథమికంగా ఓ ఒప్పందానికి వచ్చిందని కాలిఫోర్నియా కోర్టు న్యాయవాదులు ధృవీకరించారు ఒక్కో యూజర్‌కు ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు, వారి గూగుల్ ఖాతాలోకి లాగిన్ చేయనప్పటికీ, సంస్థ గూగుల్ అనలటిక్స్ ద్వారా ట్రాఫిక్ ఎంత వస్తుందని గూగుల్ ట్రాక్ చేస్తుంది. గూగుల్ ఈ తరహా వ్యాపార కార్యకలాపాలు చేసినందుకుగాను ఒక్కో యూజర్‌కు 5 వేల డాలర్లు చెల్లించాలి. అలా ఎంపిక చేసిన యూజర్లకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.41వేల కోట్లని తేలింది. అయితే, గూగుల్ ఈ కేసులో ఎలాంటి ముందుస్తు చెల్లింపులు చేయలేదని సమాచారం. ముందు తిరస్కరించినా.. చివరికి దారికొచ్చిన గూగుల్ ఈ కేసును న్యాయమూర్తి ద్వారా పరిష్కరించాలన్న గూగుల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఆ పిమ్మట వారం రోజుల వ్యవధిలో గూగుల్ కేసును సెటిల్మెంట్ చేసేందుకు మొగ్గు చూపినట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. తదుపరి విచారణ ఫిబ్రవరి 24, 2024లో జరగనుంది. అప్పుడే 41వేల కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చిన గూగుల్ నిర్ణయంపై న్యాయస్థానం ఆమోదం తెలపనుంది. -
ఫ్యాషన్ స్టార్టప్స్‌లో అజియో పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 డైరెక్ట్ టు కస్టమర్ ఫ్యాషన్ స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టాలని లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీ అజియో భావిస్తోంది. ఈ స్టార్టప్స్ తయారు చేసే, విక్రయించే దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్ వంటి ఉత్పత్తులను డైరెక్ట్ టు కంన్జ్యూమర్ వేదిక అయిన అజియోగ్రామ్లో అందుబాటులో ఉంచనుంది. భారతీయ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగంలోని 200 బ్రాండ్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అజియోగ్రామ్లో వచ్చే ఏడాదికల్లా చేర్చనున్నట్టు వెల్లడించింది. ఈ బ్రాండ్స్ విస్తరణకు, ఆదాయ వృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు అజియో ప్రకటించింది. -
సెలెవిదా వెల్నెస్ పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా సెలెవిదా వెల్నెస్ డైరెక్ట్ టు కంజ్యూమర్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఈ పోర్టల్ ద్వారా మధుమేహ రోగుల కోసం పలు ఉత్పత్తుల అమ్మకంతోపాటు ఆహార సిఫార్సులు, సమాచారం అందిస్తారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2019 నుంచి సెలెవిదా బ్రాండ్‌లో న్యూట్రాస్యూటికల్స్ తయారీ చేపడుతోంది. దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు పిన్‌కోడ్స్‌కు వీటిని సరఫరా చేస్తోంది. -
అవగాహనే అస్త్రం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన ‘స్కూల్ కన్జ్యూమర్ క్లబ్’లను ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్.. ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 8, 9 తరగతుల విద్యార్థులతో దాదాపు 6 వేలకు పైగా వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటు చేయించింది. ఒక్కో క్లబ్లో కనీసం 100 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ.. సుమారు 6 లక్షల మందిని వినియోగదారుల హక్కుల పరిరక్షకులుగా తీర్చిదిద్దబోతోంది. విద్యార్థులే వినియోగదారులుగా తమ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని తమ కుటుంబసభ్యులకు, గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, తోటి విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం ఈ క్లబ్‌లకు రూపకల్పన చేసింది. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు దోపిడీకి గురికాకుండా సమగ్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్ ట్రైనర్లు రాష్ట్రంలోని అన్ని క్లబ్‌ల టీచర్ గైడ్లకు దశలవారీగా, క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తకాలు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మేము సైతం’ పేరుతో శిక్షణ మాడ్యూల్ పుస్తకాన్ని వెలువరించారు. త్వరలోనే వినియోగదారుల హక్కుల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, క్లబ్‌లు చేపట్టిన కార్యకలాపాలను అప్లోడ్ చేయడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. క్లబ్‌ల కార్యక్రమాల ఆధారంగా అవార్డులతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. పోస్టర్లతోనూ విస్తృత ప్రచారం వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిం చేలా 10 రకాల పోస్టర్లతో కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించనుంది. వస్తువు కొనుగోలులో వినియోగదారులకు ఉండే హక్కులు, బాధ్యతలు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ బంకుల్లో పొందే హక్కులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై అవగాహన, సమస్య వస్తే వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసే విధానం, బిల్లు ఆవశ్యకత తదితర అంశాలను వివరించనుంది. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాలతో ‘మేలు కొలుపు’ పేరుతో మాస పత్రికను కూడా ప్రచురిస్తోంది. నెలకు సుమారు 9 వేల కాపీలను విడుదల చేస్తుండగా వీటిని వినియోగదారుల క్లబ్‌లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు జాయింట్ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించారు. విద్యార్థులతోనే చైతన్యం.. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదంటే సేవను పొందేటప్పుడు వినియోగదారుడికి చట్టం కొన్ని హక్కులు కల్పిం చింది. వీటి ద్వారా మోసాల నుంచి కొనుగోలుదారుడు తనను తాను రక్షించుకోవచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా వినియోగదారులు తమ హక్కులు తెలుసుకోవడంలో వెనుకబడిపోయారు. అందుకే ప్రభుత్వం పాఠశాల విద్య దశలోనే ఈ అంశంపై సమగ్ర అవగాహన కల్పిం చేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు. అందుకే సమస్య వస్తే వినియోగదారుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేయడంతో పాటు మోసపోకుండా సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్ కుమార్, వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ -
ఫోన్ నంబర్ తీసుకుని విసిగిస్తున్నారా? వినియోగదారుల శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా? -
లేస్ గౌర్మెట్ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే!
పెప్సికో 2022లో లేస్ గౌర్మెట్‌తో ప్రీమియం పొటాటో చిప్స్లోకి ప్రవేశించింది.ఈ కేటగిరీలో వినియోగదారులు మరిన్ని ప్రీమియం అనుభవాల కోసం చూస్తున్నారంటున్నారు పెప్సి కో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి. కేటగిరీ ప్రీమియమైజేషన్ గురించి, రూ.20 రేంజ్లో అందించే కొత్త ప్లాన్..తదితర వివరాలు ఆమె మాటల్లోనే.. ఆగస్టు 2022లో లే గౌర్మెట్ను ప్రారంభించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. వినియోగదారుల గురించి, అవుట్లెట్ల గురించి తెలుసుకున్నాము. స్పందన బాగుంది. జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించేవారు గౌర్మెట్ను ఆనందిస్తారు. ఈ స్నాక్ అందించే అనుభూతులు మరింత ఆనందంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు చక్కటి స్నాక్స్‌తో ట్రీట్ చేసుకోవాలనుకుంటుంటారు. లేస్ గౌర్మెట్‌కు వచ్చిన విశేష ఆదరణ దృష్ట్యా దానిని మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందువల్ల, మరింత మందికి లేస్‌ను చేరువచేసే లక్క్ష్యంతో రూ.20 ప్యాకెట్లను విడుదల చేస్తున్నాము. రిటైల్, వినియోగదారుల దృక్కోణం నుండి ఈ ధర అంశం చాలా ముఖ్యమైనది. రూ.20 ప్యాక్‌లు త్వరలో మార్కెట్లో లభింస్తాయి. మరింత విస్తృతంగా పంపిణీ చేయనున్నాం. లేస్ కన్సూమర్తో పోలిస్తే గౌర్మెట్ కొనేవాళ్లు భిన్నమని మీరు భావిస్తున్నారా? ఈ తేడాను జనాభా పరంగా చూడలేం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే అవసరం లేదా సందర్భం కావొచ్చు. ఒక వినియోగదారు ఒక సారి లేస్‌ను తినాలనుకోవచ్చు, ఎందుకంటే అతను/ఆమె స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు, ఇదొక సంబరం, ఇలాంటి నోరూరించే చిరుతిళ్లతో స్నేహితుల భేటీ సరదాగా ఉంటుంది. వేరే మూడ్‌లో లేదా వేరే సందర్భంలో ఉన్న ఒకే రకమైన వినియోగదారులు లేస్ గౌర్మెట్‌కు కూడా వినియోగదారుగా ఉండవచ్చు. అలాగే, కోవిడ్ తర్వాత, ప్రజలు మరింత కొత్త రుచుల కోసం ఎలా వెతుకుతున్నారో కూడా మేము గమనించాము. లే యొక్క గౌర్మెట్‌తో, చాలా మంది వినియోగదారులు స్నాకింగ్లోకి రావడాన్ని మేము ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే వారు స్నాకింగ్‌లో చక్కని అనుభవాన్ని కోరుకుంటారు. Q. Not just cooked, crafted. ఈ లైన్ వినగానే సైఫ్ అలీ ఖాన్, ఆయన రాజవంశం గుర్తుకొస్తుంది. అప్పుడు లేస్ ప్రోడక్ట్ ప్రమోషన్లో ఈ వ్యాక్యం వాడారు. ఇప్పుడదే వ్యాక్యాన్ని అలాగే సైఫ్‌ను మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకున్నారు. ఎలా చూడవచ్చు? సైఫ్ అలీ ఖాన్‌తో మా అనుబంధం చాలా గొప్పది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం అందుకే లేస్ గౌర్మెట్ కోసం సైఫ్‌నే మళ్లీ ఎంచుకున్నాం. లేస్ గౌర్మెట్ చిప్స్ బ్రాండ్‌కు అతడే సరైన ఎంపిక. మంచి రుచి, క్రమబద్ధత కలిగిన ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సైఫ్‌ను ఎంపిక చేసుకున్నాం. బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఎందుకు వచ్చింది? పెప్సీకో కింద ఎన్నో బ్రాండ్లు, ప్రోడక్టులున్నాయి. సైఫ్ అంశాన్ని బ్రాండ్ అంబాసిడర్ అవసరంగా చూడకూడదు. మా బ్రాండ్ ఇమేజ్‌కు మరింత ప్రయోజనం లభిస్తుందని భావించినప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్లతో కలిసి పని చేస్తాము. అలాగే బ్రాండ్ , అంబాసిడర్ రెండూ పరస్పర సంబంధం కలిగి ఉండాలి, రెండూ కలిసి వెళ్లాలి. మా బ్రాండ్‌కు ఉన్న గుర్తింపు, చక్కటి రుచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ చాలా విలువను జోడించగలడని మా నమ్మకం. గౌర్మెట్‌తో కలిసి సైఫ్ నడవడం వల్ల ఆ ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ మరింత ఉన్నతమవుతుంది. అసలు సైఫ్‌ను తీసుకురావడం వెనక మా ఆలోచన ఇదే. చాలా ప్రీమియం బ్రాండ్ల ధరలు రూ.100 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే గౌర్మెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఇది గౌర్మెట్‌కు ఎలా సహాయపడుతుంది? రూ.30, రూ.50ల ఉత్పత్తుల విభాగంలో మీ వాటా వాటా ఎంత? ప్రపంచవ్యాప్తంగా పొటాటో చిప్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాము. ఒక ఉత్పత్తిని తీసుకొస్తున్నప్పుడు మా నైపుణ్యాన్ని, మా అభ్యాసాలను కేవలం భారతీయ మార్కెట్‌కు పరిమితం చేయాలనుకోవడం లేదు. మార్కెట్‌పై మాకు ఉన్న అవగాహన మాకు గౌర్మెట్ సెగ్మెంట్ ధరల గురించి స్పష్టమైన ఆలోచనన ఇచ్చింది. చాన్నాళ్లుగా మేము మార్కెట్లో ఉన్నాం.ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మార్కెట్లో ఉన్న రూ.30 ప్యాక్ ఉత్పత్తులు ఎక్కువగా సాంప్రదాయ వినియోగదారులు కొంటున్నారు. మా వాటా కూడా దీంట్లోనే ఎక్కువ. అలాగే రూ.50 ప్యాక్ ఉత్పత్తులకు ఇ-కామర్స్‌లో డిమాండ్ ఎక్కువ. లేస్ గౌర్మెట్ చిప్స్ మూడు ఫ్లేవర్లలో ఉన్నాయి. లైమ్ అండ్ క్రాక్డ్ పెప్పర్, థాయ్ స్వీట్ చిల్లీ మరియు వింటేజ్ చీజ్ & పెప్రికా. వీటిలో ఎక్కువ అమ్ముడవుతున్న ఫ్లేవర్ ఏది? మరిన్ని ఫ్లేవర్లు తెచ్చే ఆలోచన ఉందా? థాయ్ స్వీట్ చిల్లీకి మంచి స్పందన వచ్చింది. ఎక్కువ మంది ఏది ఇష్టపడితే అదే ఫ్లేవర్ అవుతుంది. నిజానికి మూడు ఫ్లేవర్ల అమ్మకాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మేము కూడా ఎక్కువ ఉత్పత్తులను ప్రయత్నించే దశలో ఉన్నాము. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కువ మందికి ఈ రుచులు చేరాలని, వినియోగదారుల సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. మా దగ్గర మరిన్ని ఆలోచనలున్నాయి. మార్కెట్ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతానికయితే ఈ మూడు ఫ్లేవర్లతో మా వ్యాపారాన్ని పెంచుతాం. -
కరోనా తరువాత కామన్ మ్యాన్ కష్టాలు
-
అమెరికన్లకు ద్రవ్యోల్బణం సెగ
వాషింగ్టన్: అమెరికన్లకు ధరల స్పీడ్ సెగ కొనసాగుతోంది. ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 0.6 శాతం పెరిగింది (2022 డిసెంబర్‌తో పోల్చి). ఇక వార్షికంగా చూస్తే ఈ రేటు 4.7 శాతం ఎగసింది. నవంబర్ నుంచి డిసెంబర్‌కు 0.2 శాతమే పెరిగితే, డిసెంబర్ నుంచి జనవరికి అంచనాలను మించి 0.6 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మున్ముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత పెంపునకే ఇది దారితీస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, వినియోగ వ్యయం జనవరిలో 1.8 శాతం పెరిగిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. తాజా గణాంకాల నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి అమెరికన్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
విమానయాన శాఖ ‘టైమింగ్ అదిరింది’..నవ్వులు పూయిస్తున్న రిప్లయ్!
యాపిల్ ప్రొడక్ట్ ధరలు భారీగా ఉన్నాయి. వాటి సంగతేందో చూడండి అంటూ ఓ యువకుడు కేంద్ర విమానయాన శాఖకు ట్వీట్లో విజ్ఞప్తి చేశాడు. ఆ ట్వీట్‌పై చమత్కారంగా..చాలా స్పాంటేనియస్‌గా స్పందించడం నెటిజన్లను తెగ నవ్వులు పూయిస్తుంది. అంకుర్ శర్మ అనే ట్విట్టర్ యూజర్ అమెజాన్ అన్ ఫెయిర్ బిజినెస్ చేస్తోంది. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినియోగదారు వ్యవహారాల శాఖ శాఖకు కాకుండా కేంద్ర విమానయాన సంస్థకు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అమెజాన్ పేజ్‌లో ఐపాడ్ ప్రో ప్రొడక్ట్ ప్రారంభ ధర రూ.1,76,900 ఉండగా ధరను భారీగా తగ్గిస్తూ రూ.67,390కే అందిస్తున్నట్లు పేర్కొందని తెలుపుతున్నట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. ‘‘నెటిజన్ అంకుర్ శర్మ..ఆ ధరని, డిస్కౌంట్‌ను హైలెట్ చేస్తూ యాపిల్ ఐపాడ్ ప్రో రీటైల్ ధర రూ.1,76,900గా ఉంది. అదే ప్రొడక్ట్‌పై 62శాతం డిస్కౌంట్ ఇస్తుందంట అమెజాన్. సాధ్యం కాదు. అంత తక్కువ ధరకే ఐఫాడ్ రాదు’’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. అంతేకాదు ఆ ట్వీట్‌ను జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు. అంతే ఆ ట్యాగ్‌పై విమానాయన శాఖ స్పాంటేనియస్‌గా రిప్లయి ఇచ్చింది. ‘‘తక్కువ ధరకే అందించాలని మాకు ఉంది. కానీ మేం ప్రయాణికులు అఫార్డబుల్ ప్రైస్‌కే ఇండియాకు వచ్చేలా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో బిజీగా ఉన్నాం’’ అని బదులిచ్చింది. We intend to help, but we are busy providing affordable air travel to India.#SabUdenSabJuden https://t.co/ogDImlINJe — MoCA_GoI (@MoCA_GoI) September 14, 2022 అదే ట్వీట్‌ను 8 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేయగా..700 మంది రీట్వీట్ చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హ్యూమరస్‌గా చేసిన ట్వీట్‌పై అమెజాన్ స్పందించింది. అంకుర్ శర్మ మీరు చేసిన ట్వీట్‌ను పరిగణలోకి తీసుకున్నాం. సంబంధిత విభాగానికి చెందిన ప్రతినిధులతో మాట్లాడుతున్నాం అని రిప్లయి ఇచ్చింది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో షాపింగ్స్ మాల్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. 2020 నుంచి 8 ప్రధాన పట్టణాల్లో 16 కొత్త మాల్స్ తెరుచుకున్నాయి. కరోనా వంటి ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లు ఉన్నా కానీ.. కొత్త మాల్స్ రూపంలో 15.5 మిలియన్ చదరపు అడుగులు వాణిజ్య స్థలం గత 30 నెలల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2022’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2019 డిసెంబర్ నాటికి దేశంలోని హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలో 255 మాల్స్, వీటి నుంచి స్థూల లీజు విస్తీర్ణం 77.4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులో ఉంది. 2022 జూన్ నాటికి భారత్‌లో మొత్తం 92.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం, 271 మాల్స్రూపంలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. గ్రేడ్ ఏ మాల్స్‌కు డిమాండ్.. దేశ రాజధాని ప్రాంతంలో అత్యధికంగా 34 శాతం షాపింగ్ మాల్ విస్తీర్ణం ఏర్పాటై ఉంది. ముంబై 18 శాతం, బెంగళూరు 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. ‘‘రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త పరిపక్వత దశకు చేరుకుంది. చిన్న సైజు నుంచి గ్రేడ్ ఏ మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ మాల్స్‌లో95 శాతం లీజు స్థలం నిండి ఉంది. నాణ్యమైన రియల్ ఎస్టేట్‌కు డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. డెవలపర్ల నుంచి నాణ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి అవసరం’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం.. పెట్టుబడులకు, రీట్లకు గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో 39 శాతం విస్తీర్ణం గ్రేడ్ ఏ పరిధిలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. వీటి పరిధిలో స్థూల లీజు విస్తీర్ణం 36 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. టాప్–8 పట్టణాల్లో మొత్తం గ్రేడ్ ఏ మాల్స్ 52 ఉన్నాయి. గ్రేడ్ బీ కేటగిరీలో 94 మాల్స్ ఉండగా, 29.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు అందుబాటులో ఉంది. గ్రేడ్ సీ పరిధిలో 125 మాల్స్ 27.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి. -
క్రెడిట్ కార్డ్ వాడకం మామూలుగా లేదుగా, తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుముఖం పట్టి .. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. క్రెడిట్ కార్డు, యూపీఐ చెల్లింపుల ధోరణులే ఇందుకు నిదర్శనమని నిపుణులు, మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నెలవారీ గణాంకాల ప్రకారం ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 9.83 లక్షల కోట్లుగా ఉండగా ఆగస్టులో రూ. 10.73 లక్షల కోట్లకు చేరాయి. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్ ద్వారా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఏప్రిల్‌లో రూ. 29,988 కోట్లుగా ఉండగా ఆగస్టు నాటికి రూ. 32,383 కోట్లకు చేరాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో క్రెడిట్ కార్డుల వినియోగం రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు చేరింది. 2017-2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో క్రెడిట్ కార్డులపై బకాయిలు వార్షిక ప్రాతిపదికన 16 శాతం మేర పెరిగినట్లు ఎస్బీఐ కార్డ్ ఎండీ రామ్మోహన్ రావు అమర తెలిపారు. ‘క్రెడిట్ కార్డులను ఉపయోగించడం పెరిగే కొద్దీ వాటితో ఖర్చు చేయడం కూడా పెరిగింది. గత కొద్ది నెలలుగా సగటున నెలకు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు రూ. 1 లక్ష కోట్లు దాటుతోంది. భారీ వినియోగ ధోరణులను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్ రానుండటంతో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఊతం.. డిజిటల్ లావాదేవీలు ఇటు విలువపరంగా అటు అమ్మకాలపరంగా పెరుగుతుండటం ఎకానమీకి మేలు చేకూర్చే అంశమని పేనియర్‌బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి వివిధ విధానాల విషయంలో భయాలను పక్కనపెట్టి ప్రజలు అలవాటు పడుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, ఆదాయాలు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగు పడుతుండటం వంటి అంశాలు ఆన్లైన్ చెల్లింపుల వృద్ధికి దోహదపడుతున్నాయని బజాజ్ చెప్పారు. మరింతమంది వర్తకులు డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండటం మరో సానుకూలాంశమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారు కూడా యూపీఐని ధీమాగా వినియోగిస్తుండటంతో ప్రస్తుత పండుగ సీజన్లో ఈ విధానంలో చెల్లింపులు మరింతగా పెరిగే అవకాశం ఉందని సర్వత్రా టెక్నాలజీస్ ఎండీ మందర్ అగాషే చెప్పారు. మరోవైపు, డెబిట్ కార్డులు కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగు తుండటానికి రెండు పార్శా్వలు ఉండవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ (ఎకనమిక్ అడ్వైజరీ సర్వీసెస్) రణేన్ బెనర్జీ తెలిపారు. కుటుంబాలు నిజంగానే మరింతగా ఖర్చు చేస్తూ ఉండటం ఒక కోణం కాగా, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా రుణాలపై ఆధారపడుతుండటం మరో కోణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!
(మంథా రమణమూర్తి) మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి. లాభాలు రావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కు తత్వం బోధపడింది.... ప్రపంచ ఓటీటీ రారాజు నెట్‌ఫ్లిక్స్‌లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్ హేస్టింగ్స్ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్‌ఫ్లిక్స్‌ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్వర్డ్ షేరింగ్‌కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కు 2 లక్షల మంది గుడ్‌బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి. ఏప్రిల్– జూన్‌లోనూ ఈ షాక్ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్స్క్రిప్షన్ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్. యాడ్ మార్కెట్ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్‌ఫ్లిక్స్ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి. అమెజాన్‌కు ఆ అవసరం లేదా? ప్రకటనతో కూడిన వీడియో ఆన్ డిమాండ్ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్‌స్టార్ ఇప్పటికే ఏవీవోడీ మోడల్‌ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్‌తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్ నెక్స్›్ట వంటి ఇతర స్ట్రీమింగ్ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా సబ్స్క్రిప్షన్ ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం తట్టుకోగలుగుతున్నాయి. దీనిపై ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్‌ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్‌లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు. ఆహా... నెట్‌ఫ్లిక్స్ దారిలోనే తెలుగు కంటెంట్‌కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రామ్‌శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్‌లో కొన్ని యాడ్స్ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్‌స్టార్‌కు 3.6 కోట్లు, అమెజాన్‌కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశీ టాప్–10లోనూ లేదు. యాడ్స్‌ను స్కిప్ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్ 2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్ మున్ముందు ఎస్వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్ 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్‌వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్ తెలిపింది. యాడ్స్ నుంచి ప్రీమియంవైపు కూడా...! చేతిలో కంటెంట్ ఉన్నపుడు దాన్ని యాడ్స్‌తో... యాడ్స్ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్ గోల్డ్ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్‌తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!. -
2022-23 క్యూ1 ఫలితాలు: టాటా కన్జూమర్ లాభం, ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 38 శాతం జంప్‌చేసి రూ. 277 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 200 కోట్లు మాత్రమే ఆర్జించింది. వ్యయ నియంత్రణలు, ధరల పెంపు లాభాలు పుంజుకునేందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం ఎగసి రూ. 3,327 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 3,008 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఆదాయంలో దేశీ వాటా 9 శాతం వృద్ధితో రూ. 2,145 కోట్లను తాకగా.. అంతర్జాతీయ బిజినెస్ సైతం 9 శాతం పుంజుకుని రూ. 837 కోట్లకు చేరింది. నాన్‌బ్రాండెడ్ బిజినెస్ రూ. 278 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు బలపడింది. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా కన్జూమర్షేరు బీఎస్ఈలో 0.25 శాతం లాభపడి రూ. 790 వద్ద ముగిసింది. -
పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి ఈటీఎఫ్‌లు
హెల్త్‌కేర్, బ్యాంకింగ్, వినియోగం, టెక్నాలజీ మొదలైనవన్నీ కచ్చితంగా అవసరమైనవే కాబట్టి .. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ రంగాలు వృద్ధి బాటలోనే ఉంటాయి. కాబట్టి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకు కాస్త భద్రతతో పాటు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వృద్ధి కూడా చెందుతుందని భావించవచ్చు. అయితే, ఆయా రంగాల్లో మెరుగైన కంపెనీలను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం కష్టమైన ప్రక్రియే. ఇక్కడే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సాధనాలైన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అక్కరకొస్తాయి. నిర్దిష్ట సూచీపై ఆధారితమై ఉండే ఈటీఎఫ్‌లు.. షేర్ల ఎంపికలో రిస్కులను తగ్గించడంతో పాటు వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. ఇవి ఎక్సే్చంజీలో ట్రేడవుతాయి కాబట్టి సులభంగానే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ థీమ్‌లు, రంగాల ఆధారిత సూచీలు, ఈటీఎఫ్‌ల గురించి అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక కథనం. ► వినియోగం: ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్, ఆటో, టెలికం, హోటల్స్, మీడియా.. వినోదం, కన్జూమర్ గూడ్స్ .. సర్వీసులు, టెక్స్టైల్స్ వంటి వాటిపై ఖర్చు చేసే ధోరణులు కూడా పెరుగుతుంటుంది. మార్కెట్ క్యాప్ పరంగా భారీవైన 30 వినియోగ ఉత్పత్తుల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ సూచీ ద్వారా అవకాశం దొరుకుతుంది. ► హెల్త్‌కేర్: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, ఔషధాల తయారీ సంస్థలు, పరిశోధన.. అభివృద్ధి సంస్థలు మొదలైనవి హెల్త్‌కేర్ రంగం కిందికి వస్తాయి. ఇలాంటి 20 బడా హెల్త్‌కేర్ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ సహాయపడుతుంది. ► టెక్నాలజీ: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి టెక్నాలజీ రంగాన్ని నడిపిస్తున్నాయి. సమీప, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దాదాపు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ద్వారా 10 పెద్ద ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ► బ్యాంకింగ్: ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకింగ్ రంగంతో ముడిపడే ఉంటాయి. ఇంతటి కీలకమైన బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సహాయకరంగా ఉంటుంది. ఈ సూచీలో ప్రధానంగా 95.7 శాతం వాటా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీలదే ఉంటోంది. ► బంగారం: సెంటిమెంటుపరంగానే కాకుండా ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా కూడా బంగారానికి ఉన్న ప్రాధాన్యతను వేరే చెప్పనక్కర్లేదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉపయోగపడతాయి. దొంగల భయం, స్టోరేజీ, ప్యూరిటీ మొదలైన వాటి గురించి ఆందోళన పడే పరిస్థితి ఉండదు. ► ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్): ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం .. రెండు సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్గం. ఇందులో వ్యక్తిగత ఇన్వెస్టరు.. దేశీ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలకు తగ్గ విధంగా రాబడులు అందించే దిశగా.. ఈ దేశీ ఫండ్ ఆ డబ్బును ఇతర దేశీయ లేదా అంతర్జాతీయ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలోనూ పెట్టుబడుల కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుంది. ఈటీఎఫ్‌లతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు స్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి భద్రత ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాలతో.. మార్కెట్లలో సత్వరం ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అవసరాలు తీరడం తో పాటు ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే భవిష్యత్‌లో మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలు కాగలదు. అలాగే, పన్నుపరంగా చూసినా ఈటీఎఫ్‌లు ప్రయోజనకరంగానే ఉంటాయి. – అశ్విన్ పట్ని, ప్రోడక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విభాగం హెడ్, యాక్సిస్ ఏఎంసీ -
అలా చేస్తే వినియోగదారుల పరిధిలోకి రారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్‌డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
East Godavari: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగవకాశాలు
కాకినాడ సిటీ(తూర్పుగోదావరి): జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ పోస్టులకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 రెమ్యూనరేషన్ ఉంటుందన్నారు. చదవండి: పార్క్ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్.. తర్వాత ఏం జరిగిందంటే.. జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి ఇంటర్మీడియెట్, స్టెనోగ్రాఫీ లోయర్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. టైపిస్ట్ పోస్టుకి ఇంటర్మీడియట్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఇంటర్మీడియెట్, టైపు, హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 42 ఏళ్ల వయసు మించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధ్యక్షుడు, జిల్లా వినియోగదారుల కమిషన్, కోర్టు కాంపౌండ్, కాకినాడలో అందజేయాలన్నారు. -
పేయూ చేతికి బిల్‌డెస్క్
న్యూఢిల్లీ: దేశీ ఇంటర్నెట్ కన్జూమర్ విభాగంలో తాజాగా అతిపెద్ద ఒప్పందానికి తెరలేచింది. ఫిన్‌టెక్ బిజినెస్ సంస్థ పేయూ.. డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల సంస్థ బిల్‌డెస్క్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 4.7 బిలియన్ డాలర్లు(రూ. 34,376 కోట్లు) వెచ్చించనుంది. దీంతో పేయూ మాతృ సంస్థ, నెదర్లాండ్స్ దిగ్గజం ప్రోసస్ ఎన్వీ దేశీ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల(రూ. 73,140 కోట్లు)కు చేరనున్నాయి. అయితే బిల్‌డెస్క్, పేయూ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి లభించవలసి ఉంది. 2022 తొలి త్రైమాసికానికల్లా ఒప్పందం పూర్తయ్యే వీలున్నట్లు ప్రోసస్ గ్రూప్ సీఈవో బాబ్ వాన్ డిక్ అభిప్రాయపడ్డారు. రెండు సంస్థల కలయికతో డిజిటల్ పేమెంట్స్ విభాగంలో దేశీయంగానూ, గ్లోబల్ స్థాయిలోనూ లీడింగ్ కంపెనీ ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న దేశీ ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌లో మరింత లోతైన, మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. 2005 నుంచీ..: దేశీయంగా ప్రోసస్ దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా నిలుస్తున్నట్లు డిక్ పేర్కొన్నారు. 2005 నుంచీ టెక్ కంపెనీలలో దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాజా లావాదేవీతో ఈ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. ఇది భారత్ మార్కెట్‌పట్ల తమకున్న కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తమ పెట్టుబడులకు దేశీ మార్కెట్ కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. రానున్న దశాబ్దంలోనూ గ్రూప్ వృద్ధికి భారీగా దోహదపడనున్నట్లు తెలియజేశారు. రానున్న కొన్నేళ్లలో 20 కోట్లమందికిపైగా కొత్త వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. మూడేళ్ల కాలంలో ఒక్కో వ్యక్తి సగటు లావాదేవీలు 10 రెట్లు జంప్‌చేసి 22 నుంచి 220కు చేరనున్నట్లు అభిప్రాయపడ్డారు. పలు కంపెనీలలో..: ప్రోసస్ ఇప్పటికే బైజూస్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ తదితర పలు కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. పేయూ ద్వారా సిట్రస్‌పే, పేసెన్స్, విబ్మోలనూ సొంతం చేసుకుంది. అత్యధిక వృద్ధిలో ఉన్న 20 మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించిన పేయూ తాజా కొనుగోలుతో ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ పేమెంట్ సర్వీసుల సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. 2000లో షురూ బిల్‌డెస్క్ కార్యకలాపాలు 2000లో ప్రారంభమయ్యాయి. కంపెనీలో జనరల్ అట్లాంటిక్, వీసా, టీఏ అసోసియేట్స్, క్లియర్స్టోన్ వెంచర్, టెమాసెక్ తదితర దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ నెట్‌వర్క్‌ను కొన్ని దిగ్గజ బ్యాంకులతోపాటు, యుటిలిటీస్, టెలికం, బీమా తదితర పలు విభాగాలకు చెందిన చాలా కంపెనీలు వినియోగిస్తున్నాయి. పేయూ, బిల్‌డెస్క్ సంయుక్తంగా ఏడాదికి 4 బిలియన్ లావాదేవీలను నిర్వహించే అవకాశమున్నదని పేయూ సీఈవో అనిర్బన్ ముఖర్జీ అంచనా వేశారు. దశాబ్ద కాలంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో కంపెనీ అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు బిల్‌డెస్క్ సహవ్యవస్థాపకుడు ఎంఎన్ శ్రీనివాసు తెలియజేశారు. -
కేంద్రం కొత్త నిబంధనలపై వాట్సాప్ న్యాయపోరాటం
-
WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌ల సదుపాయం తమ ఖాతాదారులకు ఉందని గుర్తుచేసింది. సందేశం పంపినవారు, స్వీకరించిన వారు తప్ప ఇతరులు ఆ మెసేజ్‌లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరినపుడు లేదా కోర్టులు అడిగినపుడు తొలుత సందేశాన్ని సృష్టించిన వారిని గుర్తించాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయని, ఇది సరైన విధానం కాదని వెల్లడించింది. దీనివల్ల ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్‌లో ఒక సందేశం మొదట ఎక్కడ పుట్టింది, దాన్ని మొదట ఎవరు సృష్టించారు అనేది గుర్తించి, ధ్రువీకరించాలని ఆదేశించడం... గోప్యత హక్కుకు భంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌర సమాజంతో కలిసి పనిచేస్తాం: వాట్సాప్ కొత్త ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాము వ్యాజ్యం దాఖలు చేయడం నిజమేనని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలియజేశారు. ‘‘కొత్త డిజిటల్ నిబంధనలు అనుచితంగా ఉన్నాయి. వాట్సాప్‌లో ఒకరికొకరు పంపుకొనే మెసేజ్‌లను ట్రేస్ చేయాలని, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం అంటే వాట్సాప్‌లో షేర్ అయ్యే ప్రతి ఒక్క మెసేజ్ తాలూకు సమాచారాన్ని భద్రపర్చమని కోరడమే. అలాగే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. కోట్లాది మంది ప్రజల గోప్యత హక్కును కూడా పణంగా పెట్టినట్లే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... గోప్యత హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఉల్లంఘించడమే’ అని బుధవారం వాట్సాప్ పేర్కొంది. డాక్టర్లు– పేషెంట్లు, లాయర్లు– కక్షిదారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు... ఇలా ఎందరో వాట్సాప్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకుంటారంది. తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడడానికి పౌర సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో కలిసి పని చేస్తామని తెలిపింది. 36 గంటల్లోగా తొలగించాల్సిందే.. సామాజిక మాధ్యమాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు–2021ను ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సోషల్ మీడియా కంపెనీలు 36 గంటల్లోగా తొలగించాలి. ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై స్పందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్టు ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. అభ్యంతరకరమైన సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను (పోర్నోగ్రఫీ) తొలగించడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్ వాడాలి. ఏదైనా సందేశాన్ని/ సమాచారాన్ని మొదట ఎవరు సృష్టించారనేది గుర్తించే ఏర్పాటు ఉండాలని కొత్త నిబంధనల్లోని రూల్ 4(2) చెబుతోంది. దీనినే వాట్సాప్ కోర్టులో సవాల్ చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడానికి కేంద్రం 3నెలల గడువిచ్చింది. ఇది మంగళవారంతో ముగిసింది. సోషల్ మీడియా సంస్థలకు ఇదివరకు ‘మధ్యవర్తి హోదా’తో రక్షణ ఉండేది. తమ ఖాతాదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు సంబంధించి వీటిపై క్రిమినల్ కేసులు, నష్టపరిహారం కేసులకు వీల్లేకుండా ఈ మధ్యవర్తి హోదా కాపాడేది. కొత్త ఐటీ నిబంధనలను అంగీకరించకపోతే ఈ ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోతాయి. ఫలితంగా ఎవరు, ఏది పోస్ట్ చేసినా దానికి ఈ సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అత్యంత తీవ్ర నేరాలను అడ్డుకునేందుకే! కొత్త నిబంధనలన్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అత్యంత తీవ్ర నేరాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో ప్రచారమైన సందేశాల మూలం తెలుసుకునేందుకే కొత్త డిజిటల్ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలతో సత్సంబంధాలు, దేశ రక్షణ, దేశంలో శాంతి భద్రతలు మొదలైనవాటికి విఘాతం కలిగించే అవకాశమున్న నేరాలు, లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు తదితరాలను అడ్డుకోవడానికి, అలాంటి తీవ్ర నేరాల విచారణకు సంబంధిత సోషల్ మీడియా సందేశాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో, ఎలా వ్యాప్తి చెందాయో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాంటి సందేశాల వివరాలు వాట్సాప్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటల్ నిబంధనలను ‘వాట్సాప్’ చివరి నిమిషంలో కోర్టులో సవాలు చేయడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలతో పోలిస్తే.. భారత్ ప్రతిపాదిస్తున్న నిబంధనలు అంత తీవ్రమైనవి కావని వెల్లడించింది. ప్రైవసీ హక్కును ప్రాథమిక హక్కుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలతో వాట్సాప్ సాధారణ కార్యకలాపాలకు, వాట్సాప్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. వారి కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను పాటించే విషయంలో తాజా పరిస్థితిని తక్షణమే తమకు తెలియజేయాలని కేంద్ర ఐటీ శాఖ ప్రధాన సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. అప్రమత్తతతో వ్యవహరించాలంది. తాజా సోషల్ మీడియా నిబంధనల్లో పేర్కొన్న మేరకు.. భారత్‌లోని తమ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ల వివరాలను తమకు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. సంబంధిత సామాజిక మాధ్యమానికి చెందిన యాప్ పేరు, వెబ్సైట్ పేరు, అందించే సేవలు వివరాలను తెలియజేయాలంది. ఒకవేళ తాము ఈ నిబంధనల పరిధిలోకి రామని భావిస్తే అందుకు కారణాలను వెల్లడించాలి. సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే తాము కోరిన వివరాలను అందించాలని బుధవారం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ప్రధాన సోషల్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో అవి ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌలభ్యాలను కోల్పోవడంతో పాటు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని హెచ్చరించింది. ఇదీ ‘సోషల్ పవర్’ సోషల్ మీడియా వేదికలకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ సంస్థలకు ఉన్న వినియోగదారుల సంఖ్య ఇలా ఉంది. వాట్సాప్ 53 కోట్లు ఫేస్బుక్ 41 కోట్లు యూట్యూబ్ 44.8 కోట్లు ఇన్స్టాగ్రామ్ 21 కోట్లు ట్విట్టర్ 1.75 కోట్లు -
కోరిన స్ట్రీట్‌ఫుడ్.. క్షణాల్లో ఇంటికి!
కరీంనగర్‌సిటీ: మనం రోడ్లపై వెళ్తుంటే వేడి వేడి బజ్జీలు.. ఇడ్డీలు.. సమోసాలు.. పానీపూరీ, కట్లెట్స్, వడలు ఇలా అనేక పదార్థాలు నోరూరిస్తూ ఉంటాయి. అయితే మనకు ఉన్న రకరకాల పని ఒత్తిళ్ల వల్ల బండ్ల వద్ద నిలబడలేకనో, ఇతర కారణాలతోనో తినాలని ఉన్నా తికలేకపోతుంటాం. ఇక ఆ చింత అవసరం లేదు. మీరు కోరుకున్న స్ట్రీట్‌ఫుడ్ క్షణాల్లో మీ ఇంటికే రానుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాల వీధి వంటకాలను స్విగ్గీతో అనుసంధానం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 100 మంది వ్యాపారులు ముందుకు వచ్చారు. కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మెప్మాలో నమోదు చేసుకున్న వీధి వ్యాపారులకు ఇప్పటికే ఆత్మనిర్భర్ ద్వారా రుణాలు ఇప్పించారు. వారికి మరింత చేయూతనిచ్చేందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వీధి వంటకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్విగ్గీ సంస్థ ముందుకు రాగా వారితో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్లైన్లో నమోదు చేస్తే చాలు.. ఇప్పటికే అనేక రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో సంస్థలు ఆన్లైన్లోనే వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ యాప్‌లో మనకు కావాల్సిన వీధి వంటకాల పేర్లు నమోదు చేస్తే చాలు వాటిని నేరుగా ఇంటికి చేరవేస్తారు. ఇందుకోసం మెప్మా ద్వారా ఎంపిక చేసిన చిరు వ్యాపారులకు నిపుణులతో శిక్షణనిస్తారు. వంటకాల నాణ్యత, శుభ్రతతో ఎలా తయారు చేయాలి, ప్యాక్ చేసే క్రమంలో తీసుకునే జాగ్రత్తలు ఇలా వారి వ్యాపారాన్ని మార్కెటింగ్ చేసుకునే విధానంలోనూ మెలకువలు నేర్పుతారు. ఫుడ్‌సేఫ్టీ, స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ధ్రువపత్రాలు మెప్మా ద్వారా అందిస్తారు. మొబైల్లో ఉండే స్విగ్గీ యాప్‌లో ఇలా ఆర్డర్ చేయగానే వేడివేడి పదార్థాలు ఇంటికి వచ్చేస్తాయని మెప్మా అధికారులు తెలిపారు. పీఎం స్వనిధి ద్వారా రుణాలు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రయోజనాలు ఇవీ.. ఈ కార్యక్రమం వల్ల ఇటు వినియోగదారుడికి, అటు అమ్మకందారులకూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వీధి వ్యాపారులు తమ బండ్ల వద్ద ఎంత ధరకు ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారో అంతే ధరను ఆర్డర్ ప్రకారం వారం రోజులకోసారి స్విగ్గీ వారికి చెల్లిస్తుంది. దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా వారి వ్యాపారం మరింత విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కరీంనగర్‌లోని కమాన్ ప్రాంతంలో దోశ రూ.30 ఉంటే వీధి వ్యాపారులకు స్విగ్గీ అంతే మొత్తం చెల్లించి, సదరు ఆహారం తీసుకెళ్లి కొంత సర్వీస్ ఛార్జీ కలిపి వినియోగదారుడి వద్ద నుంచి తీసుకుంటుంది. అనేక ప్రాంతాల్లో వీధి వంటకాలు... కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రాంతాల్లో వీధి వంటకాలు లభిస్తాయి. ఆర్టీసీ బస్టాండ్, కమాన్ ప్రాంతం, క్లాక్ టవర్, కోర్టు చౌరస్తా, రాంనగర్, కోతిరాంపూర్, ఎన్టీఆర్ విగ్రహం, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్ రోడ్డు, అంబేద్కర్ స్టేడియం, సెవెన్‌హిల్స్, జ్యోతిబాఫూలే పార్క్, గీతాభవన్, వన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్, కాపువాడ, బైపాస్‌రోడ్డు ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్న వీధి వ్యాపారులను స్విగ్గీతో అనుసంధానం చేశారు. ఆయాచోట్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ అనేక ఆహార పదార్థాలు లభిస్తాయి. -
భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ వత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది. మహమ్మారి కేసులు తగ్గుతున్నాయా? లేదా పెరుగుతున్నా యా? అన్న అంశంపై భవిష్యత్ ఎకానమీ పనితీరు ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. ఎస్అండ్పీ విడుదల చేసిన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై మా అంచనాలను మార్చుకునే ముందు కరోనా కేసుల సంఖ్యలో స్థిరత్వం లేక తగ్గుదల వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే మూడవ త్రైమాసికానికి (అక్టోబర్–డిసెంబర్) సంబంధించిన కీలక ఆర్థిక గణాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైల్ ద్రవ్యోల్బణం సవాలుగా ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు విస్తృత ప్రాతిపదికన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకటించిన చర్యలు దిగువ ఆదాయ కుటుంబాలను ఉద్దేశించిన తీసుకున్నవి. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత ఆర్బీఐ రేట్ల కోత అవకాశాలను కట్టడి చేస్తున్నాయి. ఖర్చు చేయడం మళ్లీ మొదలవుతుంది: ఫిచ్ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో భారత్‌లో ఈ ఏడాది వ్యయాలు తగ్గించుకున్న వినియోగదారులు వచ్చే ఏడాది మళ్లీ ఖర్చు చేయడంపై దృష్టి పెట్టనున్నారని, దీంతో 2021లో వినియోగదారుల వ్యయం 6.6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ ఒక నివేదికలో పేర్కొంది. ‘‘ఆహారం, ఆల్కహాల్యేతర పానీయాలపై ఖర్చు చేయడానికి 2020లో కుటుంబాలు తమ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. రాబోయే రోజుల్లోనూ వీటిపై ఖర్చు చేయడం సానుకూలంగానే ఉండనున్నప్పటికీ 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గొచ్చు’’ అని ఫిచ్ వివరించింది. -
కరోనా: డిజిటల్ వినియోగదారుల్లో మార్పులు
కరోనా : డిజిటల్ వినియోగదారులలో మార్పులు: కోవిడ్-19 కారణంగా ప్రపంచం మొత్తం మారిపోయింది. తాజా పరిస్థితుల్లో ప్రజలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రిటైలర్ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కరోనా వైరస్ కారణంగా కొన్ని వారాల వ్యవధిలోనే అనేక వ్యవస్థలు దారుణంగా నష్టపోయాయి. వినియోగదారుల అవసరాలు, ఆలోచనలు కూడా మారాయి. తమ అవసరాలకు సంబంధించి ఎక్కడ నుంచి కొనాలి? ఏం కొనాలి అన్న అంశాల్లో వినియోగదారుల ప్రాధాన్యతలు మారినట్లు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సంక్షోభంలో వినియోగదారులకు తగ్గట్టుగా మారడం: కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా వినియోగదారుల వైఖరుల్లో అనేక మార్పులు వచ్చాయి. వినియోగదారులు వారు కొనుగొలు చేయాల్సిన వస్తువుల విషయంలో రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎప్పటిలా జీవితం కొనసాగాలని ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందరి మనస్సులో కరోనా భయం లోతుగా నాటుకుపోయింది. కోవిడ్-19 - భారతీయ వినియోగదారులపై ప్రభావం: కోవిడ్-19 కారణంగా భారతీయ వినియోగదారుల ప్రవర్తనలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 60 శాతం మంది వినియోగదారులు తాము సాధారణంగా కొనుగోలు చేసే వస్తు సామగ్రి జాబితాను చేర్చాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాల ఆధారంగా ఈవై ఫ్యూచర్ కన్యూమర్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వినియోగదారులు ఐదు రకాలుగా మారారు. (అడ్వర్టోరియల్) 1. మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి (38% మంది అనుకుంటున్నారు) 2. పొదుపుగా ఉందామనుకునే వారు (29% మంది భావిస్తున్నారు) 3. ఖర్చులు తగ్గించుకోవాలని అనుకునేవారు (19% మంది భావిస్తున్నారు) 4. చాలా జాగ్రత్తగా ఉంటున్నవారు (11% మంది భావిస్తున్నారు) 5. అంతకు ముందులా ఉండేవారు (2% మంది భావిస్తున్నారు) ఈ పరిస్థితుల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో ఎప్పటిదాని కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. రెండో కేటగిరి పొదుపుగా ఉండమనుకునే వారు తమ ఖర్చులను కొద్దిగా తగ్గించుకున్నారు. ఖర్చులు తగ్గించుకోవాలి అనుకునే వారు ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఖర్చుచేయాలి అనుకునే కేటగిరి వారు కొన్ని వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. అంతకముందులానే ఉండి వారిలో ఎటువంటి మార్పులు లేవు. ఇంటర్నెట్ - ప్రతి విషయానికి ఒక కొత్త మార్గం: కోవిడ్-19 కారణంగా లాక్డౌన్లో, దాని తరువాత కూడా చాలా మంది వినియోగదారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్నెట్ ద్వారానే వారు బయట ప్రపంచంతో కలుస్తున్నారు. పనిచేయడం, వినోదం, ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకుంటున్నారు. కోవిడ్-19 కారణంగా ఇంతలా డిజిటల్ వినియోగం పెరగడం వల్ల కూడా ఆన్లైన్ కస్టమర్ల ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి. సాధారణంగా సమయంలో కన్నా లాక్డౌన్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. అదే విధంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న సమయం కూడా బాగా పెరిగింది. ఇండియాలో లాక్డౌన్ సమయంలో ప్రతి ఇంటర్నెట్ వినియోగదారుడు సగటుగా రోజుకు 21/2 గంటల సమయం గడిపాడు. సగటున వినియోగదారుడు ఏఏ విషయాలపై ఎంత సమయం వెచ్చిస్తున్నాడంటే: కేటగిరి వివరణ సగటు సమయం(నిమిషాలలో) వినోదం సినిమాలు,పాటలు, వీడియోలు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ మొదలైన అన్ని వెబ్సైట్లు చూస్తూ 28 సోషల్ నెట్వర్కింగ్ మీరు వేరే వాళ్లతో మాట్లాడటానికి వీలుగాఉండే సోషల్ మీడియా అప్లికేషన్లు అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డిన్ లాంటివి 25 సర్వీస్‌లు జీ-మెయిల్, మెసేజ్బోర్డ్లు, కోరాలాంటి వినియోగం 23 మెసెంజర్స్ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటివి 19 గేమ్స్ ఆన్లైన్లో ఆడే డిజిటల్ గేమ్స్ 12 సమాచారం/వార్తల కోసం వార్త ఛానెళ్లు చూడటం, ఒక ప్రత్యేకమైన విషయం గురించి గూగుల్‌లో వెతకడం 7 రిటైల్/ఈ- కామర్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మొదలైన ఆన్లైన్ రిటైల్ సంస్థలు, ఆన్లైన్ షాపింగ్ 4 ప్రస్తుతం వినియోగదారులు పాటిస్తున్న దినచర్యలు: కోవిడ్-19 ప్రతి ఒక్కరూ జీవించే మార్గాన్ని మార్చివేసింది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వారి సౌకర్యానలను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో వినియోగదారులు కొత్త విషయాలను అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి కేవలం కరోనా సమయంలోనే కాకుండా చాలా రోజుల వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఎక్కువ కాలం కొనసాగేలా మూడు అలవాట్లు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే 1. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం: వినియోగదారులకు సంబంధించిన వస్తువులను తయారు చేసే సంస్థలన్ని అన్ని వస్తువులను ఆరోగ్యకరంగా తయారుచేయాలి. అలా ఆరోగ్యవంతమైన వాతావరణంలో వస్తువులు తయారుచేయాడానికి ఒక ప్రణాళిక రూపొంచుకోవాలి. 2. ఆచితూచి కొనుగోలు చేయడం: వినియోగదారులందరూ వారు ఏం కొనాలి అనే విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆహారాన్ని వృధా చేయడం తగ్గిస్తున్నారు. చాలా జాగ్రత్తగా షాపింగ్ చేస్తూ అవసరమైన వాటినే కొనుగోలు చేస్తున్నారు. సీపీజీ బ్రాండ్ వీటిని దృష్టిలో పెట్టుకొని తమ ఆఫర్లను ప్రకటించాలి. 3. స్థానిక వస్తువుల కొనుగోలు: ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం లోకల్‌గా ఉండే వస్తువులను కొనడానికే వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీపీజీ బ్రాండ్లు లోకల్‌గా వినియోగదారులకు దగ్గర కావడానికి ప్రయత్నించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నప్పుడే మీ ఇష్టాలను, నైపుణ్యాలను తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వెరో (MeVero) ఈ విషయలో మీకు సాయంగా ఉంటుంది. మీ వెరో (MeVero) వరల్డ్ ఫస్ట్ డిజిటల్ పాషన్ బేస్డ్ ఇంకుబేటర్. MeVero refferal game (అడ్డ్వర్టోరియల్) మీలాంటి ఆసక్తులే ఉన్న మీ ఫ్రెండ్స్‌కు షేర్ చెయ్యొచ్చు. ప్రతి రిఫరెల్ ద్వారా మీరు 1500 డాలర్లు గెలుచుకొనే అవకాశం ఉంది. మీలాంటి ఆసక్తులు ఉన్నవారితోనే మీరు సమయాన్ని గడపవచ్చు. కరోనా వైరస్ మనతో పాటే ఉంటుంది. సీపీజీ బ్రాడ్లు దాంతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. వినియోగదారులలో ఈ మార్పులు తాత్కాలికమా? శాశ్వతమా? మీ పెట్టుబడులకు సరైన రిటర్న్ రావాలంటే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకోవాలి. (అడ్వర్టోరియల్) MeVero Referral Game - https://mevero.app.link/5FhMTkcd07 -
లైఫ్ స్టైల్ మారుతోంది
లాక్డౌన్ ప్రభావం ఇంకా చాలాకాలం ఉంటుందని, పొదుపు పాటిస్తామని చెప్పినవారు : 82% ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గు చూపినవారు : 44% స్థానిక కిరాణా దుకాణాలపైనే ఆధారపడేవారు: 70% రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లం అని చెప్పిన వారు : 63% బయటి ఆహారం తగ్గిస్తామని చెప్పిన వారు: 43% సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులు.. ఆర్థిక వనరులు, ఉద్యోగాలు, జీతాలు, ఆదా యాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల వ్యవహారశైలిలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నా యి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరి స్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆర్థిక పరిస్థితి మెరుగునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, మరో 2–3 నెలలు లేదా అంతకుమించి దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న వారి సంఖ్య 80%కి పైగా ఉంది. గృహావసరాలు, ఔషధాలు, ఆహార పదార్థాలు మినహా మిగతా ఖర్చులు తగ్గించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కువగా సమీప కిరాణా దుకాణాలపై ఆధారపడటం లేక ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, కనిష్టంగా మరో 3 నుంచి 4 నెలలు ఈ ప్రభావం ఉంటుందని జాతీయ సంస్థలు చేసిన సర్వేలు చెబుతున్నాయి. పొదుపు మంత్రం.. దిగువ, మధ్యతరగతి సహా ఎగువ తరగతిపైనా లాక్డౌన్ పెను ప్రభావాన్ని చూపింది. ఈ ప్రభావం మరో 2–3 నెలలు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు 35% మంది, మరో 4–6 నెలలు ఉంటుందని 32% మంది, అంతకుమించి ఉంటుందని 15% మంది భావిస్తున్నారని ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తంగా 82% మంది తమ ఆర్థిక వనరులను జాగ్రత్తగా వాడుకుంటామని, పొదుపు చర్యలు పాటిస్తామని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటామని సర్వేలో వెల్లడించారు. అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక ఇంటి ఆదాయం ఏప్రిల్‌లో 54శాతం తగ్గగా, అది మే నెలలో 65శాతం తగ్గిందని, మరో రెండు నెలల పాటు ఆదాయంపై లాక్డౌన్ ప్రభావం మరో 54శాతం ఉంటుందని చాలా కుటుంబాలు సర్వేల్లో తమ అభిమతాన్ని వెల్లడించాయి. ఇదే సమయంలో గృహావసర వస్తువులపై చేసే ఖర్చు ఏప్రిల్, మే నెలల్లో 49శాతం పెరగగా, మరో రెండు నెలలు 40శాతం వరకు పెరిగే అవకాశాలే ఎక్కువని వినియోగదారులు భావిస్తున్నారు. కిరాణాలే దగ్గరి దారి.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితుల్లో నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడంలో కిరాణా దుకాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. లాక్డౌన్ పరిస్థితులు, పోలీసు ఆంక్షలు, ప్రభుత్వ జాగ్రత్తల నేపథ్యంలో వినియోగదారులు సూపర్మార్కెట్లు, స్టోర్లు, మాల్స్‌కు వెళ్లడం పూర్తిగా తగ్గించారు. సూపర్ మార్కెట్లకు సరుకులు తెచ్చే వాహనాల రవాణాలో ఇబ్బందులు, గోదాముల్లో సరుకుల ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత నేపథ్యంలో పూర్తిస్థాయి సరుకుల లభ్యత తగ్గడంతో వినియోగదారులంతా కిరాణా దుకాణాల్లో కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఇంటికి దగ్గరలోనే కొనుగోలు, నాణ్యత, ప్రయాణ సౌలభ్యాల నేపథ్యంలో వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు సైతం అందుబాటులో ఉండటం వినియోగదారుల చెల్లింపులను సులభతరం చేస్తోంది. ఇక కూరగాయలు, పండ్లు విక్రయాలకు సైతం స్థానికంగా అందుబాటులోకి వచ్చిన మొబైల్ కూరగాయల దుకాణాలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. రైతుబజార్లకు, ఇతర పెద్ద మార్కెట్లకు వినియోగదారులు పెద్దగా వెళ్లడం లేదు. మరో రెండు, మూడు నెలల పాటు తమ ప్రయాణాలు, ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా స్థానిక కిరాణాలపైనే ఆధారపడే వారి సంఖ్య 70శాతం వరకు ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపే వారి సంఖ్య 44శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి. సినిమాలు, షికార్లకు ‘నో’.. లాక్డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసినా ఖర్చులపై నియంత్రణ మరో మూడు, నాలుగు నెలల పాటు ఉండనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లడం తగ్గిస్తామని 63శాతం మంది, పర్యటనలు ఆపుతామని 59శాతం, కార్లలో ప్రయాణం చేయబోమని 56శాతం, వాహనాలు కొనబోమని 41శాతం, సినిమాలకు వెళ్లబోమని 49శాతం, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు చేయబోమని 52శాతం, బయటి ఆహారం తగ్గిస్తామని 43శాతం, బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటామని 51శాతం మంది వినియోగదారులు ఇటీవల ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడించారు. ఇక ఆహారశైలినీ మార్చుకుంటున్న వినియోగదారులు కూల్‌డ్రింక్స్ స్థానంలో పాలు, పెరుగు వినియోగాన్ని పెంచారు. స్వీట్స్ వంటి వస్తువుల ఉత్పత్తికి వినియోగించే పాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మళ్లాయని, ప్యాకేజ్డ్ పాల వినియోగం లాక్డౌన్ తర్వాత 15 నుంచి 25 శాతం పెరిగిందని ఈ సర్వేలు తెలిపాయి. డ్రింక్స్‌కు బదులు ప్రతి ఇంట్లో వేసవితాపానికి విరుగుడుగా చల్లని మజ్జిగ ఎక్కువ వినియోగిస్తున్నారని, నిమ్మకాయ తదితర రసాలు తాగేందుకు అధికశాతం మంది ఆసక్తి చూపుతున్నారని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో చేసిన అభిప్రాయ సేకరణలో తేలింది. -
యూజర్ల ’అన్క్లెయిమ్డ్’ మొత్తం విద్యానిధికే
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో యూజర్లు క్లెయిమ్ చేసుకోని డబ్బును నిర్దిష్ట కాలావధి తర్వాత ’టెలికం వినియోగదారుల విద్యా, రక్షణ నిధి’కి బదలాయించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. సాధారణంగా .. అధికంగా వసూలు చేసిన చార్జీలను, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైనవి యూజర్లకు టెల్కోలు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా రిఫండ్ చేయలేకపోయిన పక్షంలో ఆ మొత్తాన్ని టెలికం నిధికి జమ చేయాలి. కానీ, ఆపరేటర్లు డిపాజిట్ చేసే నగదు విషయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయని ట్రాయ్ పరిశీలనలో తేలింది. దీనిపై టెల్కోలతో భేటీ అయింది. ఆడిటింగ్‌లో అధిక బిల్లింగ్ విషయం వెల్లడైనప్పుడు మాత్రమే కొన్ని టెల్కోలు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు తేలింది. అలాగే మరికొన్ని సంస్థలు లావాదేవీ ఫెయిలైన సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, ప్లాన్ చార్జీల వంటివి రీఫండ్ చేసేందుకు వినియోగదారుల వివరాలు సరిగ్గా దొరక్కపోయినప్పుడు, ఆ మొత్తాలను విద్యా నిధిలో జమ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు ట్రాయ్ తాజాగా సంబంధిత నిబంధనలను సవరించింది. అన్క్లెయిమ్డ్ మొత్తం.. ఏ కేటగిరీకి చెందినదైనా, పన్నెండు నెలల వ్యవధి లేదా చట్టబద్ధంగా నిర్దేశించిన గడువు పూర్తయిపోయిన పక్షంలో విద్యా నిధికి జమ చేయాలంటూ స్పష్టతనిచ్చింది. -
పరస్పర సహకారంతో మంచి ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రైల్వేకు, సరుకు రవాణాదారుకు మధ్య పరస్పర సహకారం కొనసాగితే గతేడాది సాధించిన రికార్డుకంటే మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఆశాభావం వ్యక్తం చేసారు. దక్షిణ మధ్య రైల్వే 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను భారతీయ రైల్వే లోని అన్ని జోన్లకంటే ఉత్తమ స్థాయిలో సరుకు రవాణా చేసిన రికార్డును పురస్కరించుకొని సరుకు రవాణాలో క్రియాశీలక భాగస్వామ్యంగా ఉన్న పరిశ్రమల అధికారు లు, ప్రతినిధులు, ఇతర కంపెనీలను గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో సన్మానించింది. జీఎం మాట్లాడుతూ జోన్‌లోని అధికారులు, సరుకు వినియోగదారు మధ్య విశ్వసనీయ సంబంధాలు, సమర్థవంతమైన కార్యాచరణ అమలు చేయడం, అందుబాటులోని గూడ్స్ వ్యాగన్ల వినియోగంతో సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించిందన్నారు. వినియోగదారుల ప్రతిస్పందన విలువైందని, వాటిని రైల్వే పరిగణనలోనికి తీసుకుంటుందని అన్నారు. గణనీయ స్థాయిలో సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే కొత్త మార్గాలైన, డబ్లింగ్/ట్రిప్లింగ్ మార్గాలు, విద్యుదీకరణ వంటి మౌళిక సదుపాయాల గురించి వివరించారు. జోన్ చేసిన సరుకు రవాణాలో ఎరువు, ఐరన్ వోర్, ఆహార ధాన్యాలే కాకుండా బొగ్గు (55%), సిమెంట్ (23%) తొలి 2 స్థానాల్లో నిలిచాయని అన్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి, విద్యుత్ ఉత్పత్తి కంపెనీల అవసరాలు తీరుస్తూ మొత్తం సరుకు రవాణాలో 39%, కేవలం బొగ్గు రవాణాలో 71% నమోదు చేసిందన్నారు. సమావేశంలో సీఎండీ ప్రభాకరరావు, ఏపీ జెన్కో చైర్మన్ అజయ్ జైన్, సింగరేణి కంపెనీ ఎలక్ట్రికల్ మెకానికల్ డెరైక్టర్ ఎస్.శంకర్ పాల్గొన్నారు. -
ఈ–కామర్స్ 1.2 లక్షల కోట్ల డాలర్లు!
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2021 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. అప్పటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌గా మారనుంది. డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ మార్కెట్... కొనుగోలుదారులు ఆన్లైన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో 2021 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని నివేదిక పేర్కొంది. దేశీ కరెన్సీ రూపాయి మారకం విలువపై ఒత్తిడి, క్రూడాయిల్ దిగుమతుల భారం పెరుగుతున్నప్పటికీ.. 2021–2026 మధ్య భారత రిటైల్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 7.8% మేర వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం 32% వార్షిక వృద్ధి సాధిస్తున్న భారత ఈ–కామర్స్ మార్కెట్ మరికొన్నాళ్ల పాటు మరింత అధిక వృద్ధి నమోదు చేయనుందని నివేదిక తెలిపింది. మారుతున్న కొనుగోలుదారుల ధోరణులు.. ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్లో కొనుగోలు జరిపేవారి సంఖ్య పెరుగుతుండటం, వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతుండటం తదితర అంశాలు ఈ–కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది. అటు ఎం–కామర్స్ (మొబైల్ ద్వారా కొనుగోళ్లు) కూడా భారీగా పెరుగుతోందని వివరించింది. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కోట్లుగా ఉన్న ఎం–కామర్స్ లావాదేవీల పరిమాణం 2018 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,00,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, మారుతున్న షాపింగ్ ధోరణులు, స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో వృద్ధి వంటివి ఆన్లైన్ అమ్మకాల పెరుగుదలకు తోడ్ప డ్డాయి. ఇక, ప్రథమ..ద్వితీయ..తృతీయ శ్రేణి మార్కెట్స్‌లో మిలీనియల్స్ (1980–1996 మధ్య పుట్టినవారు) ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆహారం, దుస్తులు, ఫుట్‌వేర్, యాక్సెసరీలు మొదలైన వాటి కొనుగోళ్లు అత్యధికం. సోషల్ కామర్స్ ప్రభావం... ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించి సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోందని నివేదిక పేర్కొంది. 28% మిలీనియల్స్.. సోషల్ మీడియా సిఫార్సుల మేరకు కొనుగోళ్లు జరపగా, 63% మిలీనియల్స్ తమకిష్టమైన బ్రాండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. దేశీ ఈ–కామర్స్ రంగంలో కన్సాలిడేషన్ కూడా పెరుగుతోందని, 2017, 2018లో విలీన... కొనుగోళ్ల డీల్స్ 25 శాతం మేర పెరగడమే నిదర్శనమని నివేదిక పేర్కొంది. -
నోకియా నుంచి మరో ఫోన్
హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా 106 మోడల్ ఫీచర్ ఫోన్‌ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్, చూడ్డా నికి సింపుల్‌గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్‌టైమ్, 21 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రో యూఎస్బీ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. డార్క్ గ్రే రంగులో లభించే ఈ ఫోన్ ధర రూ.1,299. -
జీమెయిల్.. న్యూలుక్
సాక్షి, నేషనల్ డెస్క్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ జీమెయిల్లో కొత్తగా 14 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల సమాచారానికి మరింత భద్రత కల్పించడంతో పాటు గోప్యతను పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు దశలవారీగా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. 1. డౌన్లోడ్, ప్రింట్ చేయకుండా బ్లాక్ వ్యాపార సంస్థల గోప్యతను పరిరక్షించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాము పంపిన ఈ–మెయిల్‌ను అవతలివారు డౌన్లోడ్, ఫార్వర్డ్, కాపీ చేయకుండా, ప్రింట్ తీసుకోకుండా బ్లాక్ చేసే సదుపాయం కల్పించింది. 2. కాన్ఫిడెన్షియల్ మోడ్ నిర్ణీత గడువు తర్వాత ఈ–మెయిల్స్ డెలిట్ అయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మోడ్‌లో అవతలివారికి ఈ–మెయిల్లో సమాచారం కాకుండా ఓ లింక్ మాత్రమే వెళుతుంది.దీనిపై క్లిక్ చేయగానే సమాచారం సాధారణ ఈ–మెయిల్లో ఉన్నట్లే కన్పిస్తుంది. 3. రెండు దశల్లో ధ్రువీకరణ అవతలి వ్యక్తి పంపిన ఈ–మెయిల్‌ను చూసేందుకు రెండు దశల్లో ఉండే ధ్రువీకరణను తీసుకొచ్చింది. ఈ–మెయిల్ అందుకున్న వ్యక్తి దాంట్లోని సమాచారాన్ని చూసేందుకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. 4. ముఖ్యమైన మెయిల్స్ కోసం స్నూజ్ వినియోగదారులు ముఖ్యమైన ఈ–మెయిల్స్‌కు జవాబివ్వడం మర్చిపోకుండా ఈ ఫీచర్‌ను తెచ్చింది. ముఖ్యమైన ఈ–మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో అన్నింటికంటే పైన కన్పించేలా ఈ ఫీచర్ ఉపకరిస్తుందని వెల్లడించింది. 5. ఆఫ్లైన్లోనూ వాడుకోవచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండని సందర్భాల్లో సైతం జీ–మెయిల్‌ను వాడుకునేలా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నెట్ ఉన్నప్పుడు జీమెయిల్‌కు వచ్చిన సమాచారం ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయిపోతుంది. 6. చెక్చేయని మెయిల్స్ కోసం అలర్ట్స్ రెండ్రోజులు దాటినా ఓపెన్ చేయని మెయిల్స్‌ను ఈ ఫీచర్ వినియోగదారుల దృష్టికి తీసుకెళుతుంది. ముఖ్యమైన ఈ–మెయిల్స్‌ను మెషీన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా గుర్తిస్తామంది. యూజర్లు అందుకున్న ఈ–మెయిల్స్‌లో ఏవైనా ప్రశ్నలుంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తామంది. 7.తెరవకుండానే అటాచ్మెంట్లు చూసేలా మెయిల్స్‌ను ఓపెన్ చేయకుండానే వాటితో వచ్చిన అటాచ్మెంట్లను చూసే ఫీచర్ తెచ్చిం ది. ఈ ఫీచర్లో అటాచ్మెంట్లు ఈ–మెయిల్ కింద కన్పించే ఐకాన్‌పై క్లిక్ చేసి చూడొచ్చు. 8. హై ప్రయారిటీ నోటిఫికేషన్లు ఈ ఫీచర్ ద్వారా ఇన్‌బాక్స్‌లో చేరే అనవసరమైన ఈ–మెయిల్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యమైన, అత్యవసరమైన ఈ–మెయిల్సే ఇన్‌బాక్స్‌లో చేరుతాయి. దీనివల్ల 97% అనవసరమైన ఈ–మెయిల్స్‌ను నిలువరించవచ్చు. 9.ఒక్క క్లిక్‌తో అన్–సబ్‌స్క్రైబ్ గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా అవసరం లేదని ఈ–మెయిల్ నోటిఫికేషన్లను ఓకే క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. 10.స్మార్ట్‌గా రిప్లై ఇవ్వొచ్చు ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని కంప్యూటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మెయిల్ అందుకున్న వ్యక్తులు సంక్షిప్తంగా తమ జవాబుల్ని పంపొ చ్చు. జీ–మెయిల్లో అప్పటికే ఉండే ఈ జవాబుల్ని కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. 11. జీమెయిల్లో స్లైడ్ ప్యానెల్ ఇతర యాప్‌లను వాడుకోవడానికి జీమెయిల్ నుంచి బయటకి వెళ్లకుండా కొత్తగా యాప్స్ ప్యానెల్‌ను తీసుకొచ్చింది. జీమెయిల్లో కుడివైపు కన్పించే ఈ ప్యానెల్లో క్యాలెండర్, టాస్క్స్ సహా పలు యాప్‌లను చేర్చారు. 12. ఆకర్షణీయంగా కన్పించేలా సరికొత్త యూజర్ ఇంటర్ఫేజ్ సాయంతో జీమెయిల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి వెబ్ వెర్షన్‌కు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. 13. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు టాస్క్స్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు సరికొత్త గూగుల్ టాస్క్స్(జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ తదితరాలు ఉండే) యాప్‌ను విడుదల చేసింది. 14. పిషింగ్ హెచ్చరికలు స్పష్టంగా.. సైబర్ నేరగాళ్లు పంపే పిషింగ్ మెయిల్స్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి హెచ్చరించేలా కొత్త ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. పిషింగ్ తీవ్రతను బట్టి ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో ప్రమాదకర ఈ–మెయిల్స్ కన్పిస్తాయని పేర్కొంది. -
ఐఫోన్ల కోసం అంత క్యూలు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్ కంపెనీ ప్రత్యేక ఎడిషన్ ‘ఆపిల్ ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు కూడా ఎప్పటిలాగే వినియోగదారులు ఒక రోజు ముందు నుంచే కంపెనీ షోరూమ్‌ల ముందు క్యూలో నిలుచున్నారు. పడిగాపులు గాశారు. ఆపిల్ కంపెనీ నుంచి ఏ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడల్లా వినియోగదారులు ఒకటి, రెండు రోజుల ముందు నుంచే షాపుల ముందు క్యూలు కడుతున్నారు. గత పదేళ్లుగా ఇదే జరుగుతోంది. ఎందుకు వినియోగదారులు ఇలా క్యూలో నిలబడుతున్నారు. చాలా మందికన్నా ముందుగానే తాము కొత్త ఫోన్‌ను అందుకోవలనా? పరిమితంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఆలస్యంగా వెళితే దొరకవనే ఉద్దేశమా? ఆపిల్ ఉత్పత్తులపైన ఉన్న క్రేజీనా? వినియోగదారుల్లో పెరిగిన కన్జూమరిజమా?, మూర్ఖత్వమా? ఆన్లైన్లో కూడా అమ్మకాలున్నప్పుడు షాపుల ముందే ఎందుకు పడిగాపులు పడాలి? ఇలా క్యూలో నిలబడడాన్ని శ్యామ్‌సంగ్ లాంటి పోటీ మొబైల్ ఫోన్ సంస్థలు యాడ్స్ రూపంలో అపహాస్యం చేస్తున్నా వినియోగదారులు క్యూలో నిలబడేందుకు ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఇలా క్యూలో నిలబడ్డవారినే ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలు చేయగా చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మొట్టమొదటి ప్రధాన కారణం మీడియానేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్యూలకు ఎక్కువ ప్రాధాన్యతను మొదటి నుంచి ఇస్తున్నది మీడియానే. మీడియాలో తాము కనిపిస్తామన్న ఉద్దేశంతో కొంత మంది వినియోగదారులు క్యూ కడుతుండగా, ఎక్కువ మంది తాము నిలబడ్డ చోటును అమ్ముకుంటున్నారు. ఈ చోటు విలువ అంతా, ఇంతా కూడా కాదు. మూడు వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటోంది. క్యూలో ముందున్న వ్యక్తి తన చోటును 30వేల రూపాయలకు విక్రయిస్తుండగా, పదవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎనిమిది నుంచి 15 వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. కొందరు తమ యాప్స్ పబ్లిసిటీ కోసం క్యూలను ఉపయోగించుకుంటున్నారు. తమ యాడ్ కలిగిన టీషర్టులు ధరించి క్యూలో నిలబడిన వారికి, వారి వారి డిమాండ్ల మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. కొన్ని యాప్స్ సంస్థలు తమ వాలంటీర్లనే డబ్బులిచ్చి నిలబెడుతున్నాయి. ఇటీవల ఐఫోన్ ఆపిల్ ఎక్స్ విడుదల సందర్భంగా సిడ్నీలో క్యూలో ముందు నిలబడిన వ్యక్తి ‘యూట్యూబర్’. ఫోన్ విడుదలపై యూట్యూబ్ డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. అందులో ప్రధానంగా కనిపించడం కోసం మొదటి స్థానంలో నిలబడ్డారు. ఇక రెండు, మూడోస్థానంలో నిలబడ్డవారు ‘డెయిలీ మిర్రర్’ వెబ్‌సైట్‌కు లైవ్ బ్లాగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఫుడ్ కంపెనీలు కూడా ఏమీ తీసిపోలేదు. తమ ఉత్పత్తులను పబ్లిసిటీ కోసం క్యూలో నిలుచున్న వారికి ఉచితంగా అందజేస్తున్నాయి. గ్రెగ్స్, డామినోస్, నండోస్, సబ్వే కంపెనీలు ఈ విషయంలో పోటీ పడ్డాయి. తమ ఉత్పత్తులను వినియోగదారులు తింటుంటే మీడియాలో వాటి బ్రాండ్ల పేర్లు కనిపిస్తాయన్నది ఆహార కంపెనీల ఆశ. చారిటీ సంస్థల ప్రతినిధులు కూడా నిధుల కోసం క్యూలో నిలబడుతుండడం విశేషం. ఇలా ఆపిల్ క్యూల వెనక ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అందరికన్నా ఎక్కువ ప్రయోజనం మాత్రం ఆపిల్ కంపెనీకే. -
విద్యుత్ ఫోరంతో సమస్యల పరిష్కారం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ ఫోరంను అందుబాటులోకి తీసుకువచ్చామని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కన్సూ్యమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరమ్ చైర్పర్సన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డి.ధర్మారావు అన్నా రు. శనివారం స్థానిక డీఈఈ కార్యాలయంలో విద్యుత్ విని యోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పలు సమస్యలపై ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ధర్మారావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు, బిల్లింగ్‌లో సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడానికి నిరాకరణ, ఇతర సమస్యలను ఫోరం తక్షణమే పరిష్కరిస్తుందన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1912ను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్ 2 నుంచి ఇప్పటివరకు 201 కేసుల విషయంలో తీర్పులు చెప్పామన్నారు. బిల్లింగ్‌లో 112, మీటరు సమస్యలు 8, లోవోల్టేజీ సమస్యలు 10, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఫోరం ఏర్పాటుతో 5 జిల్లాల్లోనూ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అధికారులు కె.బాలాజీ, పీవీ రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, డీఈఈ ఎస్.జనార్దన్‌రావు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
హక్కుల వినియోగంతోనే మోసాలకు చెక్
- వినియోగదారుల సంఘాల పటిష్టతకు చర్యలు - పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపు - కర్నూలులో జాతీయ వినియోగదారుల రాష్ట్రస్థాయి వేడుకలు కర్నూలు(అగ్రికల్చర్) : గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వినియోగదారుల సంఘాలను పటిష్టం చేసి వినియోగదారుల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. గురువారం కర్నూలులో జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్రస్థాయి వేడుకలు కనులపండువగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు ఎక్కడెక్కడ ఏ విధంగా మోసపోతున్నారు, కార్బైడ్‌తో మాగించిన, సహజసిద్ధంగా మాగిన పండ్ల తేడాలు, మందుల్లో నకిలీలను గుర్తించే విధానం, తూకాలు, కొలతల్లో అక్రమాలు, కల్తీ విత్తనాలు, ఎరువులను గుర్తించడం తదితర వాటికి సంబంధించి అవగాహన కోసం సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వీటిని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు, ఇతర ప్రముఖులు స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు కర్నూలులో జూట్ బ్యాగుల తయారీ కేంద్రాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో సునీత మాట్లాడుతూ వినియోగదారులు ఏ రూపంలోనూ మోసపోకుండా ఉండాలంటే ముందుగా అందుకు సంబంధించి చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎలాంటి వస్తువును కొనుగోలు చేసినా విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. నాణ్యత లేకపోతే వినియోగదారుల ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చని వివరించారు. గ్యాస్ పంపిణీలో మోసపోకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హక్కుల పరిరక్షణకు కృషి .. రాష్ట్ర వినియోగదారుల ఫోరం జడ్జి జస్టిస్ నౌషద్ అలీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఫోరం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వినియోగదారుల కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ ఏడాది కర్నూలులో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలో 1.34 కోట్ల మంది కార్డుదారులున్నారని, వీరందరూ ప్రభుత్వ వినియోగదారులని తెలిపారు. వీరికి ఇచ్చే సరుకుల్లో ఎక్కడా దగాకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసి బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో స్టేట్ ఇన్ఫర్మేషన్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం రావాలని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత సామాన్య కూలీ మొదలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, వీరి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి అన్నారు. వీరితో పాటు జంతువులు, పక్షులు కూడా వినియోగదారుల కిందికే వస్తాయని, గాలి, వాతావరణం కలుషితం అవుతుండటం వల్ల ఇవి కూడా దెబ్బతింట్నునాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీపై చర్యలు తీసుకునేందుకు స్థానిక సంస్థలకు సర్వాధికారాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తదితరులు ప్రసంగించారు. కేవీఆర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన 'వినియోగదారుడా... మేలుకో' నాటకం ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ రామ్మోహన్, డీఎస్ఓ శశిదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, జిల్లా వినియోగదారుల సేవా కేంద్రం ఇన్చార్జి నదీం హుసేన్, జిల్లా వినియోగదారుల రక్షణమండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్‌రెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీటీసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
18 నుంచి ప్రపంచ వినియోగదారుల వారోత్సవాలు
–డీఎస్ఓ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ప్రపంచ వినియోగదారుల వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి(డీఎస్ఓ) శశిదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ...ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురష్కరించుకుని హైస్కూల్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియంలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. హైస్కూల్ విద్యార్థులకు డీఈఓ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కేవీఆర్ కళాశాల ప్రిన్స్‌పాల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని, మొదటి స్థానంలో గెలిచిన వారికి రూ.3000, రెండో స్థానంలో గెలిచిన వారికి రూ.2000, తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.1500 నగదు బహుమతులు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే మొదటి స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. వారోత్సవాల్లో భాగంగా 24న కర్నూలులో పెద్ద ఎత్తున ర్యాలీ, సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
వినియోగదారుల సమస్యలు తీర్చే కొత్త యాప్!
సెల్ ఫోన్ బుక్ చేస్తే... కీ చైన్ రావడం..., ఓ కంపెనీ ప్రొడక్టు బుక్ చేస్తే మరో కంపెనీది రావడం ఇలా తరచుగా మనం ఆన్ లైన్ షాపింగ్ ఇబ్బందులు చూస్తూనే ఉంటాం. బిజీ లైఫ్ లో వీకెండ్ షాపింగ్ కు సమయం వెచ్చించలేని వారు ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడుతుంటారు. అత్యంత సులభం అనుకునే ఆన్ లైన్ షాపింగ్ ఒక్కోసారి కొనుగోలుదారులకు కష్టాలను కొని తెచ్చిపెడుతుంటుంది. అయితే తాము బుక్ చేసిన ఉత్పత్తులు సరిపోలకుండా.. వచ్చినప్పుడు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఆ ఫిర్యాదులను అత్యంత త్వరగా పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో 'కన్జూమర్ కనెక్ట్' పేరున ఓ మొబైల్ యాప్ వచ్చింది. దీంతో ఎప్పటికప్పుడు కస్టమర్ల సమస్య తీరే అవకాశం ఉంది. సత్యమూర్తి అనే యువకుడు తన ప్రయాణం కోసం ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీలో అరవై వేల రూపాయలతో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. కానీ అత్యవసర పరిస్థితుల్లో అతని ప్రయాణం ఆగిపోయింది. దీంతో సత్యమూర్తి తన డబ్బు తిరిగి ఇవ్వమని కంపెనీకి ఫిర్యాదు చేశాడు. కంపెనీ నుంచీ కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తిరిగి రావడంతో ఆశ్చర్యపోయిన అతడు...కన్జూమర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకున్నాడు. సమస్యను పరిశీలించిన సీ.ఏ.ఐ సత్యమూర్తికి ఫిర్యాదు విషయంలో సహాయపడింది. దీంతో 55 వేలు రిఫండ్ కూడ వచ్చాయి '' ఇది పూర్తిగా కంపెనీల తప్పు కాదు, మనం కొనుగోలుదారులుగా తగిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్యను వెంటనే వినియోగదారుల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో తక్షణ సేవలు అందించేందుకు సీఏఐ అందుబాటులో ఉంది.'' అంటున్నారు సీఏఐ సంస్థ ఫౌండర్ ట్రస్టీ కె. కృష్ణ కుమార్. కష్టమర్ల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలతో ఫాలోఅప్ చేసి సహాయం అందించేందుకు 2001 లో సీ.ఏ.ఐ ప్రారంభమైంది. సీ.ఏ.ఐ టీమ్ కేవలం ఒక్క నెల్లోనే కస్టమర్ల సమస్యను తీర్చేందుకు కూడ సహాయ పడుతోంది. అక్కడితో ఆపకుండా ఇప్పుడు కస్టమర్లకు మరింత అందుబాటులో ఉండేందుకు సంస్థ కొత్తగా 'కన్జూమర్ కనెక్ట్' పేరున మొబైల్ యాప్ విడుదల చేసింది. దీంతో కస్టమర్లు ఎవర్ని కలవాలి అన్న సందేహం లేకుండా ఎప్పటికప్పుడు తమ చేతిలో ఉండే యాప్ ద్వారానే ఫిర్యాదులు చేయొచ్చునని సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. మొబైల్ యాప్ తో కస్టమర్ స్వయంగా కంప్లైంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం సంస్థలోని పదకొండు మంది టీమ్... వచ్చిన కంప్లైంట్ లను మెయిల్స్ ద్వారా ఆయా కంపెనీలతో ప్రదించి పరిష్కరానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా నెట్ వర్క్ అందుబాటులో లేని సమయంలో కూడ అప్లికేషన్ పూర్తి చేసే అవకాశం ఈ యాప్ లో ఉంది. పూర్తిచేసి సిద్ధంగా ఉంచిన ఫిర్యాదును నెట్ వర్క్ ద్వారా పంపించవచ్చు. తాము అందుకున్న ఉత్పత్తుల ఫొటోలను కూడా తీసి కూడ యాప్ ద్వారా పంపించవచ్చు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కస్టమర్లు వార్షిక రిజిస్ట్రేషన్ ఫీజు కడితే సరిపోతుంది. త్వరలో సంస్థ వినియోగదారులకు అదనంగా సహాయం అందించేందుకు కన్జూమర్ ఇంటర్నేషనల్, కన్జూమర్ వరల్డ్ ఫెడరేషన్ గ్రూపులతో సంప్రదించి తమ సేవలను మరింత విస్తరించనుంది. -
పటిష్టమైన నెట్వర్కే మా బలం..
బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం పి.వి. మురళీధర్ - త్వరలో 21.6 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మొబైల్ నెట్ - మా వినియోగదార్లకు కాల్ డ్రాప్ సమస్యే లేదు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సర్వీసుల వేగాన్ని పెంచుతోంది. పారదర్శకతకు తోడు ప్రైవేటు టెల్కోల కంటే తక్కువ ధరకే మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తూ... కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు పెద్ద ఎత్తున 3జీ టవర్లను, వైఫై హాట్‌స్పాట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. తదుపరి తరం నెట్‌వర్క్‌తో వినూత్న సేవలందించటంపై దృష్టిపెట్టామని, తమకున్న బ్రాండ్ ఇమేజ్‌తో రానున్న రోజుల్లో టెలికం రంగంలో సంచలనాలకు తెర తీస్తామని బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వి.మురళీధర్ చెప్పారు. సర్కిల్లో చేపట్టిన విస్తరణ, సంస్థ నూతన సేవల గురించి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యాంశాలివీ... కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతోంది. మీ వినియోగదారుల క్కూడా...? అలాంటిదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) సర్కిల్లో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు 2జీ టవర్లు 7,518, 3జీ టవర్లు 3,113 ఉన్నాయి. 2014-15లో మొత్తం 3,600 టవర్లను ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి 1,126 మండలాలను, 20 వేలకుపైగా గ్రామాలను కవర్ చేశాం. 450 పట్టణాల్లో 3జీ సేవలు అందుబాటులోకి తెచ్చాం. 2015-16లో రూ.200 కోట్లతో 1450 దాకా కొత్త 3జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా కొత్తగా 700 పట్టణాలకు 3జీ సర్వీసులను విస్తరిస్తాం. ఈ స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించటంతో మా వినియోగదారులకు కాల్ డ్రాప్ సమస్యే లేదు. అది మేం గట్టిగా చెప్పగలం. ఇతర కంపెనీల మాదిరి మీరూ డేటాపై దృష్టి పెడుతున్నారా? మాకు ఈ సర్కిల్లో 95 లక్షల మంది మొబైల్ చందాదారులున్నారు. నెలకు కొత్తగా 1.2 లక్షల కస్టమర్లు జతవుతున్నారు. దాదాపు అంతా డేటా వాడుతున్నవారే. అందుకే వేగవంతమైన నెట్‌పై ఫోకస్ చేశాం. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు త్వరలో మరింత స్పీడ్‌ను అందుకుంటారు. ప్రస్తుతం 14.4 ఎంబీపీఎస్ వేగం ఇస్తున్నాం. డిసెంబర్‌కల్లా దీనిని 21.6 ఎంబీపీఎస్‌కు చేరుస్తాం. 4జీ సేవల్లోకి ప్రవేశిస్తున్నారా? మా కొత్త టెక్నాలజీతో 4జీని కూడా అందించే వీలుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీని వాడాం. 4జీ సేవలు ఎప్పుడు ప్రారంభించేదీ కేంద్ర కార్యాలయం నిర్ణయిస్తుంది. బ్రాడ్ బ్యాండ్ సంస్థలు తక్కువ ఖర్చుకే నెట్ అందిస్తున్నాయి. మరి మీరు? హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో 700 దాకా వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశాం. రెండు నెలల్లో మరో 450 వస్తాయి. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 4,000 హాట్‌స్పాట్స్ వస్తాయి. కస్టమర్లు నెట్ వ్యయాన్ని 70-80% ఆదా చేసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయి. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించేందుకు ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) సేవల్ని హైదరాబాద్‌సహా 10 ప్రాంతాల్లో ప్రారంభించాం. 6,000 పైగా కస్టమర్లున్నారు. కొత్త సేవలేమైనా ప్రారంభిస్తున్నారా? ఎక్స్ఛేంజీలను తదుపరి తరం నెట్వర్క్ టెక్నాలజీతో ఆధునీకరిస్తున్నాం. దీంతో ల్యాండ్‌లైన్ వినియోగదారులు మరిన్ని సేవలు పొందే వీలుంది. దేశంలో ఎక్కడున్నా క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌గా (సీయూజీ) ఏర్పడి... అపరిమితంగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. సభ్యుల సంఖ్యనుబట్టి నెలకు కొంత అదనంగా చెల్లించాలి. గతంలో ఒక ఎక్స్ఛేంజ్ పరిధిలో మాత్రమే సీయూజీకి అవకాశం ఉండేది. అలాగే మొబైల్‌కు వచ్చిన కాల్‌ను ల్యాండ్‌లైన్‌కు బదిలీ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ సేవలు 5 నెలల్లో ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. మీ సర్కిల్ ఆదాయం సంగతో...? 2014-15లో ఇక్కడ రూ.2,321 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. గత జూలైతో పోలిస్తే ఈ జూలైలో జీఎస్‌ఎంలో 5 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో 4 శాతం వృద్ధి నమోదైంది. 2018 కల్లా బీఎస్ఎన్ఎల్ను లాభాల్లోకి తేవాలన్న సంస్థ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ధరలు, ప్యాక్‌ల విషయంలో అంతా పారదర్శకం. ఇదే మాకు కలిసి వచ్చే అంశం. సిబ్బందిని ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేస్తున్నాం. 45,000లకుపైగా టచ్ పాయింట్లున్నాయి. ఈ ఏడాది 10 శాతం పెంచుతాం. -
సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా
- వంట గ్యాస్ ప్రమాదానికి రూ.40 లక్షల బీమా! - వినియోగదారునికి తెలియకుండా దాచిఉంచిన ఇంధన కంపెనీలు, డీలర్లు సంగారెడ్డి టౌన్: వంట గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే వినియోగదారునికి రూ. 40 లక్షలు బీమా కవరేజ్ ఉంది. అంతే కాకుండా సిలిండర్ పేలి బతికి బయట పడ్డ వారికి కూడా రూ. 30 లక్షల బీమా ఇవ్వాలని నిబంధన కూడా ఉంది. అయితే ఈ విషయం ఎంతమంది వంట గ్యాస్ వినియోగించే వినియోగదారులకు తెలుసనేది ప్రశ్న? ప్రమాదాలు జరిగిన వారికి ఇంధన కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిన సందర్భాలున్నాయి? ఆలోచించాల్సిందే. వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. సదరు వినియోగదారుడు బీమాకు అర్హుడవుతాడు. ఈ విషయం గ్యాస్ కంపెనీలలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు తెలియపోవడం విడ్డూరం. ఉద్యోగస్తులకే తెలియంది సామాన్యులకు ఎలా తెలుస్తుంది. అంతే కాదు.. గ్యాస్ కనెక్షన్ తీసుకోవడంతోనే తమకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని వారికే తెలియదాయే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిబంధన ప్రకారం వంట గ్యాస్ వినియోగదారులందరికీ కంపెనీలు బీమా చేస్తారు. ఈ విషయం గ్యాస్ వినియోగదారులకు సంబంధిత డీలర్లు చెప్పడం లేదు. అసలు వారికి కూడా ఈ విషయం తెలుసనేది సందేహం. ఎందుకంటే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కుమ్మక్కై ఇలాంటి ముఖ్య సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు. ఇప్పటి వరకు కొన్ని వందల గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలు జరిగాయి. ఏ ఒక్కరికి ఈ పాలసీ ద్వారా లబ్ధిపొందిన దాఖలాలు లేవు. వంట గ్యాస్ ప్రమాదాలు జరిగిన వెంటనే వినియోగదారులు సంబంధిత డీలరుకు విషయం తెలుపాలి. ఆ డీలర్ ఈ విషయం కంపెనీకి తెలపాల్సి ఉంటుంది. విచారణ జరిపి బాధితునికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం రహస్యంగా ఉండడం శోచనీయం. ఈ విషయంపై వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 18002333555కు ఫిర్యాదు చేయవచ్చు. -
వినియోగదారుల ఫోరంపై హైకోర్టు కీలక సందేహం
ఉన్న దానిపై స్పష్టతనివ్వకుండా తిరిగి ఫోరంలు ఏర్పాటు చేయవచ్చా..? సందేహం వ్యక్తం చేసిన జస్టిస్ నాగార్జునరెడ్డి విచారణ డిసెంబర్ 29కి వాయిదా సాక్షి, హైదరాబాద్: ఏపీ వినియోగదారుల ఫోరం ఉండగానే, దాని సంగతి తేల్చకుండా ఇరు రాష్ట్రాలూ కూడా తమ తమ రాష్ట్రాలకు కొత్త వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కీలక సందేహాన్ని లేవనెత్తింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల ఫోరం పరి స్థితి ఏమిటో స్పష్టతనివ్వకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేస్తూ జీవోలు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. తెలంగాణకు ప్రత్యేక ఫోరం ఏర్పాటు కావడంతో ప్రస్తుత కమిషన్ తెలంగాణ రాష్ట్ర కేసులను విచారించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ఫోరంను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ తెలంగాణ రాష్టానికి ఉందని, అయితే ప్రస్తుత ఫోరం ఉండగానే మరో ఫోరంను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. ప్రస్తుత ఫోరంపై స్పష్టతనివ్వకుండా, అసలు వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని నిబంధనలకు సవరణలు చేయకుండా ఇరు రాష్ట్రాలూ స్వతంత్ర వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేసుకోవచ్చా.. అని న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. దీనిపై వాదనలు వినిపించాలని ఇరు రాష్ట్రాల అడ్వకేట్ జనరళ్లను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ ద్వారా తమ వైఖరి ఏమిటో తెలియ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేస్తూ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. -
అమెరికాను మించిపోయాం!
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్సైట్లకు అక్కడికంటే భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఉండటం. కొన్నింటిలో దాదాపు సమానంగా ఉండటం గమనార్హమని ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై ఓ కన్నేసి ఉంచే సంస్థ అలెక్సా తెలిపింది. ఇవేవీ చెత్త వెబ్సైట్లు కాకపోవడం..మేధో సమాజంగా భారత్ ఎదుగుతోందనేందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వెబ్సైట్లు ఏవంటే... కోరా... ప్రశ్న, జవాబు మనవే..! ఫేస్బుక్ మాజీ ఉద్యోగులు ఇద్దరు కలిసి మొదలుపెట్టిన వెబ్సైట్ ఇది. ఇది సెర్చ్ ఇంజిన్‌లా పనిచేస్తుంది. అదే సమయంలో వికీపీడియా మాదిరిగా సందేహాలపై వివరాలనూ అందిస్తుంది. వికీపీడియాలో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే ఒక చిక్కు ఉంది. ఆ అంశానికి సంబంధించిన పదాలను ఎంటర్ చేయగానే విసృ్తత స్థాయిలో సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దాంట్లో మనకు కావాల్సిన సమాచారం ఏమిటో తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది. కోరాలో ఇలా కాదు. ఇందులో ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు. సింపుల్ కీవర్డ్‌తో సెర్చ్ చేయవచ్చు. కోరాలో కనిపించే కొన్ని ప్రశ్నలు ఇలా ఉంటాయి. ‘How is school life in different countries?" or "What is the worst part about working at Google?"భారతీయ వినియోగదారులు పెరిగిన తరువాత "What does it feel like to get married through BharatMatrimony?"వంటి ప్రశ్నలు పెరిగిపోతున్నాయి!!! భారత్‌లో వినియోగదారులు 35.6 శాతమైతే అమెరికాలో ఇది 25.6 శాతంగా ఉంది. చాటింగ్ కోసం ఒమెగ్లే... అమెరికాతో సమానమైన వినియోగదారులు ఉన్న ఛాటింగ్ వెబ్సైట్ ఇది. అపరిచితులతో మాటామాటా కలిపేందుకు, అభిరుచులు పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. 2009లో మొదలైన ఈ వెబ్‌సైట్‌కు భారత్‌లో 18 శాతం వినియోగదారులుంటే అమెరికాలో ఒక శాతం ఎక్కువ వినియోగదారులు ఉన్నారు. టెక్ట్స్, వీడియో ఛాటింగ్ రెండింటికీ అవకాశముంది. అసలు పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేని కారణంగా కొంతమంది ఈ సైట్‌ను అడల్ట్ ఛాటింగ్కూ ఉపయోగిస్తున్నట్లు అలెక్సా చెబుతోంది. స్టంబుల్ అపాన్.... గూగుల్‌లో మనం కొన్ని వేలసార్లు వివిధ అంశాలపై సెర్చ్ చేసి ఉంటాం. ఎప్పటికప్పుడు వెతుక్కోవడం, ఆ తరువాత మరచిపోవడం మనకు అలవాటు. స్టంబుల్ అపాన్ అలా కాదు. మీరు గతంలో జరిపిన సెర్చ్‌ల హిస్టరీని గుర్తుంచుకుని ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని అప్పుడప్పుడూ ఇస్తూంటుంది. అదే సమయంలో మనం కూడా ఏదైనా ఆసక్తికరమైన సమాచారాన్ని గుర్తించినప్పుడు ఆ లింక్‌లను వెబ్సైట్లో పోస్ట్ చేయవచ్చు. భారతీయ వినియోగదారులు ఎప్పటికప్పుడు పెరిగిపోతూండటం వల్ల ఈ వెబ్సైట్లో త్వరలోనే ఇదే తరహా కంటెంట్ కూడా పెరిగిపోతుందని అంచనా. ప్రోగ్రామర్ల కోసం స్టాక్ఓవర్ఫ్లో... ఇది ప్రోగ్రామర్లు పరస్పర సహకారం అందించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ వేదిక. ప్రోగ్రామింగ్‌లో వచ్చే సమస్యలను ఇక్కడ పోస్ట్ చేస్తూంటారు. ఈ సమస్యలకు ఎవరు సరైన సమాధానం పోస్ట్ చేస్తారో వారికి ‘రెప్యుటేషన్ పాయింట్లు’ దక్కుతాయి. ఎవరికి ఎన్ని పాయింట్లు ఉంటే అంత పాపులర్ అన్నమాట. భారతీయ ఐటీ ఇంజినీర్లు ఈ వెబ్‌సైట్‌ను వాడటం ఎక్కువ కావడంతో మిగిలిన వినియోగదారులు పాపులారిటీ చార్ట్‌లో బాగా వెనుకబడి పోతున్నారట. సహజంగానే భారతీయ ఐటీ ఇంజినీర్లే ఈ వెబ్సైట్ టాప్‌లిస్ట్‌లో ఉన్నారు. -
4 నుంచి రాజమండ్రిలో వైఎస్సార్సీపీ సమీక్షలు
మళ్లీ పెరిగిన ధరలు రెండు నెలలు గడవకముందే షాకిచ్చిన డెయిరీ లీటర్‌కు రూ. 2 వడ్డన నేటి నుంచి అమలు అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌లైన్: వినియోగదారులకు విశాఖ డెయిరీ మళ్లీ షాకిచ్చింది. రెండు నెలలు తిరక్క ముందే పాల ధర మళ్లీ పెంచింది. లీటరుకు రెండు రూపాయలు పెంచుతూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ధరలు ఆదివారంనుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో, ఈ ఏడాది ఏప్రిల్ 5న ధరలు పెంచిన డెయిరీ యాజమాన్యం రెండు నెలలు గడవకముందే మళ్లీ పెంచి సామాన్యుడిపై విపరీతమైన భారం మోపింది. ఇప్పటికే మోయలేని ధరలతో సతవుతవువుతున్న ప్రజలకు ఇప్పుడు పాల ధర మరో సమస్యగా మారనుంది. విశాఖ డెయిరీ గత ఏడాదిన్నర కాలంలో పాలరేట్లను పెంచడం ఇది ఆరోసారి. దీంతో సగటు వినియోగదారుడు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి తలెత్తింది. 2012 ఫిబ్రవరి, జూన్, గత ఏడాది మార్చి, సెప్టెంబర్లలో ఈ ఏడాది ఏప్రిల్‌లోని ప్రతిసారి రెండేసి రూపాయల వంతున ధర పెంచడంతో ఆ భారం ఒక్కో లీటరుకు పది రూపాయలనుంచి రూ.40 వరకు పెరిగింది. విద్యుత్ కోత, సిబ్బంది సమస్య, పెరిగిన ఇంధన ధరలు, పాల సేకరణ ధరల వంటి అనేక కారణాలు చూపుతూ ధరలు పెంచుతున్నట్టు డెయిరీ తెలిపింది. రైతుల నుంచి పాల సేకరణ తక్కువగా ఉండడంతో నిర్వహణ కష్టమవుతోందని ప్రకటనలో పేర్కొంది. -
ధరల పెంపు తప్పదు రూపాయి పతనం ప్రభావం
న్యూఢిల్లీ: రూపాయి పతనంతో కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ పడిపోతుండటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగి వాహన కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో అవి ధరల పెంపును ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచగా, మరికొన్ని కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి. ఇక్కడ జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) వార్షిక సమావేశంలో పాల్గొన్న కొన్ని కంపెనీల అధినేతలు ధరల పెంపుపై మాట్లాడారు. ఆ వివరాలివీ... టయోటా వడ్డింపు అక్టోబర్ నుంచి! రూపాయి పతనం ఇలాగే కొనసాగితే అక్టోబర్ నుంచి కార్ల ధరలను పెంచే అవకాశాలున్నాయని టయోటా కిర్లోస్కర్ డిప్యూటీ ఎండీ, సీఓఓ(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) సందీప్ సింగ్ చెప్పారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రభావం చూపలేకపోయాయని సందీప్ పేర్కొన్నారు. ఈ నెల 10 కల్లా ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయం రూపాయి క్షీణతతో ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. తమ మార్జిన్లపై రూపాయి పతన ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా ఎండీ (ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్) అర్వింద్ సక్సేనా చెప్పారు. ఈ నెల 10 కల్లా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. వ్యయాలు భరించలేం: ఫోర్డ్ రూపాయి పతన ప్రభావాన్ని తట్టుకోవడానికి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ జోగిందర్ సింగ్ చెప్పారు. ఉత్పత్తి, రవాణా వ్యయాలు భరించగలిగే స్థాయికి మించి పెరిగిపోయాయని అన్నారు. తోడ్పాటు అవసరమే..: మంత్రి ప్రఫుల్ పటేల్ అమ్మకాలు కుదేలై అల్లాడుతున్న వాహన రంగానికి ప్యాకేజీ కావలసిందేనని భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ విషయమై చర్చించడానికి వాహన రంగ ప్రతినిధులను ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి పి. చిదంబరం దగ్గరకు తీసుకువెళతానని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన సియామ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగ కళ కలే పండుగల సీజన్లో అమ్మకాలు ఏమంతగా పుంజుకోకపోవచ్చని వాహన కంపెనీలు భావిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా అమ్మకాలు స్వల్పంగానే పెరుగుతాయని, గత ఏడాది పండుగ సీజన్లో ఉన్నట్లుగా ఉండకపోవచ్చని మహీంద్రా ప్రెసిడెంట్ పవన్ గోయెంకా చెప్పారు. సాధారణంగా పండుగల సీజన్లో అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని, ఈ సారి మాత్రం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని 8-10 శాతం వృద్ధే ఉండొచ్చని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ, సీఓఓ(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) సందీప్ సింగ్ చెప్పారు. ఏ ఏడాదికి ఆ ఏడాది పండుగ సీజన్ అమ్మకాలు తగ్గుతున్నాయని టాటా మోటార్స్ కార్ల్ సిమ్ పేర్కొన్నారు. మందగమనం ఉన్నా, ముందుకే అమ్మకాల్లేక కుదేలైన వాహన పరిశ్రమలో పలు కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలకు కట్టుబడి ఉన్నాయి. రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను కొనసాగిస్తామని, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్(ఆటోమోటివ్) పవన్ గోయెంకా పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రదేశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ ప్రకారమే, తమ పెట్టుబడి ప్రణాళికలు కొనసాగుతాయని టాటా మోటార్స్ పేర్కొంది. అమ్మకాలు తగ్గుతున్నప్పటికీ తమ పెట్టుబడి ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని కంపెనీ ఎండీ కార్ల్ సిమ్ చెప్పారు. పారదర్శకంగా ప్రభుత్వ విధానాలు వృద్ధి మందగమనాన్ని తట్టుకోవటానికి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని వాహన కంపెనీ అధినేతలు సూచించారు. రాజకీయాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ వైఫల్యం తదితర అంశాల గురించి మాట్లాడవద్దని ఫోర్స్ మోటార్స్ చైర్మన్ అభయ్ ఫిరోదియా వ్యాఖ్యానించారు. వాహన రంగంలో వృద్ధికి, స్థిరమైన, పారదర్శకమైన విధానాలను ప్రభుత్వం ప్రకటించాలని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సాహ్ సూచించారు.