న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment