ministry
-
ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!
ఇంతకుముందు "జనాభా నియంత్రణ" అంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ కథే అడ్డం తిరిగింది. బాబు.. "పిల్లల్ని కనండి ప్లీజ్" అంటూ వెంటపడుతున్నాయి దేశాలు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. అందుకోసం ఆయా దేశాల అధికారులు జననాల రేటు పెంచేందుకు తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు చూస్తే.. మరీ ఇంతలా దిగజారిపోవాలా..! అనుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు పిల్లలు వద్దు అని ప్రజల మనసుల్లో పాతకునేలా చేశాం. ఇప్పుడు కావాలంటే..ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు కూడా. జనాభాని పెంచేందుకు ఆయా దేశాలు అమలు చేస్తున్న స్కీమ్‌లు, విధానాలు వింటే గోప్యతకు భంగం వాటిల్లేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతలా ఆయా దేశాలు జనాభాను పెంచేందుకు ఏం చేస్తున్నాయనే కదా..!రష్యాలో జనాభా దారుణంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి జననాల రేటుని పెంచాలనే నిర్ణయానికి వచ్చేసింది రష్యా. అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను(సెక్స్ మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసి జననాల రేటుని పెంచే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించింది. ఆ విషయమై పిటిషన్‌ని కూడా దాఖలు చేశారు అధికారులు. ఇది జనాభాను పెంచే రష్యా పార్లమెంట్ కమిటీ అధిపతి నినా ఒస్తానియా సమీక్షలో ఉంది. పని ప్రదేశాల్లో కూడా జంటలను ఎక్కువ విరామం తీసుకుని పిల్లలనే కనేలా ప్లాన్ చేసుకోండని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అక్కడితో ఆగలేదు ఆఖరికి బెడ్రూంలోకి కూడా ఎంటర్ అయ్యిపోయే స్థాయికి దిగజారిపోయింది రష్యా ప్రభుత్వం. దయచేసి బెడ్రూంలోకి రాగానే పౌరులంతా మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది. అంతేగాదు పిల్లలను కనేలా ప్రోత్సహిస్తూ..జంటలకు రూ. 4 వేల రూపాయలు అందిస్తోంది. అదే కొత్తగా పెళ్లైన జంటలకు హోటల్లో గడిపేందుకు ఖర్చులు కింద ఏకంగా రూ. 22 వేల రూపాయల వరకు అందిస్తోంది. అలానే 18 నుంచి 23 మధ్య వయస్సు గల మహిళలకు బిడ్డను కనేలా రూ. 98,029 ఇస్తున్నారు. మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల వరకు పారితోషకం ఇవ్వడం విశేషం. అంతేగాదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఫ్యామిలీ ప్లాన్ గురించి, వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన డేటాను సేకరిస్తారు. దీంతోపాటు గతంలో పిల్లలను కలిగి ఉన్నారా..ఎంతమంది కావాలనుకుంటున్నారు వంటి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. ఇతర దేశాల్లో..దక్షిణ కొరియాఈ దేశంలో జననాల రేటు ఘోరంగా తగ్గిపోతోంది. అక్కడి ప్రభుత్వాలు ఈ విషయమై రకరకాలుగా సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే పార్క్‌లు, పబ్లిక్ మ్యూజియంలలో ప్రజలు వివాహాలు చేసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. జస్ట్ జంటలుగా మారితేనే రూ.30,270 చెల్లిస్తోంది. అంతేగాదు వివాహం గురించి మాటలు జరిగితేనే ఏకంగా రూ. 60540 పారితోషకం అందిస్తోందట. ఇక పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ. 1210810ల పారితోషకాన్ని గిఫ్ట్‌గా పొందొచ్చు. జపాన్జపాన్ ప్రభుత్వం వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ. 3 లక్షలు పైనే చెల్లించేలా ఓ ప్రత్యేక స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆకర్షించేలా.. వివాహానికి సంబంధించిన పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో పడింది.చైనాచైనా ఒకప్పుడు ఒకే బిడ్డ అనే పాలసీతో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర జనాభా కొరతతో పోరాడుతోంది. చైనా అంతట జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలను కనండి అంటూ ఉద్యోగులకు ఎన్నో వెసులుబాటులు, సౌకర్యాలు కల్పిస్తోంది. మూడో బిడ్డను కనేవారికి ఏకంగా రూ. 3లక్షలుగా పైగా విలువైన సబ్సిడీలను కూడా అందిస్తోంది.(చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?) -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
నిజమాడితే నేరమా!
‘వాస్తవాలు మొండిఘటాలు. అవి ఓ పట్టాన లొంగవు. గణాంకాలు అలా కాదు... అవి ఎటువంచితే అటు వంగుతాయి’ అంటాడు విఖ్యాత రచయిత మార్క్ ట్వైన్. పాలకులు గణాంకాలను ఇష్టానుసారం మార్చితే... నిజాలకు మసిపూస్తే ప్రమాదం. అయితే ఏ దేశంలోనైనా జరిగేది అదే అంటారు నిరాశా వాదులు. ఆ మాటెలా వున్నా కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ సేన్ ఆధ్వర్యంలోని గణాంకాల స్థాయీ సంఘాన్ని ఇటీవల రద్దు చేసిన తీరు వాంఛనీయం కాదు. ఎన్ని విమర్శలున్నా, లోపాలున్నా గణాంకాలు పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకానికైనా, రూపొందించే ఏ విధానానికైనా గణాంకాలే ప్రాతిపదిక. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించే సర్వేల ప్రక్రియ ఎలావుండాలో, పరిశోధనకు వేటిని పరిణనలోకి తీసుకోవాలో, దాని నమూనా ఏ విధంగా ఉండాలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయటం గణాంకాల కమిటీ ప్రాథమిక విధి. దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు గణాంకాల మంత్రిత్వ శాఖకు సమర్పించే సర్వే నివేదికల తీరుతెన్నులెలా వున్నాయో నిశితంగా పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకుని ఆ ఫలితాలను ప్రకటించటం కూడా కమిటీ పనే. దేశంలోనే తొలిసారి 2019లో కేంద్రం 14 మందితో ఈ కమిటీని నియమించినప్పుడు అందరూసంతోషించారు. నిరుడు ఆ కమిటీ పరిధిని విస్తరించారు కూడా. కానీ దాన్ని కాస్తా మొన్నీమధ్య రద్దు చేశారు. జాతీయ నమూనా సర్వేలకు సంబంధించి ఇటీవల స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనందున గణాంకాల కమిటీని రద్దు చేస్తున్నామని కమిటీ సభ్యులకు చెప్పారు. అసలు అప్పటికే ఆ పనిలో ఓ కమిటీ నిమగ్నమై ఉండగా కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటైనట్టు? దాన్ని చూపించి పాతది రద్దు చేస్తున్నామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? వీటికి జవాబిచ్చేవారు లేరు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయానికీ, వేసే ప్రతి అడుగుకూ గణాంకాలు ప్రాణం. ఏటా బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే తీసుకుంటే... దేశంలో ఆహారానికి జనం ఖర్చు చేస్తున్నదెంతో, అది పట్టణాల్లో ఎలావుందో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుస్తుంది. నిరుద్యోగిత ఏ విధంగా వున్నదో, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నవారి సంఖ్య ఎంతో వెల్లడవుతుంది. జనం విద్యకు ఖర్చు చేస్తున్నదెంత... ఆరోగ్యానికి ఖర్చవుతున్నదెంత అనే వివరాలు కూడా తెలు స్తాయి. ఇక పేదరిక నిర్మూలన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపాయో, వాటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవటా నికి గణాంకాలు తోడ్పడతాయి. అయితే ఈ గణాంకాల విశ్వసనీయత తేలాలంటే ఒక గీటురాయి అవసరం. జనాభా గణాంకాలే ఆ గీటురాయి. విషాదమేమంటే మూడేళ్ల క్రితం ప్రారంభం కావా ల్సిన జన గణన ఇంతవరకూ మన దేశంలో మొదలుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పదేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ గణన కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో సాగలేదు. వాస్తవానికి జనగణన నోటిఫికేషన్ పద్ధతిగా 2019 మార్చిలో విడుదలైంది. దాని ప్రకారం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లమధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలు వగైరాలకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. 2021 ఫిబ్రవరిలో జనాభా గణన ఉండాలి. కానీ 2020 మార్చితో మొదలై ఆ ఏడాది నవంబర్ వరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జనాభా గణన సాధ్యపడలేదు. ఆ తర్వాతైనా వెనువెంటనే ప్రారంభించాలని కేంద్రం అనుకోలేదు. అమెరికా, చైనాలతో సహా ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా తీవ్రత తగ్గగానే చకచకా రంగంలోకి దిగి జనాభా గణనను జయప్రదంగా పూర్తిచేశాయి. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొన్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జన గణన జరగలేదు. మన దగ్గర ఎందుకు కాలేదో సంజా యిషీ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధపడలేదు.భిన్న మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే సంస్థలూ, ఇతరత్రా స్వచ్ఛంద సంస్థలూ క్రమం తప్పకుండా సర్వేలు చేస్తున్నాయి. కానీ వాటిని దేంతో సరిపోల్చుకోవాలి? ఏ ప్రాతిపదికన వాటిని విశ్వసించాలి? తాజా జన గణన లేదు కాబట్టి 2011 నాటి జనాభా లెక్కలే వీటన్నిటికీ గీటురాయిగా వినియోగిస్తున్నారు. కానీ ఇందువల్ల వాస్తవ చిత్రం ఆవిష్కరణ కాదు. ఉదాహరణకు 2011 జనగణన ప్రాతిపదికగా మన జనాభా 120 కోట్లని తేలింది. తాజాగా అది 140 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు. కానీ పాత లెక్కన పేదరికాన్నీ, ఇతర స్థితిగతులనూ గణిస్తున్నందువల్ల 12 కోట్లమంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సదుపాయం వర్తించటం లేదని అంటున్నారు. తమ రాష్ట్ర జనాభా పెరిగినందువల్ల అదనపు కోటా కావాలని ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాతి పదికన అడగాలి? అందుకు కేంద్రం ఎలా అంగీకరించాలి? అప్పుడప్పుడు వెలువడే ప్రపంచసంస్థల సర్వేలు పేదరికాన్నీ, నిరుద్యోగితనూ, ఇతరత్రా అంశాలనూ చూపుతూ మన దేశం వెనక బడి వుందని చెబుతుంటే కేంద్రం నిష్టూరమాడుతోంది. అక్కడివరకూ ఎందుకు... మన సర్వేల రూపకల్పన, అవి వెల్లడించే ఫలితాలు దేశంలో పేదరికం పెరిగినట్టు, అభివృద్ధి జరగనట్టు అభి ప్రాయం కలగజేస్తున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామికా రవి ఆ మధ్య విమ ర్శించారు. ఈ విషయంలో ఆమెతో ప్రణబ్ సేన్‌కు వాగ్వాదం కూడా జరిగింది. బహుశా గణాంకాల కమిటీ రద్దు వెనకున్న అసలు కారణం అదేనా? ఇద్దరి వైఖరుల్లోనూ వ్యత్యాసానికి మూలం జన గణన జరపక పోవటంలో ఉంది. ఆ పనిచేయకుండా గణాంకాల కమిటీనే రద్దు పర్చటం ఉన్నదు న్నట్టు చూపుతున్నదని అలిగి అద్దాన్ని బద్దలుకొట్టడమే అవుతుంది. -
కేంద్ర వ్యవసాయ మంత్రిగా మాజీ సీఎం? ప్రధాని మోదీ లేఖలో స్పష్టం?
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్‌లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్‌ను ప్రశంసించారు.ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్‌కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్‌లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. -
‘హిట్ అండ్ రన్’కు టెక్నికల్ పరిష్కారం?
ఢిల్లీ: కొత్త చట్టాలను అనుసరించి.. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ అండ్ రన్’కు పరిష్కారం.. రవాణాశాఖ(MoRTH.. The Union road transport and highways ministry) కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా అటువంటి వాటిని ‘హిట్ అండ్ రన్’ కింద పరిగణించకుండా ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని.. తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని రవాణాశాఖ పేర్కొంది. ‘ప్రమాదం జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదం ఉందని ట్రక్కు డ్రైవర్లు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మనం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లు సాంకేతికత వాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25-50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అటువంటి దాన్ని ‘హిట్ అండ్ రన్’ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండవచ్చు’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు సూచించామన్నారు. -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్‌కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్‌సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్‌నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి!
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి పర్యవసానాలను దేశంలోని సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో రెండేళ్ల వయసుగల నలుగురు పిల్లలు తీవ్రమైన తట్టు(మీజిల్స్) వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ పీడియాట్రిక్ అసోసియేషన్ ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు దేశంలోని చిన్నారులకు టీకాలు వేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వెంటనే టీకాలు వేయించాలని వైద్యాధికారులు సూచనలు చేశారు. తట్టు అనేది వాస్తవానికి రుబియోలా అనే వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వైరస్ సోకాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయపటతాయి. తట్టు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి జ్వరం పొడి దగ్గు జలుబు గొంతు మంట కళ్లు ఉబ్బడం చర్మంపై దద్దుర్లు, చర్మంపై చిన్న మచ్చలు వాస్తవానికి మీజిల్స్(తట్టు) లక్షణాలు సాధారణంగా రోగి ముక్కు, గొంతులో కనిపిస్తాయి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ వైరస్ గాలిలో కలుస్తుంది. ఫలితంగా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధికి టీకా అందుబాటులో ఉంది. రెండు మోతాదుల టీకా ఈ వ్యాధిని నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో 97 శాతం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమయ్యింది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్ చెకప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలోనే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం కేరళ తర్వాత ఏపీలోనే అధికం దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు. -
ఫోన్ నంబర్ తీసుకుని విసిగిస్తున్నారా? వినియోగదారుల శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా? -
‘అది పనిష్మెంట్ కాదు.. మోదీ విజన్’
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కొత్త మంత్రిత్వశాఖ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ బదిలీ అనేది మోదీ ప్రభుత్వం తనకు విధించిన శిక్ష మాత్రం కాదని అన్నారు. ఇదొక ప్రణాళిక అని అన్నారు. ఈ చర్య ప్రధాని మోదీ విజన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ బదిలీ విషయమై తాను సుప్రీం కోర్టుకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని నొక్కి చెప్పారు. అలాగే న్యాయమంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రశ్నలను అస్సలు అడగవద్దని, ప్రస్తుతం ఆ శాఖ తనకు సంబంధం లేనిదని తేల్చి చెప్పారు. అయినా మోదీ నాకు కొత్త బాధ్యతలు ఇస్తూనే ఉన్నందున తాను బాధ్యాతాయుతంగా పని చేస్తూనే ఉంటాను అని చెప్పారు. ఇదిలా ఉండగా రవిశంకర్ ప్రసాద్ నిష్క్రమణ తర్వాత రిజిజు జూలై 7, 2021న న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తి నియమకాల విషయమై సుప్రీం కోర్టు, ప్రభుత్వం వైఖరిపై తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి పరాయి అని ఘాటు వ్యాఖ్యలు చేయడమే గాక రిటైర్డ్ యాక్టివిస్ట్ జడ్జిల న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర షోషిస్తోందని విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు బేధాభిప్రాయాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యాయవ్యవస్థలో ఎలాంటి జగడాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా కిరణ్ రిజిజును తప్పించినట్లు పలువురు భావిస్తున్నారు. (చదవండి: లేడీ సింగం మృతిపై అనుమానాలు.. రభా వెనక భాగంలో గాయాలు!) -
తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. చైనా సైనిక విన్యాసాలు
చైనా మళ్లీ తైవాన్‌పై కయ్యానికి కాలుదువ్వే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ మేరకు తైవాన్‌కి సమీపంలోని జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దీన్ని చైనా చేస్తున్న అతిపెద్ద చొరబాటు ప్రయత్నంగా తైవాన్ చెబుతోంది. ఐతే చైనా మిలటరీ మాత్రం ఇది అమెరికా కవ్వింపు చర్యలకు ప్రతిగా ఈ సైనిక కసరత్తులని స్పష్టం చేసింది. యూఎస్ రెచ్చగొట్టు చర్యలకు ఇది గట్టి కౌంటర్ అని కూడా పేర్కొంది. అంతేగాదు యూఎస్ తన రక్షణ బడ్డెట్లో తైవాన్‌కు రూ. 82 వేల కోట్ల సహాయం అందించిందని, దీన్ని తాము ఎన్నటికీ సహించమని తెగేసి చెప్పింది చైనా. ఈ మేరకు చైనా తైవాన్ గగతలంలోకి పంపించిన విమానాల్లో 6ఎస్‌యూ30 ఫైటర్ జెట్లు, హెచ్6 బాంబర్లు, అణుదాడులు కలిగిన డ్రోన్లు ఉన్నాయని తైవాన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా తన యుద్ధ విమానాలతో 47 సార్లు తైవాన్ గగనతలంలోకి చొరబడినట్లు తెలపింది. తమ ప్రాంతంలోని శాంతికి విఘాతం కలిగించేలా ప్రజలను భయపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందంటూ తైవాన్ ఆరోపణలు చేసింది. మరోపక్క తైవాన్ విదేశాంగ మంత్రి తైవాన్‌లో చొరబడేందుకే చైనా ఇలా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. కాగా, రోజు రోజుకి తైవాన్ చైనా మధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనా పదే పదే చొరబడటంతో..ఏ క్షణం ఏం జరుగుతుందోనని తైవాన్ నిరంతరం ఆందోళన చెందుతోంది. (చదవండి: తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు -
75కోట్ల మంది బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ లేకపోవడం అన్యాయం: ఎంపీ ఆర్. కృష్ణయ్య
-
భారీ ఊరట: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెల ధరలను అదుపు చేసేందుకవసరమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా శుభవార్త అందించింది. వంట నూనెల రిటైల్ ధరను లీటరుకు రూ. 15 తగ్గించింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ధర తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు తక్షణమే అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో సామాన్యులకు వంటింటి భారం నుంచి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల నపథ్యంలో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. కాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామాయిల్ రిటైల్ ధరలు 5-11 శాతం తగ్గాయి. -
అఫ్గాన్: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ పరిపాలన మొదలైంది. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే ఆ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తాలిబన్లకు వ్యతిరేకంగా బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మంత్రివర్గంలో మహిళ అంశంతో పాటు నిన్న జరిగిన మహిళల ప్రదర్శనపై తాలిబన్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: తాలిబన్ల అరాచకం.. జర్నలిస్టులకు చిత్రహింసలు ‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. వాళ్లు కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని పేర్కొన్నాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఆమె మెడపై ఏమైనా వస్తువు పెడితే వారు మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిన్న మహిళల నిరసన ప్రదర్శనపై అతడు స్పందిస్తూ ‘ఆ నలుగురు మహిళల నిరసన అఫ్గానిస్తాన్ మొత్తం మహిళలు ప్రాతినిథ్యం వహించినట్టుగా భావించొద్దు’. చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా? ‘మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏం జరుగుతుందో మీకో ఉదాహరణ చెబుతా. రెండు దశాబ్దాలుగా కీలుబొమ్మ పరిపాలన కొనసాగలేదా’ అని ఎదురు ప్రశ్నించాడు. వ్యభిచారం బాగా పెరిగిపోయింది. కార్యాలయాల్లోనే ఏకంగా ఆ వ్యవహారం కొనసాగుతోంది. మహిళలు జనాభాలో సగభాగమని యాంకర్ తెలపగా వారు సగభాగమని మేం భావించాం’ అని జెక్రుల్లా స్పష్టం చేశాడు. మహిళలు అఫ్గానిస్తాన్ ప్రజలను జన్మనివ్వడానికే పరిమితం కావాలి’ అని పేర్కొన్నాడు. A Taliban spokesman on @TOLOnews: "A woman can't be a minister, it is like you put something on her neck that she can't carry. It is not necessary for a woman to be in the cabinet, they should give birth & women protesters can't represent all women in AFG." Video with subtitles👇 pic.twitter.com/CFe4MokOk0 — Natiq Malikzada (@natiqmalikzada) September 9, 2021 -
తెలంగాణ కేబినేట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
-
సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్‌పై వేటు పడింది. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక పంపిన నేపథ్యంలో.. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంటూ గవర్నర్ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను శనివారం ముఖ్యమంత్రికి బదలాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం సాయంత్రం భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో ఈటల మంత్రివర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటారా? లేక బర్తరఫ్ చేసేంత వరకు వేచి చూస్తారా? అనే ఉత్కం ఠ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్‌కు గవర్నర్ కార్యాలయం ముగింపు పలికింది. ఇప్పటికే వివాదాస్పద భూమిలో అధికారులు బోర్డులు పాతగా, కేవలం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌తో సరిపెట్టకుం డా వివిధ చట్టాల ఉల్లంఘనను కారణంగా చూపు తూ ఆయనపై మరిన్ని చర్యలకు కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశమున్నట్లు సమాచారం. రెండోరోజూ అదే సీన్.. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో రోజు ఆదివారం కూడా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కుల సంఘాల నేతలు కూడా వచ్చి తమ సంఘీభావం తెలియజేశారు. ‘మేము మీ వెన్నంటి ఉంటాం’అని నియోజకవర్గంలోని కేడర్ స్పష్టం చే సినట్లు సమాచారం. వివిధ సంఘాల నేతలు మా త్రం ఏదో ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూ డా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు, పార్టీలో కొనసాగుతూ తాడో పేడో తేల్చుకోవాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది. అందరం కలిసి మాట్లాడుకుందాం.. తనను కలుస్తున్న వారందరికీ.. ‘వేచి చూద్దాం.. తొందర పడొద్దు’అంటూ ఈటల సమాధానం ఇస్తున్నారు. అందరమూ కూర్చొని మాట్లాడుకుం దామని చెబుతున్నారు. ఒకటీ రెండురోజుల్లో నియోజకవర్గ కేంద్రానికి వెళ్లేందుకు ఈటల సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయ సేకరణ జరపాలనే యోచనలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, శ్రేయోభిలా షులతోనూ భేటీ అయ్యే అవకాశముంది. పార్టీలో నిశ్శబ్దం తెలంగాణ ఉద్యమ నేతగా, మంత్రిగా ఇన్నాళ్లూ పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఈటల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్లో మౌనం రాజ్యమేలుతోంది. ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను విమర్శిస్తూ శని, ఆదివారాల్లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వేర్వేరు ప్రెస్మీట్లు పెట్టినా ఈటల అంశం ప్రస్తావనకు రాకుండా చూసుకున్నారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు మినహా పార్టీ ఇతర నేతలెవరూ ఈటల ఇంటి దరిదాపులకు వెళ్లకపోవడం గమనార్హం. కేటీఆర్‌ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఈటల చెప్పినా, ఇతర కీలక నేతలెవరూ ఆయనను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. చదవండి: ఊహించని షాక్.. 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' -
జపాన్‌లో లోన్లీనెస్ మినిస్టర్
టోక్యో: జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో తొలిసారి ఓ కొత్త శాఖని ప్రవేశపెట్టారు. దానిపేరు ‘లోన్లీనెస్ మినిస్టర్’. అంటే ఒంటరితనానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ అని అర్థం. ఇంత ఈ అవసరం ఏమొచ్చిందనేగా మీ అనుమానం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. కోవిడ్‌తో మరణాలు ఒక ఎల్తైతే, కోవిడ్ కారణంగా ఒంటిరితనంతో మరణిస్తోన్న వారి సంఖ్య జపాన్‌లో 11 ఏళ్ళలో ఎప్పుడూలేనంతగా పెరిగింది. జాతీయ సమస్యలతో పాటు తీవ్రతరమౌతోన్న ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ‘లోన్లీనెస్ మినిస్ట్రీ’ని జపాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. యూకేలో తొలిప్రయత్నం అయితే లోన్లీనెస్ మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టిన తొలిదేశం జపాన్ మాత్రం కాదు. 2018లో యూకేలో తొలిసారి ఇలాంటి ఒక శాఖను ప్రవేశపెట్టారు. యూకేని ఆదర్శంగా తీసుకొని జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో ఈ లోన్లీనెస్ శాఖను ప్రవేశపెట్టారు. ఈ కొత్త పోర్ట్‌ఫోలియో దేశంలో క్షీణిస్తోన్న జననాల రేటుని ఎదుర్కోవడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పునరుజ్జీవింపజేసే అంశాలపై దృష్టి సారిస్తుంది. మంత్రి టెట్సుషి సకామోటో ఏకకాలంలో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని జపాన్ ప్రధాని సుగా తెలిపారు. జాతీయాంశాలు, కోవిడ్ మహమ్మారి కాలంలో పెరుగుతోన్న మహిళల ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధాని యోషిహిడే సుగా తనకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి సకామోటో మీడియాకు వివరించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొంటూ సమగ్రవ్యూహాన్ని రూపొందించా లని ప్రధాని సూచించారని మంత్రి చెప్పారు. సామాజిక ఒంటరితనాన్ని పరిష్కరించేందుకు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించనున్నట్టు మంత్రి చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమ యంలో పెరిగిన ఆత్మహత్యలు, పిల్లల్లో పేదరికం సమస్యలు పరిష్కరించేందుకు ఫిబ్రవరి 19న క్యాబినెట్లోనే ‘ఐసోలేషన్, లోన్లీనెస్ కౌంటర్ మెజర్స్ ఆఫీస్’ని ఏర్పాటు చేశారు. టోక్యోలో ప్రతి ఐదుగురిలో ఒక మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు అనేక దేశాల్లో మాదిరిగానే జపాన్‌లో సైతం కోవిడ్ భారం మహిళలపై ఎక్కువగా పడింది. కోవిడ్ మహమ్మారి మహిళల స్థితిగతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.జపాన్‌లోని మహానగరం టోక్యోలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. కోవిడ్ కారణం గా బయటకు వెళ్ళకుండా ఇళ్ళకే పరిమితం కావ డంతో అసలే ఒంటరిగా ఉంటోన్న మహిళలు మరింత ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా అది వారిని కుంగదీసింది. కోవిడ్‌లో 15 శాతం పెరిగిన మహిళల ఆత్మహత్యలు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలను బట్టి జపాన్‌లో 4,26,000 కోవిడ్ కేసులు నమోదుకాగా, 7, 577 మంది మరణించారు. గత ఏడాది జపాన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళల సంఖ్య మొత్తం దేశంలోని కోవిడ్ మరణాల సంఖ్యకు దగ్గరగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది జపాన్‌లో 6,976 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య 2019 కంటే 15 శాతం అధికం. గత పదకొండేళ్ళలో ఆత్మహత్యల సంఖ్య ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. గత ఏడాది పురుషులకంటే మహిళలు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెరిగిన లైంగిక వేధింపులు, గృహహింస ఎంతో మంది మహిళలు వర్క్‌ఫ్రం హోం కారణంగా ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనితో పాటు పిల్లల సంరక్షణా బాధ్యతలతో ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా కరోనా కాలం లో గృహహింస, లైంగిక వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయి. పెరుగుతోన్న మానసిక, శారీ రక సమస్యలు మహిళల ఆత్మహత్యలకు కారణమౌతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వైరస్ భారాన్ని మోసింది ఎక్కువగా మహిళలే కరోనా వైరస్ భారాన్ని మోసింది ఎక్కువగా మహిళలేనని జపనీస్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ యుకి నిషిముర అభిప్రాయపడ్డారు. మహిళలు తమ ఆరోగ్యం గురించి మాత్రమే చూసుకుంటే సరిపోదు. వాళ్ళ పిల్లలు, వృద్ధులు, మొత్తం కుటుంబం ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన భారం కూడా వారిపైనే ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఇంటి పరిశుభ్రతలాంటి సమస్యలు వారిపై భారాన్ని మరింత పెంచాయి అంటారు యుకి నిషిముర. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది జపాన్‌లో ఉద్యోగాలు చేస్తోన్న మహిళల్లో సగం మందివి పార్ట్‌టైం, లేదా కాంట్రాక్టు ఉద్యోగాలు. కోవిడ్ కారణంగా కంపెనీలు మూతపడటంతో ముందుగా మహిళలనే ఉద్యోగాల్లోనుంచి తీసివేశారు. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 1.44 మిలియన్ల మంది ఇలాంటి కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అందులో సగానికి పైగా మంది మహిళలే కావడం గమనార్హం. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన మహిళల్లో మూడింట రెండొంతుల మంది నిరుద్యోగులే. ఉద్యోగాలను కోల్పోవడం మహిళలను మరింత మానసిక ఒత్తిడికి గురిచేసింది అని సోషల్ ఎపిడెమియాలజీ నిపుణులు, ఒసాకా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ టెస్టూయా మాట్సు బయాషి అభిప్రాయపడ్డారు. -
మంత్రివర్గంలో సామాజిక న్యాయమేది?
సాక్షి, కాజీపేట : కేసీఆర్ మంత్రి వర్గంలో వెలమ, రెడ్డి వర్గాలకే తప్ప మిగతా వర్గాలకు చోటు ఇవ్వకుండా సామాజిక న్యాయాన్ని విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. హన్మకొండ వడ్డేపల్లిలోని విద్యుత్ భవన్లో శుక్రవారం ఏర్పాటు సమావేశంలో మంద కృష్ణ మాట్లాడా రు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో మాల, గౌడ, యాదవ, ముదిరాజ్, కాపు, ముస్లిం వర్గాలకు ఒక్కో సీటు కేటాయించడం ద్వారా ద్వంద్వనీతి అవలంబించారన్నారు. మాదిగ, ఉపకులాలతో పాటు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని బీసీ, ఎస్టీ, అగ్రకుల వర్గాలకు స్థానం కల్పించేలా పోరాడుతామని తెలిపారు. సెప్టెంబర్ 22న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో నిర్వహించే మహాదీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కోరా రు. అనంతరం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు రాగటి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్‌తో బీఎన్.రమేష్, తిప్పారపు లక్ష్మణ్, బొడ్డు దయాకర్, మంద రాజు, ఈర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం కేయూ క్యాంపస్: ఉన్నతవిద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగల అస్తిత్వం కోసం, సామాజిక సమస్యలపై పోరాటాలకు ఎమ్మార్పీఎస్ కేంద్ర బిందువుగా నిలుస్తోందని చెప్పారు. కేయూకామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో శుక్రవారం మాదిగ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన మాదిగ అధ్యాపకుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంద కృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడంతో పాటు కాంట్రాక్టు, పార్ట్‌టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎంటీఎఫ్ బాధ్యు డు డాక్టర్ పి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ టి.మనోహర్, డెవలప్మెంట్ ఆఫీసర్ వీ.రాంచంద్రం, ఎంటీఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్‌మాదిగ, డాక్టర్ సమ్మయ్య, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
చోటు ఎవరికో?
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు 17న ప్రొటెం స్పీకర్ఎన్నిక, 19న గవర్నర్ ప్రసంగం రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపై ఊహాగానాలు పాలమూరు నుంచిఅవకాశం దక్కేదెవరికో? ప్రచారంలో సింగిరెడ్డినిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి,శ్రీనివాస్‌గౌడ్ పేర్లు సాక్షి, వనపర్తి : తెలంగాణ కొత్త శాసనసభ కొలుదీరే సమయం ఆసన్నమైంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మంత్రి పదవికి ఎవరికి వస్తుందనే చర్చ అంతటా సాగుతోంది. ఈనెల 16వ తేదీన తాత్కాలిక స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆయన 17న అసెంబ్లీని సమావేశపరిచి ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 19న శాసనసభ, శాసనమండలి సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 20న ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనుండటంతో ఆ లోగానే మొదటి విడత మంత్రి వర్గవిస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి విడతలో 8 మందికి చోటు కల్పిస్తారని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కేబినెట్ పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అడ్డంకి లేనట్లే డిసెంబర్ 7న ఎన్నికలు జరగగా, 11న ఫలితాలు వెలువడిన అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితాలు వెలువడి 25 రోజులు గడిచినా ఇప్పటికీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో శాసనసభ కొలువుదీరలేదు. దీనికితోడు మంత్రివర్గ విస్తరణ సైతం చేపట్టలేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అడ్డుపడుతుందని అంతా భావించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళితో ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేయడంతో సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా.. గత పాలకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డిని మంత్రి పదవులు వరించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఓటమి చెందడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక్క కొల్లాపూర్ మినహా మిగతా అన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే భారీ మెజార్టీతో విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ సైతం మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు ఉన్నతస్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందడంతో ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం ఎన్నికల ఫలితాల నాటినుంచీ కొనసాగుతోంది. ఆయనతోపాటు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజికవర్గం కలిసొచ్చేనా? సామాజికవర్గాల పరంగా చూస్తే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. 2014లోనే ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ కుదరలేదు. ఈసారి తప్పకుండా తన కల నెరవేరుతుందనే భావనలో ఆయన ఉన్నారు. ఈసారి కేసీఆర్ పాలకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తారని వార్తలు వినిపిస్తుండటంతో శ్రీనివాస్‌గౌడ్‌కు బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. పాలమూరుకు స్పీకర్ పదవి? ఎమ్మెల్యేలు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నా తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దే కావడంతో ఆయన ఎవరికి అవకాశమిస్తారనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారెవరూ లేనందున కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికే అంతా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా, స్పీకర్ పదవి పలువురికి కలిసి రాకపోవడంతో ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు స్పీకర్ పదవి దక్కొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరో 10రోజులు ఆగక తప్పదు! -
ఆయనే తొలి మంత్రి..
మధిర: ఖమ్మం జిల్లాలో తొలి మంత్రి పదవి మధిర నియోజకవర్గానికే దక్కింది. 1964లో శాసనమండలికి ఎన్నికైన శీలం సిద్ధారెడ్డి 1967వ సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఆయన 1947–48లో ఆయన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోసవీడు క్యాంపు ఇన్చార్జ్గా ఉండి నిజాం ప్రభుత్వంపై పోరాటం నిర్వహించారు. నాటి హైదరాబాద్ స్టేట్‌లో 1949నుంచి 1952 వరకు మధిర తాలూకా కాంగ్రెస్‌పార్టీ కార్యదర్శిగా, 1958నుంచి 1962వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1963నుంచి 1967వరకు పీసీసీ కార్యదర్శిగా, 1964నుంచి 2004వరకు ఏఐసీసీ సభ్యునిగా పనిచేశారు. 1958లో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలి కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1964 సంవత్సరంలో ఆప్కాబ్ తొలి చైర్మన్‌గా ఎన్నికై అదే సంవత్సరం రెండోసారి శాసన మండలికి ఎన్నికయ్యారు. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో జిల్లా నుంచి తొలిమంత్రిగా పనిచేశారు. 1970లో మూడో సారి శాసనమండలికి ఎన్నికై పీవీ నర్సింహారావు మంత్రి వర్గంలో 1972వరకు నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు. 1983లో మధిర ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. చివరగా 1998 మధిర ఉప ఎన్నికల్లో కూడా పోటీచేసి నాటి సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్యచేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. కమ్యూనిస్టులతో రాజీలేని పోరు అనేక దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో సిద్ధారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించేస్థాయికి ఎదిగారు. ముక్కుసూటిగా వ్యవహరించే తొలిమంత్రి సిద్ధారెడ్డి రాజీలేని మనస్తత్వంతో పనిచేయడంవల్ల అప్పట్లో ముఖ్యమంత్రి పదవినికూడా వదులుకున్నారని ఆయన స్నేహితులు చెబుతుంటారు. 1972లో ఆయన రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఆ పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న శీలం సిద్ధారెడ్డికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని ఇందిరాగాంధీ తనదూత పీవీ నర్సింహారావు ద్వారా రాయభారం పంపగా, ఆయన ముఖ్యమంత్రి పదవిని నిరాకరించినట్లు చెబుతారు. నిబద్ధత కలిగిన కాంగ్రెస్‌వాదిగా సిద్ధారెడ్డి సుదీర్ఘకాలం రాజకీయ కురుక్షేత్రంలో పనిచేశారు. ఒకవైపు సొంత పార్టీలోనూ, మరోవైపు జిల్లాలోని కమ్యూనిస్టులతో రాజీలేని పోరాటంచేసి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే సిద్ధారెడ్డికి ఆయన మంత్రి వర్గంలోకి తన ముఖ్య అనుచరుడు సంభాని చంద్రశేఖర్‌కు మంత్రి పదవి ఇప్పించారు. లంకా సాగర్ ప్రాజెక్ట్, ఎన్నెస్పీ కాలువలకు రూపకల్పన సర్దార్ జమలాపురం కేశవరావు, పొట్లూరి సుందరం వంటి జాతీయ నాయకులతో కలిసి గ్రంథాలయ ఉద్యమం, పత్రికా ఉద్యమాలను నడిపారు. జీవహింసకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. ఆయన తన స్వగ్రామంలో నాటికాలంలో రాత్రిపూట పాఠశాలలను నడిపి అభ్యుదయ ఉద్యమానికి నాందిపలికారు. అంటరానితనం పీడిస్తున్న తరుణంలో దళితవర్గాల ఉద్ధరణకోసం హాస్టళ్లను ఏర్పాటుచేశారు. భారీ నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఎన్ఎస్పీ కాలువలు, లంకా సాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి హైలెవల్ కాలువలకు రూపకల్పన చేశారు. మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తనసొంత మండలంలో కట్లేరు ప్రాజెక్టును నిర్మించి వేలాది ఎకరాల పంటపొలాలకు సాగునీరు అందించారు. తన స్వగ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రిని, ఇంటర్మీడియట్ కళాశాలలను నెలకొల్పేందుకు కృషిచేశారు. అనారోగ్యంతో 2011లో మృతిచెందారు. -
మధ్యప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, భోపాల్ : సాధువులు, సన్యాసులకు క్యాబినెట్ హోదా కట్టబెట్టి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలను ఎదుర్కొంటున్న క్రమంలో మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీవాలను కాపాడేందుకు గో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఎంపీ మంత్రి అఖిలేశ్వరానంద్ వ్యాఖ్యానించారు. గత వారం అఖిలేశ్వరానాంద్‌కు గో పరిరక్షణ బోర్డు ఛైర్మన్‌గా క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టారు. ‘రాష్ట్రంలో గోవులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.. దీనికోసం గో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి..సీఎం స్వయంగా రైతు కావడంతో పాటు తనలాంటి వారు ఈ విషయంలో ఆయనకు సాయపడతా’మని అఖిలేశ్వరానంద్ చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై ట్విట్టర్ సహా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందించారు. రాష్ట్రంలో తక్షణం దృష్టిసారించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని, ముందుగా వాటిని పరిష్కరించాలని సూచించారు. కాగా, గతంలో వీహెచ్‌పీ సైతం కేంద్ర, రాష్ట్ర స్ధాయిల్లో గో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. -
కర్ణాటక: కొలిక్కి వచ్చిన పదవుల పంపకాలు
-
ఆశల పల్లకిలో
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులకు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ఆ స్థానంలో జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు పలువురు మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడంతో ఆ రెండు పదవులను రాష్ట్రానికి చెందిన వారితోనే భర్తీ చేస్తారనే ప్రచారం బీజేపీలో సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కంభంపాటి హరిబాబుతో పాటు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంతో ఉన్న సత్సంబంధాల కారణంగా గోకరాజు గంగరాజుకు పదవి దక్కుతుందని తెలుస్తోంది. అయితే వెంటనే ఆ పదవులను భర్తీ చేస్తారా ఇంకా సమయం తీసుకుంటారా అన్నది వేచిచూడాల్సి ఉంది. మరోవైపు మంత్రి పదవికి రాజీనామా చేసిన పైడికొండల మాణిక్యాలరావుకు కేంద్రానికి చెందిన ఒక కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించే అవకాశం కనపడుతోంది. రాష్ట్రంలో కూడా రెండు పదవులు ఖాళీ కావడంతో ఆ పదవుల్లో ఒకటి జిల్లాకు కేటాయించవచ్చన్న ప్రచారం మొదలైంది. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం రాజ్యసభ ఎన్నికల తాయిలంగా ఈ పదవులను వాడుతున్నట్లు సమాచారం. రాజ్యసభలో మూడో సీటు దక్కించుకోవడం కోసం కొత్తగా తమ పార్టీలోకి వచ్చే వారికి ఈ పదవులను ఎరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్ల కొంత డైలమా నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పడం స్వార్ధపూరిత రాజకీయలబ్ధి కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస వర్మ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల కోసమే తెలుగుదేశం ఎన్డీఏలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. అర్బన్ డెవలప్మెంట్ పథకంలో దేశంలో 10 లక్షల గృహాలను మంజూరు చేస్తే ఒక్క ఏపీలో 6.5 లక్షల గృహాలు ఇచ్చారని, ఇవన్నీ తాము చెప్పుకోలేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ నేడు విమర్శలకు దిగుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, పెంచిన పింఛన్లు రాష్ట్ర లోటు బడ్జెట్లో చూపిస్తే కేంద్రం ఎందుకు ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా మిత్రభేదంతో జిల్లాలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. -
జహీరాబాద్ నిమ్జ్‌కు ‘పచ్చ’ జెండా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ మెగా పారిశ్రామికవాడ నిర్మాణంలో అనుసరించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదం తెలిపింది. తొలి దశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టీఓఆర్’కు ఆమోదం లభించడంతో.. తుది అనుమతులు కోరేందుకు మార్గం సుగమమమైంది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణ జరిపి తుది దశ అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లో 12,635 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిమ్జ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.37,740 కోట్ల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటవనున్నాయి. 2040 సంవత్సరం నాటికి రూ.96,778 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు జరగనున్నాయి. 2030 నాటికి పూర్తి.. నిమ్జ్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సైట్ అభివృద్ధి, అంతర్గత రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వరద, మురుగు నీటి కాల్వలు, భవనాలు, వీధి దీపాలు, పచ్చదనం అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు వెలుపల మౌలిక సదుపాయాల కోసం మరో రూ.6,100 కోట్ల వ్యయం కానుంది. 2020 నాటికి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, 2030 నాటికి మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. నిమ్జ్ పరిధిలో 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,635 ఎకరాలకు గాను 2,884 ఎకరాలు టీఎస్ఐఐసీ ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు ఆకర్షించేందుకు నిమ్జ్ ప్రతిపాదిత ప్రాంతం అనుకూలమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు సమీపంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ టైర్స్, అరబిందో ఫార్మా, స్పార్శ్ ఫార్మా, కావేరీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ మెదక్, భారత్ డైనమిక్స్(బీడీఎల్), ట్రైడెంట్ షుగర్స్ లాంటి మెగా పరిశ్రమలున్నాయంది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ., ఓఆర్ఆర్ నుంచి 50 కి.మీ, దూరంలోని ఈ ప్రాజెక్టుకు రహదారులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సీ పోర్టు (కృష్ణపట్నం, జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్) సదుపాయాలతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలున్నాయని పేర్కొంది. కాగా, నిమ్జ్‌లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. జోన్ల వారీగా ప్రాజెక్టు అభివృద్ధి ఇలా.. జోన్ స్థలం (ఎకరాల్లో) ఉత్పత్తి పరిశ్రమలు 7,107 సాంకేతిక సదుపాయాలు 550 మౌలిక వసతులు 883 గృహ నిర్మాణం 638 లాజిస్టిక్స్ 899 పచ్చదనం 1,603 రహదారులు 955 మొత్తం 12,635 నోట్: కామన్ ఫోల్డర్లో నీమ్జ్ జహీరాబాద్ పేరుతో ప్రాజెక్టు సైట్ మ్యాప్ ఫోటోలు ఉన్నాయి. పరిశీలించగలరు. 12,635 - ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడ నిర్మాణం 4,500 - కోట్లు అంచనా వ్యయం 6,100- కోట్లు ప్రాజెక్టు వెలుపల మౌలిక వసతులకు.. 2,40,000- మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -
ఇక ఆ ఉద్యోగాలన్నీ గల్లంతేనా..? కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత అయిదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను రద్దు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక సమర్పించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఉద్యోగాల రద్దుపై అన్ని మంత్రిత్వ శాఖలను, విభాగాలను యాక్షన్ రిపోర్టును కోరామని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని శాఖల అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, పారామిలిటరీ దళాల చీఫ్, ఇతర సంబంధిత సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఐదేళ్లుగా భర్తీకాని ఉద్యోగాలపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా గతంలోనే అన్నిమంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారులు , ఉమ్మడి కార్యదర్శులు (అడ్మినిస్ట్రేషన్) / విభాగాలను కోరినట్టు వెల్లడించింది. అయితే కొన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు స్పందించినప్పటికీ, మరికొన్ని నివేదికలు సమగ్రంగా లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 16, 2018 తేదీన సంబంధిత మెమోరాండం జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ప్రాథమిక అంచనా ప్రకారం, ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా అనేక వేల కేంద్ర ప్రభుత్వం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా హోంశాఖ అధికారి తెలిపారు. -
రిజర్వాయర్లలో పడిపోతున్న నీటిమట్టం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 19 శాతానికే పరిమితమైనట్లు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్, ఇందిరా సాగర్, భాక్రానంగల్ తదితర రిజర్వాయర్లలో ఈ వారాంతంలో 29.665 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గతేడాది కంటే నీటి నిల్వలు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత ఏడాది కంటే నీటి నిల్వలు పెరిగినట్లు జలవనరుల శాఖ పేర్కొంది. -
ప్రజాస్వామ్యం ఖూనీ.
-
’నేను చాలా గొప్పగా ఫీల్ అవ్వట్లేదు’
-
ఇవ్వాలా.. వద్దా!
సర్వే చేయిస్తున్నవారు టీడీపీ అధినేత? - నివేదిక తర్వాతే నిర్ణయం - సర్వేపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే వ్యవహారాన్ని ఒక సర్వే తేల్చనుందా? అదీ నంద్యాల ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉందా? ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదా? అంటే అవుననే తెలుస్తోంది. ఇందుకు కారణం... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా... వద్దా... మీ అభిప్రాయం ఏమిటి? అంటూ అధికారపార్టీ ఏకంగా ఒక సర్వే చేయిస్తుండటమే ఉదాహరణ. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తికానున్నట్టు సమాచారం. అనంతరం ఈ సర్వే నివేదిక ఆధారంగా అధికారపార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, కేవలం సర్వే నివేదిక ఆధారంగానే మంత్రి పదవి నిర్ణయం జరుగుతుందా? ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు పదవి అప్పగిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ వివాదమే...! వాస్తవానికి భూమా నాగిరెడ్డి అధికారపార్టీలో చేరిక మొదలు మంత్రి పదవి వ్యవహారం వరకూ అధికారపార్టీలో రోజుకో వివాదం రేగుతూనే ఉంది. మొదట్లో ఆయన రాకను శిల్పా సోదరులతో పాటు గంగుల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చామంటూ చేరికలు జరిగిపోయాయి. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఒకానొక సమయంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. ఢీ అంటే ఢీ అని ఇరువర్గాలు సవాళ్లు కూడా విసురుకున్నాయి. అయితే, తాజాగా ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యేలకే పట్టం అంటూ... నియోజకవర్గ ఇంచార్జీలను డమ్మీలను చేయడంతో మరోసారి పాత నేతలు భగ్గుమన్నారు. తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంచార్జీ గంగుల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. నంద్యాల నియోజకవర్గంలోనూ ఇదే అలజడి మొదలయ్యింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తాము స్వతంత్రంగానైనా పోటీ చేస్తామని శిల్పా వర్గీయులు సంకేతాలు పంపించారు. అంతేకాకుండా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమై... తమకు జరుగుతున్న అవమానాలను వివరించారు. గతంలో కర్నూలులో జరిగిన సమన్వయ కమిటీ భేటీల్లోనూ ఇదే అంశాన్ని శిల్పా సోదరులు లేవనెత్తారు. తద్వారా భూమా దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఇరు నేతల మధ్య ఆది నుంచీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్వేలో వ్యతిరేక ఫలితాలే...! భూమాకు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా అంటూ జరుగుతున్న సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితం వస్తోందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. తద్వారా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నట్టు నమాచారం. సర్వేను కాదని తమ అధినేత ముందుకు వెళ్లడనే ధీమా వ్యతిరేక వర్గంలో కనిపిస్తోందని అధికారపార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సర్వే అంటే జనాభిప్రాయమని.. ఇందుకు భిన్నంగా పదవి కట్టబెట్టే ప్రసక్తే లేదని గాంభీర్యంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికారపార్టీలో ఇరువర్గాల మధ్య రేగిన విభేదాల పర్వం విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. -
మైనార్టీలకు మంత్రిత్వశాఖ కేటాయించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దాపురం, సామర్లకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాయని, కేబినెట్లో మైనార్టీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. దళిత, బడుగు వర్గాల సామాజిక హక్కుల వేదిక బస్సుయాత్రలో భాగంగా ఇచ్చాపురంలో బయలేరిన బస్సుయాత్ర బుధవారం ముందుగా పెద్దాపురం, అనంతరం సామర్లకోటలో సాగింది. పెద్దాపురం మెయిన్‌రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మ«ధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన నిధుల్లో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగకుంటే పోరాటాని తీవ్రతరం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. తొలుత స్థానిక మున్సిపల్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక హోదా కోరుతూ రామకృష్ణ, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు మున్సిపల్ సెంటర్ నుంచి మెయిన్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం కార్యదర్శి రావుల వెంకయ్య, మహిళా సమాఖ్య కార్యదర్శి దుర్గాభవాని, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిర్ల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బైలపూడి సూరిబాబు, పెదిరెడ్ల సత్యనారాయణ, నిమ్మన సత్యనారాయణ, జల్లిగంపల వెంకన్న, తిరుపతి సత్తిబాబు, ఎలిశెట్టి రామదాసు, కన్నూరి వెంకన్న, పోలపర్తి తాతారావు, అల్లు నాగేశ్వరరావు, వేముల అర్జునరావు, గుమ్మిరేగుల రమణ, బదిరెడ్డి కృష్ణ, నక్కా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సామర్లకోటలోనూ.. స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు బస్సుయాత్రకు స్వాగతం పలికారు. ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చంద్రయ్యదాసు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ ప్రసంగించారు. -
మంత్రైనా కింద కూర్చోవలసిందే: లోకేశ్
గుంటూరు: తనకు మంత్రి అవ్వాలన్న కోరిక లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీలో తాను కీలకపాత్ర పోషిస్తున్నానని చెప్పారు. బుధవారం ఆయన తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... తానేప్పుడు కేబినెట్ సమావేశంలో కూర్చోలేదని, రుజువులుంటే చూపాలని అన్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫొటో చూసి తనకు బాధ కలిగిందన్నారు. ఈ ఫొటోపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. మంత్రైనా, ఎంపీ అయినా పార్టీ కార్యక్రమంలో కింద కూచోవలసిందేనన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో లో తాను సభ్యుడినని, ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా కూడా ఉన్నానని ఆయన తెలిపారు. చాలా చిన్న వయసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కావడం తన అదృష్టమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకంగా సరికాదన్నారు. అన్నిటికీ అడ్డుపడితే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. పార్టీలోకి ఎవరూ వచ్చి చేరినా ఆహ్వానిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి !
నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం వక్కలిగల సంబరాలు బెంగళూరు : ఎట్టకేలకు విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే, వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.కృష్ణప్ప అమాత్య పదవిని అలంకరించబోతున్నారు. రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్ వాలా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జూన్ 19న జరిగిన మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి లభిస్తుందని అందరూ భావించారు. అయితే చివరి క్షణంలో ఆయన పేరును తొలగించడంతో కృష్ణప్ప నియోజక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కలిగ సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. చివరికి సీఎం సిద్ధరామయ్య కృష్ణప్పకు సమీప భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తానని మాట ఇవ్వడంతో నిరసనలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల విషయమై హైకమాండ్‌తో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్యకు మొదట ఎం.కృష్ణప్పకు అమాత్య పదవి ఇవ్వాలని సూచింది. ఈ నేపథ్యంలో దీంతో నేడు ఎం.కృష్ణప్ప నేడు అమాత్య పదవిని అలంకరించబోతున్నారు. ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే ఆయన మద్దతుదారులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కాగా, కృష్ణప్పకు గృహ నిర్మాణ, సమాచార శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో ప్రథమ నిందితుడుగా ఉన్న కే.జే. జార్జ్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన స్థానాన్ని తిరిగి అతనికే కేటాయించనున్నారు. మరోవైపు పశుసంవర్థకశాఖ మంత్రి ఏ.మంజు, గనుల శాఖ మంత్రి వినయ్కులకర్ణీకు క్యాబినెట్ హోదా లభించనుంది. ఇదిలా ఉంటే తనకు మంత్రి పదవి కేటాయించడం పట్ల కృష్ణప్ప ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను శనివారం సాయంత్రం కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. అంబికి నిరాశ : మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయిన అంబరీష్‌కు మంత్రి మండలిలో తిరిగి సభ్యత్వం లభించనుందని వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు అంబరీష్ కూడా పరోక్షంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పుకొంటూ వచ్చారు. అయితే తాజా పరిణామంతో అంబి ఆశలు ఆవిరయ్యాయని ఆయన అనుచరులే చెబుతున్నారు. -
జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం !
బెంగళూరు : డీఎస్పీ గణపతి ఆత్మహత్య సంఘటనతో మంత్రి పదవిని కోల్పోయిన కే.జే జార్జ్‌కు మళ్లీ అమాత్య పదవి దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో కే.జే జార్జ్ మొదటి నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ దర్యాప్తులో గణపతి ఆత్మహత్య విషయంలో జార్జ్ పాత్ర ఏమీ లేదని తేలిందని ఈ మేరకు త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో కే.జే జార్జ్‌కు గతంలో ఆయన నిర్వర్తించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖనే కేటాయించడానికి సిద్ధరామయ్య సిద్ధపడుతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న మరో స్థానాన్ని ఎం. కృష్ణప్పతో భర్తీ చేయడానికి కూడా సిద్ధరామయ్య అంగీకరించారు. -
పదవి కోసమే పార్టీని వీడారు
నిన్నటి వరకూ చంద్రబాబును తిట్టి ఇప్పుడు జగన్‌పై విమర్శలా {పజా తీర్పుతో మహా నాయకులే మట్టికరచారు ఎమ్మెల్యే అమర్నాథ్ తీరుపై వైఎస్సార్సీపీ నేతల ధ్వజం పలమనేరు: మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించారని పలమనేరు మున్సిపాలిటీ, మండల వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే అమరనారెడ్డిని విమర్శించారు. పలమనేరులోని మాజీ ఎంపీపీ రాజేం ద్రన్ ఇంటిలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు సీవీ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు తీరు బాగోలేకే వైస్సార్సీపీలోకి వచ్చానని చెప్పిన అమర్నాథ్ ఇప్పుడు జగన్మోహన్ తీరు నచ్చకే పార్టీని వీడానని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. టీడీపీలో చేరిన కాసేపటికే తమ అధినేతను తీవ్రస్వరంతో విమర్శించడం వెనుక ఆంతర్యం తెలుసునన్నారు. గతం లో సవాళ్ళు చేసిన ఎందరో మహా మహా నాయకులే ప్రజాతీర్పుతో మట్టికరిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పలమనేరులో వైఎస్సార్సీపీకి ఎంఎల్ఎ నిష్ర్కమణ వల్ల జరిగే నష్టం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే పార్టీని వీడినంత మాత్రాన బయపడాల్సిందేమీ లేదని ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మురళీక్రిష్ణ, పలమనేరు, గంగవరం పార్టీ కన్వీనర్లు బాలాజీనాయుడు, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్యామ్, శ్యామ్‌సుందర్ రాజు, రహీంఖాన్, విజయబాబు, శాంతమ్మ మణి, గోవిందుస్వామి, కోదండరామయ్య, కమాల్, నాయకులు పార్టీ రైతు విభాగం జిల్లా నేత మండీ సుధా, రాజారెడ్డి, కిరణ్, జగన్మోహన్రెడ్డి, చక్రపాణి, అగ్రహారం రెడ్డెప్పరెడ్డి, మనోజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెళితే భయపడాల్సిన పనేలేదు ఎమ్మెల్యే దురాలోచనతో పార్టీ మారినంత మాత్రాన వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన గెలుపు కోసం చాలా కష్టపడ్డాం. నియోజకవర్గంలోని క్యాడర్ ఏమాత్రం బయపడాల్సినపనిలేదు. ఇలాంటి వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడు. అందరం కలసి జూలై 8నుంచి గడపగడపకు వైఎస్సార్సీపీని విజయవతం చేద్దాం. -రాజేంద్రన్, మాజీ ఎంపీపీ, పలమనేరు రాజీనామా చేసి వెళ్ళుంటే బాగుందేది.... ఎమ్మెల్యే పార్టీ వీడినంత మాత్రాన మాకొచ్చిన ఇబ్బందులేమీ లేవు. ఆయన ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్ళడం పద్ధతి కాదు. రాజీనామా చేసి వెళ్ళింటే బాగుండేది. పార్టీ కోసం గట్టిగా కృషిచేస్తాం. -బాలాజీనాయుడు, పార్టీ కన్వీనర్, పలమనేరు మండలం -
అసలు పేర్లు చెప్పండి...లేదంటే..
న్యూఢిల్లీ : మోసపూరిత చర్యలకు అడ్డుకట్టవేసేందుకు... ఫోన్లు వాడే యూజర్లందరూ పూర్తి వాస్తవ పేర్లను 2017 జూన్ 30 వరకూ టెలికాం కంపెనీల దగ్గర నమోదుచేయాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. అన్ని టెలీ కమ్యూనికేషన్ కంపెనీలు పూర్తి వాస్తవ పేరు వ్యవస్థను అమలు చేయాలని తెలిపింది. ఒకవేళ యూజర్లు ఈ వివరాలను డెడ్ లైన్ లోపు నమోదుచేయని పక్షంలో వారికి సర్వీసులు కట్ చేయాలని పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు టెలికాం కంపెనీ వాస్తవ పేర్ల యూజర్ల జాబితాను 95శాతం పెంచాలని, వచ్చే జూన్ వరకూ 100శాతం ఉండాలని నిర్దేశించింది. టెలికాం కంపెనీలు సైతం గడువులోపు తమ వాస్తవ పేర్లను నమోదుచేసుకోవాలని యూజర్లను కోరాయి. టెస్ట్ మెసేజ్ లు, ఫోన్ కాల్స్, లెటర్స్, నోటీసుల రూపంలో ఈ విషయాన్ని యూజర్లకు కంపెనీలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం వాస్తవ పేర్లతో ఫోన్లను వాడే వారు 92శాతం ఉన్నారు. ఇంకా 1000లక్షల మంది వారి వాస్తవ గుర్తింపులను టెలికాం కంపెనీల దగ్గర నమోదుచేసుకోవాల్సి ఉంది. చైనాలో 2013లోనే వాస్తవ పేరు రిజిస్ట్రేషన్ వ్యవస్థ అమల్లో ఉంది. అయితే ఏప్రిల్ వరకూ 20 కంపెనీలు ఆఫర్ చేసిన 1,40,000 టెలిఫోన్ నెంబర్లు రద్దు అయ్యాయి. మోసపూరిత చర్యలకు పాల్పడటం వల్ల వీటిని రద్దుచేశారు. వాస్తవ పేరు నమోదు లేకపోవడం వల్ల స్పామర్లని కనుక్కోవడం కష్టతరమవుతుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో మోసపూరిత చర్యలకు పాల్పడే వారిని తేలికగా కనుగొనేందుకు వాస్తవ పేరు నమోదువ్యవస్థను అమలుచేయాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. -
ప్రత్యేక హోదాపై పోరాటం వద్దు
మంత్రివర్గం, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడంపై ఎలాంటి పోరాటం చేయకూడదని రాష్ట్ర మంత్రివర్గం, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయించాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయకూడదని, మన పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాల్సిందిగా వినతులు, లేఖల ద్వారా కోరాలని నిర్ణయించాయి. టీడీపీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావేశాలు సోమవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగాయి. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంట్లో తాజాగా కేంద్ర మంత్రి హెచ్‌పీ చౌదరి చేసిన ప్రకటనపై చర్చ జరి గింది. కేంద్రం చేసిన ప్రకటన వల్ల తాము ప్రజ ల్లోకి వెళ్లలేకపోతున్నామని, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రులు, నేతలు వివరించారు. చంద్ర బాబు మాత్రం వారి ఆవేదనను సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుత పరి స్థితుల్లో కేంద్రంతో ఏ అంశంలోనూ పోరాటం చేయలేమని, మంత్రివర్గం నుంచి మన వారిని ఉపసంహరించుకోలేమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఆర్థిక సాయంపై ఇప్పటికే పలుమార్లు కేం ద్రానికి వినతులు సమర్పించామని, అవసరమైతే మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తామని చెప్పారు. కాగా, ఈసారి మహానాడును తిరుపతిలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని సరి చేయాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం మంగళవారం గుంటూ రు జిల్లాలోని సీఎం నివాసంలో జరగనుంది. -
ఐసిస్ అలకిడి..
-
కాంట్రాక్టులపై సీవీసీ డేగకన్ను
న్యూఢిల్లీ: మంత్రిత్వ శాఖల్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కాంట్రాక్టు ప్రక్రియల్లో మరింత పారదర్శకత, వ్యయ నియంత్రణ సాధించే దిశగా కొత్తగా పలు నియమనిబంధనలను కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మంగళవారం జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖల్లోని చీఫ్ విజిలెన్స్ అధికారులు(సీవీఓ) కచ్చితంగా నిర్వహించాల్సిన పలు విధులను వాటిలో పొందుపర్చింది. ఆ వివరాల ప్రకారం.. ‘ప్రతీ విభాగంలోని సీవీఓ తన విభాగ పరిధిలో, ఏడాది కాలంలో చోటుచేసుకున్న కాంట్రాక్టుల్లో కొన్నింటిని రాండమ్‌గా ఎంపిక చేసుకుని, వాటిని నిశిత పరీక్ష(ఇంటెన్సివ్ ఎగ్జామినేషన్) జరపాలి. అలా యాధృచ్ఛికంగా ఎంపిక చేసుకునేందుకు కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. కాంట్రాక్టుల విలువల ఆధారంగా వాటిని భారీ, సుమారు, చిన్న కాంట్రాక్టులుగా విభజించి, ఒక ఏడాదిలో కనీసం మూడు భారీ, రెండు సుమారు, ఒక చిన్న కాంట్రాక్ట్‌ను నిశిత పరీక్ష కోసం ఎంపిక చేసుకోవాలి. టెండర్లు కోరుతూ ఇచ్చే పేపర్ ప్రకటన నుంచి తుది అనుమతి వరకూ అన్ని ప్రక్రియలనూ నిశితంగా పరీక్షించాలి. అనంతరం మొదట ప్రాథమిక నివేదికను రూపొందించి, లోటుపాట్లుంటే సంబంధిత విభాగాల అధిపతుల నుంచి కాలపరిమితితో కూడిన సమాధానం తెప్పించుకోవాలి. ఆ తరువాత తుది నివేదికను సిద్ధం చేయాలి’ అని ఆ గైడ్‌లైన్స్‌లో సీవీసీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు సీవీఓల త్రైమాసిక నివేదికల ఆధారంగా చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్స్ ఆర్గనైజేషన్ విధుల్లో భాగంగా ఈ నిశిత పరీక్ష ఉండేది. -
చిన్నారుల మిస్సింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ ఘటనలపై స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రన్ని ఆదేశించింది. 'బచ్పన్ బచావో ఆందోళన్' అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా జస్టీస్ లోకూర్, లలిత్‌లతో కూడిన ధర్మాసనం చిన్నారుల మిస్సింగ్ నివారణకు స్పష్టమైన విధానాలను తయారుచేయాలని ఆదేశించింది. అలాగే కోయాపాయ, ట్రాక్దమిస్సింగ్చైల్డ్ వెబ్సైట్లను అనుసంధానం చేయాల్సిందిగా ఉన్నత ధర్మాసనం మహిళా, శిశు సంక్షేమ శాఖను కోరింది. ఇటీవలి కాలంలో చిన్నారుల మిస్సింగ్ ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిని నివారించడానికి సీనియర్ లాయర్ హెచ్ ఎస్ పూల్కాను చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పటిష్టంగా అమలవడానికి కావాల్సిన విధి విధానాలు రూపొందించడానికి నియమించింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్)లో ఖాళీగా ఉన్నటువంటి చైర్ పర్సన్ పోస్టును, ఇతర ఉద్యోగులను సత్వరమే బర్తీ చేయాల్సిందిగా మంత్రిత్వ శాఖను ఆదేశించిన ధర్మాసనం రాష్ట్రాల వారిగా అదృశ్యమైన చిన్నారుల జాబితాను కోర్టుకు మార్చ్ 21 లోగా సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. -
అసలుకే ఎసరు రావచ్చు
అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంత్రివర్గంలో కీలక స్థానం దక్కించుకున్న ఓ అమాత్యుల వారికి షాకింగ్ న్యూస్ ఒకటి చెవినపడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఈ మంత్రివర్యులు తన జిల్లాలో తనకు ఇక తిరుగులేదని భావించారు. పార్టీలో ఎవరైనా చేరడానికి వస్తే తనకు ఇష్టం లేకుండా చేర్చుకోరాదని షరతు పెట్టేదాకా ఆయన ముందుకెళ్లారు. ముఖ్యమంత్రి తరువాత తానే అన్నట్లు వ్యవహారం నడుపుతున్న సదరు సీనియర్ మంత్రికి చెక్ పెట్టే వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. సదరు నేతకు పోటీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీఆర్ఎస్లో ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ లోగానే ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టాలని పార్టీ అధినాయకత్వమే ఓ నిర్ణయానికి వచ్చిందట. అదే జిల్లాలో తన సామాజిక వర్గానికి చెందిన ఓ నేత కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే అంశం అది. పార్టీ ముఖ్యులు నేరుగా ఆ విషయం అమాత్యుల వారికి చెప్పేసరికి అవాక్కయ్యారట. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎదురు లేదని అనుకుంటే అంతే సంగతులు మరి...టీఆర్ఎస్సా...మజాకా! -
మంత్రి వర్గంలో చీలిక
చిచ్చురేపిన బీబీఎంపీ మేయర్ స్థానం జేడీఎస్‌తో పొత్తుపై కుదరని సయోధ్య భగ్గుమన్న విభేదాలు.. సిద్ధు నిర్ణయాలు తప్పు బట్టిన సీనియర్లు బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో చీలిక ఏర్పడింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలో విభేదాలను రేకెత్తించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు మంత్రులు బీబీఎంపీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ వశం చేసేందుకు జేడీఎస్ సహకారం తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ చర్యలను ఆ పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు మరికొందరు మంత్రులూ విభేధిస్తున్నారు. ఫలితంగా సోమవారం మంత్రి మండలి సమావేశంలో పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులను బయటకు పంపి వేసి సిద్ధరామయ్య నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో జేడీఎస్‌తో మైత్రి విషయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు జేడీఎస్ సహకారం తీసుకుంటే తర్వాత ఆ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుందని, ఇది సరైన నిర్ణయం కాదంటూ సిద్ధరామయ్యకు పలువురు సూచించారు. దీని వల్ల ప్రజల దృష్టిలో పార్టీ పరువు మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా జేడీఎస్‌తో మైత్రి విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హై కమాండ్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని అక్రోశం వ్యక్తం చేశారు. ఈ తీవ్ర వాగ్వాదం తర్వాత సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తెలపకుండా మరోసారి ఈ విషయంపై సమావేశమవుదామంటూ ముగించినట్లు సమాచారం. -
మాజీ సైనికుల కోసం ‘ఓలా సైనిక్’
హైదరాబాద్: మాజీ సైనికులు ఎంటర్ప్రెన్యూర్లుగా మారే అవకాశాన్ని వ్యక్తిగత రవాణాకు సంబంధించిన మొబైల్ యాప్, ఓలా అంది స్తోంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్(డీజీఆర్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అర్హులైన అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, సాంకేతికతను వినియోగించుకునేలా వారిని తీర్చిదిద్దడం, నైపుణ్యమున్న సూక్ష్మ ఎంటర్ప్రెన్యూర్లుగా వారు వృద్ధి చెందేలా చూడ్డం... వంటి అంశాలకు ఓలా పెట్టుబడి పెట్టేలా ‘ఓలా సైనిక్’ కార్యక్రమాన్ని రూపొందించామని ఓలా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యుగాంతర్ సైకియా పేర్కొన్నారు. -
60 కోట్ల బీసీలకు మంత్రిత్వశాఖ అక్కర్లేదా..?
మోదీ సర్కారును నిలదీసిన బీసీలు న్యూఢిల్లీ: కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉండగా.. దేశ జనాభాలో 60 కోట్ల మంది ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అక్కర్లేదా? అంటూ ప్రధాని మోదీని బీసీలు నిలదీశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై మౌ నం వీడాలని మోదీని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో జాతీయ ప్రధాన కార్యదర్శి కె.ఆల్మిన్రాజ్, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్రావులు మాట్లాడారు. బీసీలకు మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల విద్య,ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పి ంచాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు ఈ సందర్భంగా బీసీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జ్యోతిబా పూలే సంఘం అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, సంఘం నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
నారాయణకు జాక్పాట్లో మంత్రి పదవి
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణకు జాక్పాట్లో మంత్రి పదవి వచ్చిందని, అందుకే ఆయనకు ప్రజల కష్టాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు డబ్బు సంచులు ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. నగరంలోని వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి నారాయణ ఎప్పుడు నెల్లూరుకు వస్తారో.. ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తారో.. అర్థం కావడం లేదన్నారు. ఆయన రాత్రులు మాత్రమే అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలం ప్రజలు సమస్యలపై మాట్లాడుతుంటే మంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. తాము చేసే ప్రతి విమర్శకూ కట్టుబడి ఉన్నామని, దానికి సమాధానం చెప్పలేక నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. పదవి చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా అభివృద్ధి పనులకు ఇంత వరకు రూ.లక్ష అయినా ఖర్చు చేశారా అంటూ మంత్రిని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన కొత్తల్లో సీఎం చంద్రబాబుతో కలసి ఒకే వేదికపై నెల్లూరుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తదితర సదుపాయాలు కల్పిస్తానని డాబు మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. నెల్లూరులో వీధిలైట్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్నాయని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వీటికి సమాధానం చెప్పకుండా తమపై ఎదురు దాడికి దిగడం సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే మంత్రి ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి నెల్లూరు పర్యటనకు వస్తుంటే కనీసం ఎమ్మెల్యేలకు, అధికారులకు తెలియకపోవడం దారుణమన్నారు. మంత్రిగా ఎలా నడుచుకోవాలో నెల రోజుల పాటు శిక్షణ తీసుకుని పనులు చేపట్టాలని మంత్రి నారాయణకు హితవు పలికారు. కార్పొరేషన్లో సమావేశాలు నిర్వహిస్తే కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వరా..? సమావేశానికి వస్తే ప్రజా సమస్యలపై ఎక్కడ నిలదీస్తారేమో అని భయమా అని ప్రశ్నించారు. రాష్ర్టంలోని కమిషనర్లు ఇటీవల ఒంగోల్లో సమావేశం ఏర్పాటు చేసి పురపాలక శాఖ మంత్రి ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, సమయపాలన లేకుండా రోజూ సమావేశాలు ఏమిటని కమిషనర్లు ప్రశ్నించిన ఘన చరిత్ర ఆయనదన్నారు. మంత్రికి, తమకూ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తాము ప్రశ్నించేది ప్రజల సమస్యలపైనే అని తెలిపారు. సమస్యలను పట్టించుకోకుండా అధికార బలంతో గొంతు నొక్కాలని చూస్తే ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇదేవిధంగా మంత్రి వ్యవహరిస్తే జిల్లాలో ఆయన పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఖలీల్‌అహ్మద్, మాధవయ్య, నాగరాజు, డి.రాజశేఖర్, రవిచంద్ర, డి.అశోక్, నాయకులు కె.శ్రీనివాసులు, వి.రంగ, వి.మషేష్, టి.రఘురామిరెడ్డి, వి.శ్రీనివాసులురెడ్డి, జి.సుధీర్‌బాబు, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, సత్యకృష్ణ, హరికృష్ణ, హాజీ, మైనార్టీ నాయకులు మునీర్‌సిద్ధిక్ పాల్గొన్నారు. -
అంబి ఫస్ట్...
మంత్రుల పనితీరుకు సంబంధించి ర్యాంకింగ్‌లు సీఎంకు నివేదిక అందించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గంలోని మంత్రుల పనితీరు ఎలా ఉంది? వారి వారి శాఖలకు సంబంధించి వారు సాధించిన పురోగతి ఏమిటి? పనితీరుకు సంబంధించిన పరీక్షలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? వంటి అంశాలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు జరిపిన సమీక్షకు సంబంధించిన నివేదిక ఆయనకు అందినట్లు తెలిసింది. ఈ నివేదికలో ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఎప్పుడూ విధానసౌధలో కనిపించరంటూ విమర్శలు ఎదుర్కొనే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌కి ఈ పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు రావడం. అంతేకాదు మంత్రివర్గ పునర్నిర్మాణం కనుక జరిగితే ముందుగా బయటికి వెళ్లిపోయే వారి జాబితాలో మొదట ఉన్న రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు సైతం ఈ సమీక్షలో ఏ కేటగిరీ దక్కింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో 86.63శాతం మార్కులతో మంత్రి అంబరీష్ మొదటి స్థానంలో నిలవగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ 51.70శాతం మార్కులతో చివరి స్థానంలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ అంశాల ఆధారంగా సమీక్ష.... సిద్ధరామయ్య మంత్రి వర్గంలోని చాలా మంది మంత్రుల పనితీరు సరిగా లేదని, ఆశించిన విధంగా వారు ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారని విపక్షాలతో పాటు అటు స్వపక్ష సభ్యుల నుంచి సైతం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు శాసనసభా పక్ష సమావేశంలో సైతం సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మంత్రుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఏయే శాఖలకు చెందిన మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీకి కొంతకాలం క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో 26 మంది మంత్రులకు సంబంధించిన మొత్తం 38శాఖల్లో ఆయా మంత్రుల పనితీరుకు సంబంధించి కౌశిక్ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. ఆయా మంత్రులు తమ శాఖల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, జిల్లాల పర్యటన, ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరువ చేయడం తదితర అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సమీక్షను నిర్వహించారు. అంతేకాక మంత్రుల పనితీరుకు సంబంధించిన ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లాల అధికారులతో నివేదికలు తెప్పించుకొని సమీక్షకు తుదిరూపునిచ్చారు. మూడు విడతల్లో ఈ సమీక్షను నిర్వహించి శాఖల వారీగా అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన మంత్రులకు ఏ కేటగిరి, ఓ మోస్తరుగా పనితీరు ఉన్న మంత్రులకు బీ కేటగిరి, పనితీరు ఏ మాత్రం బాగాలేని మంత్రులకు సి కేటగిరీని ఇచ్చినట్లు సమాచారం. ఏ కేటగిరీలో అంబి....సి కేటగిరీలో శ్రీనివాస ప్రసాద్.... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ సమీక్ష నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు సమాచారం. ఈ సమీక్ష ప్రకారం మంత్రులు అంబరీష్, ఆర్.వి.దేశ్‌పాండే, సతీష్ జారకీహోళి, ఆర్.రామలింగారెడ్డి, హెచ్.కె.పాటిల్, ఎస్.ఆర్.పాటిల్, శామనూరు శివశంకరప్ప, కృష్ణబేరేగౌడ, కిమ్మన రత్నాకర్, శివరాజ్ తంగడగి, హెచ్.ఎస్.మహదేవ ప్రసాద్, బి.రామనాథ్ రైలు ఏ కేటగిరీలో ఉన్నారు. ఇక మంత్రులు ఉమాశ్రీ, శరణ్ ప్రకాష్ పాటిల్, పరమేశ్వర నాయక్, హెచ్.సి.మహదేవప్ప, ఖమరుల్ ఇస్లామ్, రోషన్‌బేగ్, బాబూరావ్ చించనసూర్, ఎం.బి.పాటిల్, అభయ్ చంద్రజైన్, డి.కె.శివకుమార్‌లు బీ కేటగిరీలో ఉన్నారు. ఇక సీ కేటగిరీలో యు.టి.ఖాదర్, ఆంజనేయ, వినయ్‌కుమార్ సూరకె, వి.శ్రీనివాస ప్రసాద్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. -
తూర్పు.. పశ్చిమం..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పదవుల పందేరం జిల్లాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతల మధ్య దూరాన్ని పెంచుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలక పదవులన్నీ పశ్చిమ ప్రాంత నేతలనే వరిస్తున్నాయనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ప్రాధాన్యతతో కూడిన పదవులన్నీ ‘పశ్చిమా’నికే దక్కాయి. రానున్న రోజుల్లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల విషయంలోనైనా తమకు ప్రాధాన్యం ఇవ్వాలనే వాదన ‘తూర్పు’ నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గా కొనసాగుతున్నారు. అలాగే ముథోల్‌కు చెందిన వేణుగోపాలచారి కూడా కేబినెట్ స్థాయి పదవిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా ఢిల్లీలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రతినిధిగా ఆయన్ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో కూడా నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి చోటు దక్కింది. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్‌లో కూడా ఆయనకు బలమైన అనుచరవర్గం ఉండటం, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండటం వంటి అంశాలు ఆయనకు కలిసొచ్చాయి. మంత్రి పదవితో పోల్చితే అంతగా ప్రాధాన్యత లేని పదవులు మాత్రం తూర్పు జిల్లా నేతలకు దక్కాయి. ప్రభుత్వ విప్‌గా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నియమితులు కాగా, మహిళా కోటాలో కోవ లక్ష్మికి పార్లమెంట్ సెక్రెటరీ పదవి వరించింది. గతం నుంచీ వీరి మధ్య పోటీ గతంలో జిల్లాలో పలు పదవుల విషయంలో తూ ర్పు, పశ్చిమ జిల్లాల మధ్య పోటాపోటీ నెలకొంది. అత్యంత కీలకమైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠం విషయంలో అప్పట్లో తూర్పు, పశ్చిమ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరి వరకు ఇరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల పేర్లు వినిపించాయి. కానీ.. నిర్మల్ జెడ్పీటీసీ శోభా సత్యనారాయణగౌడ్కే ఈ పదవి వరించింది. తాజాగా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవి విషయంలోనూ ఇరు ప్రాంత నేతలు పోటీ పడ్డారు. ఈ పదవిని టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకున్నా, చైర్మన్ పదవి విషయంలో తూర్పు, పశ్చిమ జిల్లాల డెరైక్టర్లు తీవ్రంగా ప్రయత్నిం చారు. తూర్పు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో చివరకు ఆ ప్రాంతానికి ఈ డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కింది. అంతకు ముందు డీసీసీబీ చై ర్మన్ పదవి విషయంలోనూ ఇరు ప్రాంత నేతలు పా వులు కదిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెం దిన డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం వ్యవహారాన్ని నడిపిన చంద్రశేఖర్‌రెడ్డి పశ్చిమ ప్రాంతానికే చెందినా, తూర్పు ప్రాంత డెరైక్టర్ల మద్దతుతో ఈ వ్యవహారాన్ని నడిపారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించ లేదు. -
తలసాని ఇంటి వద్ద కోలాహలం
తల్లి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణ స్వీకారానికి వెళ్లిన శ్రీనివాస్ తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు రాంగోపాల్‌పేట్: సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి పరిసరాలు మంగళవారం ఉదయం సందడిగా మారాయి. వందలాది మంది కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు. ఇంటి ముందు టపాకాయలు కాలుస్తూ అభిమానులు ఆనందాన్ని పంచుకున్నారు. రోడ్లఫై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేశారు. ప్రమాణ స్వీకారానికి తరలి వెళుతుండగా మారేడుపల్లిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత తలసాని మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు మంత్రి పదవి ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంత కాలం సహకరించిన గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. తల్లి ఆశీర్వాదం తీసుకుని... ఉదయం 8.45 గంటలకు తల్లి లలితాబాయి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం తలసాని ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు. చంద్రబాబు పెద్ద కొడుకు: లలితాబాయి తన కుమారుడు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడని... ఆయన కష్టానికి ఫలితం లభిస్తోందని తలసాని తల్లి లలితాబాయి అన్నారు. తనకు చంద్రబాబునాయుడు పెద్ద కొడుకులాంటివాడని, తలసాని చిన్నకొడుకని... ఇద్దరూ విడిపోతుండటం బాధగా ఉందని అన్నారు. తరలి వెళ్లిన కార్యకర్తలు తలసాని ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ నుంచి నాగేందర్ ఆధ్వర్యంలో బండిమెట్, ప్యారడైజ్, మంజు థియేటర్ నుంచి మూడు బృందాలుగా వెళ్లారు. మిగతా డివిజన్ల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు. అభిమానుల సందడి సోమాజిగూడ: తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణను పురస్కరించుకొని మంగళవారం రాజ్‌భవన్ రోడ్, సీఎం క్యాంపు కార్యాలయం ప్రాంతం గులాబీమయంగా మారిపోయింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల చిత్రపటాలు, ఫ్లెక్సీలను అభిమానులు పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. రాజ్‌భవన్ రోడ్లో రాకపోకలపై పోలీసులు నియంత్రణ విధించడంతో బేగంపేట, పంజగుట్ట ప్రదాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. -
దశాబ్దకాలం తర్వాత మళ్లీ మంత్రి పదవి
హైదరాబాద్ : సరిగ్గా దశాబ్దకాలం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రి పదవి అందుకున్నారు. ఆయన దాదాపు 40 సంవత్సరాలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగి తాజాగా టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తుమ్మల పది సంవత్సరాల తర్వాత మంగళవారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని చేపట్టారు. టీడీపీలో కొనసాగినన్నాళ్లు తనదైన పంథాలో ముందుకెళ్లిన ఆయన పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఇతర పరిణామాల కారణంగా నాలుగు నెలల క్రితం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల ఆయన పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచే ఆయనను మంత్రిపదవి వరిస్తుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి. సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో తొలిసారిగా రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామంత్రిగా, భారీ నీటి పారుదల శాఖామంత్రిగా, రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరిన తుమ్మల జిల్లాలో టీడీపీకి భారీ గండి కొట్టిన నేతగా మెజార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను తనతోపాటు టీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. -
అమాత్య తుమ్మల!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సరిగ్గా దశాబ్దకాలం తర్వాత రాష్ట్ర మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రి పదవి చేపట్టనున్నారు. తుమ్మల దాదాపు 40 సంవత్సరాలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగిన ఆయన పది సంవత్సరాల తర్వాత మంగళవారం మంత్రి పదవిని చేపట్టనున్నారు. టీడీపీలో కొనసాగినన్నాళ్లు తనదైన పంథాలో ముందుకెళ్లిన ఆయన పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఇతర పరిణామాల కారణంగా నాలుగు నెలల క్రితం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల ఆయన పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచే ఆయనను మంత్రిపదవి వరిస్తుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి. సత్తుపల్లి నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో తొలిసారిగా రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖామంత్రిగా, భారీ నీటి పారుదల శాఖామంత్రిగా, రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరిన తుమ్మల జిల్లాలో టీడీపీకి భారీ గండి కొట్టిన నేతగా మెజార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను తనతోపాటు టీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, తుమ్మలకు మంత్రిగా గతంలో ఉన్న సుదీర్ఘ అనుభవం జిల్లా అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి దోహదపడుతుందని జిల్లా ప్రజానీకం భావిస్తోంది. తుమ్మల ముందున్న అభివృద్ధి.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, దు మ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేయడం, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం, సింగరేణి గనుల విస్తరణ, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ, జిల్లాలో రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పనులు తుమ్మల ముందున్న కర్తవ్యాలు. ఆయనకు కేబినెట్లో చోటు ఖాయమైనప్పటినుంచే ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతోంది. సత్తుపల్లి నియోజకవర్గంలోనైతే ఆయనకు శాఖల కేటాయింపుపై హోరాహోరీగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.తుమ్మలకు హోం, విద్యుత్, ఆర్అండ్బీ వంటి కీలక శాఖలను కేటాయించే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. చాలాకాలం తర్వాత తుమ్మలకు మంత్రిపదవి లభిస్తుండటంతో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. వేలాదిగా కార్యకర్తలను తరలించేందుకు పార్టీ నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికే సమాయత్తం అయ్యారు. తుమ్మల మంగళవారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, ఆయనను కలవడానికి హైదరాబాద్ వెళ్లిన జిల్లాకు చెందిన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ సమీపంలో ఉన్న జయగార్డెన్స్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా నుంచి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య, పార్టీ నేతలు కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ తదితరులు హైదరాబాద్ తరలివెళ్లారు. తుమ్మలకు మంత్రి పదవి ఖాయమవుతుండటంతో వివిధ రాజకీయ పక్షాల్లో ఆదరణకు నోచుకోని నాయకులు సైతం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో నెలకొన్న స్తబ్దత తుమ్మల మంత్రిపదవి చేపట్టిన అనంతరం తొలగిపోతుందని విశ్లేషకుల భావన. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు, టీఆర్ఎస్ నేతలు, తుమ్మలతో అనుబంధం ఉన్న వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
అధికారమస్తు
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర కేబినెట్లో ఆరునెలల తర్వాత జిల్లాకు ఓ మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కనుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు జిల్లాలో ఒక్క స్థానమే రావడంతో తొలి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. నామినేటెడ్ రేసులో ఇప్పటికే జిల్లాకు చెందిన పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిన నేపథ్యంలో ఇక అభివృద్ధికి అడుగులు పడతాయని జిల్లా ప్రజలు గంపెడాశతో ఉన్నారు. తొలి కేబినెట్లో జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ప్రధాన అభివృద్ధి పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా మారాయి. జిల్లాలో అభివృద్ధి, ప్రతిపాదిత పనుల ప్రస్తావనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగింది. జిల్లా ప్రజల ఆశలసౌధం రాజవ్సాగర్ ( దుమ్ముగూడెం ) ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఈ ప్రాజెక్టుకు అత్తెసరు నిధులే కేటాయించారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా..? అని జిల్లా వాసులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వాసులకు ఉపాధి కల్పతరువు కాబోతుందని ఊరిస్తున్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్ ) ప్రతినిధుల బృందం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై సర్వే చేసుకొని వెళ్లి నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే పారిశ్రామిక కారిడార్‌గా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాలు విద్యుత్ హబ్‌గా మారబోతున్నాయి. రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం మణుగూరులో నిర్మించ తలపెట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు వెళ్తున్నా ఇక్కడ నిర్వాసితుల గోడు వినిపించుకోవడం లేదు. నిర్వాసితులు మెరుగైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వారి సమస్యపై దృష్టి పెట్టలేకపోతోంది. పవర్ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే స్థానికంగా ఉండే తమకు ఉపాధి దొరుకుతుందని ఈ ప్రాంత యువత వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధి పనులన్నీ జిల్లాకు కేబినెట్లో స్థానం లేకపోవడంతోనే ఇన్నాళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నా సర్కారు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పవచ్చు. బొగ్గు గనుల దృష్ట్యా మణుగూరులో పవర్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. జిల్లాకు మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కుతుండడంతో ఇకనైనా ప్రధానపనులన్నీ వేగవంతం చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాకు ప్రధాన పదవులు.. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లయిన తర్వాత జిల్లాకు ప్రధాన పదవులు దక్కుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి ఇటీవల ముఖ్యమంత్రి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకే ఈ పదవి దక్కింది. కేబినెట్ విస్తరణలో మాజీ మంత్రి, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవులు దక్కబోతున్నాయి. తుమ్మలకు రోడ్లు, భవనాలు లేదా హోం శాఖ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మరికొన్ని పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈ పదవులు కోసం ఇప్పటికే పోటీపడుతున్నారు. జిల్లాకు పదవుల యోగం పడుతుండటంతో జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు సంవత్సరాంతాన్ని ఘనంగా ముగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మిగిలింది నాలుగున్నరేళ్లు.. ఈ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంత్రి పదవి యోగం పట్టేసరికి ఆరునెలలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా మిగిలిన నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధిని పట్టాలెక్కించాలి. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ తన ఎన్నికల అజెండాలో పెట్టింది. విద్యుత్ అవసరాల దృష్ట్యా పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడం ప్రభుత్వానికి సునాయాసం అయితే, కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ మంజూరై నిర్మాణం కొంతైనా జరిగితేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో టీఆర్ఎస్కు పట్టు ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. జిల్లా నుంచి మంత్రి, పార్లమెంట్ కార్యదర్శి పదవులు పొందుతున్న వారిపైనే ఈ గురుతర బాధ్యత ఉందని జిల్లా ప్రజానీకం చర్చించుకుంటోంది. -
బెర్త్ ఎవరికో..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/చెన్నూరు : ఎన్నో రోజులుగా ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణ అంశం ఎట్టకేలకు తెరపైకి రావడంతో ఈ పదవులను ఆశి స్తున్న నేతలతోపాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కం ఠ నెలకొంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ప్రభుత్వ విప్ పదవి ఖరారైంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓదేలుకు సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితునిగా పేరుంది. ప్రభుత్వ విప్‌గా ఓదెలు పేరు గతంలోనే వినిపించినా ఇప్పటికి ఖరారైంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఇంద్రకరణ్‌రెడ్డికి సీనియర్ నేతగా పేరుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో సొంత చరిష్మతో విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆయన అనుచర వర్గాలు భావిస్తున్నాయి. అలాగే కోవ లక్ష్మికి కూడా ఈ పదవి దక్కడంలో సమీకరణాలు కలిసొస్తున్నాయని ఆమె అనుచర వర్గాలు భావిస్తున్నాయి. ఆమెకు ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇటు మహిళా కోటా, మరోవైపు గిరిజనుల కోటా కింద పదవి ఇచ్చినట్లు అవుతుందని, పైగా ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కోవ లక్ష్మి అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేటెడ్ పదవులపై.. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఎమ్మెల్యేలను నియమిం చాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అలాగే పార్లమెంట్ సెక్రటరీలుగా ఎ మ్మెల్యేలను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేల్లో ఈ పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా మంత్రి వర్గంలో చేరే మంత్రులు ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ పదవులు దక్కనున్న వారికి ఆది, సోమవారాల్లో కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలున్నాయి. బాధ్యత మరింత పెరిగింది : ఓదెలు బంగారు తెలంగాణ నిర్మాణంలో మరింత బాధ్యత పెరిగిందని చెన్నూ ర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. ప్రభుత్వం నల్లాల ఓదెలును శని వారం ప్రభుత్వ విప్‌గా నియమించగా ‘సాక్షి’ ఆయనను ఫోన్లో పలకరించింది. ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతోనే ప్రభుత్వ విప్‌గా నియమించారని తెలిపారు. కేసీఆర్ ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తానన్నారు. అన్ని రంగాల్లో నియోజవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు. -
బీజేపీది అనవసర రాద్ధాంతం : సీఎం
భూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న బీజేపీ డిమాండ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. బీజేపీ పేర్కొంటున్న మంత్రులపై వచ్చిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాలేదని అన్నారు. అందువల్ల వారిని మంత్రి వర్గం నుంచి తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఉప ముఖ్యమంత్రులు ఆర్.అశోక్, కేఎస్ ఈశ్వరప్ప, మంత్రి సోమణ్ణలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని, అంతేకాక ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఆ సమయంలో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని బీజేపీ ఇప్పుడు తమనెందుకు ప్రశ్నిస్తోందో సమాధానం చెప్పాలని అన్నారు. -
కేసీఆర్ వద్దనున్న శాఖలు మంత్రులకు కేటాయింపు!
-
చిన్ని చిన్ని ఆశ..!
మంత్రి పదవి కోసం ఆ ముగ్గురి చూపు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్లో పదవుల పందేరం కొనసాగుతోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, కమిటీల ఏర్పాటుపై అన్ని స్థాయిల్లోని నాయకులు ఆశలు పెంచుకున్నారు. అధినేత వీటిపై ఎప్పుడు దృష్టి పెడతారా? అని సర్వత్రా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మంత్రిపదవులే కాకుండా, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టులు, మార్కెట్, ఆలయ కమిటీల పదవులు ఆశిస్తున్న పలువురు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఇతర ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా పదవులు దక్కించుకోవాలన్న యోచనలో వారు హైదరాబాద్ టూర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2న ఏర్పడిన తెలంగాణ తొలి ప్రభుత్వ కేబినెట్లో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరికీ చోటుదక్కలేదు. దీంతో మలివిడత మంత్రివర్గ విస్తరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీఆశలు పెంచుకున్నారు. సాధారణ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ తరుఫున ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) మంత్రివర్గ విస్తరణలో తమకు చోటుదక్కడంపై భారీగా లెక్కలు వేసుకుంటున్నారు. మెదక్ ఉపఎన్నిక, దసరా పండుగ.. ఆ తర్వాత ఈనెల 11, 12 తేదీల్లో చేపట్టనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం.. ఈ సమావేశం తర్వాతైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని విసృ్తత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలోని సగం అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపు సాధించినా మంత్రి పదవులు దక్కకపోవడంతో స్థానికంగా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు కూడా ప్రకటించారు. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లో మునిగితేలుతున్నారు. ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో తమకు స్థానం దక్కే విషయంపై ఎవరికి వారు అంచనాలతో ఉన్నారు. కార్పొరేషన్ పదవులపై కన్ను ఓ వైపు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు కార్పొరేషన్ పదవులపై ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గద్వాల నుంచి పోటీచేసి ఓటమి పాలైన బి.కృష్ణమోహన్‌రెడ్డి, కొడంగల్‌లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. పార్టీలో చాలాకాలంగా కొనసాగుతున్న సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ దక్కని వారు పలువురు కూడా ప్రాధాన్యం కలిగిన కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం వస్తుందనే అంచనాలో ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం పార్టీ అధినేతతోపాటు ముఖ్యనాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు. మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ద్వారా ముమ్మర ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల తర్వాతే మలివిడత మంత్రి వర్గవిస్తరణ, నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే జిల్లాలో ఎంతమందిని పదవులు వరిస్తాయో వెల్లడికానుంది. -
మోడీ, కెసీఆర్ లకు లేనిది... చంద్రబాబుకు ఉన్నది....
ఒక నాయకుడి బలం తెలుసుకోవాలంటే ఆ నాయకుడిని ఆయన అనుచరులు ఎంత బలంగా నమ్ముతున్నారో తెలుసుకుంటే చాలు. దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కరుణానిధిని ఆయన అనుచరులు విడిచిపోలేదు. జయలలిత అధికారంలో ఉన్నా లేకున్నా ఆమె అనుచరులు ఆమె వెన్నంటే ఉంటారు. నరేంద్ర మోదీ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పక్కనబెట్టారు. బండారు దత్తాత్రేయ వంటి బలమైన నేతలను పక్కనపెట్టారు. కానీ పార్టీలో ఎలాంటి తిరుగుబాటూ లేదు. అదే విధంగా కొద్ది పాటి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రి వర్గం విషయంలోనూ అసంతృప్తులు ఉన్నా బయటకి రావడం లేదు. ఎవరూ తిరుగుబాటు ప్రకటించలేదు. అదే చంద్రబాబు విషయానికి వచ్చే సరికి ఆయనకు అసెంబ్లీలో తగినంత బలం ఉంది. కెసీఆర్ తో పోలిస్తే ఆయన పరిస్థితి మరింత సురక్షితం. ఆయనకు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. ఇన్ని ఉన్నా ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తే అసమ్మతి సెగలు ఎందుకు రగులుతున్నాయి? ఎందుకు ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు నిరాహార దీక్షలకు దిగుతున్నారు? ఎందుకు వారు పార్టీ పదవులకు బై చెబుతున్నారు? ఉత్తరాంధ్రలో ఏడు సార్లు ఎన్నికలు గెలుస్తూ వచ్చిన పతివాడ నారాయణ స్వామి, కష్టకాలంలోనూ పార్టీని వెన్నంటి ఉన్న కళా వెంకటరావు అసంతృప్తితో ఉన్నారు. దాన్ని వారు దాచుకోవడం లేదు. మరో వైపు విశాఖపట్నంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు దూతగా వచ్చి బుజ్జగించినా ఆయన మాట వినడం లేదు. తూర్పు గోదావరిలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాజమండ్రిలో మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న కాగిత వెంకట్రావు మధుమేహ వ్యాధి పీడితుడై ఉండీ నిరాహార దీక్ష చేసి, ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఇక గుంటూరులోనైతే గత పదేళ్లుగా పార్టీకి నోరుగా పనిచేసిన ధూళిపాళ నరేంద్ర కు మంత్రి పదవి దక్కనందుకు ఆయన అనుచరులు ఆయనను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లవద్దని నిర్బంధించారు. ఇంకోవైపు మోదుగుల అనుచరులు టీడీపీ కార్యాలయంపైనే దాడి చేసి, కసి తీర్చుకున్నారు. అనంతపురంలో పెనుకొండ ఎమ్మెల్యే బీకె పార్థసారధి అనుచరులు పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ తిరుగుబాటు చంద్రబాబు ఊహించి ఉండరా? కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలు, గతం నుంచి వెన్నంటి ఉండిన వారికి మధ్య సయోధ్య ఎందుకు కుదర్చలేదు? పార్టీ నేతలతో ఆయన ముందస్తుగా చర్చించి, బుజ్జగించడానికి ప్రయత్నించలేదా? వారికి వేరే పదవులు ఇస్తామని హామీ ఇచ్చారా లేదా? రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సీమాంధ్రను మళ్లీ పునర్నిర్మించే బాధ్యత ఉన్న నేతగా ఆయన తన లీడర్ షిప్ ను ప్రదర్శించాల్సిన సమయంలో ఎందుకు విఫలమయ్యారు? ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన పరిస్థితిలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్టుంది. ఇప్పటికే రుణమాఫీ తలకు చుట్టుకుంటోంది. మిగతా వాగ్దానాలూ ఇలాగే ఉండబోతున్నాయా? ప్రస్తుతం ఓటర్లు ఎక్కువకాలం వేచి చూసే మూడ్ లో లేరు. తాము నమ్మి నాయకత్వం, అధికారం కట్టబెట్టిన నేత తప్పటడుగులు వేసినా కొద్దికాలం సహిస్తారేమో కానీ, తప్పుటడుగులు వేస్తున్నారన్న అనుమానం వస్తే చాలు శిక్షించేందుకు రెడీ అవుతారు. కేవలం అయిదులక్షల ఓట్లు ఎక్కువగా వచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశాన్ని శిక్షించేందుకూ వోటర్లు వెనుకాడరు. -
జిల్లాకు మరో పదవి
ఆదిలాబాద్ : కేసీఆర్ సర్కారులో జిల్లాను మరో పదవి వరించింది. ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్నకు ఇప్పటికే మంత్రి పదవి దక్కగా, ఇప్పుడు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాలాచారికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి పదవి లభించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి కేబినేట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ముథోల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలతో చారికి ఈ పదవి దక్కింది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. హామీల కమిటీ చైర్మన్‌గా వేణుగోపాలాచారి బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ, ఇతర అనుమతులు తీసుకురావడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అధినేత కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని వేణుగోపాలాచారి ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు. -
సీఎంగా కిరణ్ ఉన్నంతకాలం మంత్రి పదవి తీసుకోను
దమ్ముంటే నా రాజీనామా ఆమోదించాలి: శ్రీధర్‌బాబు సాక్షి, కరీంనగర్: కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మంత్రి పదవి తీసుకోనని శ్రీధర్‌బాబు ప్రతినబూనారు. కుట్రపూరితంగా తనను శాసనసభా వ్యవహారాల నుంచి తప్పించారని ఆరోపించారు. కిరణ్‌కు దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించాలని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత మొదటిసారి ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాకు రాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి, భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసమే తాను అనేక అవమానాలు భరించానని చెప్పారు. అమరవీరుల త్యాగాల ముందు తన రాజీనామా ఎక్కువ కాదన్నారు. ముసాయిదా బిల్లుపై రాజ్యాంగబద్దంగా ఓటింగ్ సాధ్యం కాదని, ఆర్టికల్ 3,4 ప్రకారం సూచనలు, అభిప్రాయాలు చెప్పే అవకాశం మాత్రమే ఉంటుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. 43రోజుల గడువు ఇస్తూ బిల్లు పంపినా సీమాంధ్ర నేతలు మరింత గడువు కోరనున్నారని తెలిసిందని, వారెన్ని ఎత్తులు వేసినా అది సాధ్యం కాదన్నారు. బిల్లును ఆపుతామని సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విభజన ప్రక్రియలో జాప్యం చేసేందుకు కిరణ్ కుట్రలు పన్నుతున్నారని మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఆయన ఆరోపించారు. -
నేటినుంచి సైన్స్ ఫెయిర్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: బాలురలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను సంగారెడ్డి డివిజన్ స్థాయిలో శనివారం ప్రారంభించనున్నారు. ఇందుకు గాను 15 మండలాలకు చెందిన విద్యార్థులు 480 ప్రదర్శనలు చేయనున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవే క్షించేందుకు 16 కమిటీలను నియమించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో నిర్వహించనున్న డివిజన్‌స్థాయి సైన్స్ ఫెయిర్‌ను ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డితో పాటు ఇతర శాసనసభ సభ్యులు హాజరు కానున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి ఐదు వేల మంది సందర్శిస్తారని, వీరికి మూడు రోజులపాటు 15వేల మంది హాజరవుతారని అంచనా. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్, రాయికోడ్, జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, మునిపల్లి, సదాశివపేట, కొండాపూర్, రామచంద్రాపురం, జిన్నారం, పటాన్చెరు మండలాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహిస్తున్నందున వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సందర్శించేందుకు వస్తారని అధికారులు అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు ఒక గైడ్ టీచర్‌తో పాటు విద్యార్థి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లకు సంబంధించి నియమించిన కమిటీలకు డీఈఓ పలు సూచనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలకు విద్యార్థులతో పాటు గైడ్ టీచర్‌కు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.