మోదీ సర్కారును నిలదీసిన బీసీలు
న్యూఢిల్లీ: కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉండగా.. దేశ జనాభాలో 60 కోట్ల మంది ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అక్కర్లేదా? అంటూ ప్రధాని మోదీని బీసీలు నిలదీశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై మౌ నం వీడాలని మోదీని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో జాతీయ ప్రధాన కార్యదర్శి కె.ఆల్మిన్‌రాజ్, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్‌రావులు మాట్లాడారు. బీసీలకు మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల విద్య,ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పి ంచాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు ఈ సందర్భంగా బీసీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జ్యోతిబా పూలే సంఘం అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, సంఘం నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
60 కోట్ల బీసీలకు మంత్రిత్వశాఖ అక్కర్లేదా..?
Published Wed, May 6 2015 2:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement