మైనార్టీలకు మంత్రిత్వశాఖ కేటాయించాలి
పెద్దాపురం, సామర్లకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాయని, కేబినెట్‌లో మైనార్టీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. దళిత, బడుగు వర్గాల సామాజిక హక్కుల వేదిక బస్సుయాత్రలో భాగంగా ఇచ్చాపురంలో బయలేరిన బస్సుయాత్ర బుధవారం ముందుగా పెద్దాపురం, అనంతరం సామర్లకోటలో సా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పెద్దాపురం, సామర్లకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాయని, కేబినెట్‌లో మైనార్టీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. దళిత, బడుగు వర్గాల సామాజిక హక్కుల వేదిక బస్సుయాత్రలో భాగంగా ఇచ్చాపురంలో బయలేరిన బస్సుయాత్ర బుధవారం ముందుగా పెద్దాపురం, అనంతరం సామర్లకోటలో సాగింది.
పెద్దాపురం మెయిన్‌రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మ«ధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన నిధుల్లో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగకుంటే పోరాటాని తీవ్రతరం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. తొలుత స్థానిక మున్సిపల్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక హోదా కోరుతూ రామకృష్ణ, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు మున్సిపల్ సెంటర్ నుంచి మెయిన్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం కార్యదర్శి రావుల వెంకయ్య, మహిళా సమాఖ్య కార్యదర్శి దుర్గాభవాని, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిర్ల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బైలపూడి సూరిబాబు, పెదిరెడ్ల సత్యనారాయణ, నిమ్మన సత్యనారాయణ, జల్లిగంపల వెంకన్న, తిరుపతి సత్తిబాబు, ఎలిశెట్టి రామదాసు, కన్నూరి వెంకన్న, పోలపర్తి తాతారావు, అల్లు నాగేశ్వరరావు, వేముల అర్జునరావు, గుమ్మిరేగుల రమణ, బదిరెడ్డి కృష్ణ, నక్కా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
సామర్లకోటలోనూ..
స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు బస్సుయాత్రకు స్వాగతం పలికారు. ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చంద్రయ్యదాసు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ ప్రసంగించారు.