ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి! | Israeli Health Ministry Warns Against Wide Measles Outbreak in Children | Sakshi
Sakshi News home page

Israel War: యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి!

Published Mon, Oct 9 2023 12:52 PM | Last Updated on Mon, Oct 9 2023 12:55 PM

Israeli Health Ministry Warns Against Wide Measles Outbreak in Children - Sakshi

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి పర్యవసానాలను దేశంలోని సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. 

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో రెండేళ్ల వయసుగల నలుగురు పిల్లలు తీవ్రమైన తట్టు(మీజిల్స్‌) వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ పీడియాట్రిక్ అసోసియేషన్ ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు దేశంలోని చిన్నారులకు టీకాలు వేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వెంటనే టీకాలు వేయించాలని వైద్యాధికారులు సూచనలు చేశారు. 

తట్టు అనేది వాస్తవానికి రుబియోలా అనే వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వైరస్ సోకాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయపటతాయి. తట్టు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి
జ్వరం
పొడి దగ్గు
జలుబు
గొంతు మంట
కళ్లు ఉబ్బడం
చర్మంపై దద్దుర్లు, చర్మంపై చిన్న మచ్చలు
వాస్తవానికి మీజిల్స్(తట్టు) లక్షణాలు సాధారణంగా రోగి ముక్కు, గొంతులో కనిపిస్తాయి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ వైరస్‌ గాలిలో కలుస్తుంది. ఫలితంగా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధికి టీకా అందుబాటులో ఉంది. రెండు మోతాదుల టీకా ఈ వ్యాధిని నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో 97 శాతం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమయ్యింది.
ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement