అసలుకే ఎసరు రావచ్చు | Shocking news to ministry | Sakshi
Sakshi News home page

అసలుకే ఎసరు రావచ్చు

Published Sun, Oct 11 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

అసలుకే ఎసరు రావచ్చు

అసలుకే ఎసరు రావచ్చు

అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంత్రివర్గంలో కీలక స్థానం దక్కించుకున్న ఓ అమాత్యుల వారికి షాకింగ్ న్యూస్ ఒకటి చెవినపడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఈ మంత్రివర్యులు తన జిల్లాలో తనకు ఇక తిరుగులేదని భావించారు. పార్టీలో ఎవరైనా చేరడానికి వస్తే తనకు ఇష్టం లేకుండా చేర్చుకోరాదని షరతు పెట్టేదాకా ఆయన ముందుకెళ్లారు. ముఖ్యమంత్రి తరువాత తానే అన్నట్లు వ్యవహారం నడుపుతున్న సదరు సీనియర్ మంత్రికి చెక్ పెట్టే వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. సదరు నేతకు పోటీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీఆర్‌ఎస్‌లో ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
 
ఈ లోగానే ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టాలని పార్టీ అధినాయకత్వమే ఓ నిర్ణయానికి వచ్చిందట. అదే జిల్లాలో తన సామాజిక వర్గానికి చెందిన ఓ నేత కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే అంశం అది. పార్టీ ముఖ్యులు నేరుగా ఆ విషయం అమాత్యుల వారికి చెప్పేసరికి అవాక్కయ్యారట. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎదురు లేదని అనుకుంటే అంతే సంగతులు మరి...టీఆర్‌ఎస్సా...మజాకా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement