హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment