ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత అయిదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను రద్దు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక సమర్పించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఉద్యోగాల రద్దుపై అన్ని మంత్రిత్వ శాఖలను, విభాగాలను యాక్షన్ రిపోర్టును కోరామని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని శాఖల అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, పారామిలిటరీ దళాల చీఫ్, ఇతర సంబంధిత సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఐదేళ్లుగా భర్తీకాని ఉద్యోగాలపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా గతంలోనే అన్నిమంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారులు , ఉమ్మడి కార్యదర్శులు (అడ్మినిస్ట్రేషన్) / విభాగాలను కోరినట్టు వెల్లడించింది. అయితే కొన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు స్పందించినప్పటికీ, మరికొన్ని నివేదికలు సమగ్రంగా లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జనవరి 16, 2018 తేదీన సంబంధిత మెమోరాండం జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ప్రాథమిక అంచనా ప్రకారం, ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా అనేక వేల కేంద్ర ప్రభుత్వం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా హోంశాఖ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment