మాజీ సైనికుల కోసం ‘ఓలా సైనిక్’
హైదరాబాద్: మాజీ సైనికులు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారే అవకాశాన్ని వ్యక్తిగత రవాణాకు సంబంధించిన మొబైల్ యాప్, ఓలా అంది స్తోంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్(డీజీఆర్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అర్హులైన అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, సాంకేతికతను వినియోగించుకునేలా వారిని తీర్చిదిద్దడం, నైపుణ్యమున్న సూక్ష్మ ఎంటర్‌ప్రెన్యూర్లుగా వారు వృద్ధి చెందేలా చూడ్డం... వంటి అంశాలకు ఓలా పెట్టుబడి పెట్టేలా ‘ఓలా సైనిక్’ కార్యక్రమాన్ని రూపొందించామని ఓలా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యుగాంతర్ సైకియా పేర్కొన్నారు.