ఇక యాప్‌తోనే ఓలా బుకింగ్స్
బెంగళూరు : ట్యాక్సీ సేవల సంస్థ ఓలా ఇక ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మొబైల్ యాప్ రూపంలోనే సర్వీసులు అందించనుంది. తమకొచ్చే బుకింగ్స్‌లో 99%.. యాప్ ద్వారానే ఉంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. కస్టమర్లకు సహాయపడేందుకు తమ కాల్‌సెంటర్ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. 2011లో క్యాబ్ బుకింగ్స్ కోసం ఓలా మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ముంబైలో ఇది ఆటో రిక్షాలు, ట్యాక్సీల బుకింగ్‌కి కూడా ఉపయోగపడుతోంది. మొదటిసారిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న కస్టమర్లు ‘యాప్‌ఓన్లీ’ అనే కూపన్ కోడ్‌ను బుకిం గ్ కన్ఫర్మేషన్ స్క్రీన్‌పై టైప్ చేస్తే.. తమ తొలి బుకింగ్‌పై రూ. 150 డిస్కౌంటు లభిస్తుందని ఓలా సీవోవో ప్రణయ్ జీవ్‌రాజ్క తెలిపారు.