
ఫైల్ ఫోటో
సాక్షి,న్యూఢిల్లీ: క్యాబ్ అగ్రిగేటర్ ఓలా ముంబైకి చెందిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ టికెటింగ్ అండ్ కమ్యూటింగ్ యాప్ రిడ్‌లార్‌ను కొనుగోలు చేసింది. డిజిటల్ రవాణా సేవలను వినియోగదారులకు అందించే క్రమంలో ఈ చర్య తీసుకున్నామని కంపెనీ మంగళవారం ప్రకటించింది. తద్వారా రిడ్‌లార్ ఆవిష్కరణలతో మేళవించి వినియోగదారులకు మల్టీ మోడల్ మొబిలిటీ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భీష్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ఓలా ద్వారా పట్టణ ప్రాంతాల్లో వన్‌స్టాప్ డెస్టినేషన్‌లాంటి సేవలను విస్తరించడంతోపాటు సరసమైన ధరలో నిరంతరాయ సేవలందించడంపై రిడ్‌లార్ వ్యవస్థాపకుడు బ్రిజ్‌రాజ వాఘాని సంతోషం వ్యక్తం చేశారు.
రిడ్‌లార్‌కు చెందిన 64గురు ఉద్యోగులు ఓలాలో జాయిన్ అవుతారు. అలాగే మొత్తం ఆపరేషన్స్ బాధ్యతలను బ్రిజ్‌రాజ్ వాఘాని చేపడతారు. కాగా రిడ్‌లార్ యాప్ ముంబై, ఢిల్లీ సహా మరికొన్నినగరాల్లో తన సేవలను అందిస్తోంది. 2015లో టాక్సీ ఫర్‌ష్యూర్‌ను స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే.