జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం ! | George was crowned minister again | Sakshi
Sakshi News home page

జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం !

Published Wed, Aug 24 2016 2:24 AM | Last Updated on Fri, May 25 2018 5:54 PM

జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం ! - Sakshi

జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం !

బెంగళూరు : డీఎస్‌పీ గణపతి ఆత్మహత్య సంఘటనతో మంత్రి పదవిని కోల్పోయిన కే.జే జార్జ్‌కు మళ్లీ అమాత్య పదవి దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో కే.జే జార్జ్ మొదటి నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ దర్యాప్తులో గణపతి ఆత్మహత్య విషయంలో జార్జ్ పాత్ర ఏమీ లేదని తేలిందని ఈ మేరకు త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.


దీంతో కే.జే జార్జ్‌కు గతంలో ఆయన నిర్వర్తించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖనే కేటాయించడానికి సిద్ధరామయ్య సిద్ధపడుతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న మరో స్థానాన్ని ఎం. కృష్ణప్పతో భర్తీ చేయడానికి కూడా సిద్ధరామయ్య అంగీకరించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement