నిన్నటి వరకూ చంద్రబాబును తిట్టి ఇప్పుడు జగన్‌పై విమర్శలా
{పజా తీర్పుతో మహా నాయకులే మట్టికరచారు
ఎమ్మెల్యే అమర్‌నాథ్ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
పలమనేరు: మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించారని పలమనేరు మున్సిపాలిటీ, మండల వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మెల్యే అమరనారెడ్డిని విమర్శించారు. పలమనేరులోని మాజీ ఎంపీపీ రాజేం ద్రన్ ఇంటిలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు సీవీ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు తీరు బాగోలేకే వైస్సార్‌సీపీలోకి వచ్చానని చెప్పిన అమర్‌నాథ్ ఇప్పుడు జగన్‌మోహన్ తీరు నచ్చకే పార్టీని వీడానని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. టీడీపీలో చేరిన కాసేపటికే తమ అధినేతను తీవ్రస్వరంతో విమర్శించడం వెనుక ఆంతర్యం తెలుసునన్నారు. గతం లో సవాళ్ళు చేసిన ఎందరో మహా మహా నాయకులే ప్రజాతీర్పుతో మట్టికరిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పలమనేరులో వైఎస్సార్‌సీపీకి ఎంఎల్‌ఎ నిష్ర్కమణ వల్ల జరిగే నష్టం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే పార్టీని వీడినంత మాత్రాన బయపడాల్సిందేమీ లేదని ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మురళీక్రిష్ణ, పలమనేరు, గంగవరం పార్టీ కన్వీనర్లు బాలాజీనాయుడు, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్యామ్, శ్యామ్‌సుందర్ రాజు, రహీంఖాన్, విజయబాబు, శాంతమ్మ మణి, గోవిందుస్వామి, కోదండరామయ్య, కమాల్, నాయకులు పార్టీ రైతు విభాగం జిల్లా నేత మండీ సుధా, రాజారెడ్డి, కిరణ్, జగన్‌మోహన్‌రెడ్డి, చక్రపాణి, అగ్రహారం రెడ్డెప్పరెడ్డి, మనోజ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెళితే భయపడాల్సిన పనేలేదు
ఎమ్మెల్యే దురాలోచనతో పార్టీ మారినంత మాత్రాన వైఎస్సార్‌సీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన గెలుపు కోసం చాలా కష్టపడ్డాం. నియోజకవర్గంలోని క్యాడర్ ఏమాత్రం బయపడాల్సినపనిలేదు. ఇలాంటి వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడు. అందరం కలసి జూలై 8నుంచి గడపగడపకు వైఎస్సార్‌సీపీని విజయవతం చేద్దాం. -రాజేంద్రన్, మాజీ ఎంపీపీ, పలమనేరు
రాజీనామా చేసి వెళ్ళుంటే బాగుందేది....
ఎమ్మెల్యే పార్టీ వీడినంత మాత్రాన మాకొచ్చిన ఇబ్బందులేమీ లేవు. ఆయన ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్ళడం పద్ధతి కాదు. రాజీనామా చేసి వెళ్ళింటే బాగుండేది. పార్టీ కోసం గట్టిగా కృషిచేస్తాం. -బాలాజీనాయుడు, పార్టీ కన్వీనర్, పలమనేరు మండలం