Amarnath Reddy N
-
ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి
చిత్తూరు: జిల్లాలోని ఏకైక ఫిరాయింపు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారా? టీడీపీలో ఆయన ఒంటరి అయ్యారా? అధికారులు కూడా ఆయన వినతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? 2019 జరిగే ఎన్నికల్లో కూడా ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదా? ఒకవేళ ఇచ్చినా గెలిచే అవకాశాలు సన్నగిల్లినట్లేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది టీడీపీలోని కొన్ని వర్గాల నుంచి. దీంతోనే దాదాపుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా పలమనేరు ఇన్చార్జ్ సుభాస్ చంద్రబోస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై సందేహ పడుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైఎస్సార్సీపీ నుంచి ఆయనతో టీడీపీలో చేరిన కార్యకర్తలు కూడా రెండోరోజు నుంచే ఒక్కొక్కరు ఆయనను వదలి సొంత గూటికే చేరుతున్నారు. అధికారులు కూడా ఆయన చెప్పిన పనులను పక్కన పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోస్‌కే ప్రాధాన్యం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్్షకు తెరలేపింది. ఈ వలలో అమర్నాథ్రెడ్డి తేలికగా పడ్డారు. వైఎస్సార్ సీపీ విప్‌గా ఉంటూనే పార్టీ ఫిరాయించారు. మంత్రిపదవి ఆశ, జిల్లాను మొత్తం శాసించవచ్చనే ఒక కోరికతో ఆయన తెలుగుదేశం గూటికి జంప్ అయ్యారు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే అమర్‌కు అసలు తత్వం బోధపడింది. టీడీపీ కేడర్ మొత్తం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోస్‌కే అండగా నిలుస్తోంది. అధికారులు కూడా బోస్ చెప్పిన పనులకే ‘ఊ ’ కొడుతుండటం కూడా అమర్‌కు మింగుడు పడటం లేదు. తొలిరోజుల్లో ఇలాంటి పరిస్థితులు చూసి తనకు మంత్రి పదవి వస్తే అధికారులు, పార్టీ నాయకులు సరెండర్ అవుతారని అనుచరులతో చెప్పుకునేవారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని వార్తలు వస్తుండటంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఈ పరిస్థితిని జిల్లా నాయకులకు చెప్పుకుంటే అవహేళన చేస్తారనే ఉద్దేశంతో ఆయన గుంభనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టే అమర్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. కష్టకాలంలో పార్టీని వదలి వెళ్లిన అమర్‌ను ఎంత మాత్రం ప్రోత్సహించమని వారు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. టీడీపీలో చూపించిన బుద్ధే వైఎస్సార్సీపీలోనూ చూపించారని, ఆయన వైఖరే అంత అని పార్టీ అధిష్టానానికి కూడా చేరవేశారని తెలుస్తోంది. తన మనుగడ, స్వప్రయోజాల కోసం పార్టీలోకి తిరిగి వచ్చిన అవకాశవాది అమర్నా«థ్‌రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ అధిష్టానానికి పలమనేరు కేడర్ కుండబద్ధలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. -
'అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలి'
స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డిని అనర్హుడిగా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, దేశాయి తిప్పారెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో నిర్ణీత ఫార్మాట్లో గల ఫిర్యాదును అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణకు ఎమ్మెల్యేలు అందజేశారు. సాధ్యమైనంత త్వరగా తమ పిటిషన్‌ను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి అనర్హత విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
అమర్‌కు షాక్ !
వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేసిన బెరైడ్డిపల్లె ఎంపీపీ అదే బాటలో మరో ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు పార్టీ మారిన వారిని వ్యతిరేకిస్తున్న ఓటర్లు హైదరాబాద్‌లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పలమనేరు నియోజకవర్గ నాయకులతో బెరైడ్డిపల్లె ఎంపీపీ విమల వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ మారిన రోజు నుంచీ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారం రోజులు కాక మునుపే, తన వెంట టీడీపీలో చేరారని చెబుతున్న బెరైడ్డిపల్లె ఎంపీపీ విమల తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అమర్ వెంట వెళ్లిన మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా వైఎస్ఆర్సీపీ బాట పట్టనున్నారు. పలమనేరు: ఈ మధ్యనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బెరైడ్డిపల్లె ఎంపీపీ విమల కూడా టీడీపీలో చేరారని వార్తలు వచ్చిన తర్వాత ఆమె స్వగ్రామానికి చేరుకోగానే అక్కడి ఓటర్లు నిలదీశారు. దీంతో ఆమె తనను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బలవంతంగా తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆ విషయాన్ని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో స్పష్టం చేస్తానన్నారు. ఆ వెంటనే ఆమె వైఎస్ఆర్సీపీకి చెందిన మొత్తం ఎంపీటీసీ సభ్యులతో కలసి హైదరాబాద్‌కు బయలుదేరారు. బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి సమక్షంలో తనకు స్థానిక ఎమ్మెల్యే బలవంతంగా టీడీపీ కండువా కప్పించారని చెప్పారు. తనను ఎలా ఏమార్చి పసుపు కండువా వేయించారో పూసగుచ్చినట్టు వివరించిన వైనం మీడియాలో ప్రసారమైంది. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ముఖ్యంగా బెరైడ్డిపల్లె నాయకులు డైలమాలో పడ్డారు. ఈ విషయం జిల్లాలో ప్రస్తుతం హాట్టాఫిక్లా మారింది. ఇదిలాఉండగా, నియోజకవర్గంలోని పలువురు ప్రజాత్రినిధులను కూడా ఎమ్మెల్యే బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీలో వారు కనీసం వారం రోజులు కూడా ఇమడలేకపోతున్నారు. స్థానికుల నుంచి వస్తున్న తీవ్రమైన విమర్శలతో మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు తమ అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఓ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు తిరిగి సొంత పార్టీలోకి రానున్నట్టు తెలిసింది. మరి కొందరు కూడా పునరాలోచన లో పడ్డారు. ఈ పరిణామాలు స్థానిక ఎమ్మెల్యేని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్వయం గా వచ్చి పలమనేరులో పార్టీని బలోపేతం చేస్తారని తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గానికి వీరు రంగంలోకి దిగితే నియోజవర్గంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బెరైడ్డిపల్లెలో ఎంపీపీ స్థానాన్ని తమఖాతాలో వేసుకోవాలని కలలు గన్న ఎమ్మెల్యేకి తొలి దెబ్బ తగి లిందని జనం చెవులు కొరుక్కుంటున్నారు. -
దమ్ముంటే రాజీనామా చేయాలి
► వైఎస్ఆర్ సీపీ నేతల సవాల్ ► బెరైడ్డిపల్లెలో వైఎస్ఆర్ సీపీ భారీ ర్యాలీ బెరైడ్డిపల్లె: ప్రజలను మోసం చేసి పార్టీ వూరిన నాయుకులు వెంటనే రాజీనామా చేసి దవుు్మంటే ఎన్నికలకు సిద్ధం కావాలని బెరైడ్డిపల్లె వుండల వైఎస్ఆర్ సీపీ నాయుకులు సవాల్ విసిరారు. పార్టీ వూరిన నాయుకులకు గుణపాఠం చెప్పేందుకు బెరైడ్డిపల్లెలో శనివారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. బెరైడ్డిపల్లె చెక్‌పోస్టు కూడలి నుంచి ఇండియున్బ్యాంకు వరకు ర్యాలీ కొనసాగింది. ఇండియున్ బ్యాంకు వద్ద నిర్వహించిన రాస్తారోకోలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ రెడ్డెవ్ము వూట్లాడారు. ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, జెడ్పీటీసీ రాధవ్ము, ఎంపీపీ వివుల ఫ్యాన్ గుర్తుపై గెలిచి డబ్బుకు అవుు్మడు పోయారన్నారు. పార్టీలు వూరడం సవుంజసం కాదన్నారు. టీడీపీలో గెలవడం కష్టవుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కువూరుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ సీపీలో చేరారన్నారు. అయితే రాజీనావూ చేయుకనే పార్టీ వూరడం శోచనీయువున్నారు. పార్టీ వూరిన పలవునేరు ఎమ్మెల్యే అవురనాథరెడ్డి తవు నాయుకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ధూషించడం సరికాదన్నారు. దవుు్మంటే అవురనాథరెడ్డి పలవునేరు నియోజకవర్గంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవుు్మడు పోరుున వ్యక్తులకు జగన్మోహన్రెడ్డిని వివుర్శించే హక్కు లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణవుూర్తి వూట్లాడుతూ రాత్రికి రాత్రి అవినీతి సొవుు్మతో ఎంపీపీ, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే అవురనాథరెడ్డి పూర్తిగా నైతిక విలువలను కోల్పోయూరన్నారు. వూజీ జెడ్పీటీసీ ఆర్. కేశవులు వూట్లాడుతూ పార్టీ మారే ముందు రాజీనామా చేయాలన్న నైతిక విలువలు పాటించకపోవడం సిగ్గు చేటన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి, జనంలోకి వచ్చి తీర్పు కోరాలని తెలిపారు. చప్పిడిపల్లె పంచాయతీ పరిధిలోని 3వ వార్డు సభ్యుడు వునోహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రవుంలో వైస్ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, సర్పంచ్‌లు వెంకటేష్, అశోక్‌రెడ్డి, జ్యోతి శ్రీనివాసులు, ఉపసర్పంచు తబ్రాజ్, ఎంపీటీసీలు అబ్దుల్‌సత్తార్, రవుణారెడ్డి, నారాయుణప్ప, శ్రీనివాసులు, అవురావతి కార్తిక్, వెంకటేష్, ఫైజుల్లా, నాయుకులు దయూనందగౌడు, రాజప్పగౌడు, నారాయుణప్ప, బాలకృష్ణ, వుహబూబ్ఖాన్, ఖాదర్‌బాషా, బాలాజీ, లోకనాథంరెడ్డి, ఇలాహీ, షాకీర్, ఆర్ఎం నాయుుడు, అబ్బోడు, ప్రభాకర్, వుునివెంకట, అషఫ్ ్రబాషా, సంపంగి, చంద్ర, శివ, పాపన్న తదితరులు పాల్గొన్నారు. -
పలమనేరులో ఇక అంతర్గత పోరు
► ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్న నేతలు ► ఆధిపత్య పోరు తప్పదంటున్న విశ్లేషకులు ► బాబు బుజ్జగింపు తాత్కాలిక ఊరటే.. పలమనేరు టీడీపీలో అంతర్గత పోరుకు మళ్లీ బీజం పడింది. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇకపై ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఖాయమని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, సెగ్మెంట్ పరిధిలోని కొంత మంది మండల స్థాయి నాయకులు ఆయనతో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరడం వంటి తాజా రాజకీయ పరిణామాలు నియోజకవర్గ టీడీపీలో పెరిగే అసమ్మతి, అంతర్గత పోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చేరికను జీర్ణించుకోలేని టీడీపీ నేతల పరిస్థితి ఇరకాటంలో పడింది. మనసులోని మాటలను, భవిష్యత్ ఆందోళనను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరంగా చెప్పుకునే పరిస్థితి లేక సతమతం అవుతున్నారు. తిరుపతి: తిరుపతిలో జరిగిన మహానాడుకు ముందు నుంచే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పలమనేరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సుభాశ్‌చంద్రబోస్ మొదటి నుంచీ ఆయన రాకను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడి ఇప్పుడు మళ్లీ పార్టీలోకి రావడాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచీ బోస్ పలమనేరు నియోజకవర్గం పార్టీ కేడర్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేరిక బోస్ వర్గానికి ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో, లేదోనన్న అనుమానాలు బోస్‌తో పాటు ఆయన సన్నిహితుల్లో పెరిగాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన పార్టీ అధిష్టానం బోస్‌తో పాటు పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నాయకులను బుధవారమే విజయవాడకు పిలిపించుకుని బుజ్జగించడం జరిగింది. అయినప్పటికీ బోస్ వర్గీయుల్లో ఆందోళన తగ్గలేదు. ప్రస్తుతానికి నేతల మధ్య ఉన్న విభేదాలు బయటకు కనిపించకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులో వర్గపోరు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా. అగమ్యగోచరంలో మండల నాయకులు... తాజా రాజకీయ పరిణామాలు పలమనేరు నియోజకవర్గం టీడీపీ నాయకులను అగమ్యగోచరంలో పడేశాయి. ప్రధానంగా పలమనేరు రూరల్, పెద్దపంజాణి, గంగవరం, బెరైడ్డిపల్లి మండలాల్లోని టీడీపీ నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. సెగ్మెంట్లో కీలకంగా మారిన బోస్, ఎమ్మెల్యేల్లో ఎవరికి విధేయులుగా మసలాలో తెలియక సతమతమవుతున్నారు. పలమనేరు రూరల్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీనాయుడు మొదటి నుంచీ బోస్‌కు విధేయుడిగానే ఉన్నారు. ఈయన కాకుండా మండలంలో పార్టీనేతగా ఉన్న జెడ్పీటీసీ భర్త వెంకటరత్నం ఇకపై ఎమ్మెల్యే వెంట నడిచే అవకాశాలున్నాయి. బెరైడ్డిపల్లి మండలంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప, యువనేత సుబ్బులుతో పాటు ఇటీవలనే టీడీపీలో చేరిన క్రిష్ణవేణి జైకుమార్‌లు బోస్ వెంట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే మండలంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులురెడ్డి రెండేళ్లుగా బోస్‌తో కాస్తంత దూరంగా ఉంటున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు రాధ కిషోర్‌గౌడ్ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డితో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలంలో మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి. వీరంతా కలిసి పార్టీ కార్యక్రమాల్లో ఏ మేరకు పాల్గొంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంగవరం, పెద్ద పంజాణి మండలాలతో పాటు మిగతా చోట్ల ఎమ్మెల్యేతో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు అందరూ ఆయన వెంటే నడిచే వీలుంది. ఇదే జరిగితే సుభాష్‌చంద్రబోస్ వర్గం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని సమాచారం. మారిన రాజకీయ పరిణామాలు నియోజకవర్గ నేతల్లో ఆధిపత్య పోరును కచ్చితంగా పెంచుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. అక్కడి నుంచే వచ్చి... మళ్లీ అక్కడికే.... వైఎస్సార్సీపీలో కొనసాగుతూ ఎమ్మెల్యేతో వెళ్లిన వివిధ మండలాల నాయకులందరూ ఎన్నికలకు ముందు టీడీపీలోనే ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న వీరంతా మళ్లీ ఎమ్మెల్యేతో టీడీపీలోకి వెళ్లారు. బెరైడ్డిపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, మున్సిపల్ కౌన్సిలర్లు గుల్జార్ఖాజా, వాణికిషోర్లు అమరనాథ్‌రెడ్డితో పాటే పార్టీలు మారారు. దీన్నిబట్టి వీరంతా టీడీపీలోనే కొనసాగితే ముందు ముందు ఎమ్మెల్యేతోనే ఉంటారని బోస్ వర్గం అంచనా వేస్తోంది. -
పదవి కోసమే పార్టీని వీడారు
నిన్నటి వరకూ చంద్రబాబును తిట్టి ఇప్పుడు జగన్‌పై విమర్శలా {పజా తీర్పుతో మహా నాయకులే మట్టికరచారు ఎమ్మెల్యే అమర్నాథ్ తీరుపై వైఎస్సార్సీపీ నేతల ధ్వజం పలమనేరు: మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించారని పలమనేరు మున్సిపాలిటీ, మండల వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే అమరనారెడ్డిని విమర్శించారు. పలమనేరులోని మాజీ ఎంపీపీ రాజేం ద్రన్ ఇంటిలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు సీవీ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు తీరు బాగోలేకే వైస్సార్సీపీలోకి వచ్చానని చెప్పిన అమర్నాథ్ ఇప్పుడు జగన్మోహన్ తీరు నచ్చకే పార్టీని వీడానని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. టీడీపీలో చేరిన కాసేపటికే తమ అధినేతను తీవ్రస్వరంతో విమర్శించడం వెనుక ఆంతర్యం తెలుసునన్నారు. గతం లో సవాళ్ళు చేసిన ఎందరో మహా మహా నాయకులే ప్రజాతీర్పుతో మట్టికరిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పలమనేరులో వైఎస్సార్సీపీకి ఎంఎల్ఎ నిష్ర్కమణ వల్ల జరిగే నష్టం ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే పార్టీని వీడినంత మాత్రాన బయపడాల్సిందేమీ లేదని ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మురళీక్రిష్ణ, పలమనేరు, గంగవరం పార్టీ కన్వీనర్లు బాలాజీనాయుడు, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్యామ్, శ్యామ్‌సుందర్ రాజు, రహీంఖాన్, విజయబాబు, శాంతమ్మ మణి, గోవిందుస్వామి, కోదండరామయ్య, కమాల్, నాయకులు పార్టీ రైతు విభాగం జిల్లా నేత మండీ సుధా, రాజారెడ్డి, కిరణ్, జగన్మోహన్రెడ్డి, చక్రపాణి, అగ్రహారం రెడ్డెప్పరెడ్డి, మనోజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెళితే భయపడాల్సిన పనేలేదు ఎమ్మెల్యే దురాలోచనతో పార్టీ మారినంత మాత్రాన వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన గెలుపు కోసం చాలా కష్టపడ్డాం. నియోజకవర్గంలోని క్యాడర్ ఏమాత్రం బయపడాల్సినపనిలేదు. ఇలాంటి వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడు. అందరం కలసి జూలై 8నుంచి గడపగడపకు వైఎస్సార్సీపీని విజయవతం చేద్దాం. -రాజేంద్రన్, మాజీ ఎంపీపీ, పలమనేరు రాజీనామా చేసి వెళ్ళుంటే బాగుందేది.... ఎమ్మెల్యే పార్టీ వీడినంత మాత్రాన మాకొచ్చిన ఇబ్బందులేమీ లేవు. ఆయన ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్ళడం పద్ధతి కాదు. రాజీనామా చేసి వెళ్ళింటే బాగుండేది. పార్టీ కోసం గట్టిగా కృషిచేస్తాం. -బాలాజీనాయుడు, పార్టీ కన్వీనర్, పలమనేరు మండలం -
గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయి
నిన్నటి వరకూ చంద్రబాబును తిట్టి ఇప్పుడు జగన్‌పై విమర్శలా ప్రజా తీర్పుతో మహా నాయకులే మట్టికరిచారు పదవీకాంక్షతోనే పార్టీని వీడారు ఎమ్మెల్యే అమరనాథ్ తీరుపై పలమనేరు..బెరైడ్డిపల్లి వైఎస్సార్సీపీ నేతల ధ్వజం వీకోటలో ఆయన దిష్టిబొమ్మ దహనం బెరైడ్డిపల్లె: పార్టీలు వూరిన నాయుకులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయుని జెడ్పీ మాజీ చైర్పర్సన్ రెడ్డెవ్ము హెచ్చరించారు. బెరైడ్డిపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయుకుల సవూవేశంలో ఆమె వూట్లాడారు. వైఎస్ఆర్సీపీ బీ-ఫారంతో గెలుపొంది ఎంఎల్ఎ అమరనాథ్‌రెడ్డి పార్టీ వూరడం దారుణవున్నారు. దవుు్మం టే రాజీనావూ చేసి గెలన్నారు. ఆటుపోట్లు ఎదురైనా, పార్టీలో కొనసాగిన వారికే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సంక్షేవుపథకాలు అవులు చేయుకుండా వుుఖ్యవుంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధవుయ్యూరన్నారు. ప్రజా సవుస్యలపై ప్రస్తావించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మోసపూరిత రాజకీయూ లు చేసిన వారికి ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నా రు. వుండల కన్వీనర్ ఆర్ కేశవులు మాట్లాడు తూ నాయుకులు పార్టీలు వూరినంత వూత్రానా వైఎస్ఆర్సీపీకి నష్టం లేదని స్పష్టంచేశారు. కార్యకర్తలంతా పార్టీకి సేవ చేయుడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలకు ఇబ్బంది కలిగిం చేలా ప్రవర్తిస్తే ఊరుకునేదిలేదన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సారథ్యంలో పలమనేరు నియోజవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటావున్నారు. ఈ కార్యక్రవుంలో వైస్ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, ఎంపీటీసీ సభ్యులు అబ్థుల్సత్తార్, రవుణారెడ్డి, నారాయుణరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్ సర్పం చులు వెంకటేష్, ఉపసర్పంచ్ తబ్రాజ్, మైనార్టీ కన్వీనర్ ఖాదర్‌బాషా, నాయుకులు దయూనందగౌడు, రాజప్పగౌడు, షాకీర్, అప్రఫ్, షాకీర్, చంద్రస్వామి, లోకనాథంరెడ్డి, లక్కనపల్లె ఖాదర్‌భాష, వుహబూబ్ఖాన్, ఆర్ఎం నాయుుడు, సుబ్రవుణ్యం తదితరులు పాల్గొన్నారు. -
'పార్టీ మారుతారో..గంగలో దూకుతారో..'
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లడాన్ని నిరసిస్తూ ఓ బ్యానర్ వెలసింది. వీ.కోట మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ బ్యానర్ ను ప్రదర్శించారు. ' ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు.. ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదు. అమర్నాథ్రెడ్డిని మేం ఓట్లు వేసి గెలిపించింది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండి. అమర్నాథ్రెడ్డి గారు మీరు పార్టీ మారుతారో గంగలో దూకుతారో మీ ఇష్టం. కానీ- మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి. ఓటర్లుగా మాకు విలువ ఉంది. ఓటుకు ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్ఏగా మీకు విలువుందా? సిగ్గు..సిగ్గు.. అని ఉన్న బ్యానర్‌ను వారు ప్రదర్శించారు. -
టీడీపీలోకి పలమనేరు ఎమ్మెల్యే
సుభాష్ చంద్రబోస్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని సీఎం హామీ? తాడేపల్లి రూరల్: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి గురువారం రాత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం సీఎం నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరానని, తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. ఇదిలాఉంటే 2014లో పలమనేరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుభాష్ చంద్రబోస్, మరికొందరు టీడీపీ నాయకులను బుధవారమే చంద్రబాబు విజయవాడకు పిలిపించారు.అమర్నాథ్రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుభాష్‌కు నామినేటెడ్ పోస్టు ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు విప్
♦ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి ♦ ఫోన్లు, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పురస్కరించుకుని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎన్.అమర్నాథరెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేశామని, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, టెలిగ్రామ్ లాంటి అన్ని మార్గాలలో విప్ జారీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని కోరామన్నారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన రోజే దానిపై చర్చ జరగదని, అయితే అధికార పక్షం సోమవారమే దీనిపై చర్చ చేపట్టాలని నిర్ణయించడంతో విప్ జారీ చేసినట్లు తెలిపారు. విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అమర్నాథరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలను వంచించారు.. అవిశ్వాస తీర్మానంపై బలవంతంగా చర్చ చేపట్టి అధికార పక్షం ప్రజలను వంచించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన తర్వాత పది రోజుల్లో చర్చకు స్వీకరిస్తామని చెప్పి.. ఇప్పుడే చర్చ జరగాలనడం చాలా హేయమని, అయినప్పటికీ తాము చర్చలో పాల్గొంటామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుని సభలో మెజారిటీ లేకపోయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని, కానీ టీడీపీ ప్రభుత్వం వారిని రక్షించడానికి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బీఏసీ నిర్ణయం మేరకే.. అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సభకు ఆ ఎనిమిది మంది గైర్హాజరు వైఎస్సార్సీపీ తర ఫున ఎన్నికై ఇటీవల టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభకు గైర్హాజరయ్యారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారమే చర్చకు అనుమతించిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవడం చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్యే గన్‌మన్ పిస్టల్ మాయం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గన్‌మెన్ గౌస్ పాషా గన్ మిస్సింగ్ కలకలం సృష్టించింది. పలమనేరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్తుండగా ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 1996 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గౌస్‌సాహెబ్ కొన్నేళ్లుగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వద్ద గన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్‌లో శాసనసభ సమావేశాలకు వెళ్లారు. ఆయనకు అక్కడ మరో గన్‌మ్యాన్ భద్రత కల్పిస్తున్నారు. ఆ గన్‌మ్యాన్‌ను రిలీవ్ చేసేందుకు గౌస్‌సాహెబ్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు పలమనేరు నుంచి కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండులో దిగి చూసుకోగా 9ఎంఎం పిస్టల్‌తో పాటు పది రౌండ్లు (బుల్లెట్లు) కనిపించకుండా పోయాయి. లగేజీ ఉండి పిస్టల్ మాయమవడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తారా?
ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి వి.కోట (చిత్తూరు): వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తారా? అని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం వి.కోటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిని రాబట్టలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. సీఎం అసమర్థ పాలనతో కొత్త రాష్ట్రంలో సమస్యలు తీవ్రతరమయ్యాయన్నారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై రానున్న బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం విప్ జారీ చేస్తామన్నారు. ఒక పార్టీ ముద్రతో గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ మారే సమయంలో రాజీనామ చేయడం సంప్రదాయమని చెప్పారు. 2012లో తాను టీడీపీని వీడినప్పుడు రాజీనామ చేసి ప్రజల ముందు నిలిచానన్నారు. ప్రజావిశ్వాసం చూరగొనలేని వారు ఎన్ని పార్టీలు మారినా దండగన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. -
రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరో?
పలమనేరు: రాష్ట్రాన్ని ముక్కలు చేసి దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితికి విభజనే శాపమంటూ ప్రజలకు తెలియజేస్తామని చంద్రబాబు చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేంద్రానికి విభజనలేఖ ఇచ్చింది మొ దలు శాశనసభలో జరిగిన అన్ని విషయాలు సీ మాంధ్రులకు తెలియదా అని ప్రశ్నించారు. మళ్లీ జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తే జనం ఊరుకోరని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పాల న అస్తవ్యస్తంగా మారిందని, దీన్ని కప్పిపుచ్చేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆయన మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతోనే పాదయాత్రలకు దిగారని తెలిపారు. ఈ ప్రభుత్వంపై జనం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు సీవీ కుమార్, చాంద్‌బాషా, మండీసుధా, కమాల్, జాఫర్, కోదండరామయ్య, ప్రహ్లాద తదితరులున్నారు. -
అవినీతి రాజ్యమేలుతోంది
- ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పెద్దపంజాణి: రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన పెద్దపంజాణి మండలంలోని కంగానంబండ గ్రామంలో నూతనంగా ప్రారంభమైన విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి పేరుతో నెలకోమారు విదేశాలకు ప్రభుత్వ ఖర్చులతో వెళ్లి, సొంత వ్యాపారాల లెక్కలు చూసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కుమారుడికి కూడా ప్రభుత్వ అధికారులను వెంట బెట్టి అమెరికాకు పంపడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు వద్ద ఉన్న ఓఎస్డీ అభీష్ట, కార్తికేయ మిశ్రాలను తన కుమారుడి వెంట ఒకే విమానంలో పంపడం, వారి ఖర్చుల కోసం ప్రభుత్వం 1326, 1336 జీవోలను మం జూరు చేయడం ఎంతవరకూ సమంజ సమన్నారు. ప్రభుత్వ సొమ్ము మం చినీళ్లలా తమ సొంత పనులకు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేసి గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తానని చెబుతున్న సీఎం, కాలువ పనులకు నిధులు ఎం దుకు మంజూరు చేయలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్ల ఒతి ్తడి పెరగడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన సీఎం సభలో రాము అనే రైతు ఆత్మహత్యకు యత్నించడమే ఇందుకు సాక్ష్యమ ని తెలిపారు. రాజధాని పేరుతో మూ డు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కొవడమేమిటన్నారు. రాజ ధాని పేరుతో వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపిం చారు. కుప్పంలో మినీ ఎయిర్పోర్ట్ ఎవరడిగారని, దీన్ని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటున్నారని విమర్శిం చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శ్రీరాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో ప్రముఖులు
ఇంద్రకీలాద్రి : కనకదుర్గమ్మను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఏపీ రైతు బజార్ సీఈవో ఎం.కె.సింగ్ కూడా కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలి కారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మను దర్శించుకు న్నారు. వారిని వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న ‘అంతా అక్కడే జరిగింది’ బృందం ఈ నెల 14న విడుదల కానున్న ‘అంతా అక్కడే జరిగింది’ సినిమా నటీనటులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్ర హీరో శరవన్, దర్శకుడు సతీష్‌తో పాటు నిర్మాత ఆదినారాయణ తదితరులు సినిమా హార్డ్ డిస్క్‌ను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. సినిమా ఘనవిజయం సాధించాలని అమ్మవారిని కోరామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
బాబు ప్రతిపక్ష నేత భ్రమలోనే ఉన్నారు!
పలమనేరు: చంద్రబాబునాయుడు తాను ఇంకా ప్రతిపక్షనేత అనే భ్రమలోనే ఉన్నట్టున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకొచ్చినా ఆ పార్టీ నాయకులు మాత్రం వారి ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారని తెలిపారు. పింఛన్ల కమిటీ విచారణ పూర్తిగా ఆ పార్టీ సమావేశాల్లా మారాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వని ఈ ప్రభుత్వం ఉన్న వాటిని ఊడగొట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, త్వరలో ప్రజాగ్రహం తప్పదని జోస్యం చెప్పారు. రుణమాఫీ జరగక రైతులు పడుతున్న ఆవేదన ఈ ప్రభుత్వానికి శాపంలా మారకతప్పదన్నారు. చంద్రబాబు హామీతో 8 శాతం వడ్డీ 14 శాతంగా పెరిగి బంగారు నగలు వేలం వేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. మంచినీటి సమస్య పరిష్కారంలో భాగంగా జిల్లాలోని పడమటి మండలాల్లో ఒక్క బోరైనా డ్రిల్ చేశారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ గెలుపొందిన స్థానాలపై చిన్నచూపు చూస్తున్నారని, ‘మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం కార్యకర్తలకా’ అని ప్రశ్నించారు. చాలా మంది మంత్రులకు వారి శాఖల గురించి అవగాహన లేదని, వీరు ప్రజా సమస్యలను గాలికొదిలి లోకేష్‌బాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ఇప్పటికే జనం భాధపడుతున్నారని, త్వరలోనే వీరికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శారదా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సీవీ.కుమార్ పాల్గొన్నారు. -
స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్, అమర్నాథ్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహన్ను కలిశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీ నామాలు ఆమోదించాలని కోరారు. స్పీకర్ ఫార్మాట్లోనే తాము రాజీ నామాలు చేసినట్లు కూడా వారు తెలిపారు. రాజీనామాలను పరిశీలించి నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని శాసనసభాపతి వారికి చెప్పారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే తమ ఎమ్మెల్యేలంతా మరోసారి స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. విభజన విషయంలో న్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి
హైదరాబాద్ కేసీఆర్ తండ్రి జాగీర్ కాదని సమైక్యాంధ్రులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్‌కు చరిత్రలో పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు అమరనాథ్ రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజంపేటలో మున్సిపల్ కార్మికులు ఉపాధ్యాయులు, అంగన్వాడి మహిళలు ఐక్య కళాకారుల యూనియన్ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. కడపలో బైక్ ర్యాలీ చేసేందుకు యత్నించిన సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కోటిరెడ్డి సర్కిల్లో బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.