హైదరాబాద్‌ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి | Hyderabad Belongs to Seemandhra People: MLA Akepati Amarnath Reddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి

Published Wed, Aug 7 2013 12:43 PM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM

హైదరాబాద్‌ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి - Sakshi

హైదరాబాద్‌ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి

హైదరాబాద్‌ కేసీఆర్‌ తండ్రి జాగీర్‌ కాదని సమైక్యాంధ్రులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్కు చరిత్రలో పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు అమరనాథ్ రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజంపేటలో మున్సిపల్‌ కార్మికులు ఉపాధ్యాయులు, అంగన్‌వాడి మహిళలు ఐక్య కళాకారుల యూనియన్‌ ధర్నా, ర్యాలీ నిర్వహించారు.

కడపలో బైక్‌ ర్యాలీ చేసేందుకు యత్నించిన సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కోటిరెడ్డి సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement