చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి గురువారం రాత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
సుభాష్ చంద్రబోస్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని సీఎం హామీ?
తాడేపల్లి రూరల్: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి గురువారం రాత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం సీఎం నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరానని, తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. ఇదిలాఉంటే 2014లో పలమనేరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుభాష్ చంద్రబోస్, మరికొందరు టీడీపీ నాయకులను బుధవారమే చంద్రబాబు విజయవాడకు పిలిపించారు.అమర్‌నాథ్‌రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుభాష్‌కు నామినేటెడ్ పోస్టు ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.