'పార్టీ మారుతారో..గంగలో దూకుతారో..' | YCP MLA Amarnath Reddy To Join TDP | Sakshi
Sakshi News home page

'పార్టీ మారుతారో..గంగలో దూకుతారో..'

Published Fri, Jun 17 2016 1:54 PM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM

YCP MLA Amarnath Reddy To Join TDP

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లడాన్ని నిరసిస్తూ ఓ బ్యానర్ వెలసింది. వీ.కోట మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ బ్యానర్ ను ప్రదర్శించారు. ' ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు.. ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదు. అమర్‌నాథ్‌రెడ్డిని మేం ఓట్లు వేసి గెలిపించింది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండి. అమర్‌నాథ్‌రెడ్డి గారు మీరు పార్టీ మారుతారో గంగలో దూకుతారో మీ ఇష్టం. కానీ- మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి. ఓటర్లుగా మాకు విలువ ఉంది. ఓటుకు ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్‌ఏగా మీకు విలువుందా? సిగ్గు..సిగ్గు.. అని ఉన్న బ్యానర్‌ను వారు ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement