ఎమ్మెల్యే గన్‌మన్ పిస్టల్ మాయం | mla amarnathreddy gunmen gouse pasha gun missing in hyderabad | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గన్‌మన్ పిస్టల్ మాయం

Published Mon, Mar 7 2016 1:41 AM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM

ఎమ్మెల్యే గన్‌మన్ పిస్టల్ మాయం - Sakshi

ఎమ్మెల్యే గన్‌మన్ పిస్టల్ మాయం

హైదరాబాద్: చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గన్‌మెన్ గౌస్ పాషా గన్ మిస్సింగ్ కలకలం సృష్టించింది.  పలమనేరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్తుండగా ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 1996 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గౌస్‌సాహెబ్ కొన్నేళ్లుగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వద్ద గన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్‌లో శాసనసభ సమావేశాలకు వెళ్లారు. ఆయనకు అక్కడ మరో గన్‌మ్యాన్ భద్రత కల్పిస్తున్నారు.

ఆ గన్‌మ్యాన్‌ను రిలీవ్ చేసేందుకు గౌస్‌సాహెబ్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు పలమనేరు నుంచి కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండులో దిగి చూసుకోగా 9ఎంఎం పిస్టల్‌తో పాటు పది రౌండ్లు (బుల్లెట్లు) కనిపించకుండా పోయాయి. లగేజీ ఉండి పిస్టల్ మాయమవడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement