వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహన్ను కలిశారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహన్ను కలిశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీ నామాలు ఆమోదించాలని కోరారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే తాము రాజీ నామాలు చేసినట్లు కూడా వారు తెలిపారు. రాజీనామాలను పరిశీలించి నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని శాసనసభాపతి వారికి చెప్పారు.
అనంతరం శ్రీకాంత్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే తమ ఎమ్మెల్యేలంతా మరోసారి స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. విభజన విషయంలో న్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు.