'పరువు తీసింది.. మీరా మేమా?' | Ysrcp Mla Srikanth Reddy slams Cm chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'పరువు తీసింది.. మీరా మేమా?'

Published Fri, Feb 23 2018 12:42 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

Ysrcp Mla Srikanth Reddy slams  Cm chandrababu Naidu - Sakshi

ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : అంతర్జాతీయంగా పరువు తీసింది మీరా మేమా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, కడప మేయర్‌ సురేశ్‌ బాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పరువు తీసిందెవరో జపాన్‌ కంపెనీ విషయంలోనే అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారన్నారు.  చంద్రబాబు చేసిన తప్పులు ఇతరులపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎంతటికైనా తెగిస్తారని స్పష్టం చేశారు. తమ అధినేతపై ఎంత ఎదురు దాడిచేసినా ఆయన భయపడరన్నారు. రాష్ట్రం పరువు చంద్రబాబే తీస్తున్నారని , సీఎం పంచాయితీలు చెప్పారని మంత్రి ఆదినారయణ రెడ్డి చెప్పడంతోనే ఈ విషయం స్పష్టమైందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరని ప్రశ్నించారు. 

 ప్రత్యేక హోదా సంజీవని అని మేం పోరాటం చేస్తే ప్యాకేజీ ముద్దు అని తప్పుదోవా పట్టించలేదా అని నిలదీశారు. మళ్లీ ఈ రోజు హోదా అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని విమర్శించారు. ఈ రాష్ట్ర ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. రాష్ట్రం విడదీయడానికి కారణం మీ లేఖ కాదా అని , రాష్ట్రప్రయోజనాల కోసం ఏ రోజైనా ప్రతిపక్షంతో మాట్లాడారా అని ఈ సందర్భంగా శ్రీకాంత్‌ రెడ్డి నిలదీశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement