'ఎప్పుడు ఎలా తినాలనే బాబు ఆలోచన'
హైదరాబాద్: పప్పుల ధరలు ఆకాశన్నంటినా నీరో చక్రవర్తిలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బాబు ప్రభుత్వం పప్పుదినుసు పంటలను ప్రోత్సహించడం లేదని చెప్పారు. జనం సొమ్ము ఎలా తినాలి, ఎంత తినాలి అని అని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారే తప్ప అసలు ప్రజలు ఏం తింటున్నారనే ఆలోచన ఆయనకు లేనే లేదని అన్నారు. రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని, ఇలా ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే నేడు ఇబ్బందులు వచ్చాయని చెప్పారు.
గతంతో పోలిస్తే పప్పు పంటల దిగుమతులు తగ్గిపోయాయని ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని చెప్పారు. 90శాతం కందిపప్పు భారత్లోనే ఉత్పత్తి అవుతుందని, అయినా, రైతులకన్నా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారని చెప్పారు. కూరగాయల ధరలు 150శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పప్పు దినుసుల పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంలేదని, ఈ పంటల విషయంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా చేశారని చెప్పారు.