మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
బెళుగుప్ప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 610 హామీలను ఇచ్చి గత నాలుగు సంవత్సరాల్లో పది హామీలను కూడా అమలు చేయలేదని, ప్రస్తుతం మరోసారి బూటకపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీరంగయ్యలు విమర్శించారు.
శనివారం బెళుగుప్పలో పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే మరియు అనంతపురం సమన్వయకర్తలు ముఖ్య అథితుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయం వరకు రాష్ట్రానికి రూ. 90 వేల కోట్లు అప్పులు ఉండగా ప్రస్తుతం రూ.2.4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.50,000 పైగా అప్పులు మోపిందన్నారు.
రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కేవలం రూ.14 వేల కోట్లు అది వడ్డీకి సరిపోయే విధంగా రుణమాఫీ చేసి రైతుకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీలు సకాలంలో రాకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లో పడేశారన్నారు. రుణమాఫీ చేయకుండా 6 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేశారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ పనుల్లో నాలుగేళ్లుగా గంప మట్టిని కూడా తీయని పాలకులు రూ.50 కోట్లతో పూర్తి అయ్యే 36వ ప్యాకేజీ పనులను ప్రస్తుతం రూ. 250 కోట్లకు పెంచుకుని రూ. 200 కోట్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం
కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లో టీడీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని తలారి పీడీ రంగయ్య అన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ కొనుగోలులో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడన్నారు. ఉమ్మడి రాజధానిలో దాదాపుగా 85 రోజుల పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌కు సీఎం వెళ్లకుండా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీకి మొగ్గు చూపి అసెంబ్లీ తీర్మానం చేశాడన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో వ్యాపారులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సీఎం చంద్రబాబునాయుడు యుటర్న్‌గా తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠాన్ని చెప్పాలని పిలుపునిచ్చారు.
బెళుగుప్ప : రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలిన టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పోరాడుదామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీ రంగయ్యలు పిలుపునిచ్చారు. శనివారం బెళుగుప్పలో శ్రీనివాస్ తోటలోని హాల్ నందు పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బూత్ కమిటీ సభ్యుల శిక్షణా కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్యలు ముఖ్య అథితులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, బెళుగుప్ప సింగిల్ విండో అధ్యక్షుడు శివలింగప్ప, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు, దుద్దేకుంట సర్పంచ్ ఎర్రిస్వామి, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోధమ్మ, నాయకులు మరియు బూత్ కమిటీల కన్వీనర్లు ఓబిరెడ్డి కేశవరెడ్డి, చౌదరి, అంగడి ఎర్రిస్వామి, నరిగన్న, తిమ్మారెడ్డి, మచ్చన్న, నరిగన్న, దొడగట్ట క్రిష్టప్ప, రమనేపల్లి రమేష్, శ్రీరంగాపురం శ్రీనివాసరెడ్డి, జగన్‌మోహన్, మోహన్‌రెడ్డి, అంకంపల్లి శ్రీనివాసరెడ్డి, రుద్రానంద, గురుమూర్తిరెడ్డి, బాబురెడ్డి, పూలప్రసాద్, వినోద్, తిప్పేస్వామి, నరసింహ, బ్రహ్మయ్య, తిమ్మారెడ్డి, రమనేపల్లి రమేష్, హనుమంతురాయుడు, దొడగట్ట క్రిష్టప్ప, నరిగన్న అక్కులన్న,రమేష్, మల్లి, ధనుంజయ, నాగరాజు, తాతెప్ప, తగ్గుపర్తి క్రిష్ణ, గంగవరం రమేష్, రవి, వెంకటనరసు, కాలువపల్లి ఫకృద్దీన్, మదు, తిమ్మన్న, రాము, యలగలవంక తిమ్మారెడ్డి, లేపాక్షి, శీనప్ప, తిప్పేస్వామినాయక్, లక్ష్మానాయక్, రామునాయక్, తగ్గుపర్తి నరేంద్ర, హనిమరెడ్డిపల్లి గోపాల్, గోవిందు, ఆనంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment