mla srikanth reddy
-
వైఎస్ఆర్సీపీలో బడుగులకు పెద్దపీట
రాయచోటి (వైఎస్సార్ కడప): వైఎస్సార్సీపీతో రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిన్నమండెం, రాయచోటి రూరల్ పరిధిలోని బూతు కన్వీనర్ల సమావేశాలను జెడ్పీ మాజీ వైఎస్ చైర్మన్ పి.దేవనాథరెడ్డి, మాజీ ఎంపీపీ పోలు వెంకటసుబ్బారెడ్డిల అధ్యక్షతన విడివిడిగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రాయచోటి పరిధిలోని చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామన్నారు. టీడీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు పరచకుండా ప్రజలను మోసగించారని ఆయన ధ్వజమెత్తారు. అలాగే బీసీలకు ఉన్నత పదవులను రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్సీలలో ఎవరు పుట్టాలనుకుంటారని ఎస్సీలను కించపరచాడని విమర్శించారు. ప్రజలకోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డేనన్నారు. వైఎస్సార్ïసీపీ అధికారంలోకి వస్తే జగన్ ప్రవేశపెట్టనున్న నవరత్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షులు గంగిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, అలాగే చిన్నమండెం సింగిల్ విండో అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ముసల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు ఎం.కంచంరెడ్డిలు ఆయా మండలాలకు చెందిన బూతు కన్వీనర్ల్లనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ గుర్తింపు కార్డులు, అభినందన పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెండు మండలాల పరిధిలోని ఎంపిటిసిలు ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రెడ్డెప్ప, వెంకటరమణ, సర్పంచులు స్వామి, గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దివాన్సాహెబ్, రఫీ, అమరనాథరెడ్డి, రాజారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘురామిరెడ్డి,మాజీ ఎంపిటిసి ఏజీస్ అలీఖాన్, లోకేశ్వరరెడ్డి, వెంకటరమణారెడ్డి, చుక్కా అంజనప్పలతో పాటు బూతు కన్వీనర్లు పాల్గొన్నారు. -
కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు వైఎస్ జగన్
రాయచోటి: కార్మికుల కష్టం తెలిసిన ఏకైక నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన అని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆటోకు లైఫ్ ట్యాక్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 10వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ, అదే సమయంలో ఆటో కార్మికుల కోసం ఏడాదికి 10 వేల రూపాయలను అందజేస్తామని వైస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనకు మద్దతుగా మంగళవారం రాయచోటిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ఆటో కార్మికులకు వరంలాంటిదన్నారు. కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారిపై అదనపు భారం పడేలా లైఫ్ ట్యాక్స్‌లు వేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికులకు ఆటో నగర్, ప్రత్యేక హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.ఆటో యూనియన్ నాయకులు రామచంద్ర, విక్కీ, మహేష్, చాన్‌బాషా, రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు పల్లపు రాజారమేష్, ఎంపీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ జాఫర్, మైనార్టీ నాయకులు కొలిమి చాన్‌బాషా, లయన్ అన్వర్, ఫయాజ్ అహ్మద్, పార్టీ యువనాయకులు కిషోర్, హనుమంత్‌నాయక్, సురేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. యూనిఫాం పంపిణీ... ర్యాలీలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా యూనిఫాంను అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్ ఆర్థిక సాయంతో 60 మందికి అందజేశారు. జగనన్న పైనే మా ఆశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆటో కార్మికుల కష్టాలు తీరుతాయన్న ఆశ ఉంది. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తానని చేసిన ప్రకటనను అభినందిస్తున్నాం. జగన్మోహన్రెడ్డి రాకతోనే మా బాధలు తీరుతాయన్న ఆశాభావం ఆటో కార్మికులందరిలో ఉంది. ధన, ఆటో యూనియన్ నాయకుడు -
40 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఇదేనా?
-
40 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఇదేనా?
సాక్షి, రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని, ఆయన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనగానే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనీ.. ప్రత్యేకహోదాపై వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ వస్తుందన్న భయంతో బాబు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రత్యేహోదాకు ఎవరు మద్దతు ఇస్తారో వారితో కలిసి పోరాడాతామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఎందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. 90 వేల కోట్ల రాష్ట్ర అప్పును రెండు లక్షల కోట్లకు చేసింది మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవమేనా? అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎవరికీ భయపడను అంటూనే కేసులకు చంద్రబాబు భయపడుతున్నారని, ఈ దేశంలో ఆయనను మించిన ఆర్థిక నేరగాడు ఎవరులేరని, అందుకే ఆయనను కేంద్రం దూరంగా పెడుతుందని విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి తాము గర్వపడుతున్నామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
మళ్లీ అవే డ్రామాలు.. అదే తీరు
-
మళ్లీ అవే డ్రామాలు.. అదే తీరు : శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించే అసెంబ్లీని తెలుగుదేశం కార్యాలయంగా మార్చారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షంపై బురద చల్లేందుకు నానాకష్టాలు పడుతున్నారని అన్నారు. హోదాపై వైఎస్ఆర్సీపీ మొదటినుంచి ఒకటే మాట మీద ఉందని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లి తరహాలో రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం, ఆపార్టీ నేతలు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తిరగబడే పరిస్థితి వచ్చేసరికి హోదా కావాలంటున్నారని విమర్శించారు. హోదా విషయంలో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన వైఖరితో ఉందని, ఎవరైతే హోదా ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఓవైపు చంద్రబాబు బీజేపీతో అంటగాగుతూనే, మరోవైపు వైఎస్ఆర్సీపీ దగ్గరౌతోందని దుష్ఫ్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కేసుల భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ అధినేత, పార్టీ నాయకులు ఆందోళనతలు, యువభేరీల ద్వారా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలుగుదేశం నేతలు అవిశ్వాసం పెట్టినా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు ఇలాగే డ్రామాలు ఆడారని, ఇప్పుడు మళ్లీ అవే డ్రామలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. -
చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పని చేయకుండా బిల్లులు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌లో ఎస్టిమేషన్లను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, మంత్రి దేవినేని ఉమ సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయం, ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, మనసులో మాట పుస్తకంలోనే ఆ విషయం చెప్పారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'పరువు తీసింది.. మీరా మేమా?'
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయంగా పరువు తీసింది మీరా మేమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పరువు తీసిందెవరో జపాన్ కంపెనీ విషయంలోనే అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు ఇతరులపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎంతటికైనా తెగిస్తారని స్పష్టం చేశారు. తమ అధినేతపై ఎంత ఎదురు దాడిచేసినా ఆయన భయపడరన్నారు. రాష్ట్రం పరువు చంద్రబాబే తీస్తున్నారని , సీఎం పంచాయితీలు చెప్పారని మంత్రి ఆదినారయణ రెడ్డి చెప్పడంతోనే ఈ విషయం స్పష్టమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సంజీవని అని మేం పోరాటం చేస్తే ప్యాకేజీ ముద్దు అని తప్పుదోవా పట్టించలేదా అని నిలదీశారు. మళ్లీ ఈ రోజు హోదా అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని విమర్శించారు. ఈ రాష్ట్ర ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. రాష్ట్రం విడదీయడానికి కారణం మీ లేఖ కాదా అని , రాష్ట్రప్రయోజనాల కోసం ఏ రోజైనా ప్రతిపక్షంతో మాట్లాడారా అని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. -
'పైన పటారం.. లోన లొటారం'
సాక్షి, రాయచోటి : జన్మభూమి సభల్లో చంద్రబాబు ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ శ్రమదానం, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఆచరణ మాత్రం శూన్యం అంటూ విమర్శించారు. ప్రస్తుతం తెలుగుదేశం పాలన 'పైన పటారం.. లోన లొటారం' అన్న చందంగా తయారైందన్నారు. గ్రామసభల్లో అధికారులు, నాయకులు ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ ఏదో అది చేశాం,, ఇది చేశాం అని చెప్పుకోవడం తప్పితే ప్రజలకు చేసింది మాత్రం ఏమీలేదని విమర్శించారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులను కూడా గ్రామసభలో నలుగురికి ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల నుంచే మైక్ లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను ఎంతమాత్రం పట్టించుకుంటుందంటూ విమర్శించారు. గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలు ఎంత వరకూ పరిష్కరించారో అడుగుదామంటే గ్రామస్థలకు మైక్ కూడా ఇవ్వడం లేదని, ఎన్ని సార్లు అర్జీలు ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ప్రశ్నించారు. జగన్ వైపు యువత మొగ్గు : చంద్రబాబు చేస్తున్న మోసాలను రాష్ట్రంలో యువత ఎప్పటికప్పుడు గమనిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి వైఎస్ జగన్ సరైన నాయకుడని యువత భావిస్తోందని, అందుకే జగన్ వైపు మొగ్గుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో నూతనంగా ఏర్పాటైన జగన్ యువసేన నాయకులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. -
అప్పుడేమన్నారు? ఇప్పుడేమంటున్నారు?
సాక్షి, అమరావతి: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో మా పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి బహిష్కరించినప్పుడు కోర్టు ఆమెను సభలోకి అనుమతించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు తీసుకుని అసెంబ్లీలోకి రావాలని ఆమె వస్తే.. సభ కోర్టు పరిధిలోకి రాదని అప్పట్లో స్పీకర్ ప్రకటించారు. అప్పుడు కోర్టు ఆదేశాల్నే ఖాతరు చేయలేదు. ఇప్పుడేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి మాత్రం కోర్టు కేసు అడ్డుగా ఉన్నట్లు సాకులు చూపుతున్నారు. ఇలా ద్వంద్వ వైఖరి ఎందుకు? సభ హుందాతనాన్ని, విలువలను కాపాడాల్సినవారే దిగజారుతుంటే ఎవరికి చెప్పుకోవాలి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ పునఃసమీక్షించుకోవాలన్నారు. ‘స్పీకర్ ఫార్మాట్లో ఎప్పుడో రాజీనామా పత్రం సమర్పించాం. స్పీకరే నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అంటున్నారని, మరి రాజీనామా సమర్పిస్తే స్పీకర్ ఎందుకు ఆమోదించరు? ఈ డ్రామా ఎందుకు? రాజ్యాంగాన్ని గౌరవించని వారు అధికారాలు వినియోగించుకోవడానికి అనర్హులని అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలు సమంజసంగా లేవు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించడంద్వారా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని, రాజ్యాంగ గౌరవాన్ని పరిరక్షించాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసి బయటికొచ్చాక సభాపతి కోడెల చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసంగా లేవని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తన నిర్ణయాలను, ఆలోచనలను సమీక్షించుకోవాలని స్పీకర్‌కు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ‘‘వైఎస్సార్సీపీ సభకు రాకుండా పారిపోయిం దని టీడీపీవారు అంటున్నారు. మా నేత, మేం ప్రజలమధ్యే ఉన్నాం. పారిపోతున్నదెవరో? దొడ్డిదారిన వెళుతున్నదెవరో వారే ఆలోచించాలి..’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలి: కళావతి సీతంపేట: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్‌తోనే వైఎస్సార్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. గురువారం సీతంపేటలో ఆమె విలేకరులతో మాట్లాడు తూ.. వైఎస్సార్సీపీ తరఫున గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకుంటే సమావేశాలకు హాజరవు తామని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉందని బాధ్యతగల స్పీకర్ చెప్పుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు. -
రైతుల్ని మరిచి బాబు డ్యాన్సులు వేసుకుంటున్నాడు
-
‘తెలుగుదేశం పార్టీ డ్రామాలాడుతోంది’
కడప: తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ డ్రామా ఆడుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే సత్తా, దమ్ము ధైర్యం ఉన్నప్పుడు శిబిరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తరలిస్తామని, కోట్లాది రూపాయల నగదుతో పాటు, కాంట్రక్టు పనులు కల్పిస్తామని ప్రలోభాలు పెడుతున్నదన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి గెలుపు తథ్యమన్నారు. వివేకానంద రెడ్డికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా రాణించారన్నారు. అయన గెలుపును ఎవరూ అపలేరంటూ టీడీపీ శిబిరాలలో ఉన్న వారు సైతం వివేకానంద రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. -
ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్ జగన్
– ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి : ఆంధ్రుల ఆశాకిరణం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం లండన్ నగరంలోని హౌన్ స్లోవెస్ట్లో గల కోహినూర్ బాన్క్వెట్టింగ్ హాల్లో యునైటైడ్ కింగ్ డమ్ అండ్ యూరప్ వైఎస్ఆర్సీపీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ, రాజన్న రాజ్యం తీసుకురావడానికి నిత్యం పరితపిస్తూ ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతున్నా లెక్కచేయకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజానాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీలు ఇచ్చి పబ్బం గడుపుకుని, హామీలు నెరవేర్చకపోవడంపైన సుదీర్ఘంగా ఆయన వివరించారు. కార్యక్రమంలో వందల మంది ప్రవాసభారతీయుల కుటుంబ సభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగవైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో లండన్‌లోని స్థానిక కౌన్సిల్ మేయర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకినాడ పార్లమెంట్ ఇన్చార్జ్ సునీల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’
-
’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’
హైదరాబాద్ : ఈ రెండున్నరేళ్లలో రైతులు చాలా కష్టాలు పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...బంగారం తాకట్టు పెట్టి రైతులు వ్యవసాయం చేశారని, అయితే వారికి భరోసా కల్పించే నాథుడే లేరన్నారు. జూన్‌లో పడిన వర్షాలతో రైతులు పంట వేశారని, లక్షలాది ఎకరాల్లో వేరుశెనగ పంట వేసినా, పంట చేతికొచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతులకు దిక్కుతోచక తమ పొలాలను తామే దున్నేసుకుంటున్నారన్నారు. చిన్న, సన్నకారు రైతులు నట్టేట మునిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే తప్ప రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు రైతులకు భరోసా కల్పించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు చేయాలని లేకుంటే రీ షెడ్యూలు అయినా చేయాలని అన్నారు. -
ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయం
–ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి : రాయచోటి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ శివార్లలలోని పాలిటెక్నిక్ కళాశాల ఆదనపు భవనాల నిర్మాణపు పనులను, రాజీవ్ స్వగృహ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న మైనార్టీ బాలుర వసతి గృహాన్ని, ఓదివీడు మార్గంలో నిర్మితమవుతున్న ఉర్దూ బాలికల జూనియర్ కళాశాల, మైనార్టీ బాలుర ఐటీఐలు, హస్టళ్ల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ జనార్ధనరెడ్డి, డీఈ చంద్రశేఖర్‌రెడ్డిలతో భవన నిర్మాణ పనులపై చర్చించి పనులను నాణ్యతగా, రాబోయే విద్యాసంవత్సరంలోగా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో ఇండోర్ స్టేడియం, ఉర్దూ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ఉద్యాన, వ్యవసాయ కళాశాలల మంజూరుకు కృషి చేస్తున్నానన్నారు. లక్కిరెడ్డిపల్లె, రాయచోటిలలోని ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల భవన నిర్మాణాలను, రామాపురం, దేవపట్ల, లక్కిరెడ్డిపల్లెలోని గురుకుల పాఠశాలల అదనపు భవనాల నిర్మాణాలను త్వరితగితంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఏఈలు సుధాకర్‌బాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ ఫయాజుర్రహిమాన్, వైఎస్ఆర్సీపీ యువజనవిభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్పీఎస్ రిజ్వాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు వడ్డె వెంకట్రామణారెడ్డి, రియాజుర్రహిమాన్, తదితరులు ఉన్నారు. -
వైఎస్ హయంలోనే రైతుకు సంక్షేమం
గాలివీడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే రైతుల సంక్షేమానికి విశేష కృషి చేయడం జరిగిందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రామాలయంలో వైసీపీ నాయకుడు మలసాని సుబ్బారెడ్డి కుమార్తె ప్రవళ్లిక, మల్రెడ్డి విహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరిగిన అరవీడు గ్రామ బీసీ నాయకుడు బాలయ్య కుమారుడు మల్లికార్జున, మానస వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి వేరుశనగ పంట సాగు చేసి నష్టాలకు గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటలబీమా ఇంత వరకు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ ప్రాంత సాగు రైతులను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పలు దఫాలుగా చర్చించి కుడికాలువకు నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకుడు యదు భూషణ్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, వైకాపా నాయకులు ధనుంజయరెడ్డి, రమణారెడ్డి, బిసీ నాయకులు ఉమామహేశ్వర్‌నాయుడు, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే..
హైదరాబాద్: విజయవాడలో వైఎస్సాఆర్ విగ్రహం తొలగింపుపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి పార్థసారథిలు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గపు చర్య అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని చేయకపోతే తామే విగ్రహాన్ని తిరగి ఏర్పాటు చేస్తామని అన్నారు. మహానేత వైఎస్ఆర్ ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారని, పులిచింతల ప్రాజెక్టుకు చిహ్నమే వైఎస్ఆర్ విగ్రహం అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. వైఎస్ విగ్రహాలంటే చంద్రబాబుకు అసహనంగా ఉందని, సంస్కారహీనంగా మహానేత విగ్రహాన్ని తొలగించడాన్ని ప్రజలంతా ఖండిస్తున్నారని పార్థసారధి అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం తర్వాతే వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబువన్నీ విధ్వంసకర ఆలోచనలని విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పటమట, పామర్రులో ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనలో విఫలమై.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే వైఎస్ విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దని నిబంధనలు ప్రకారం వ్యవహరించాలని కోరారు. -
అవినీతి వ్యవహారాల్ని పక్కదారి పట్టిస్తున్నారు
చంద్రబాబు సర్కార్ తీరుపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ పెద్దల అవినీతిని తమ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారీ చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారాలను పక్కదారి పట్టిస్తూ, ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేస్తూ అడ్డూ అపూలేకుండా అధికారపార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలోని అవినీతి విషయాలను బయటపెట్టినప్పుడల్లా.. ప్రతిపక్షాలు అలానే మాట్లాడతాయనో, లేదంటే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయనో చెబుతూ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం అధికార పార్టీ పెద్దలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు చేశారని, దానిపై సీబీఐ విచారణ జరిపించిన ఉదంతాలున్నాయన్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ పత్రిక ద్వారా అవినీతి వెలుగులోకి వచ్చినా విచారణ జరిపించారని.. ఇప్పుడు కొన్ని పత్రికల తనకు మద్దతు ఇస్తున్నాయన్న భావనతో సీఎం చంద్రబాబు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విచారణ జరిపించండి... హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల్లో 20 (బి) ప్యాకేజీ పనులకు సింగిల్ టెండర్ మాత్రమే దాఖలై నా నిబంధనలకు వ్యతిరేకంగా అధికార పార్టీ పెద్దలకు అనుకూలంగా ఉండే వారికి రూ.కోట్లను దోచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి.. అందులో అవినీతి లేకుండా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. సీబీఐ విచారణతో అభివృద్ధి ఆగిపోతుందన్నదే ప్రభుత్వ ఆలోచన అయితే కనీసం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండే సీబీసీఐడీతోనైనా లేదంటే విజిలెన్స్తోనైనా విచారణ జరిపించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'రాయలసీమంటే ఎందుకంత ద్వేషం'
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీమకు నీళ్లివ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. రాయలసీమ అంటే ఎందుకంత వివక్ష అని శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అయితే సీమ ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. దేవినేని ఉమకు రాయలసీమంటే ద్వేషమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని తాము అంటే పై పెచ్చు ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం తమ పార్టీకి ఏమాత్రం లేదన్నారు. -
రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం
ఒర్లాండ్లో ప్రవాసాంధ్రులతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్ఆర్ఐలకు వివరించారు. సీఎం అవినీతికి పాల్పడిన అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు- అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ ఎన్నారై విభాగం అమెరికాలో శుక్రవారం ఆవిష్కరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండ్ నగరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజధాని పేరుతో విలువైన భూములను సీఎం చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే విదేశీ పర్యటనల పేరుతో రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎన్నారై ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ సాధించడంలోనూ సీఎంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎన్నారై పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో అమెరికా దక్షిణ ఎన్నారై విభాగం పార్టీ ఇన్చార్జి నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్సీపీ నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం నోటీసు అందించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారమే ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత బయటకు వెళుతుండగా లాబీల్లో విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. సభ జరిగిన తీరుపై వ్యాఖ్యానించమని కోరగా.. ‘చూశారుగా... ఇది కౌరవ సభలాగా సాగింది...’ అన్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ సోమవారం సభలో వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. స్పీకర్ తీరులో మార్పు వస్తుందని తాము చాలాకాలంగా ఎదురుచూశామని, అయితే ఆయన మరింత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటం తమకు బాధ కలిగిస్తోందని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై తాము డివిజన్ కోరినా స్పీకర్ తిరస్కరించారని, మూజువాణీ ఓటుతో వీగిపోయినట్లు ప్రకటించారని విమర్శించారు. సోమవారం సభ సాగిన తీరుపై మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికే అలా చేశారన్నారు. ఒక్క నిమిషం జగన్ మాట్లాడితే చాలు వెంటనే ఐదారుమంది అధికారపక్షం వారికి అవకాశం ఇచ్చి 20 నుంచి 30 నిమిషాల వరకు మాట్లాడిస్తున్నారని చెప్పారు. అధికారపక్షం వారు చెయ్యెత్తకున్నా లేపి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ వైఖరిని చూశాక అవిశ్వాస తీర్మానం పెట్టక తప్పడం లేదని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. బాబుకు ధైర్యముంటే విచారణకు సిద్ధపడాలి అన్నా హజారేకు సోదరుడినన్నట్టుగా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు.. తనపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఎందుకు అంగీకరించడం లేదని గడికోట సూటిగా ప్రశ్నించారు. విచారణలకు ఆదేశిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి తప్పించుకుంటున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగురోడ్డుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించారని, అంతమాత్రాన అభివృద్ధి ఆగిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు. ధైర్యం ఉంటే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంపై తమకు గౌరవం ఉన్నా అవిశ్వాస తీర్మానం పెట్టక తప్పడం లేదని చెప్పారు. -
'ప్రాణం ఉన్నంతవరకూ జగన్‌తోనే'
వైఎస్ఆర్ కడప: అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తామని చెప్పారు. డబ్బులు, కాంట్రాక్టులిస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకన్నా తెలంగాణకే ఎక్కువగా న్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు కేంద్రంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారు. -
'వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ఆ నివేదిక..'
హైదరాబాద్: ప్రభుత్వం కావాలనే కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతేడాది డిసెంబర్ 22న శాసనసభ జీరో అవర్‌లో జరిగిన చర్చతోపాటు వీడియో ఫుటేజి లీకేజీ తదితర అంశాలపై ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ప్రభుత్వం ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. కాగా ఈ కమిటీలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. కమిటీ భేటీ అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీపై బురదజల్లే ఎజెండాతో బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదిక రూపొందించిందని అన్నారు. వీడియో లీకేజ్ అంశంపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేద్దామన్నా స్పందించలేదని చెప్పారు. మంత్రులు అధికార సభ్యులకు స్పీకర్ మైకు ఇచ్చి.. ప్రతిపక్ష నేతను దూషించే విధానాన్ని మానుకోవాలని నివేదికలో పొందుపరచాలని చెప్పినా వినలేదన్నారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తప్పుడు వీడియోలను విడుదల చేస్తూ ప్రభుత్వం కొంతమందిపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తుందని ఇదే విషయం కమిటీలో చెప్పానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరీ, బోండా ఉమ ఎంత దారుణంగా మాట్లాడినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోలను విడుదల చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. -
ఇదెక్కడి న్యాయం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొసీడింగ్ సీడీలు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌లో శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. స్పీకర్ నియమించిన కమిటీకి ఏ అంశాలపై చర్చించాలో ఇప్పటివరకూ నియమ నిబంధనలు ఇవ్వలేదన్నారు. తాము ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఇంకా స్పష్టమైన జవాబు రాలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 22 నాటి జీరో అవర్ అంశాలపై మాత్రమే కమిటీ వేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. తమ అభ్యంతరాలన్నింటిపై చర్చ జరగాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ విజువల్స్ మీడియాకు ఎలా వచ్చాయో చెప్పాలని, మీడియాకు విజువల్స్ ఇచ్చినవారిని శిక్షించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. అధికార పార్టీ నేతలు సభలో ఏం మాట్లాడాలో కొందరు రాసి ఇస్తున్నారని, తాము మాట్లాడిన వీడియోలు వారికి ఇచ్చారని, అయితే సభలో వారు రెచ్చగొట్టిన వీడియోలు మాత్రం బయటకు వెల్లడించలేదన్నారు. -
'ఎప్పుడు ఎలా తినాలనే బాబు ఆలోచన'
-
'ఎప్పుడు ఎలా తినాలనే బాబు ఆలోచన'
హైదరాబాద్: పప్పుల ధరలు ఆకాశన్నంటినా నీరో చక్రవర్తిలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బాబు ప్రభుత్వం పప్పుదినుసు పంటలను ప్రోత్సహించడం లేదని చెప్పారు. జనం సొమ్ము ఎలా తినాలి, ఎంత తినాలి అని అని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారే తప్ప అసలు ప్రజలు ఏం తింటున్నారనే ఆలోచన ఆయనకు లేనే లేదని అన్నారు. రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని, ఇలా ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే నేడు ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గతంతో పోలిస్తే పప్పు పంటల దిగుమతులు తగ్గిపోయాయని ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని చెప్పారు. 90శాతం కందిపప్పు భారత్‌లోనే ఉత్పత్తి అవుతుందని, అయినా, రైతులకన్నా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారని చెప్పారు. కూరగాయల ధరలు 150శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పప్పు దినుసుల పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంలేదని, ఈ పంటల విషయంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా చేశారని చెప్పారు. -
రుణాలు మాఫీ చేయకనే విజయోత్సవాలా?
సంబేపల్లె : రుణాలు పూర్తిగా మాఫీ చేయకుండానే విజయోత్సవాలు నిర్వహించాలను కోవడం తెలుగుదేశం ప్రభుత్వ తీరు విడ్డూరంగా ఉందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని ప్రకాశనగర్ కాలనీ లోని మినిమరెడ్డిగారిపల్లెలో మునీంద్రారెడ్డి ఇచ్చిన విందు, గుట్టపల్లెలోని గుదియవాండ్లపల్లెకు చెందిన కేతంరెడ్డి ఆదిరెడ్డి కుమారుల కేశఖండన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రుణాలు ఇంకా మాఫీ కాలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి వివరించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకులోను ఖాతా నంబర్, భూమి వివరాలను రెవెన్యూ, బ్యాంకు అధికారులు సక్రమంగా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ ఫిర్యాదుల కేంద్రాల్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్హుడైన ప్రతిరైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుని, విజయోత్సవాలు జరుపుకోవాలని ఆయన ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో చిదంబరరెడ్డి, డాక్టర్ కిషోర్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి,ప్రతాపరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీసభ్యుడు రామమోహన్, మాజీ సర్పంచ్ పాల వెంకట్రమణ, పూల వెంకట్రమణ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
►కత్తులు, కర్రలతో బీభత్సం ►తీవ్రంగా గాయపడినా కేసు నమోదు చేయని పోలీసులు ►బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లె : మండలంలోని కుర్నూతల గ్రామం వాయల్‌రాజుగారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొండూరు బాలకృష్ణంరాజు, సీతంరాజు, సరోజమ్మలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు వేంపల్లె వెంకట్రామరాజు (గన్‌మెన్ రాజు), వేంపల్లె మల్లికార్జునరాజులు తమ వర్గీయులతో కత్తులు, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాధితులు వాపోయారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గతంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ వర్గీయులు వేంపల్లె వెంకట్రామరాజు(గన్మెన్రాజు), వేంపల్లె మల్లికార్జునరాజులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి బోరు వద్ద విద్యుత్ సమస్యపై మాటామాట పెరిగింది. పాతకక్షలను మనసులో ఉంచుకున్న టీడీపీ వర్గీయులు రాయచోటి నుంచి కొంతమంది మనుషులను తీసుకొచ్చి పిడిబాకులు, బండరాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.దాడి జరుగుతున్న సమయంలో కొందరు అడ్డుకోగా వారిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండూరు బాలకృష్ణంరాజుకు ఎడమ భుజంపై పిడిబాకుతో దాడి చేస్తుండగా, అతని తల్లి కొండూరు సరోజమ్మ అడ్డుకోగా ఆమెపై బండరాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి విషయాన్ని తెలుసుకున్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ అంబాబత్తిన రెడ్డెయ్యలు బాధితులను పరామర్శించారు. రాత్రి 11 గంటల వరకు పోలీసుస్టేషన్లో ఉండి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఎదుట వారు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేయకపోతే న్యాయం జరిగేవరకు పోరాడతామని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడి చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆ గ్రామ సర్పంచ్ గాదిముతక లక్ష్మిదేవి, ఎంపీటీసీ సభ్యుడు దిద్దికుంట విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శివారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల నాయకులు జనార్ధన్‌రెడ్డి, రమణయ్య, సుబ్బయ్య తదితరులు ఉన్నారు. -
బాబుకే క్లారిటీ లేదు: శ్రీకాంత్ రెడ్డి
-
చంద్రబాబు ప్రవర్తన బాధాకరం...
హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని ప్రకటన సందర్భంగా గురువారం సభలో తప్పు సమాచారం ఇచ్చిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1953లో కర్నూలు రాజధాని కోసం చర్చ జరిగిందని .... అందుకు సాక్షిగా నాటి దినపత్రికలను శ్రీకాంత్ రెడ్డి మీడియాకు చూపారు. నిన్నటి సభలో చంద్రబాబు ప్రవర్తన బాధాకరంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని, అన్యాయంపై మాట్లాడకుండా మానోరు నొక్కారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు. వెనుకబడిన రాయలసీమను విస్మరించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. రాయలసీమలోని సహజ వనరులను పూర్తిగా వినియోగించి అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు భరోసా కల్పించాల్సిన పరిస్థితి టీడీపీ సర్కార్‌పై ఉందని ఆయన అన్నారు. -
'ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష పాత్ర'
-
'ప్రజలకు ఉపయోగపడే ప్రతి పక్షపాత్ర'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉండాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ఇప్పటికైనా చంద్రబాబు సమైక్యవాదిగా మారాలి:శ్రీకాంత్
-
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్
-
చంద్రబాబును అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే శ్రీకాంత్
-
లోకేష్ ఒక చవటబ్బాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చవటబ్బాయని వైఎస్ఆర్ సీఎల్పీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డికి వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్ లీలలు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమకు బాగా తెలుసని చెప్పారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు. లేకుంటే లోకేష్ లీలలు బయటపెడతామని హెచ్చరించారు. సీమాంధ్రలో చంద్రబాబు చేసేది ఆత్మగౌరవ యాత్ర కాదని, వైఎస్ఆర్ సిపిపై విషప్రచారయాత్ర అన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేసే ఎన్టీఆర్‌ను దించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. 2009 ముందు వైఎస్ఆర్పై గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, వైఎస్‌కే పట్టం కట్టారని గుర్తు చేశారు. -
స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్, అమర్నాథ్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహన్ను కలిశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీ నామాలు ఆమోదించాలని కోరారు. స్పీకర్ ఫార్మాట్లోనే తాము రాజీ నామాలు చేసినట్లు కూడా వారు తెలిపారు. రాజీనామాలను పరిశీలించి నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని శాసనసభాపతి వారికి చెప్పారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే తమ ఎమ్మెల్యేలంతా మరోసారి స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. విభజన విషయంలో న్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. -
సమైక్యతే మా ఆశయం : శ్రీకాంత్ రెడ్డి
-
సమైక్యతే మా ఆశయం : శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఆశయం అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ న్యాయం కోసం ఎప్పుడూ తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యంగా సమ న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సిఎం కావచ్చని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. సీమాంధ్రకు సీఎం కావాలని బొత్సతోపాటు మంత్రులూ లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు. అందుకే వారంతా విభజనకు అంగీకరిస్తున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మరణం సోనియా గాంధీ అనిగానీ, చంద్రబాబు అని గానీ వైఎస్ఆర్సీపీ ఏ నాడు ఆరోపించలేదన్నారు. ఆయన మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నామన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు విప్ జారీ చేశారని చెప్పారు. ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపారు. సీమాంధ్ర ఎలా తగలబడిపోతుందో చూడటానికే బాబు యాత్ర చేస్తున్నారన్నారు. రోమ్ చక్రవర్తిని మించిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆయన రాజకీయ కుట్రలే కారణం అన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెప్పారు. శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. టిడిపి వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్ఆర్ సిపియే నని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తనదే అని చంద్రబాబు అన్నట్లు చెప్పారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి ఆయన 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారని గుర్తు చేశారు. చంద్రబాబు సమైక్యరాష్ట్రం కోసం ఏనాడూ మాట్లాడలేదని చెప్పారు. -
పార్లమెంట్లో టీడీపీవి డ్రామాలే: శ్రీకాంత్‌రెడ్డి
-
రిమ్స్‌లో కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డి దీక్ష
కడప : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన దీక్ష రిమ్స్‌లో కొనసాగుతోంది. మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కలెక్టరేట్ ఎదుట గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలసిందే. వారి దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేసి వారిని రిమ్స్‌కు తరలించారు. అయితే వారు వైద్యానికి నిరాకరిస్తూ దీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా సోమవారం కడప, రాయచోటి బంద్ కొనసాగుతోంది. కాగా ఎమ్మెల్యే శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డిల ఆమరణ నిరాహార దీక్షలు నేటికి అయిదో రోజుకు చేరుకున్నాయి. -
ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక... ఆమరణ నిరాహార దీక్షలు
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు శనివారంతో ఆరోరోజు పూర్తయ్యాయి. రాత్రి 8గంటలకు వీరిని వైద్యులు పరీక్షించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయినా దీక్షలు కొనసాగించడానికే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి నిర్ణయించారు. పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల వారు తరలివచ్చి వీరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈసీ గంగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి దీక్షలు శనివారంతో మూడవ రోజు పూర్తి చేసుకుని ఆదివారంతో నాలుగురోజుకు చేరాయి. -
కాంగ్రెస్ డ్రామాలాడుతోంది: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
కడప : అందరికీ సమన్యాయం చేయాలంటూ ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. బీపీ, షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు పెద్దఎత్తున ప్రజలు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా డ్రామాలాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి దీక్షలకు ఈసీ గంగిరెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి జమ్మలమడుగులో వెంకటేశ్వర దేవాలయంలో 101 టెంకాయలు కొట్టారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ నేతలు, జేఏసీ నేతలు, ఉపాధ్యాయాలు పాల్గొన్నారు. -
క్షీణించిన ఆరోగ్యం.. ఐదోరోజు దాటిన శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ల ఆమరణ దీక్ష
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడి ్డలు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజులు పూర్తిచేసుకుని, శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక దీక్ష చేస్తున్న వీరిద్దరికీ సంఘీభావం తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. శుక్రవారం నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో నాలుగురాష్ట్రాలు కావాలని అక్కడి అసెంబ్లీ తీర్మానాన్ని చేసి, పార్లమెంట్‌కు పంపినా విభజించని కేంద్రం ఇక్కడ మాత్రం వద్దంటే ఎందుకు విడగొడ్తోందని ప్రశ్నించారు. తెలుగువారిని విభజించేందుకు కారణమేంటో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జననేత, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాను తగ్గించేందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని అందరికీ అర్ధమవుతోందని మేకపాటి పేర్కొన్నారు. అయితే జగన్ జనశక్తి రెండుప్రాంతాల్లోనూ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లో కలిపి తమకు 30-35 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారంతో రెండవరోజు పూర్తిచేసుకున్నాయి. వీరి దీక్షలకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. -
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష
-
ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి
కడప : సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ కుయుక్తులు, టీడీపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పోరాటం సాగించేందుకు వారు దీక్షకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలుగుతల్లి కడుపుకోతకు గురయ్యే పరిస్థితి కల్పించినా, విభజన పేరుతో సీమకు అన్యాయం జరగబోతోందని తెలిసినా అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవండంతో ఆమరణదీక్ష చేపట్టారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగుతుందని, ఈ ప్రక్రియలో తమ ప్రాణాలు పోయినా లెక్క చేయమని శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
సీమ విభజనకు అంగీకరించం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
-
రాజీనామా డ్రామాలొద్దు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి