కడప : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన దీక్ష రిమ్స్లో కొనసాగుతోంది. మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కలెక్టరేట్ ఎదుట గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలసిందే.
వారి దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేసి వారిని రిమ్స్కు తరలించారు. అయితే వారు వైద్యానికి నిరాకరిస్తూ దీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నేతల అక్రమ అరెస్ట్లకు నిరసనగా సోమవారం కడప, రాయచోటి బంద్ కొనసాగుతోంది. కాగా ఎమ్మెల్యే శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డిల ఆమరణ నిరాహార దీక్షలు నేటికి అయిదో రోజుకు చేరుకున్నాయి.
రిమ్స్లో కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డి దీక్ష
Published Mon, Aug 19 2013 9:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement