
మాట్లాడుతున్న జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ పి.దేవనాథరెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి (వైఎస్సార్ కడప): వైఎస్సార్‌సీపీతో రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చిన్నమండెం, రాయచోటి రూరల్ పరిధిలోని బూతు కన్వీనర్ల సమావేశాలను జెడ్పీ మాజీ వైఎస్ చైర్మన్ పి.దేవనాథరెడ్డి, మాజీ ఎంపీపీ పోలు వెంకటసుబ్బారెడ్డిల అధ్యక్షతన విడివిడిగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రాయచోటి పరిధిలోని చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామన్నారు. టీడీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు చేసింది శూన్యమన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు పరచకుండా ప్రజలను మోసగించారని ఆయన ధ్వజమెత్తారు. అలాగే బీసీలకు ఉన్నత పదవులను రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్సీలలో ఎవరు పుట్టాలనుకుంటారని ఎస్సీలను కించపరచాడని విమర్శించారు. ప్రజలకోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డేనన్నారు. వైఎస్సార్ïసీపీ అధికారంలోకి వస్తే జగన్ ప్రవేశపెట్టనున్న నవరత్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షులు గంగిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, అలాగే చిన్నమండెం సింగిల్ విండో అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ముసల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎం.కంచంరెడ్డిలు ఆయా మండలాలకు చెందిన బూతు కన్వీనర్ల్లనుద్దేశించి ప్రసంగించారు.
కార్యక్రమంలో పార్టీ గుర్తింపు కార్డులు, అభినందన పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెండు మండలాల పరిధిలోని ఎంపిటిసిలు ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రెడ్డెప్ప, వెంకటరమణ, సర్పంచులు స్వామి, గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దివాన్‌సాహెబ్, రఫీ, అమరనాథరెడ్డి, రాజారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘురామిరెడ్డి,మాజీ ఎంపిటిసి ఏజీస్ అలీఖాన్, లోకేశ్వరరెడ్డి, వెంకటరమణారెడ్డి, చుక్కా అంజనప్పలతో పాటు బూతు కన్వీనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment