రవికుమార్, ఆటో యూనియన్ నాయకుడు
రాయచోటి: కార్మికుల కష్టం తెలిసిన ఏకైక నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన అని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆటోకు లైఫ్ ట్యాక్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 10వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ, అదే సమయంలో ఆటో కార్మికుల కోసం ఏడాదికి 10 వేల రూపాయలను అందజేస్తామని వైస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనకు మద్దతుగా మంగళవారం రాయచోటిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ఆటో కార్మికులకు వరంలాంటిదన్నారు.
కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారిపై అదనపు భారం పడేలా లైఫ్ ట్యాక్స్‌లు వేయడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికులకు ఆటో నగర్, ప్రత్యేక హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.ఆటో యూనియన్ నాయకులు రామచంద్ర, విక్కీ, మహేష్, చాన్‌బాషా, రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు పల్లపు రాజారమేష్, ఎంపీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ జాఫర్, మైనార్టీ నాయకులు కొలిమి చాన్‌బాషా, లయన్ అన్వర్, ఫయాజ్ అహ్మద్, పార్టీ యువనాయకులు కిషోర్, హనుమంత్‌నాయక్, సురేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
యూనిఫాం పంపిణీ...
ర్యాలీలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా యూనిఫాంను అందజేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్ ఆర్థిక సాయంతో 60 మందికి అందజేశారు.
జగనన్న పైనే మా ఆశ
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆటో కార్మికుల కష్టాలు తీరుతాయన్న ఆశ ఉంది. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తానని చేసిన ప్రకటనను అభినందిస్తున్నాం. జగన్మోహన్‌రెడ్డి రాకతోనే మా బాధలు తీరుతాయన్న ఆశాభావం ఆటో కార్మికులందరిలో ఉంది.
ధన, ఆటో యూనియన్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment