Auto Union
-
ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నం
సాక్షి,హైదరాబాద్:ఆటో,క్యాబ్‌డ్రైవర్ల యూనియన్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. పెద్దఎత్తున నిరసన తెలుపుతూ యూనియన్ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికులకు రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. కార్మిక చట్టాలను సవరించాలని కోరారు. ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలన్నారు. అదే విధంగా క్యాబ్ జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ఓల, ఉబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమిషన్ ఆపాలన్నారు. టోల్ టాక్స్, రోడ్ టాక్స్‌లను వెంటనే ఎత్తివేయాలిని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ చార్జీలను తగ్గించాలన్నారు. -
కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు వైఎస్ జగన్
రాయచోటి: కార్మికుల కష్టం తెలిసిన ఏకైక నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన అని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆటోకు లైఫ్ ట్యాక్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 10వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ, అదే సమయంలో ఆటో కార్మికుల కోసం ఏడాదికి 10 వేల రూపాయలను అందజేస్తామని వైస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనకు మద్దతుగా మంగళవారం రాయచోటిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ఆటో కార్మికులకు వరంలాంటిదన్నారు. కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారిపై అదనపు భారం పడేలా లైఫ్ ట్యాక్స్‌లు వేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికులకు ఆటో నగర్, ప్రత్యేక హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.ఆటో యూనియన్ నాయకులు రామచంద్ర, విక్కీ, మహేష్, చాన్‌బాషా, రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు పల్లపు రాజారమేష్, ఎంపీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ జాఫర్, మైనార్టీ నాయకులు కొలిమి చాన్‌బాషా, లయన్ అన్వర్, ఫయాజ్ అహ్మద్, పార్టీ యువనాయకులు కిషోర్, హనుమంత్‌నాయక్, సురేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. యూనిఫాం పంపిణీ... ర్యాలీలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా యూనిఫాంను అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్ ఆర్థిక సాయంతో 60 మందికి అందజేశారు. జగనన్న పైనే మా ఆశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆటో కార్మికుల కష్టాలు తీరుతాయన్న ఆశ ఉంది. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తానని చేసిన ప్రకటనను అభినందిస్తున్నాం. జగన్మోహన్రెడ్డి రాకతోనే మా బాధలు తీరుతాయన్న ఆశాభావం ఆటో కార్మికులందరిలో ఉంది. ధన, ఆటో యూనియన్ నాయకుడు -
ఉబెర్, ఓలాకు పోటీగా బీ-ట్యాగ్
సాక్షి, బెంగళూర్ : క్యాబ్ సర్వీసులు తమకు పోటీగా వస్తుండటంతో బెంగళూర్ ఆటోవాలాలు ఓ నిర్ణయానికి వచ్చారు. సరికొత్త యాప్‌తో రంగంలోకి దిగేందుకు సిద్ధమైపోయారు. ‘బీ-ట్యాగ్’(b-Tag) పేరిట ఓ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. టాక్సీ డ్రైవర్ యూనియన్ అసోషియేషన్లు కూడా ఇందుకు మద్ధతు ప్రకటించటం విశేషం. యాప్ రూపకల్పన సంస్థ బీ-ట్రాన్స్పోర్ట్ సోల్యూషన్ చైర్మన్ ఎన్ఎల్ బసవరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘12 యూనియన్లకు చెందిన 9 వేల మంది ఆటో డ్రైవర్లు ఇందులో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. సీఐటీయూ మద్ధతు కూడా మాకే ఉంది. త్వరలోనే బీ-ట్యాగ్ యాప్ సర్వీసులను ప్రారంభిస్తాం’’ అని బసవ రాజు పేర్కొన్నారు. క్యాష్ లెస్ పేమెంట్ల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ... ‘‘ఓలా, ఉబెర్‌లు ప్రయాణికులను తక్కువ ఛార్జీల పేరిట దారుణంగా మోసం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఆటోవాలాలపై దారుణంగా పడుతోంది. కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇకపై అలాంటిది కొనసాగకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలో దేశవ్యాప్తంగా ఆటో యూనియన్ల సమావేశం నిర్వహించి ఇతర నగరాల్లో కూడా ఇలా ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ఆలోచన చేస్తాం’’ అని అన్నారు. కాగా, 2014లోనే ఓలా ఆటో సర్వీసులను బెంగళూర్ నగరంలో ప్రవేశపెట్టగా.. మొన్నీమధ్యే ఉబెర్ కూడా సర్వీసులను ప్రారంభించేసింది. -
పెట్రో ధరల పెంపుపై రాస్తారోకో
ధర్మారం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్మారం, వెల్గటూర్ మండలాల ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ధర్మారంలో మంగళవారం ర్యాలీ, రాస్తారోకో చేశారు. స్థానిక మార్కెట్‌యార్డు నుంచి కొత్త బస్టాండ్, పాతబస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోలలో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని రాష్ట్ర రహదారిపై ఆటోలతో నిరసన తెలిపారు. ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పుస్కూరి జితేందర్‌రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భగా డాక్టర్ నగేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారంపడేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిసార్లు పెట్రో ఉత్పత్తులపై ధరలు పెంచిందని పేర్కొన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌చేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కాడె సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కాంపల్లి చంద్రశేఖర్, అటోయూనియన్ అధ్యక్షులు దేవి లక్షీ్మరాజం, గుమ్ముల పోచయ్య, సాగర్, భూక్య రాజేశం, నాయకులు పాల్గొన్నారు. -
సమ్మె ఉద్ధృతం
చిక్కడపల్లి,న్యూస్‌లైన్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని, పెరిగిన డీజిల్, గ్యాస్ ధరలకనుగుణంగా ఆటోమీటర్ చార్జీలు పెంచాలని, పీల్చిపిప్పిచేస్తున్న చలాన్ జీవో108ను వెంటనే రద్దు చేయాలన్న తదితర డిమాండ్లతో ఆటోసంఘాలు చేపట్టిన సమ్మె ఉద్ధృతమవుతోంది. దీంతో రెండోరోజు ఆది వారం నగరంలో చాలా ప్రాంతాల్లో ఆటోలు నిలిచిపోయాయి. సర్కారు వైఖరిని వ్యతిరేకిస్తూ ఆటోకార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో భారీఎత్తున రాస్తారోకో నిర్వహించి రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి సర్కారుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ తదితర సంఘాల నాయకులు ఈటీ నర్సింహ, ఈశ్వర్రావు, శ్రీనివాస్, నరేందర్, అనూరాధ, పద్మ,బోస్,రామారావు, మారుతీరావు, విజితారెడ్డి,దాసరి రమేష్, అమానుల్లాఖాన్, దస్తగిరిలు విలేకరులతో మాట్లాడారు. డ్రైవింగ్ లెసైన్స్‌కు 8వ తరగతి అర్హతను రద్దు చేయాలని, హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ విధానాన్ని ఆపాలని కోరారు. నిబంధనల పేరుతో జారీచేసిన 108 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఆటోడ్రైవర్‌పై దాడి,తీవ్రగాయాలు : కాగా ఆటో కార్మిక సంఘాలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా అటుగా వస్తున్న మూడు ఆటోలను నాయకులు ధ్వంసం చేశారు. దీంతో అద్దంపడి డ్రైవర్‌పై ముక్కుపై తీవ్రగాయం కావడంతో పోలీసులు ప్రాథమిక చికిత్స నిర్వహించి పంపించేశారు. ఆగని దోపిడీ నగరంలో చాలావరకు ఆటోలు సమ్మెలో ఉండడంతో కొందరు ఆటోవాలాలు రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్ల వద్ద ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకున్నారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన వారు ఆదివారం తిరుగుముఖం పట్టడం, ఇళ్లకు చేరుకునేందుకు ఆటోలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిం చాల్సి వచ్చింది. ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన వంద బస్సులు ఏమూలకు చాలకపోవడంతో ఆటోవాలాల దోపిడీకి ప్రయాణికులు జేబులు గుల్లచేసుకున్నారు. స్వల్పదూరాలకే వందలు డిమాండ్ చేయడం కనిపించింది. సోమవారం పాఠశాలలకు రాకపోకలు సాగించే 25 వేల ఆటోలను కూడా నిలిపివేస్తామని జేఏసీ నాయకులు ఈసంద ర్భంగా ప్రకటించారు. నేడు చలోఅసెంబ్లీ తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సోమ వారం ఉదయం 11 గంటలకు హిమాయత్‌నగర్ నుంచి అసెంబ్లీ వరకు మహాప్రదర్శన నిర్వహిస్తామని ఆటో సంఘాల జేఏసీ నేతలు నరేందర్,వెంకటేశ్,సత్తిరెడ్డిలు తెలిపారు. -
విశాఖ జిల్లా వ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఆటోలు బంద్
విశాఖ:ఇప్పటికే సమైక్య నినాదాలతో హోరెత్తెస్తున్న ఉద్యమకారులకు ఆటో యూనియన్ లు కూడా జతకలవనునన్నాయి. విశాఖ జిల్లాలో రేపు, ఎల్లుండి బంద్ పాటించి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతామని ఆటో యూనియన్ ల సంఘం ప్రకటించింది. కాగా, టాక్సీ ఓనర్ల అసోసియేషన్ కూడా మద్దతు తెలిపేందుకు సన్నద్ధమైంది. రెండు రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తామని టాక్సీ ఓనర్స్ ప్రకటించారు. ఇదిలా వుండగా విద్యార్థి జేఏసీ కూడా లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుబడుతూ అన్నివర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్ర ధ్యేయంగా నినదిస్తున్నారు. యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం, ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర, రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కు తీసుకునే వరకూ సమ్మెలు కొనసాగిస్తామని ఆందోళన కారులు హెచ్చరిస్తు